సాక్షి, మచిలీపట్నం : వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు (57) దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అనుచరుడు, టీడీపీ నేత చింతా చిన్నితో పాటు మరో ఇద్దరు అనుమానితులను ఆర్‌పేట పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. రాజకీయ ఆధిపత్యం చాటేందుకే భాస్కర రావును హత్య చేసినట్లు పోలీసుల విచారణ నిర్ధారణ అయ్యింది. దీనిపై మరికొందరిని సైతం విచారించే అవకాశం ఉంది. భాస్కర్‌రావు హత్య రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. (వైఎస్సార్ సీపీ నేత దారుణ హత్య)
గతనెల 29న బందరు నడిబొడ్డున అందరూ చూస్తుండగా పట్టపగలు ఈ హత్య జరగడం తీవ్ర కలకలం రేపింది. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రోద్బలంతోనే ఆయన అనుచరుడు చింతా చిన్ని పక్కా పథకం ప్రకారం ఈ హత్యకు పాల్పడినట్టుగా భాస్కరరావు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా హత్యతో ఈ ముగ్గురికి సంబంధం ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. రాష్ట్ర రవాణా సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య మోకా భాస్కరరావు ముఖ్య అనుచరుడు కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment