Rajamandry Central jail
-
చంద్రబాబు అరెస్ట్ పై వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న టీడీపీ
-
ఆయనన్నది! రాజమండ్రి జైలులో ఉన్న బావ పరామర్శ కోసం కాదయ్యా!
ఆయనన్నది! రాజమండ్రి జైలులో ఉన్న బావ పరామర్శ కోసం కాదయ్యా! -
కరోనాను జయించిన సెంట్రల్ జైల్ ఖైదీలు
రాజమహేంద్రవరం క్రైం: ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక చర్యల వల్ల 300 మంది ఖైదీలు కరోనాను జయించి సంపూర్ణ ఆరోగ్యం పొందారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు గత నెలలో కరోనా బారినపడ్డారు. ఈ జైలులో 1,700 మంది ఖైదీలకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. 300 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు కరోనా బారిన పడిన ఖైదీలకు ప్రత్యేక బ్యారక్ ఏర్పాటు చేసి మిగిలిన ఖైదీలతో కలవకుండా చర్యలు చేపట్టి వైద్య సేవలు అందించారు. ప్రత్యేక నిధులు మంజూరు * ఖైదీలు కరోనా బారినపడిన వెంటనే పూర్తిస్థాయి వైద్యంతో పాటు బలవర్ధక ఆహారం అందించేందుకు ప్రత్యేక నిధులు కేటాయించారు. * ఎప్పటికప్పుడు ఆక్సిజన్ పరీక్షలు నిర్వహించడంతో పాటు రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులున్న ఖైదీలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రత్యేకంగా వైద్య సేవలందించారు. * కరోనా బాధితులందరికీ చికిత్స అనంతరం పరీక్షలు చేయగా నెగెటివ్ వచ్చిందని జైలు అధికారులు, వైద్యులు ధ్రువీకరించారు. -
మచిలీపట్నం సబ్ జైలుకు కొల్లు రవీంద్ర
సాక్షి, మచిలీపట్నం : మచిలీపట్నం మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు మోకా భాస్కర్‌రావు హత్య కేసులో అరెస్ట్ అయిన మాజీమంత్రి కొల్లు రవీంద్రకు న్యాయస్థానం 14 రోజులపాటు రిమాండ్ విధించింది. దీంతో ఆయనను పోలీసులు మచిలీపట్నం సబ్ జైలుకు తరలించారు. పరారీలో ఉన్న కొల్లు రవీంద్రను తుని వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఆయనను పెడన నియోజకవర్గం గూడూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడే వైద్య పరీక్షలు పూర్తి చేసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొల్లు రవీంద్రను మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. మరోవైపు ఈ కేసులో పోలీసులు ఇప్పటికే అయిదుగురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కొల్లు రవీంద్ర ప్రోద్బలంతోనే మోకా భాస్కర్‌రావును హతమార్చినట్లు నిందితులు వాంగ్మూలం ఇచ్చారు. మరోవైపు హత్య కేసుకు సంబంధించి పోలీసు విచారణలో విస్తుగొలిపే అంశాలు బయపటడుతున్నాయి. (అన్న కోసమే.. మోకా హత్య !) -
ఖైదీలే కర్షకులు
తూర్పుగోదావరి,రాజమహేంద్రవరం క్రైం: కేంద్ర కారాగారంలో ఖైదీలు కూరగాయలు, ఆకు కూరలు, నర్సరీ మొక్కలను సేంద్రియ పద్ధతిలో పండిస్తున్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు ప్రాంగణంలోని ఓపెన్ ఎయిర్ (ఆరుబయలు) జైలు ఉంది. దీనిలో సత్ ప్రవర్తన కలిగిన ఖైదీలను ఉంచుతారు. ప్రస్తుతం 45 మంది ఖైదీలు ఉన్నారు. వీరిలో కొంత మంది పెట్రోల్ బంకుల్లో పని చేస్తుండగా మిగిలిన ఖైదీలు వ్యవసాయం, డెయిరీ తదితర చోట్ల పని చేస్తున్నారు. సెంట్రల్ జైలు ఆవరణలో ఉన్న సుమారు 20 ఎకరాల్లో వంగ తోటలు, కాలీఫ్లవర్, క్యాబేజీ, బీరు, కాకర, దొండ కాయలు, ఆకుకూరలు తదితర పంటలు పండిస్తున్నారు. వీటితో పాటు మామిడితోటలు, పనస, కొబ్బరి చెట్లు, పండ్ల తోటలు సేంద్రియ ఎరువులతో సాగు చేస్తున్నారు. దీంతో ఇక్కడ నాణ్యమైన కూరగాయలు పండుతున్నాయి. వీటిని సెంట్రల్ జైలులోని ఖైదీలకు వినియోగిస్తుంటారు. మిగిలిన కాయగూరలను స్థానికంగా అమ్మున్నట్టు జైలుæ సూపరింటెండెంట్ రాజారావు పేర్కొంటున్నారు. ప్రతి సంవత్సరం కూరగాయలు, పండ్ల తోటల నుంచి రూ.30 లక్షల వరకూ ఆదాయం లభిస్తోందన్నారు. ఇక్కడ తయారు చేసిన సేంద్రియ ఎరువులు సైతం ప్యాకెట్ల ద్వారా అమ్మున్నారు. ఏటా మామిడి తోటపై సుమారు రూ.6 లక్షల వరకూ ఆదాయం లభిస్తుంది. జైలులో ఉన్న డెయిరీ ద్వారా ప్రతీ రోజు 200 లీటర్ల పాలు సేకరిస్తున్నారు. వీటిని జైలులో ఖైదీలకు ఉపయోగిస్తున్నారు. ఈ పాలతో పాటు గుడ్లనూ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఖైదీలకు సరఫరా చేస్తున్నారు. -
నలుగురు ఎర్ర స్మగ్లర్ల అరెస్ట్
వారిలో ముగ్గురు టీడీపీ నేతలు రాత్రికి రాత్రే రాజమండ్రి జైలుకు చిత్తూరు, న్యూస్‌లైన్: ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో నలుగురు బడా స్మగ్లర్లను చిత్తూరు పోలీసులు గురువారం రాత్రి అరెస్టు చేశారు. వారిని రాత్రికి రాత్రే రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. చిత్తూరు జిల్లాకు చెందిన భాస్కర్ నాయుడు, విజయానందబాబు, వైఎస్సార్ జిల్లాకు చెందిన మహేష్ నాయుడు, మదిపట్ల రెడ్డినారాయణలను అరెస్టుచేసి వీరిపై పీడీ యాక్టు నమోదు చేశారు. వీరిలో భాస్కర్ నాయుడు, మహేష్ నాయుడు, మదిపట్ల రెడ్డినారాయణ తెలుగు దేశం పార్టీకి చెందిన వారు. డీఎస్పీ కమాలాకర్‌రెడ్డి, ట్రైనీ ఎస్పీ అన్బురాజు ఈ విషయాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వారి కథనం మేరకు... ఎర్రచందనం స్మగ్లింగ్‌లో చిత్తూరు జిల్లా కేవీ పల్లె మండలం నూతన కాల్వకు చెందిన భాస్కర్ నాయుడుపై 20కి పైగా కేసులున్నాయి. చిత్తూరు నగరం కొంగారెడ్డిపల్లెకు చెందిన విజయానందబాబు అలియాస్ బాబురెడ్డిపై 20కి పైగా కేసులు నమోదయ్యాయి. వైఎస్సార్ జిల్లా సుండుపల్లె మండలం రెడ్డివారిపల్లెకు చెందిన మహేష్‌నాయుడు, సంబేపల్లె మండలం బాటావాండ్లపల్లెకు చెందిన మదిపట్ల రెడ్డినారాయణలపై పలు పోలీస్ స్టేషన్లలో ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సంబంధించిన కేసులు నమోదై ఉన్నాయి. కాగా తిరుపతిలోని శేషాచలం అడవుల్లో అటవీశాఖ అధికారులను కొట్టి చంపిన కేసుల్లో సైతం వీరి ప్రమేయం ఉన్నట్టు పోలీసులు కేసులు నమోదు చేశారు.