గాలివీడు ఘటన.. కాల్‌డేటా తీస్తే వాస్తవాలు తెలుస్తాయి: శ్రీకాంత్‌ రెడ్డి | YSRCP Srikanth Reddy Key Comments Over Galivedu Incident | Sakshi
Sakshi News home page

గాలివీడు ఘటన.. కాల్‌డేటా తీస్తే వాస్తవాలు తెలుస్తాయి: శ్రీకాంత్‌ రెడ్డి

Published Sat, Dec 28 2024 10:21 AM | Last Updated on Sat, Dec 28 2024 1:00 PM

YSRCP Srikanth Reddy Key Comments Over Galivedu Incident

సాక్షి, అన్నమయ్య: గాలివీడు ఎంపీడీవో ఘటనలో పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి. ఎంపీపీ రెచ్చగొట్టే విధంగా మాట్లాడటంతోనే సమస్య పెద్దది అయ్యిందని చెప్పుకొచ్చారు. కాల్‌డేటా తీసుకుని విచారిస్తే వాస్తవాలు ఏంటనేది తెలుస్తుంది అంటూ కామెంట్స్‌ చేశారు.

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘గాలివీడు ఎంపీడీవో ఘటనలో పూర్తి స్థాయి విచారణ చేయాలి. ఎంపీడీవో కార్యాలయ అధికారులు పిలిస్తేనే సుదర్శన్‌రెడ్డి అక్కడికి వెళ్లారు. ఎంపీపీ అయిన తన తల్లి సంతకం కావాలని ఎంపీడీవో కార్యాలయ అధికారులు కోరారు. ఎంపీపీకి చెందిన సామాగ్రి లోపల ఉందని, తాళాలు తీయాలని ఆయన అడిగారు. ఆ సమయంలో తోపులాట జరిగింది. దాన్ని రాజకీయం చేస్తున్నారు.

ఎంపీడీవో రెచ్చగొట్టే విధంగా మాట్లాడటంతోనే సమస్య పెద్దదైంది. ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ హింసను ప్రోత్సహించకూడదు. ఘటన జరగకముందే టీడీపీ నేతలు అక్కడకు ఎలా చేరారు. వారు ఎంపీడీవో కార్యాలయం వద్ద చేసిన హంగామాపై విచారణ చేయాలి. ఈ ఘటనకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్ని వివరాలు తెలుకోవాలి. దీనిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ఆయన్ను కోరుతున్నాను. ముందు కాల్‌డేటా తీసుకుని విచారిస్తే వాస్తవాలేంటనేది తెలుస్తుంది. నిజ నిర్ధారణ జరిపిన తర్వాతే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి’ అని కామెంట్స్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement