
సాక్షి, హైదరాబాద్: మార్కెటింగ్ శాఖలో వివిధ కేటగిరీల్లో ఖాళీగా ఉన్న 200 పోస్టుల భర్తీకి సర్కారు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసార థి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గ్రేడ్–3 సెక్రటరీ పోస్టులు 11, అసిస్టెంట్ సెక్రటరీ పోస్టులు 27, అసిస్టెంట్ మార్కెట్ సూపర్‌వైజర్ పోస్టులు 80, గ్రేడర్ పోస్టులు 13, బిడ్ క్లర్క్ పోస్టులు 9, జూనియర్ మార్కెట్ సూపర్‌వైజర్ పోస్టులు 60 ఉన్నాయి. ఆయా పోస్టులను నేరు గా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) ద్వారా భర్తీ చేస్తారు. గ్రేడ్–3 సెక్రటరీ, అసిస్టెంట్ సెక్రటరీ పోస్టులకు తాజా రోస్టర్ పాయింట్లను తయారు చేయాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment