Chief Whip
-
రాయలసీమ అంటే చంద్రబాబుకు ఎందుకంత ద్వేషం?
-
ఉద్దవ్ థాక్రేకు కొత్త తలనొప్పి
ముంబై: శివసేన అధినేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేకు కొత్త తలనొప్పి వచ్చి పడింది. అధికారం కోల్పోయి రోజులు గడవక ముందే.. మరికొందరు సభ్యులు పార్టీకి దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదీ ఎంపీలు వీడతారంటూ ఆందోళనల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో రాష్ట్రపతి ఎన్నికలు ఉన్నందునా.. షిండే వర్గం వైపు శివసేన ఎంపీలు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. థాక్రే టీంలోని లోక్‌సభ ఎంపీ రాహుల్షివాలే.. మంగళవారం రాత్రి ఉద్దవ్ థాక్రేకు ఓ లేఖ రాశారు. గిరిజన మూలాలు ఉన్న ద్రౌపది ముర్ముకు మద్ధతు ప్రకటించాలంటూ కోరారు. ఆపై షిండే శిబిరంలోని ఓ ఎమ్మెల్యే.. శివసేనకు ఉన్న పద్దెనిమిది మంది ఎంపీలలో 12 మంది తమ గూటికే వస్తారంటూ ప్రకటించడం కలకలం రేపింది. ఈ తరుణంలో పార్టీకి కొత్త చీఫ్ విప్‌ను ఎన్నుకున్నారు. ఈ మేరకు శివసేన పార్లమెంటరీ నేత సంజయ్ రౌత్.. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్లహాద్ జోషికి ఓ లేఖ రాశారు. లోక్‌సభ ఎంపీ రాజన్ విచారేను పార్టీ చీఫ్ విప్‌గా ఎన్నుకుంటున్నట్లు రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. ఎంపీ భావనా గవాలి స్థానంలో రాజన్ విచారేను ఎన్నుకున్నట్లు, తక్షణమే ఈ నియామకం అమలులోకి వస్తుందని లేఖలో రౌత్ స్పష్టం చేశారు. భావనా గవాలి.. యావత్మల్-వాషిమ్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. షిండే శిబిరంలో గవాలి ఉండడంతో ఉద్దవ్ థాక్రే టీం ఈ నిర్ణయం తీసుకుంది. -
తెగని పంచాయితి.. మహారాష్ట్రలో ఆ 16 మంది ఎమ్మెల్యేల పరిస్థితేంటి?
సాక్షి, ముంబై: మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వర్గంతో ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేన ఎమ్మెల్యేలకు మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు కన్పిస్తున్నాయి. పార్టీ జారీ చేసిన విప్‌ను ధిక్కరించినందుకు ఠాక్రే వర్గంలోని 16 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని శివసేన (షిండే వర్గం) చీఫ్ విప్ భరత్ గోగావలే అసెంబ్లీ స్పీకర్‌కు పిటిషన్ అందించారు. నిబంధనలను అతిక్రమించినందుకు వారిపై చర్యలు తోసుకోవాలని కోరారు. దీంతో ఠాక్రే వర్గంలోని 16 మంది ఎమ్మెల్యేలకు సస్పెన్షన్ నోటీసులు జారీ చేయనున్నట్లు స్పీకర్ కార్యాలయం వెల్లడించింది. సీఎం ఏక్నాథ్ షిండే తిరుగుబాటుతో శివసేన రెండు వర్గాలుగా విడిపోయిన విషయం తెలిసిందే. ఆదివారం జరిగిన స్పీకర్ ఎన్నికలో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే వర్గాలు పార్టీ ఎమ్మెల్యేలకు వేర్వేరు విప్ జారీ చేశాయి. చదవండి👉Maharashtra political crisis: విల్లు బాణమెవరికో? షిండే వర్గం బీజేపీ అభ్యర్థి రాహుల్ నర్వేకర్‌గా అనుకూలంగా, ఠాక్రే వర్గం శివసేన అభ్యర్థి రాజన్ సాల్వీకి అనుకూలంగా ఓటు వేశాయి. రాహుల్ నర్వేకర్‌కు 164 ఓట్లు రాగా, మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) అభ్యర్థి, శివసేన ఎమ్మెల్యే రాజన్ సాల్వీకి కేవలం 107 ఓట్లు పోలయ్యాయి. స్పీకర్ ఎన్నిక అనంతరం పార్టీ విప్‌ను కొందరు సభ్యులు ఉల్లంఘించారని ఆరోపిస్తూ శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు(ఠాక్రే వర్గం) డిప్యూటీ స్పీకర్‌కు ఓ లేఖ అందజేశారు. పార్టీ ఆదేశాలను 39 మంది ఎమ్మెల్యేలు ధిక్కరించారని సభలో సునీల్ ప్రభు చెప్పారు. ఠాక్రే వర్గంలోని 16 ఎమ్మెల్యేలే పార్టీ విప్‌ను ధిక్కరించారని షిండే వర్గం చీఫ్ విప్.. స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన వారిపై చర్యలకు ఉపక్రమించే అవకాశాలున్నాయి. చదవండి👉బల పరీక్షలో నెగ్గిన ఏక్నాథ్ షిండే ప్రభుత్వం -
శాసనమండలి చీఫ్ విప్‌గా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చీఫ్ విప్‌గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. చదవండి: (గంజి ప్రసాద్ కుటుంబ సభ్యులను పరామర్శించిన హోంమంత్రి) -
చీఫ్ విప్ ప్రసాదరాజుకు ఎమ్మెల్యే కొఠారి సత్కారం
దెందులూరు(పశ్చిమగోదావరి): ఆంధ్రప్రదేశ్ నూతన చీఫ్‌విప్‌గా ముదునూరి ప్రసాదరాజును ఎంపిక చేయడం వ్యక్తిగతంగా, పార్టీపరంగా ఎంతో సంతోషాన్నిచ్చిందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్యచౌదరి అన్నారు. సోమవారం తాడేపల్లిలో ఏపీ చీఫ్‌విప్ చాంబర్లో ప్రసాదరాజును కలిశారు. శాలువా, బొకేతో సత్కరించి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి జానంపేట బాబు, దెందులూరు మండల పార్టీ కన్వీనర్ కామిరెడ్డి నాని, పోతునూరు మాజీ సొసైటీ చైర్మన్ గూడపాటి పవన్‌కుమార్ ఉన్నారు. చదవండి: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. టీటీడీ కీలక నిర్ణయం -
చర్చకు రమ్మంటే.. టీడీపీ అలా చేసింది
సాక్షి, అమరావతి: సభలో సభ్యులు అందరూ మాట్లాడతారని అనుకున్నామని, కానీ, టీడీపీ తీరుతో అంతా తలకిందులైందని అన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి. సమావేశాల ప్రారంభంలోనే గవర్నర్‌ని అవమానిస్తూ టీడీపీ సభ్యులు ఘోరాలకు పాల్పడ్డారని, అది చూసి ముఖ్యమంత్రి సహా అంతా ఆశ్చర్యపోయారని శ్రీకాంత్ రెడ్డి ఆక్షేపించారు. బడ్జెట్ సమావేశాలు ముగిసిన అనంతరం.. చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. వ్యవస్థలను నాశనం చేసింది చంద్రబాబే అని, టీడీపీ సభ్యులు పబ్లిసిటీ కోసం అసెంబ్లీలో గవర్నర్ ని సైతం అవమానపరిచారని గుర్తు చేశారు. ఆపై సభలోనూ టీడీపీ సభ్యులు సరిగా వ్యవహరించలేదు. ఏదైనా అనుమానం ఉంటే అడగాల్సింది. కానీ, వాళ్ల ప్రవర్తన చూశాక.. టీడీపీ అంటేనే ప్రజలు అసహ్యించుకుంటున్నారు. కేవలం సభలో అలజడి సృష్టించడానికే వాళ్లు వచ్చారు. సభలోకి వచ్చి గొడవ చేసి బయటకు వెళ్లిపోవడమే పనిగా పెట్టుకున్నారు. సభ జరిగినంత కాలం చిడతలు కొట్టడం, కాగితాలు చించటం చేశారు. పోనీ.. వారు వేసిన ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పనీయకుండా చేశారు. ఇళ్ల పట్టాల మీద స్వల్ప కాలిక చర్చ పెడితే దానిలో కూడా మాట్లాడలేదు. తమ ఎల్లో మీడియా ద్వారా పోలవరం ఎత్తు తగ్గించారంటూ రచ్చ చేశారు. సరేనని దానిపై చర్చ పెడితే టీడీపీ సభ్యులు మాట్లాడలేదు. మద్యం పాలసీపై స్వల్ప కాలిక చర్చ పెడితే.. అందులోనూ పాల్గొనలేదు. ఆఖరికి.. అసెంబ్లీ హక్కుల గురించి చర్చ పెట్టినా వారు రాలేదు. ప్రతీ అంశంపై సీఎం జగన్ చాలా స్పష్టంగా వివరణ ఇచ్చారు. అసలు చర్చలపై పట్టుబట్టిందే వాళ్లు. కానీ, చర్చకు రాకుండా గొడవలు చేశారు అంటూ టీడీపీ తీరుపై అసహనం వ్యక్తం వ్యక్తం చేశారు ప్రభుత్వ చీఫ్ విప్. -
‘ప్రజలు ఛీకొడతారన్న కనీస జ్ఞానం టీడీపీకి లేదు’
సాక్షి, అమరావతి: ప్రభుత్వంపై బురద చల్లడమే కొందరు కుట్ర దారుల పని అంటూ ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ, వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ జరుపుతోందని.. రిపోర్ట్ రాకముందే అవాస్తవ కథనాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చదవండి: ‘బండారూ! మందేసి మాట్లాడుతున్నావా? ఇంతటి మహా విషాదాన్ని కూడా రాజకీయం చేస్తారా?’ ‘‘విచారణలో ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకుంటుంది?. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వలేదు. సీబీఐ ఏఎస్పీ రాంసింగ్‌పై ప్రభుత్వమే కేసు వేయించిందని దుష్ప్రచారం చేస్తున్నారు. కోర్టు ఆదేశాలతోనే సీబీఐ ఏఎస్పీ రాంసింగ్‌పై కేసు నమోదయ్యిందని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వంపై బురద చల్లాలనే ఏకైక అజెండాతో కుట్ర చేస్తున్నారు. మంచి చేసేవారిపై రోజుక కథనంతో దుష్ప్రచారం చేస్తున్నారు. మంత్రి గౌతమ్‌రెడ్డి మరణాన్ని కూడా టీడీపీ రాజకీయం చేస్తోంది. ప్రజలు ఛీకొడతారన్న కనీస జ్ఞానం కూడా టీడీపీకి లేదని’’ శ్రీకాంత్‌రెడ్డి దుయ్యబటారు. -
‘ఉద్యోగులను ద్వేషించిన వ్యక్తుల ట్రాప్‌లో పడొద్దు’
సాక్షి, అమరావతి: రాష్ట్ర పరిస్థితిని అందరూ అర్థం చేసుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులకు నష్టం చేయాలని ప్రభుత్వం ఉద్దేశ్యం కాదన్నారు. కచ్చితంగా ఉద్యోగులతో చర్చలు జరుపుతామన్నారు. ప్రభుత్వం ఎప్పుడూ మొండిగా వెళ్లదన్నారు. కొందరి మాటలు విని ప్రభుత్వంపై బురద చల్లవద్దని హితవు పలికారు. కరోనా సమయంలోనూ ప్రభుత్వంపై ఎంతో భారం పడిందన్నారు. చదవండి: వేతనాలు తగ్గవు..ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ స్పష్టీకరణ ఉద్యోగులు ఆవేశాలకు లోను కావద్దన్నారు. ఏ రాష్ట్రంలోనైనా 27 శాతం ఐఆర్ఎ ఇచ్చారా అని ప్రశ్నించారు. అందరికీ మంచి చేయాలనే ఆలోచించే ప్రభుత్వమిదని తెలిపారు. ప్రభుత్వాన్ని అస్థిర పర్చాలని కొందరు కుట్రలు చేస్తున్నారన్నారు. ఉద్యోగులను ద్వేషించిన వ్యక్తుల ట్రాప్‌లో పడొద్దన్నారు. పదివేల కోట్ల భారం పడుతున్నా సీఎం వైఎస్ జగన్ వెనుకాడలేదని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. -
కొందరి మాటలు విని ప్రభుత్వంపై బురద చల్లవద్దు
-
ఇది ప్రజా విజయం: శ్రీకాంత్‌రెడ్డి
సాక్షి, అమరావతి: ఇది ప్రజా విజయమని.. ప్రజలను నమ్ముకున్న పార్టీ వైఎస్సార్సీపీ అని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, బీజేపీ పోటీ చేసినా కథ నడిపింది చంద్రబాబే అని దుయ్యబట్టారు. క్యాలెండర్ ప్రకారం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. బీజేపీ, టీడీపీ ప్రజల విశ్వాసం కోల్పోయాయి. సంక్షేమ పాలనకే ప్రజలు పట్టం కట్టారు. ప్యాకేజీ కోసం చంద్రబాబు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. ‘‘బద్వేల్ ఫలితం మరింత బాధ్యత పెంచింది. సీఎం వైఎస్ జగన్ పాలనకు ప్రజలు ఇచ్చిన మద్దతు ఇది. ఇది దళితులు, బీసీలు, సామాన్యుల విజయం. ప్రజలు మా వైపే నిలిచారు సీఎం జగన్ పారదర్శక పాలనకు ప్రజలు అండగా నిలిచారు. నిరంతరం దుష్ప్రచారం చేసే టీడీపీ, బీజేపీలకు బుద్ధి చెప్పారు. బీజేపీ గతంలో ఇచ్చిన హామీలు విస్మరించినందుకు ప్రజలు బుద్ధి చెప్పారు. ప్రత్యేక హోదా సహా, విభజన చట్టంలోని హామీలేవి బీజేపీ నెరవేర్చలేదు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫలాలు అందించాలన్నది సీఎం జగన్ లక్ష్యం. ఆయన క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు. అందుకే ప్రజలు ఆయనకు ప్రతి ఎన్నికల్లోనూ మద్దతుగా నిలుస్తున్నారని’’ శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. -
పదవి కోసమే ఆదినారాయణరెడ్డి ఆరోపణలు: గడికోట శ్రీకాంత్‌రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఆదినారాయణ రెడ్డి ఆరోపణలు కేవలం కేంద్రంలో పదవి కోసమే.. రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ భిక్ష పెట్టినవారిపై ఆరోపణలు చేయడం తగదు. స్వప్రయోజనాల కోసం సంస్కారం మరిచిపోవద్దు అని ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ‘‘ప్రజాస్వామ్యంలో ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడగడం రాజకీయ పార్టీల బాధ్యత. కేంద్రంలో అధికారం ఉన్నామన్న గర్వంతో బీజేపీ ప్రజలను ఓట్లు అడగకుండా పత్రిక సమావేశాలకు పరిమితం అయ్యింది. ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం ఇది చెయ్యలేదని ప్రశ్నించలేని పరిస్థితి బీజేపీది’’ అని విమర్శించారు. ‘‘బీజేపీ నేతలు మంది మార్బలంతో వచ్చి అధికారులపై ఆరోపణలు చేస్తున్నారు. మాకు ప్రజా బలం ఉంది, పోలీసులు అవసరం లేదు. నిష్పక్షపాత ఎన్నికలు జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం. విభజన చట్టంలో హామీలు నేరవేరిస్తే పోటీ నుంచి విరమించుకుంటాం. ప్రత్యేక హోదా, దుర్గరాజపట్నం, స్టీల్ ప్లాంట్ ఇస్తే పోటీ నుంచి విరమించుకుంటాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం త్యాగం చేస్తాం. వ్యక్తిగతంగా దూషణలు, ఆరోపణలు చేయడం సంస్కారం కాదు. ప్రత్యేక హోదా ఇస్తామని స్వయంగా ప్రధాని చెప్పారు’’ అని తెలిపారు. ‘‘సోమశిల నిర్వాసితులకు అన్నివిధాల న్యాయం చేస్తాం. ప్రతి రైతుకు 6 నుంచి 10 లక్షలు నష్టపరిహారం ఇచ్చిన ఘనత వైఎస్సార్‌ది. సోమశిల విషయంలో పెండింగ్‌లో ఉన్న 19 వేల అప్లికేషన్లలో అర్హులైన అందరికి ఒన్ టైం సెటిల్ మెంట్ చేశాం అని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ‘‘మా ప్రభుత్వంపై చంద్రబాబు కావాలని బురద జల్లుతున్నారు. చంద్రబాబు లాగా.. మేము అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు. ప్రజాబలం ఉన్నప్పుడు మాకు ఇంకో బలం అవసరంలేదు. టీడీపీ ఢిల్లీ పర్యటన గురించి మాట్లాడ్డం అనవసరం. మోడీ అంతు తెలుస్తానని చెప్పిన చంద్రబాబు తరువాత వంగి వంగి దండాలు పెట్టారు.. ఏదోరకంగా ప్రచారం కావాలని టీడీపీ కోరుకుంటున్నారు.. చంద్రబాబు గురించి అందరికి తెలుసు’’ అన్నారు. చదవండి: ఏపీలో చంద్రబాబు కొత్తగా బూతు రాజకీయాలు తెచ్చారు: ఎంపీ భరత్ -
పరిషత్ ఎన్నికలను చంద్రబాబు బహిష్కరించడం సిగ్గుచేటు
-
అందుకు సిద్ధంగా ఉన్నాం: గడికోట శ్రీకాంత్‌రెడ్డి
సాక్షి, అమరావతి: ఉనికి కోసమే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు దిగజారి మాట్లాడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన తాడేపల్లిలో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బురద చల్లడమే తన విధానం అన్నట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అనుభవం ఉన్న నేతా లేక గల్లీ లీడరా? అని ప్రశ్నించారు. చంద్రబాబు, ఆయన తనయుడు హైదరాబాద్‌కు పారిపోయారు. చంద్రబాబు నాయుడు.. జూమ్ నాయుడుగా మారిపోయారని ఆయన ఎద్దేవా చేశారు.(చదవండి: పేర్ని నానిపై హత్యాయత్నం: కొత్త కోణం..) ‘‘కోవిడ్ దృష్ట్యా అసెంబ్లీ ఆవరణలో మీడియా పాయింట్ తొలగించాం. ఏ అర్హత ఉందని చంద్రబాబు మా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ప్రజలను పట్టించుకోని చంద్రబాబుకు ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదు. కష్టకాలంలో రూ.70వేల కోట్లు ప్రజలకు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌ది. ప్రభుత్వం ఇచ్చే ప్రతిపైసా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళ్తోంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రజలను సీఎం జగన్ ఆదుకున్నారు. 9 నెలల్లో అమరావతికి చంద్రబాబు ఎన్నిసార్లు వచ్చారు? మీరు లేవనెత్తిన అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సమస్యలను చూసి పారిపోయింది చంద్రబాబు, లోకేషేనని శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. (చదవండి: మానవత్వంతో ఆదుకోండి) -
టీడీపీ ఇష్టానుసారంగా వ్యవహరించింది..
సాక్షి, అమరావతి: శాసనమండలిలో టీడీపీ ఎమ్మెల్సీలు ఇష్టానుసారం వ్యవహరించారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ ద్రవ్యవినిమయ బిల్లును అడ్డుకోవడం వల్ల ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై టీడీపీ ఎమ్మెల్సీలు చేయి చేసుకున్నారన్నారు. మండలిలో లోకేష్ ఫోటోలు తీయడం నిబంధనలకు విరుద్ధమని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ యనమల రామకృష్ణుడు చెప్పినట్టు మండలి చైర్మన్ సభ నడిపారని నిబంధనలు ఉల్లంఘించిన టీడీపీ ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
‘ప్రచార్భాటంతో ఆయనలా చేసి ఉంటే..’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఏపీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని.. కానీ ప్రతిపక్ష నేత చంద్రబాబు హైదరాబాద్‌లో కుర్చోని బురద చల్లుతున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. విశాఖ గ్యాస్ లీక్ సంఘటనలో సాయం అందించడంలో వైఎస్ జగన్ ప్రభుత్వం సఫలమయ్యిందన్నారు. హుదూద్ తుఫాను సమయంలో చంద్రబాబు ప్రచార్భాటాలకే పరిమితమయ్యారని విమర్శించారు. ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా గ్యాస్ లీకేజీ ఘటనలో నష్టపోయిన కుటుంబాలను వైఎస్ జగన్ ఆదుకున్నారని తెలిపారు. చంద్రబాబు రూ.25 లక్షలు డిమాండ్ చేస్తే.. సీఎం జగన్ కోటి రూపాయలను ప్రకటించారని తెలిపారు. మళ్ళి కోటి రూపాయలు ఎందుకంటూ చంద్రబాబు బురదచల్లుతున్నారని దుయ్యబట్టారు. (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం) పుష్కరాల సమయంలో చంద్రబాబు ప్రచార్భాటాలు 29 మందిని పొట్టన పెట్టుకున్నాయని.. అప్పట్లో మృతులను ఉద్దేశించి ఆయన నీచంగా మాట్లాడారని గుర్తుచేశారు. ప్రతిపక్షం గట్టిగా నిలదీస్తే కేవలం పదిలక్షలు మాత్రమే ప్రకటించారని ధ్వజమెత్తారు. విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనలో ప్రభుత్వం తప్పిదం లేకపోయిన సహయక చర్యలు చేపట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారని పేర్కొన్నారు. చంద్రబాబులా ప్రచార్భాటాలకు పోయి నిర్లక్ష్యం చేసి ఉంటే వేలాది మంది మృత్యువాత పడేవారని తెలిపారు. చంద్రబాబు, లోకేష్‌లు ప్రధాని మోదీని, సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వం అన్నారని.. నేడు శవ రాజకీయాలు చేసేందుకు సిగ్గులేకుండా విశాఖకు వెళ్లడానికి కేంద్రం అనుమతి అడిగారని విమర్శలు గుప్పించారు. (విశాఖ విషాదం: ఎల్జీ పాలిమర్స్ క్షమాపణ) కరోనాను ఎదుర్కొనేందుకు కరకట్టపై అక్రమంగా నిర్మించుకున్న కట్టడంలో క్వారంటైన్ లో వుండి ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేందుకు అనుమతి అడిగావా? అని చంద్రబాబును ప్రశ్నించారు. ఆయన ప్రజా సంక్షేమం కన్నా శవ రాజకీయానికే పెద్దపీట వేస్తున్నారని ధ్వజమెత్తారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో దేశానికే వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదర్శంగా నిలిచారని శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. -
ఆయన ప్రకటించిన ఆస్తులన్నీ డుప్లికేటే..!
సాక్షి, తాడేపల్లి: అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అని.. హడావుడిగా ఆస్తులను ప్రకటించడం వెనుక అనేక అనుమానాలు కలుగుతున్నాయని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రకటించిన ఆస్తులన్నీ డుప్లికేటేనని, ఐటీ విచారణలో నిజాలు బయటపడుతున్నాయనే కారణంతో ఆస్తులు ప్రకటించారని విమర్శించారు. ‘చంద్రబాబు పీఎస్ ఇంట్లోనే దాడులు చేస్తే.. రూ.2వేల కోట్ల అక్రమ లావాదేవీలు బయటపడ్డాయి. 7 లక్షల కోట్ల అవినీతికి చంద్రబాబు పాల్పడ్డారు. విదేశాల్లో ఉన్న ఆయన బినామీ ఆస్తులు బయటపెట్టాలి’ అని శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. (టీడీపీకి ఆ హక్కు లేదు) హవాలాపై నిప్పునాయుడు ఎందుకు స్పందించలేదు..? చంద్రబాబు చెప్పేవనీ శ్రీరంగనీతులు.. చేసేవన్నీ తప్పుడు పనులని శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు 100 తప్పులపై బీజేపీ ఛార్జ్‌షీట్ కూడా వేసిందని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు అవినీతి సామ్రాట్ అని వామపక్షాలు పుస్తకం కూడా ముద్రించారన్నారు. అక్రమ ఆస్తులపై లక్ష్మీపార్వతి వేసిన పిటిషన్‌పై చంద్రబాబు స్టే తెచ్చుకున్నారన్నారు. అమరావతి నుంచి అహ్మద్ పటేల్ వరకు జరిగిన హవాలాపై నిప్పునాయుడు ఎందుకు స్పందించలేదని ఆయన నిలదీశారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు.. కాంగ్రెస్‌కు ఎంత కప్పం కట్టారో బయటపడుతోందన్నారు. అవినీతి సొమ్మును కాపాడుకోవడానికి, కేసుల కోసమే చంద్రబాబు రాష్ట్ర విభజనకు సహకరించారని ఆయన ఆరోపించారు. త్వరలోనే ఆ మాఫియాను బయటపెడతాం.. ‘పొత్తులు లేకుండా చంద్రబాబు ఏ ఎన్నికల్లోనూ గెలవలేదు. ఆయన చేసిన అవినీతికి దేవుడు కూడా కాపాడలేడు. భవిష్యత్తులో చంద్రబాబు జైలుకెళ్లక తప్పదు. రాష్ట్ర ఇమేజ్ను దెబ్బతీసేందుకు చంద్రబాబు ఒక మాఫియాను సృష్టించారు. ప్రతి నెలా రూ.5కోట్లు పెట్టి మాఫియాను నడిపిస్తున్నారని’ శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. త్వరలోనే ఆ మాఫియా వివరాలు బయటపెడతామని ఆయన పేర్కొన్నారు. అవినీతిలో కూరుకుపోయిన చంద్రబాబును ఎల్లో మీడియా కాపాడుతుందని ధ్వజమెత్తారు. చంద్రబాబుది జనచైతన్య యాత్ర కాదని.. బినామీలను కాపాడుకునే యాత్రగా శ్రీకాంత్ రెడ్డి అభివర్ణించారు. (‘చంద్రబాబు ప్రతిపక్షనేత కాదు.. పనికిమాలిన నేత’) -
పవన్‌కల్యాణ్ ఓ అమీబా
తిరుపతి రూరల్ : పవన్‌కల్యాణ్ ఓ అమీబా అని, ఒకసారి కనిపిస్తే మళ్లీ నాలుగు నెలల వరకు కనిపించరని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. గండిక్షేత్రం నుంచి తిరుమలకు ఆయన చేస్తున్న పాదయాత్ర మంగళవారం ఐదో రోజుకు చేరింది. మంగళవారం చంద్రగిరి నియోజకవర్గం భాకరాపేట నుంచి శ్రీవారి మెట్టు వరకు ఈ పాదయాత్ర కొనసాగింది. అనంతరం శ్రీనివాసమంగాపురం వద్ద ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజకీయ అజ్ఞానంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై పవన్ కల్యాణ్ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అమీబా ఒక్కసారి తింటే నాలుగు నెలల వరకు నిద్రపోతుందని, ఆయన కూడా ఒకసారి జనంలోకి వచ్చి మళ్లీ నాలుగు నెలల వరకు కనిపించకుండా పోతారని ఎద్దేవా చేశారు. చిత్తుగా ఓడిన చంద్రబాబును ఆదుకునేందుకు పవన్ పడుతున్న ఆరాటం చూస్తుంటే జాలిగా ఉందన్నారు. చంద్రబాబు, తాను ఒకటేనని దమ్ముంటే పవన్ కల్యాణ్ బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. తమ స్వార్థ రాజకీయాల కోసం దేవుడిని వాడుకోవాలని ప్రయత్నించడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గత ఆరు నెలల్లో ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను సీఎం జగన్ ప్రవేశపెట్టారని, వాటి పేర్లు చంద్రబాబు గాని, పవన్కల్యాణ్గాని కరెక్ట్‌గా చెబితే తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని సవాల్ విసిరారు. సీఎం జగన్మోహన్రెడ్డి చెప్పిన ప్రతి ఒక్కటి అమలుచేసుకుంటూ పోతున్నారని, ఆయన్ని ధైర్యంగా ఎదుర్కోలేకే దేవుడిని రాజకీయాల్లోకి లాగాలని ప్రయతి్నస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి తప్పుడు ఆలోచనలను మానుకోకపోతే జనం తరిమికొడతారని హెచ్చరించారు. ఎమ్మెల్యేల సంఘీభావం శ్రీకాంత్‌రెడ్డి పాదయాత్ర మంగళవారం భాకరాపేట నుంచి ప్రారంభమై రాత్రికి శ్రీనివాసమంగాపురంలోని శ్రీవారి మెట్టుకు చేరుకుంది. ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తిరుపతి, తంబళ్లపల్లె, సత్యవేడు ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి, ఆదిమూలం పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు. శ్రీనివాసమంగాపురంలో కల్యాణ వెంకన్నను దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. -
ఒకసారి భార్యా బిడ్డల గురించి ఆలోచించండి
సాక్షి, వైఎస్సార్ జిల్లా : జిల్లాలోని లక్కిరెడ్డిపల్లి మండలానికి చెందిన రైతు శంకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం పట్ల ప్రభుత్వ చీఫ్ విస్ శ్రీకాంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. బుధవారం శంకర్‌రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించిన ఆయన మృతుని కుటుంబాన్ని ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా.. రైతు బాగుంటేనే ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతులు మేలు కోరి అనేక నిర్ణయాలు తీసుకుంటుందని, రైతులెవరూ నిరాశ, నిస్పృహలకు లోనుకావద్దని విజ్ఞప్తి చేశారు. అఘాయిత్యానికి పాల్పడే ముందు ఒకసారి కుంటుంబం, భార్యాబిడ్డల గురించి ఆలోచించాలని సూచించారు. -
వినయవిధేయతకు పట్టం!
