Television Channels
-
దూరదర్శన్ కేంద్రాల మూసివేత!
జ్యోతినగర్ (రామగుండం): రాష్ట్రంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన ప్రసారాలను అందించిన 19 ప్రసార భారతి దూరదర్శన్ కేంద్రాలు మరో వారం రోజుల్లో మూతపడనున్నాయి. ఈ మేరకు ప్రసార భారతి డైరెక్టరేట్ జనరల్ నుంచి ఆయా దూరదర్శన్ కేంద్రాలకు ఉత్తర్వులు అందాయి. లోపవర్ ట్రాన్స్‌మీటర్/ వెరీ లోపవర్ ట్రాన్స్‌మీటర్ ప్రసారాలను నెలాఖరులో నిలుపుదల చేయనున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. మూతపడే వాటిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 25 ఏళ్ల నుంచి ప్రసారాలను అందిస్తున్న 5 కేంద్రాలు ఉన్నాయి. ఎన్టీపీసీ రామగుండం టెంపరరీ టౌన్షిప్లో 1989లో ఏర్పాటు చేసిన దూరదర్శన్ కేంద్రం ద్వారా రామగుండం, గోదావరిఖని ప్రాంతంతో పాటు 40 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలకు దూరదర్శన్ ప్రసారాలు అందుతున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావమైనప్పటి నుంచి యాదగిరి పేరుతో ప్రసారాలు అందిస్తున్నారు. పోర్టబుల్ టీవీలకు తప్పని ఇబ్బందులు దూరదర్శన్ కేంద్రాలను ఎత్తివేసినప్పటికీ డిజిటలైజేషన్ సాయంతో నాణ్యమైన ప్రసారాలు రానున్నట్లు సమాచారం. కానీ పోర్టబుల్ టెలివిజన్లకు డిజిటల్ విధానం ఎంతవరకు ఉపయోగపడుతుందనేది తెలియాల్సి ఉంది. సిగ్నల్స్ అందుకునే సామర్థ్యం బ్లాక్ అండ్ వైట్ టీవీలకు సాధ్యమా..అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. స్మార్ట్‌ఫోన్‌లో డేటా లేకుండా ప్రసారాలను చూడవచ్చని చెబుతున్నందున, ఎఫ్ఎం తరహాలో మొబైల్ ప్రసారాలకు ఆదరణ లభించే అవకాశం ఉంది. చాలా తక్కువ మంది మాత్రమే దూరదర్శన్ చూస్తున్నట్లు సర్వేలో తేలడంతోనే కేంద్రాల తొలగింపునకు చర్యలు చేపట్టినట్లు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో మూతపడనున్న దూరదర్శన్ ట్రాన్స్మీటర్లు 19 భద్రాచలం, భైంసా, గద్వాల, జడ్చర్ల, కరీంనగర్, కొల్లాపూర్, కోస్గి, మిర్యాలగూడ, మాడ్గుల, నాగర్‌కర్నూల్, నిజామాబాద్, పెద్దపల్లి, రామగుండం, సిద్దిపేట, సిరిసిల్ల, తాలకొండపల్లి, వేములవాడ, వనపర్తి, యెల్లందు. -
జీవించు... నేర్చుకో... అందించు!
కొత్తతరానికి- వారి ఉరుకుల పరుగుల జీవితానికి ఈ ఏకవాక్య ప్రక్రియ బాగా ఉపయోగపడుతుందని అనుకున్నాను. కొత్తతరాన్నే కాదు- నా తరాన్నే కాదు- నా కంటే ముందు తరాన్ని కూడా మనసులో నిలుపుకుని- మూడు తరాల మధ్య ఏర్పడ్డ అఖాతాన్ని కొటేషన్ల వంతెనతో అధిగమించాలనుకున్నాను. ‘శరీరమాద్యం ఖలు ధర్మసాధనం’ అనే కొటేషన్ (సూక్తి) మా ఇంటి దూలం పక్కన చాక్‌పీసుతో రాసి ఉండటాన్ని నేను చదివాను. అప్పుడు నేను రెండో తరగతిలో ఉండి ఉండవచ్చు. రాసిన వారెవరో ఆ కొటేషన్ రచయిత పేరు రాయలేదు. నాకంటే ఆరేండ్లు పెద్దదైన మా అక్కయ్య రాసి ఉండవచ్చు. అడగడానికి మా అక్కయ్య లేదిప్పుడు. అడగాలని నాకపుడు తెలియదు. మరో నలభై ఏడు సంవత్సరాల తరువాత, నేను కొటేషన్స్‌ని అధ్యయనం చేస్తున్నప్పుడు, అది సంస్కృత మహాకవి కాళిదాసు కొటేషన్ అని తెలిసింది. భూమిలో పడ్డ విత్తనం తీరుగా- ఆ కొటేషన్ నా మనసులో పడ్డది అర్థమయీ కానట్టు- బోధపడీ పడనట్టు. దాని అర్థం ఏమిటో పూర్తిగా తెలుసుకోవాలనే జిజ్ఞాస నాలో ప్రారంభమైంది. దాని అర్థం గురించి నేనెవరినీ అడగలేదు. వయసు పెరుగుతున్నకొద్దీ, జీవితానుభవాలు కలుగుతున్నకొద్దీ ఆ కొటేషన్ రోజూ నాకేదో బోధిస్తున్నట్టుగానే ఉండేది. శరీరం- ఆరోగ్యం- తిండి- వ్యాయామం వంటి విషయాలే కాదు, శరీరానికీ, జీవితానికీ ఉండే సంబంధం ఎటువంటిదో, అటువంటి శరీరాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో, దానికోసం ఏమి చెయ్యాలో, ఏమి చెయ్యకూడదో నిత్యం నాకేదో ఎరుక పరుస్తున్నట్టుగా ఉండేది. ఆ కొటేషన్ చిన్నదేకాని, మొత్తం జీవితం పొడుగునా నన్ను చైతన్య పరుస్తూ వస్తూనేవుంది. అది మొదలు నాకు కనిపించిన ప్రతి కొటేషన్నీ చదువుతూ వచ్చేవాణ్ణి. నాకు సాహిత్యం పట్ల ఆసక్తి ఆ కొటేషన్తోనే ప్రారంభమైందని చెప్పాలి. అయితే అటువంటి కొటేషన్లు రాస్తానని కాని, రాయాలని కాని నేను ఏనాడూ అనుకోలేదు. టెలివిజన్ చానెళ్లు అందుబాటులోకి వచ్చిన తరువాత, కొత్త తరానికి సాహిత్య పఠనాసక్తి పోతోందని మనలో చాలామంది అనుకుంటుండటం నాకు తెలుసు. అయితే రచయితలుగా కొత్త తరాన్ని మనం మన పాఠకులుగా భావించుకుంటున్నామా- అని నేను అనుకుంటూ ఉండేవాడిని. జీవన విధానాల్లో వచ్చిన మార్పుల వల్ల ఇపుడు అందరూ విడివిడిగా బతకవలసి వస్తోంది. పూర్వం- మూడు తరాలు కలిసి ఒకే ఇంట్లో బతికేవారు. హాస్టల్ చదువులు- విదేశీ ఉద్యోగాల వల్ల ఇపుడు రెండు తరాలు కూడా కలిసి ఒకే ఇంట్లో బతకడం లేదు. అందువల్ల కోల్పోతున్న విలువైన అనుభూతులు ఎన్నో ఉన్నాయి. మూడు తరాల మనుషుల మధ్య అనుబంధాల స్థానంలో, వియోగవిషాదాలు గూడు కట్టుకుని ఉంటున్నాయి. కనపడని దుఃఖమేదో మనుషుల్ని ముంచెత్తుతోంది. ఈ తరపు మనుషులందరిలాగే నేను కూడా అటువంటి స్థితులకు లోను అవుతూ వస్తున్నాను. అయితే ఈ తెగిపోతున్న మానవసంబంధాల మధ్య, ఏదో ఒక అవగాహన వారధిని నిర్మించాలని నాకేదో తండ్లాటగా ఉండేది. తరం నుంచి తరానికి అందవలసిన జ్ఞానం అందడం లేదు. అటువంటి జ్ఞానాన్ని అందించడం ఎట్లాగా అని యోచించేవాణ్ణి. అట్లాంటి యోచనలోంచి వచ్చిందే, ఆధునిక కథని స్కిప్టు లేకుండా ఆశువుగా చెప్తూ ఉంటే కెమెరాతో రికార్డు చేసి డి.వి.డి.లుగా విడుదల చేయడం! (ఆ తరువాత కూడా) ఒక కథారచయితగా నేను, నా తరువాతి తరం మనసుకు పట్టేవిధంగా వుండే ప్రక్రియల గురించి మరింత ఆలోచిస్తూ ఉన్నాను. ‘జీవితం సరళమైందే కాని, మనమే దాన్ని సంక్లిష్టం చేస్తుంటాం’ అనే కన్ఫ్యూషియస్ కొటేషన్‌ని నేనేదో పత్రికలో చదివాను. కొత్తతరం కన్ఫ్యూషియస్ చెప్పినటువంటి కొటేషన్లలో ఏ ఒక్కటి చదవగలిగినా, నా ప్రయత్నం కొంత ఫలిస్తుందని నిర్ణయానికి వచ్చి, ప్రపంచ సాహిత్యంలోంచి కొటేషన్లను సేకరించాలనుకున్నాను. తెలుగులోకి సంకలనాలుగా వచ్చినంతమేరా కొటేషన్ల సంకలనాలు కొని తెచ్చుకుని చదవడం ఆరంభించాను. అది 2010 సంవత్సరం ప్రారంభపు రోజులు. నాక్కావాల్సిన కొటేషన్లను సేకరించే పనిలోకి అట్లా దిగాను కాని- నేను కొటేషన్లని రాయవలసి వస్తుందని నాకప్పటికి తెలియదు. కొటేషన్లను చదువుతున్నకొద్దీ, నాకు చాలావాటితో విభేదం మొదలైంది. చదువుతున్నకొద్దీ, వాటికి భిన్నంగా నేను ఆలోచించాల్సి వచ్చింది. కొన్ని కొటేషన్స్తోనే నాకు ఆమోదం కలిగింది. విభేదించిన ఎన్నో కొటేషన్స్‌ని నాదైన పద్ధతిలో తిరిగి వ్యాఖ్యానించుకోవడం సాగేది. అటువంటి స్థితిలో నేను కొంత ఆగి ఆలోచించుకోవాల్సి వచ్చింది. కొటేషన్‌ను ఒక రచనాప్రక్రియగా ఎందుకు స్వీకరించకూడదు? అని ప్రశ్నించుకున్నాను. నాదైన దృక్పథంతో తిరిగి నిర్వచించే వాక్యాన్ని కవితాత్మకంగానే కాదు- హిందుస్థానీ శాస్త్రీయ సంగీత శ్రోతగా, లయపూరితంగా కూడా చెప్పడం మంచిదనుకున్నాను. కొత్తతరానికి- వారి ఉరుకుల పరుగుల జీవితానికి ఈ ఏకవాక్య ప్రక్రియ బాగా ఉపయోగపడుతుందని అనుకున్నాను. కొత్తతరాన్నే కాదు- నా తరాన్నే కాదు- నా కంటే ముందు తరాన్ని కూడా మనసులో నిలుపుకుని- మూడు తరాల మధ్య ఏర్పడ్డ అఖాతాన్ని కొటేషన్ల వంతెనతో అధిగమించాలనుకున్నాను. ఇంతకుముందు కొటేషన్స్ చెప్పినవారు పనిగట్టుకుని చెప్పినవారు కాదు. తత్వశాస్త్రంలో భాగంగానో- రాజనీతిశాస్త్రాల్లో భాగంగానో- కథలోనో- నవలలోనో- నాటకంలోనో- కవిత్వంలోనో- పాత్రల పరంగానో- రచయిత వ్యాఖ్యానాలుగానో రాయబడ్డాయి తప్ప- కొటేషన్‌ను ఒక ప్రక్రియగా భావించి, దాన్నొక కళారూపంగా తీర్చిదిద్దుకుని, ఒక తాత్విక నేపథ్యంతో రాసినవారు కాదు. వారికా అవసరం పడలేదు. ఆధునిక జీవితం కలిగించిన ఆటంకాల వల్ల, నేను వాటిని అధిగమించడానికి కొటేషన్‌ని ఒక ప్రక్రియగా తీసుకోవలసి వచ్చింది. ఫ్యూడల్ యుగానికి సంబంధించి... చిట్టచివరి దశలోని ఒక తెలంగాణ గ్రామంలో పుట్టి పెరిగినవాణ్ణి(1959). వ్యవసాయ కుటుంబం, బందిఖానా వంటి బడి చదువుల్లో గట్టెక్కలేక వ్యవసాయంలోకి దిగి, చేసి-చెడి, విధిలేక గోదావరిఖని బొగ్గుగనుల్లోకి కార్మికుడిగా వలస- సాహిత్య పరిచయం- కథారచనలోకి దిగడం- మరోవైపున వందలాది మంది అధికారులతో- వేలకొద్దీ కార్మికులతో కలిసి బొగ్గుగనుల్లో కఠినమైన పనులు చేయాల్సిరావడం- వారి వారి మనస్తత్వాలు- సంఘాలు- రాజకీయాలు- రచయితలు- వారివారి ప్రవర్తనలు- సభలు- సమావేశాలు- రాష్ట్రం- దేశం తిరగడం- ఆ నాటి గోదావరిఖని, క్రిక్కిరిసిన ప్రపంచానికి ఒక మినీ నమూనా(1980-2007). 27 సంవత్సరాల ఉద్యోగజీవితం చాలనుకుని- పదమూడేండ్లు ముందుగానే అధికారిగా ఉద్యోగాన్ని వదిలేశాను. విస్తృత జీవితానుభవం ఉన్నా పరిమితంగానే కథలు రాసినవాణ్ణి. రాయవలసింది చాలా ఉండిపోయిన స్థితి. యాభై సంవత్సరాల వయసుకు చేరుకున్నాను. జననం నుంచి మరణం దాకా, మానవ జీవితంలో, ప్రతి మనిషీ అనుభవించవలసి వచ్చే ఆనంద- విషాదాలన్నింటినీ అనివార్యంగా మూటకట్టుకుని ఉన్న స్థితి... నేనెరిగిన మనుషుల మూలంగా- ముఖ్యంగా రచయితల మూలంగా- నాకు అనేక నిర్ధారణలు కలుగుతూ వచ్చాయి. ఫ్యూడల్- పెట్టుబడిదారి- సోషలిస్టు- ప్రజాస్వామ్య వ్యవస్థల, ఉత్థానపతనాలు విన్నవాణ్ణి- కొన్నింటిని చూసినవాణ్ణి. వందల, వేల సంవత్సరాల్లో జరిగిన ప్రపంచ పరిణామాల్ని చదువుకున్నవాణ్ణి. వేల సంవత్సరాలుగా మతాల- రాజకీయ సిద్ధాంతాల ఆవిర్భావ- పతనాలు, సామ్రాజ్యాలు కూలిపోవడం- దేశాలు స్వాతంత్య్రాన్ని పొందడం వంటి అనేక విషయాలు... నేను పేర్కొన్న విషయాల నేపథ్యమే కాకుండా అపుడు నేనున్న మానసిక స్థితి- మా బాపు మరణం(2009), మా బాబు దూరదేశంలో ఉండిపోవడం, మనుషులతో పడకపోవడం- కోపం- ఆగ్రహం కలగలిసి ఒంటరినై... ‘‘ఉదాత్తంగా బతకడమే, ఉత్తమ ప్రతీకారం’’ అన్నట్టుగా, నా బతుకేదో నేను బతకాలని నిర్ణయించుకున్న స్థితి కూడా, కొటేషన్స్ రాయడానికి నన్ను ముందుకు తోసిందని నేను అనుకుంటున్నాను. కథారచయిత తుమ్మేటి రఘోత్తమరెడ్డి తాజాగా ‘ఆధునిక తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి స్వతంత్ర కొటేషన్స్’ అంటూ ‘జీవించు... నేర్చుకో... అందించు!’ వెలువరించారు. ఇది ఆయన పూర్వ కొటేషన్స్ సంకలనాలను కూడా కలుపుకొని వెలువడిన సమగ్ర సంకలనం. సంపాదకులు: డాక్టర్ డి.చంద్రశేఖర రెడ్డి. ప్రచురణ: ఎమెస్కో. పేజీలు: 488; వెల: 250; ప్రతులకు: సాహితి ప్రచురణలు, విజయవాడ-2. ఫోన్: 0866-2436643 - తుమ్మేటి రఘోత్తమరెడ్డి 9000184107 -
ఎన్నికల నిధుల కోసం ప్రత్యేక ట్రస్ట్
ఏర్పాటుకు పార్టీల సూత్రప్రాయ అంగీకారం సంస్కరణలపై పార్టీలతో సీఈసీ సంప్రదింపులు న్యూఢిల్లీ: ఎన్నికల్లో ధనబలానికి, కండబలానికి ముకుతాడు వేయాలంటే కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) ఆధ్వర్యంలో జాతీయ ఎన్నికల ట్రస్ట్(ఎన్ఈటీ)ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు దేశంలోని పలు పార్టీలు సూత్రప్రాయంగా మద్దతు ప్రకటించాయి. అయితే దీనిపై ఇంకా సంప్రదింపులు జరగాల్సిన అవసరం ఉందన్నాయి. ఎన్నికల సంస్కరణలకు సంబంధించి రాజకీయ పార్టీలకు నిధులు, లా కమిషన్ సిఫార్సులపై సీఈసీ రాజకీయ పక్షాలతో సోమవారం సంప్రదింపులు జరిపింది. 38 పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. కార్పొరేట్ నిధుల కోసం ఈసీ ఆధ్వర్యంలో ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి, దాన్నుంచి పార్టీలకు నిధుల పంపిణీ జరగాలన్న లా కమిషన్ సిఫార్సుకు 70 శాతం మంది ప్రతినిధులు మద్దతు తెలిపారు. అయితే ఏ పార్టీకి ఎంత డబ్బు అవసరమౌతుందన్నది నిర్ణయించటం కష్టమైన పని అని కొన్ని పార్టీలు పేర్కొన్నాయి. ఎన్నికల కోసం ఇప్పటి వరకు ఖర్చు చేస్తున్న ప్రజాధనాన్ని విద్య, మౌలిక సదుపాయాల వంటి వాటికోసం వెచ్చించాలన్న గట్టి అభిప్రాయం వ్యక్తమైంది. అమెరికాలో మాదిరిగా ప్రత్యర్థులు టెలివిజన్ చానళ్ల ప్రత్యక్ష చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటే ఖర్చు గణనీయంగా తగ్గించవచ్చని కొందరు అభిప్రాయపడ్డారు. ఓట్ల లెక్కింపులో వివిధ ఈవీఎంలలో ఓటింగ్ జరిగిన విధానం బయటపడకుండా ఉండేందుకు టోటలైజర్ మెషిన్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ హెచ్ఎస్ బ్రహ్మ తెలిపారు. దీని ద్వారా ఓట్లను మిక్సింగ్ చేసేందుకు అవకాశం కలుగుతుందన్నారు. ఎన్నికల నేరాలను త్వరగా పరిష్కరించేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు అవసరంపై అన్ని పార్టీలూ సానుకూలంగా స్పందించాయన్నారు. -
రాజాకు కోపం వచ్చింది...
చెన్నై: ఇళయరాజా స్వరపర్చిన పాటలను ప్రసారం చేయాలంటే ఇక ఎఫ్ ఎం రేడియోస్టేషన్లు, టీవీలు ఇక ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి. ఇళయరాజా తాజా ప్రకటన చూస్తే ఇక వాళ్లు వేరే దారి వెతుక్కోవాల్సిందే అనిపిస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు, ఇసైజ్ఞాని ఇళయరాజాకు కోపం వచ్చింది. నేను స్వరపర్చిన పాటలన్నింటి పైనా హక్కులు నావే.. కావాలంటే రైట్స్ కొనుక్కోండంటూ.. వివిధ ఎఫ్ఎం రేడియోస్టేషన్లు, టీవీలపై కొరడా ఝళిపించారు. తన అనుమతి లేకుండా తను కంపోజ్ చేసిన వేలాది పాటలను ఎలా వాడుకుంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకముందు తన పాటలను వాడుకోవాలనుకునే వారెవరైనా తననుంచి గానీ, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి గానీ అనుమతి తీసుకోవాలని తెగేసి చెబుతున్నారు. తన అనుమతి లేనిదే తన పాటలు ప్రసారం చేయడం చట్టవిరుద్దమంటున్నారు. అంతేకాదు ఇలా వచ్చిన మొత్తంలో కొంతభాగాన్ని నిర్మాతలకు పంచి ఇచ్చే ఆలోచన కూడా చేస్తున్నానని చెప్పుకొచ్చారు. అలాగే మేధో సంపత్తి హక్కు మీద మళ్ళీ తీవ్రమైన చర్చ జరగాల్సిన అవసరం ఉందంటున్నారు. నేను దుక్కిదున్ని సాగుచేశాను... నా పంటను అమ్ముకున్నాను నిజమే.. అంతమాత్రాన నేను నాటిన చెట్టును కూడా తీసుకుంటానంటే ఎలా అంటూ వాదిస్తున్నారు. -
టెలివిజన్ చానెళ్లపై పరువునష్టం దావా వేస్తా: పార్థసారథి
విజయవాడ: పత్రికావిలువలు తొక్కిపెట్టి తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్న టెలివిజన్ చానెల్లపై వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు వ్యతిరేకంగా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్న టెలివిజన్ చానళ్లపై పరువునష్టం దావా వేస్తానని మచిలీపట్నం పార్థసారథి హెచ్చరించారు. పోలీసులు జరిపిన సోదాల్లో నా రూంలో ఒక్క రూపాయి కూడా దొరకలేదు అని పార్థసారథి అని అన్నారు. అదే హోటల్లో బస చేస్తున్న టీడీపీ నేతలు డబ్బు సంచులతో బయటికెళ్లిన సాక్షాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. బీసీ కులానికి చెందిన వాడిని కాబట్టే తనను టార్గెట్ చేస్తున్నారని పార్థసారథి తెలిపారు. రాజకీయంగా, వ్యక్తిగతంగా నన్ను నష్ట పరిచేందుకే కొన్ని చానళ్లు ప్రయత్నిస్తున్నాయని ఆయన అన్నారు. -
దాయాదుల ‘బుల్లి’ సమరం
భారత వ్యతిరేక ప్రచారానికి మీడియాను వాడుకోవాలన్న తపన పాక్ నేతలలో మొదలైంది. భారత్‌ను ప్రతినాయక పాత్రలో చూపుతూ ఇటీవల నిర్మించిన ‘వార్’ ఇందుకు తాజా ఉదాహరణ. టీవీ చానెళ్ల మీద ఈ హఠాత్ దాడి కూడా అదే చెబుతోంది. భారత్‌తో ఉన్న వైరాన్ని దాచి పెట్టుకోవడం పాకిస్థాన్‌కి తెలియదు. నాలుగు రోజుల క్రితం అక్కడి పది టీవీ చానెళ్లకి కోటి రూపాయలు జరిమానా విధించడం అలాంటిదే. ఇవి చేసిన తప్పు-పరిధులు అతిక్రమించి భారతీయలు రూపొందించిన వినోద కార్యక్రమాలను ‘అతిగా’ ప్రసా రం చేయడమే. నిబంధనలు అతిక్రమించినందుకు ఒక్కొ క్క చానెల్‌కు పది లక్షల రూపాయలు జరిమానా విధించి నట్టు పాక్ సమాచార మంత్రిత్వ శాఖ ఒక పత్రంలో పేర్కొ న్నది. ప్రైవేటు చానెళ్లు ప్రసారం చేసే కార్యక్రమాలలో పది శాతం విదేశ కార్యక్రమాలు ఉండవచ్చు. ఈ పది శాతంలో అరవై శాతం భారతదేశంలో రూపొందించిన కార్యక్రమాలు, మిగిలిన నలభై శాతం ఇతర దేశాలలో తయారైన కార్యక్రమాలు ప్రసారం చేయాలి. జియో టీవీ (ఎంటర్టైన్మెంట్), ఎక్స్‌ప్రెస్ ఎంటర్టైన్మెంట్, హమ్ టీవీ, ఆక్సిజన్ టీవీ, ప్లే టీవీ, కోహినూర్ ఎంటర్టైన్మెంట్ టీవీ వన్, ఎన్టీవీ ఎంటెర్టైన్మెంట్, జీఎక్స్ఎమ్ ఎంట ర్టైన్మెంట్, జల్వా ఎంటర్టైన్మెంట్- పరిధిని అతిక్రమించాయని ఆరోపణ. కొద్దికాలం క్రితమే నేషనల్ అసెంబ్లీలో ఈ అంశం చర్చకు వచ్చింది. భారతదేశంలో తయారైన వినోద కార్యక్రమాలు తమ ఇష్టానుసారం ప్రసారం చేసుకునే అవకాశం ప్రైవేటు చానెళ్లకు ఉందా? అన్న ప్రశ్న వచ్చింది. ఇం దులో సినిమాలు, ఇతర వినోద కార్యక్రమాలు కూడా వస్తాయి. కానీ ఈ నిర్ణయం అక్కడి ప్రజలకు రుచించేది మాత్రం కాదు. పది నెలల క్రితం కూడా పాక్ వైఖరి ఈ రీతిలో లేదు. భారతీయ కార్యక్రమాలు ఆపివేయడంతోనే పాక్ టీవీ ప్రేక్షకులు వెంటనే చానెళ్లు ఆపేశారు. దీనితో రేటింగ్ చతికిలపడింది. భారతీయ కార్యక్రమాలు ఆపేయడంతోనే, వ్యాపారం పడిపోయిందని ఆపరేటర్లు గగ్గోలు మొదలుపెట్టారు. మనం మళ్లీ జియా ఉల్ హక్ కాలానికి వెళ్లామా అని సాధారణ ప్రజలు కూడా ప్రశ్నించడం మొదలుపెట్టారు. నిజానికి కొద్దికాలం క్రితమే ‘గేలప్ పాకిస్థాన్’ అనే సంస్థ భారతీయ చానెళ్లు అక్కడ ప్రసారం కావడం గురించి సర్వే చేసింది. ఇందులో నలభై మూడు శాతం మంది ప్రజలు సానుకూలత వ్యక్తం చేశారు. నలభై రెండు శాతం ప్రతికూలంగా ఉన్నారు. కార్గిల్ ఘర్షణ నుంచి భారత్ కూడా కొన్ని పాకిస్థానీ చానెళ్లను నిషేధించింది. ఆ నిషేధం తొలగించడం గురించి కొంత కాలం క్రితం పాక్ విదేశ వ్యవహారాల కార్యదర్శి జలీల్ అబ్బాస్ మాట్లాడారు. భారత్‌కు చెందిన అన్ని చానెళ్లు పాకిస్థాన్‌లో చూడవచ్చు, ఒక్క పాక్ చానెల్ కూడా భారత్‌లో ప్రసారం కావడం లేదని జలీల్ చెప్పారు. కానీ భారత్ అంతర్గత వ్యవహారాల గురించి, ముఖ్యంగా కాశ్మీర్ అంశం గురించి పీటీవీ అనుసరించిన ధోరణి అప్పుడు ఈ అంశాన్ని పరిశీలించడానికి అభ్యంతరకరంగా మారింది. 2009లో పాక్ పార్లమెంటు స్థాయీ సంఘం తమ చానెళ్లు భారత్‌లో ప్రసారం చేయడానికి కృషి జరగాలని విజ్ఞప్తి చేసింది కూడా. కానీ ఇదే స్థాయీ సంఘం ఏడాదికే వైఖరి మార్చేసింది. భారత్ చానెళ్లతో జరుగుతున్న ‘సాంస్కృతిక దాడి’ని అనుమతించవ ద్దని ఆదేశించింది. భారత వ్యతిరేక ప్రచారం చేస్తున్న 24 పాక్ చానెళ్లను గడచిన డిసెంబర్లోనే నిషేధించారు. ఇవన్నీ సరిహద్దులలో యథేచ్చగా ప్రసారం అవుతూ ఉండేవి. ఉత్తరప్రదేశ్, హైదరాబాద్, అసోం, శ్రీనగర్, ముంబై వంటి ప్రదేశాలలో ఉద్రిక్తతలు తలెత్తడానికి పాక్ చానెళ్ల కథనాలు కారణమవుతున్నాయని ఆరోపణలు రావడంతో ఈ చర్య తీసుకున్నారు. క్యూటీవీ, మదానీ టీవీ, ఏఆర్వైటీవీ, ప్రభుత్వ టీవీ చానెల్ పీటీవీ(కార్గిల్ ఘర్షణలో భారత వ్యతిరేక ప్రచారం చేసినందువల్ల నిషేధించారు), పీటీవీ హోమ్, పీటీవీ వరల్డ్, జియో టీవీ, డాన్, ఎక్స్‌ప్రెస్, వక్త్, నూర్టీవీ, హాది టీవీ, ఆజ్, ఫిల్మా క్స్, ఎస్టీవీ భారత వ్యతిరేక కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నాయని నిఘా వ్యవస్థలు తేల్చాయి. ఇవన్నీ కాశ్మీర్, పం జాబ్, ఈశాన్య రాష్ట్రాలలో ప్రసారమవుతాయి. ఎన్టీవీ బంగ్లాదేశ్, నేపాల్ టీవీ, పీస్ టీవీ(దుబాయ్), సౌదీ టీవీ, టీవీ మాల్దీవ్స్ కూడా అభ్యం తరకర అంశాలకు ప్రసిద్ధి చెందాయి. ఇందులో పాకిస్థానీ చానెళ్లు ఏవీ భారత సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు తీసుకోలేదు కూడా. ఈ విషయం మొన్న ఫిబ్రవరిలో పాక్ సమాచార శాఖ మంత్రి కమార్ జమాన్ కెయిరాయే వెల్లడించారు. భారత వ్యతిరేక ప్రచారానికి మీడియాను వాడుకోవాలన్న తపన పాక్ నేతలలో మొదలైంది. భారత్‌ను ప్రతినాయక పాత్రలో చూపుతూ ఇటీవల నిర్మించిన ‘వార్’ ఇం దుకు తాజా ఉదాహరణ. టీవీ చానెళ్ల మీద ఈ హఠాత్ దాడి కూడా అదే చెబుతోంది. పాక్‌లో ఒక భారీ పేలుడుకి భారత ఏజెంట్లు కుట్రపన్నడం, అది భగ్నం కావడం ‘వార్’లో కథాంశం. దీనికి పాక్ రక్షణశాఖ పెట్టుబడి పెట్టిందన్న వాదన ఉంది. దీనిని పాక్ సాధారణ ప్రజలైనా నమ్ముతారా? నమ్మడం లేదని సర్వేలు చెబుతున్నాయి. డాక్టర్ గోపరాజు నారాయణరావు