టెలివిజన్ చానెళ్లపై పరువునష్టం దావా వేస్తా: పార్థసారథి | Few Television Channels are defaming my image, says Parthasarathi | Sakshi
Sakshi News home page

టెలివిజన్ చానెళ్లపై పరువునష్టం దావా వేస్తా: పార్థసారథి

Published Tue, May 6 2014 6:19 PM | Last Updated on Tue, Aug 14 2018 4:24 PM

టెలివిజన్ చానెళ్లపై పరువునష్టం దావా వేస్తా: పార్థసారథి - Sakshi

టెలివిజన్ చానెళ్లపై పరువునష్టం దావా వేస్తా: పార్థసారథి

విజయవాడ: పత్రికావిలువలు తొక్కిపెట్టి తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్న టెలివిజన్ చానెల్లపై వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు వ్యతిరేకంగా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్న టెలివిజన్ చానళ్లపై పరువునష్టం దావా వేస్తానని మచిలీపట్నం పార్థసారథి హెచ్చరించారు. 
 
పోలీసులు జరిపిన సోదాల్లో నా రూంలో ఒక్క రూపాయి కూడా దొరకలేదు అని పార్థసారథి అని అన్నారు.  అదే హోటల్లో బస చేస్తున్న టీడీపీ నేతలు డబ్బు సంచులతో బయటికెళ్లిన సాక్షాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. బీసీ కులానికి చెందిన వాడిని కాబట్టే తనను టార్గెట్ చేస్తున్నారని పార్థసారథి తెలిపారు. 
 
రాజకీయంగా, వ్యక్తిగతంగా నన్ను నష్ట పరిచేందుకే కొన్ని చానళ్లు ప్రయత్నిస్తున్నాయని ఆయన అన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement