సాక్షి, విజయవాడ: వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు (57) దారుణ హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా తుని సమీపంలోని చెక్ పోస్ట్ వద్ద కొల్లు రవీంద్రను మఫ్టీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మోకా భాస్కరరావు హత్య కేసులో ఏ4 నిందితుడిగా కొల్లు రవీంద్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కొల్లు రవీంద్ర విచారణ కోసం నోటీసులు ఇవ్వడానికి ఆయన ఇంటికి పోలీసులు వెళ్లగా.. పోలీసులకు చిక్కకుండా కొల్లు రవీంద్ర తప్పించుకున్నాడు. విశాఖపట్నం వైపు వెళుతున్న కొల్లు రవీంద్రను మఫ్టీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మోకా హత్యకేసులో ఇప్పటికే ఐదు మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే మోకా కుటుంబసభ్యుల ఫిర్యాదు, పట్టుబడ్డ నిందితుల వాంగ్మూలం ఆధారంగా కొల్లు రవీంద్రను పోలీసులు విచారించనున్నారు. కొల్లు రవీంద్రను మచిలీపట్నం తరలించే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి
Comments
Please login to add a commentAdd a comment