వ్యవసాయంలోకి చదువుకున్న యువత
అందుకోసం ప్రణాళికలు రూపొందిస్తున్నాం: పార్థసారథి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడంతోపాటు చదువుకున్న యువతను వ్యవసాయం వైపు మళ్లించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి వెల్లడించారు. పట్టణాల నుంచి పల్లెల కు వలసలు వచ్చేంత అద్భుతంగా వ్యవసాయాన్ని తీర్చి దిద్దుతామన్నారు. కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన వర్సిటీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడారు.
పంట సాగు ఖర్చు తగ్గించి రైతుకు నికర ఆదాయం పెంచేందుకు కసరత్తు చేస్తున్నామన్నా రు. నాబార్డు రుణం ద్వారా రూ.874 కోట్లతో మరో 4.5లక్షల ఎకరాలను సూక్ష్మ సేద్యం కిందకు తీసుకురానున్నట్లు చెప్పారు. వ్యవసాయంపై నోట్ల రద్దు ప్రభావం భారీగానే చూపిస్తోందని... అయితే అవి తాత్కాలికమేనని, దీర్ఘకాలంలో మంచి ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. వర్సిటీ రిజిస్ట్రార్ రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.