సాక్షి ప్రతినిధి, వరంగల్: గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్‌కు మరోమారు పెద్దపీట వేశారు. ఇటు శాసనసభ.. అటు శాసనమండలిలో కీలకమైన పదవులకు వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు నేతలకు కట్టబెట్టారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ను ప్రభుత్వ చీఫ్ విప్‌గా నియమించారు. అలాగే, శాసనమండలిలో విప్‌గా ఉన్న బోడకుంటి వెంకటేశ్వర్లును కూడా చీఫ్ విప్‌గా నియమించారు. ఈనెల 9 నుంచి రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో చీఫ్ విప్‌తో పాటు ఆరుగురు విప్‌లను నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్‌గా దాస్యం వినయ్‌భాస్కర్‌కు, మండలిలో చీఫ్ విప్‌గా బి.వెంకటేశ్వర్లుకు స్థానం దక్కింది. వరుస విజయాలు వరంగల్ జిల్లా నుంచి టీఆర్ఎస్తో పాట సీఎం కేసీఆర్‌కు విధేయత, విశ్వసనీయతతో మెలిగిన వినయ్‌భాస్కర్‌కు కీలక పదవి దక్కింది. టీఆర్ఎస్ ఏర్పాటు నుంచి ఉద్యమంలో కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తున్న వినయ్‌భాస్కర్‌ను ప్రభుత్వ చీఫ్ విప్ పదవి కట్టబెట్టారు. 2004లో హన్మకొండ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి మందాడి సత్యనారాయణ రెడ్డి చేతిలో ఓడిపోయిన వినయ్‌భాస్కర్.. ఆ తర్వాత వ రుస విజయాలు సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా పశ్చిమ వరంగల్ శాసనసభ నియోజకవర్గం నుండి 2009, 2010 ఉప ఎన్నిక, 2014, 2018 సాధారణ ఎన్నికల్లో వరుసగా గెలిచారు. 2015 జనవరిలో ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంఓ) పార్లమెంటరీ కార్యదర్శిగా ఆయన నియమితులయ్యారు. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మంత్రి పదవి ఆశించిన వినయ్‌కు అప్పుడు అవకాశం దక్కకపోగా, ఈసారి ప్రభుత్వ చీఫ్ విప్‌గా కేసీఆర్ ఆవకాశం కల్పించడం విశేషం. ‘మండలి’లో చీఫ్ విప్‌గా వెంకటేశ్వర్లు శాసనమండలిలో విప్‌గా ఉన్న బోడకుంటి వెంకటేశ్వర్లు ఈసారి చీఫ్ విప్‌గా పదోన్నతి కలిగింది. ఆరు నెలల క్రితం ఉపాధ్యాయుల నియోజకవర్గం స్థానానికి జరిగిన ఎన్నికల్లో శాసనమండలి ఎన్నికల్లో చీఫ్ విప్‌గా ఉన్న సుధాకర్ రెడ్డి ఓడిపోయిన విషయం విదితమే. దీంతో ఆ స్థానంలో ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లును నియమిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కేటీఆర్, కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తా ప్రభుత్వ చీఫ్ విప్‌గా సిఫారసు చేసిన కేటీఆర్, ఖరారు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నా ప్రత్యేక ధన్యవాదాలు. తెలంగాణ కోసం వారు ఇచ్చిన పిలుపు మేరకు ఉద్యమంలో పని చేసిన నాకు సముచిత స్థానం కల్పించారు. నాకు దక్కిన ఈ పదవికి వన్నే తెచ్చేలా, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వ్యవహరిస్తాను. మొదటి నుంచి పార్టీకి వినయ విధేయతలతో ఉన్నాను. ఉద్యమ సమయంలో ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ ఆదేశాలతో ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతం చేశాం. వరంగల్ టౌన్ ప్రెసిడెంట్‌గా కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేశా. కార్పొరేటర్‌గా నా డివిజన్ అభివృద్ధికి, ఎమ్మెల్యేగా ప్రజల ఆకాంక్ష మేరకు నియోజకవర్గం అభివృద్ధికి పనిచేశా. అంకితభావంతో, పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా కొనసాగుతున్న నా పేరును ప్రభుత్వ విప్‌గా సిఫారసు చేసిన కేటీఆర్‌కు, ఖరారు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు. శాసనసభ సమావేశాలు సజావుగా సాగేలా ప్రతిపక్షాలు, మిత్రపక్షాలను కలుపుకుపోతూ కృషి చేస్తా. – దాస్యం వినయ్‌భాస్కర్ -
ఎమ్మెల్యే రేగాకు సీఎం కార్యాలయం నుంచి పిలుపు!
సాక్షి, హైదరాబాద్ : ఖమ్మం జిల్లా పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుకు శనివారం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు రావడంతో ఆయన హుటాహుటీన హైదరాబాద్ బయల్దేరారు. మంత్రివర్గ విస్తరణకు ఇంకా జాప్యం జరిగే అవకాశం నేపథ్యంలో ఎమ్మెల్యే కాంతారావును ప్రభుత్వ విప్‌గా నియమించే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వ విప్‌గా క్యాబినెట్ హోదాలో నియమించనున్నట్లు తెలుస్తోంది. కాగా రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం అవుతుండగా.. శాసనసభ కమిటీల ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. శాసన మండలి, శాసనసభ చీఫ్ విప్ పదవుల భర్తీపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. ప్రస్తుత బడ్జెట్ సమావేశాలు ముగిసేలోగా శాసనసభ కమిటీల వివరాలతోపాటు, చీఫ్ విప్, విప్ల పేర్లను కూడా ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణ శాసనసభ ఏర్పాటై ఎనిమిది నెలలు దాటినా.. బిజినెస్ అడ్వైజరీ కమిటీ మినహా ఇతర కమిటీల నియామకం జరగలేదు. శాసనసభ నిబంధనల ప్రకారం ఆర్థిక, సంక్షేమ, ఇతర రంగాలకు సంబంధించి 19 రకాలైన కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందులో ప్రధానంగా పబ్లిక్ అకౌంట్స్, అంచనాలు, పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీలున్నాయి. సంక్షేమ, ఇతర రంగాల కమిటీలను స్పీకర్ నామినేట్ చేస్తారు. ఎంఐఎంకు పీఏసీ చైర్మన్ పదవి? పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో మొత్తం 13 మంది సభ్యులకుగాను తొమ్మిది మంది శాసనసభ, నలుగురు శాసన మండలి నుంచి ఎన్నిక అవుతారు. అయితే పీఏసీ చైర్మన్ పదవిని ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు ఇవ్వడం ఆనవాయితీ. 119 మంది ఎమ్మెల్యేలున్న అసెంబ్లీలో అధికార టీఆర్ఎస్కు 103 మంది సభ్యుల బలం ఉంది. కాంగ్రెస్ తరఫున 19 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికైనా, 12 మంది చీలిక వర్గం ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరారు. దీంతో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం హోదాను కోల్పోయింది. ఏడుగురు సభ్యులున్న ఏఐఎంఐఎం అసెంబ్లీలో అతిపెద్ద రెండో పార్టీగా అవతరించింది. ఎంఐఎంకు అధికారికంగా ప్రతిపక్ష హోదా దక్కక పోయినా.. ఆ పార్టీ ఎమ్మెల్యేకు పీఏసీ చైర్మన్ పదవి దక్కే అవకాశం ఉంది. మండలి చీఫ్ విప్‌గా పల్లా రాజేశ్వర్‌రెడ్డి? గంగుల కమలాకర్, వినయభాస్కర్, గంప గోవర్దన్, బాజిరెడ్డి గోవర్దన్‌ల పేర్లు చీఫ్ విప్ పదవి కోసం వినిపిస్తున్నాయి. వీరితోపాటు ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, హనుమంతు షిండే, పద్మా దేవేందర్‌రెడ్డి, రేఖా నాయక్, బాల్క సుమన్ కూడా రేసులో ఉన్నట్లు సమాచారం. మండలి విప్‌గా ఉన్న డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని చీఫ్ విప్‌గా నియమించి, మరో ఎమ్మెల్సీకి విప్‌గా అవకాశం ఇవ్వాలనే యోచనలో సీఎం ఉన్నట్లు సమాచారం. మంత్రివర్గంలో చోటు ఆశిస్తున్న ఎమ్మెల్యేలతో పాటు, సామాజిక వర్గాల సమతుల్యత పాటిస్తూ చీఫ్ విప్, విప్ల నియామకంపై కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. చీఫ్ విప్, విప్ పదవుల కోసం పోటీ గత అసెంబ్లీలో చీఫ్ విప్‌గా వ్యవహరించిన కొప్పుల ఈశ్వర్ ప్రస్తుతం సంక్షేమ శాఖల మంత్రిగా పనిచేస్తున్నారు. గత శాసనసభలో గంప గోవర్దన్ (కామారెడ్డి), గొంగిడి సునీత (ఆలేరు), నల్లాల ఓదెలు (చెన్నూరు) విప్‌లుగా వ్యవహరించారు. ఓదెలు మినహా మిగతా ఇద్దరూ మరోమారు శాసనసభకు ఎన్నికయ్యారు. కాగా శాసన మండలిలో చీఫ్ విప్‌గా వ్యవహరించిన పాతూరు సుధాకర్‌రెడ్డి పదవీ కాలం ఈ ఏడాది మార్చితో ముగిసింది. 2016 ఆగస్టులో మండలి విప్‌లుగా నియమితులైన బోడకుంటి వెంకటేశ్వర్లు, పల్లా రాజేశ్వర్ రెడ్డి నేటికీ కొనసాగుతున్నారు. -
‘గడికోట’కు కేబినెట్ హోదా
సాక్షి, అమరావతి: శాసనసభలో ప్రభుత్వ చీఫ్ విప్‌గా నియమితులైన రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డికి ప్రభుత్వం కేబినెట్ ర్యాంక్ కల్పించింది. అలాగే ప్రభుత్వ విప్‌లుగా నియమితులైన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సామినేని ఉదయభాను, కాపు రామచంద్రారెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ముత్యాల నాయుడు, దాడిశెట్టి రాజాకు సహాయ మంత్రి హోదా కల్పించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్పీ సిసోడియా నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. -
ఆ‘ఘనత’ చంద్రబాబుదే..!
సాక్షి, అమరావతి : ఐదేళ్ల పాలనలో దళారీగా, కమీషన్ ఏజెంట్‌గా పనిచేసి సీఎం అర్థాన్ని మార్చేసిన ‘ఘనత’ చంద్రబాబుదేనని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. బాబు సీఎంగా కాకుండా కమీషన్ మినిస్టర్‌లా పనిచేశారని ఎద్దేవా చేశారు. రాజకీయ జీవితంలో ఆయన రోజురోజుకు దిగజారుతున్నారని చురకలంటించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద శ్రీకాంత్‌రెడ్డి గురువారం విలేకరులతో మాట్లాడారు. విద్యుత్ కొనుగోళ్ల పీపీఏలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షిస్తే చంద్రబాబు రంకెలెందుకు వేస్తున్నారని మండిపడ్డారు. ల్యాంకో రాజగోపాల్‌కి బాబు లబ్ది చేకూర్చారని, విద్యుత్ కొనుగోళ్లలో రూ.5 వేల కోట్ల కమీషన్లు దండుకున్నారని ఆరోపించారు. పీపీఏల కుంభకోణంలో తన పేరెక్కడ బయటికొస్తుందోనని చంద్రబాబు కొత్త డ్రామాలు మొదలుపెట్టారని విమర్శించారు. వాస్తవాలు ప్రజలకు చేరకుండా సభను తప్పుదోవ పట్టిస్తున్నారని శ్రీకాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్నటివరకు ‘ఖబర్దార్’ అంటూ కేంద్రాన్ని హెచ్చరించిన ఆయన ఇప్పుడెందుకు వెనకేసుకొస్తున్నారని ప్రశ్నించారు. రైతుల పొట్టకొట్టి హెరిటేజ్‌లో అధిక రేట్లకు అమ్ముకోవడం లేదా అని అన్నారు. టీడీపీని బీజేపీలో విలీనం చేస్తూ తమని విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం జగన్ ప్రజాసేవకుడిగా ఉంటారని పేర్కొన్నారు. -
జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడి నుంచి చీఫ్‌విప్ దాకా..
రాయచోటి : రైతు కుటుంబానికి చెందిన రాజకీయ నేత లక్కిరెడ్డిపల్లె మాజీ ఎమ్మెల్యే గడికోట మోహన్‌రెడ్డి వారసునిగా గడికోట శ్రీకాంత్‌రెడ్డి రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. నిత్యం ప్రజలకు దగ్గరగా ఉంటూ వారి కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటూ వారి మనసులో చోటు సంపాదించుకున్నారు. ఉన్నత చదువులు చదివి, అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేçస్తున్నా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం, దివంగత నేత వైఎస్సార్ స్ఫూర్తే తనను రాజకీయాల్లోకి రప్పించిందని గడికోట శ్రీకాంత్‌రెడ్డి చెబుతుంటారు. 2006లో కడప జిల్లా యువజన కాగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత సమస్యలను తెలుసుకోవడం కోసం 2007లో జిల్లా వ్యాప్తంగా 500 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని సాగునీటి వనరులు వాటి ఆవశ్యకత, ఇతర సమస్యలపై పూర్తిస్థాయిలో అవగానను పెంచుకున్నారు. ఎమ్మెల్యేగా... లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గం 2009 ఎన్నికల ముందు రద్దయింది. రాయచోటి నియోజకవర్గంలో విలీనమైంది. దీంతో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ల విషయంలో పోటీ ఉన్నప్పటికీ యువజన కోటాలో దివంగత నేత వెఎస్సార్, వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీస్సులతో శ్రీకాంత్‌రెడ్డి రాయచోటి టిక్కెట్‌ను దక్కించుకున్నారు. 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రాజకీయ దిగ్గజం సుగువాసి పాలకొండ్రాయుడిపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీకాంత్‌రెడ్డి పోటీ చేశారు. 15వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వైఎస్సార్ మరణానంతరం చోటు చేసుకున్న పరిణామాల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. శ్రీకాంత్‌రెడ్డి కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో జెడ్పీ మాజీ చైర్మన్ సుగువాసి సుబ్రహ్మణ్యంపై వైఎస్సార్సీపీ అభ్యర్థిగా శ్రీకాంత్‌రెడ్డి పోటీ చేసి 57వేల ఓట్ల భారీ మెజారిటీతో విజయాన్ని అందుకున్నారు. 2014 జమిలి ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే ఆర్.రమేష్‌కుమార్‌రెడ్డిపై పోటీ చేసి 36వేల ఓట్లతో గెలుపొంది హ్యాట్రిక్‌ను సొంతం చేసుకున్నారు. 2019 ఎన్నికల్లో కూడా ఆర్.రమేష్కుమార్రెడ్డిపైనే పోటీ చేసి 33వేల ఓట్ల మెజార్టీతో నాలుగో విజయాన్ని అందుకుని రాయచోటి రాజకీయ చరిత్రను తిరగరాశారు. రాజకీయాల్లో చురుకైన పాత్ర... పార్టీ అధినేతకు శ్రీకాంత్‌రెడ్డి దగ్గరగా, నమ్మకస్తుడుగా ఉంటూ చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఫలితంగా రాయచోటి స్థానం నుంచి నాలుగు పర్యాయాలు టిక్కెట్‌ను దక్కించుకుని వైఎస్సార్ కుటుంబం ఆశీస్సులతో విజయాలను అందుకుంటూ వచ్చారు. 1952 నుంచి ఇప్పటి వరకు 17 సార్లు రాయచోటి స్థానానికి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో వరుసగా నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా శ్రీకాంత్‌రెడ్డి గెలుపొంది రికార్డు నెలకొల్పారు. కష్టకాలంలో వైఎస్ జగన్ వెంటే... కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి బయటకు రావడంతో అందరికంటే ముందుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన వ్యక్తి శ్రీకాంత్‌రెడ్డి. జగన్ ఓదార్పు యాత్ర, పాదయాత్రల వెన్నంటే నడిచారు. అసెంబ్లీలో జగన్‌కు చేదోడు వాదోడుగా నిలిచి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తేవడంలో సఫలీకృతులయ్యారు.రాజకీయ ప్రత్యర్థులలో సింహస్వప్నంగా నిలిచారన్నది రాజకీయ విశ్లేషకుల వాదన. విజయాలు... నియోజకవర్గంలో వెలిగల్లు, ఝరికోన, శ్రీనివాసపురం ప్రాజెక్టుల మంజూరుతో పాటు వాటి నిర్మాణంలో శ్రీకాంత్‌రెడ్డి పాత్ర ప్రశంసనీయం. వెలిగల్లు నీటిని రాయచోటి పట్టణానికి అందించి తాగునీటి కొరతను తీర్చారు. అలాగే రోళ్లమడుగు నీటి పథకం ద్వారా పట్టణ సమీపంలోని చెన్నముక్కపల్లె, రామాపురం, లక్కిరెడ్డిపల్లె మండలాలలోన్ని అన్ని గ్రామాలకు తాగునీటిని అందించారు. గాలివీడు పట్టణానికి కూడా వెలిగల్లు ద్వారా తాగునీటిని అందిస్తున్నారు. రాయచోటి పట్టణంలో రింగ్‌రోడ్డు నిర్మాణం, ప్రభుత్వ పాలిటెక్నిక్, బాలికల జూనియర్ కళాశాల, మైనారిటీ హాస్టళ్లు, నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కస్తూర్బా, మోడల్ స్కూల్స్ మంజూరు, పట్టణంలో నాలుగు వరుసల జాతీయ రహదారి విస్తరణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు జాతీయ రహదారిలో డివైడర్స్ ఏర్పాటు, ట్రాఫిక్ పోలీసు స్టేషన్ ఏర్పాటు, పలు అభివృద్ధి పనుల మంజూరులో ఎమ్మెల్యే పాత్ర అభినందనీయంగా చెప్పుకోవచ్చు. -
ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్‌గా శ్రీకాంత్ రెడ్డి
సాక్షి, అమరావతి : ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్‌గా రాయచోటి నియోజకవర్గ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి నియమితులయ్యారు. రాష్ట్రంలో ప్రభుత్వ చీఫ్ విప్‌తో పాటు మరో అయిదుగురు విప్‌లను నియమించారు. విప్‌లుగా కొలుసు పార్థసారధి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, దాడిశెట్టి రాజా, బుడి ముత్యాల నాయుడు, కొరుముట్ల శ్రీనివాసులు ఎంపికయ్యారు. కాగా శ్రీకాంత్‌రెడ్డికి కేబినెట్లో స్థానం దక్కుతుందని అందరూ ఆశించినా, సామాజిక వర్గాలకు సముచిత స్థానం కల్పించే ప్రయత్నాల్లో భాగంగా ఆయనకు మంత్రి పదవి దూరమైంది. -
ప్రభుత్వ చీఫ్ విప్, విప్ హోదాలు రద్దు
సాక్షి, అమరావతి : ప్రభుత్వ చీఫ్ విప్, విప్ హోదాలను ప్రభుత్వం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు రాజీనామా చేయడంతో.. మే 25 నుంచి ప్రభుత్వ విప్ హోదాలు కోల్పోయినట్లు చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఈ ప్రకటనతో తొమ్మిది మంది సభ్యులు శాసన మండలిలో పదవులను కోల్పోయారు. వీరిలో పయ్యావుల కేశవ్, డొక్కా మాణిక్యవరప్రసాద్, బుద్దా వెంకన్న తదితరులు ఉన్నారు.