
సాక్షి, విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మోకా భాస్కర్‌రావు హత్య కేసులో మరో ఇద్దరు నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. చింతా నాగమల్లేశ్వరరావు, చింతా వంశీలను అరెస్టు చేశామని బందరు డీఎస్పీ మహబూబ్‌బాషా తెలిపారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్రపైనా కేసు నమోదు చేశామని అన్నారు. నోటీసులు ఇచ్చేందుకు కొల్లు రవీంద్ర ఇంటికెళ్తే ఆయన తప్పించుకుపోయారని చెప్పారు. కొల్లు రవీంద్ర కోసం మూడు బృందాలు గాలిస్తున్నాయని డీఎస్పీ తెలిపారు. కాగా, మోకా భాస్కరరావు హత్యకేసులో ప్రధాన నిందితుడు చింతా చిన్నీ, చింతా నాంచారయ్య (పులి), చింతా కిషోర్‌లను గురువారం ఆర్‌పేట పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
(చదవండి: అజ్ఞాతంలో టీడీపీ నేత కొల్లు రవీంద్ర!)