
సాక్షి, విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మచిలీపట్నం మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు హత్య కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. హత్యకేసులో పట్టుబడ్డ నిందితుల వాంగ్మూలంతో సూత్రదారుల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. మోకా హత్యలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రమేయం ఉందన్న ఆరోపణలో నేపథ్యంలో పోలీసులు ఆయన ఇంటికి చేరుకోగా.. విషయం తెలుసుకుని ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. కొల్లు రవీంద్ర కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. (చదవండి: ‘మోకా’ది రాజకీయ హత్యే)
Comments
Please login to add a commentAdd a comment