
సాక్షి, అమరావతి : ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్‌గా రాయచోటి నియోజకవర్గ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి నియమితులయ్యారు. రాష్ట్రంలో ప్రభుత్వ చీఫ్ విప్‌తో పాటు మరో అయిదుగురు విప్‌లను నియమించారు. విప్‌లుగా కొలుసు పార్థసారధి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, దాడిశెట్టి రాజా, బుడి ముత్యాల నాయుడు, కొరుముట్ల శ్రీనివాసులు ఎంపికయ్యారు. కాగా శ్రీకాంత్‌రెడ్డికి కేబినెట్‌లో స్థానం దక్కుతుందని అందరూ ఆశించినా, సామాజిక వర్గాలకు సముచిత స్థానం కల్పించే ప్రయత్నాల్లో భాగంగా ఆయనకు మంత్రి పదవి దూరమైంది.