సాక్షి, మచిలీపట్నం : మచిలీపట్నం మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు మోకా భాస్కర్‌రావు హత్య కేసులో అరెస్ట్ అయిన మాజీమంత్రి కొల్లు రవీంద్రకు న్యాయస్థానం 14 రోజులపాటు రిమాండ్ విధించింది. దీంతో ఆయనను పోలీసులు మచిలీపట్నం సబ్ జైలుకు తరలించారు. పరారీలో ఉన్న కొల్లు రవీంద్రను తుని వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఆయనను పెడన నియోజకవర్గం గూడూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడే వైద్య పరీక్షలు పూర్తి చేసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొల్లు రవీంద్రను మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. మరోవైపు ఈ కేసులో పోలీసులు ఇప్పటికే అయిదుగురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కొల్లు రవీంద్ర ప్రోద్బలంతోనే మోకా భాస్కర్‌రావును హతమార్చినట్లు నిందితులు వాంగ్మూలం ఇచ్చారు. మరోవైపు హత్య కేసుకు సంబంధించి పోలీసు విచారణలో విస్తుగొలిపే అంశాలు బయపటడుతున్నాయి. (అన్న కోసమే.. మోకా హత్య !)
Comments
Please login to add a commentAdd a comment