సాక్షి, అమరావతి: రాష్ట్ర పరిస్థితిని అందరూ అర్థం చేసుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులకు నష్టం చేయాలని ప్రభుత్వం ఉద్దేశ్యం కాదన్నారు. కచ్చితంగా ఉద్యోగులతో చర్చలు జరుపుతామన్నారు. ప్రభుత్వం ఎప్పుడూ మొండిగా వెళ్లదన్నారు. కొందరి మాటలు విని ప్రభుత్వంపై బురద చల్లవద్దని హితవు పలికారు. కరోనా సమయంలోనూ ప్రభుత్వంపై ఎంతో భారం పడిందన్నారు.
చదవండి: వేతనాలు తగ్గవు..ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ స్పష్టీకరణ
ఉద్యోగులు ఆవేశాలకు లోను కావద్దన్నారు. ఏ రాష్ట్రంలోనైనా 27 శాతం ఐఆర్‌ఎ ఇచ్చారా అని ప్రశ్నించారు. అందరికీ మంచి చేయాలనే ఆలోచించే ప్రభుత్వమిదని తెలిపారు. ప్రభుత్వాన్ని అస్థిర పర్చాలని కొందరు కుట్రలు చేస్తున్నారన్నారు. ఉద్యోగులను ద్వేషించిన వ్యక్తుల ట్రాప్‌లో పడొద్దన్నారు. పదివేల కోట్ల భారం పడుతున్నా సీఎం వైఎస్ జగన్ వెనుకాడలేదని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment