Galiveedu
-
గాలివీడు ఘటన.. కాల్‌డేటా తీస్తే వాస్తవాలు తెలుస్తాయి: శ్రీకాంత్ రెడ్డి
సాక్షి, అన్నమయ్య: గాలివీడు ఎంపీడీవో ఘటనలో పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి. ఎంపీపీ రెచ్చగొట్టే విధంగా మాట్లాడటంతోనే సమస్య పెద్దది అయ్యిందని చెప్పుకొచ్చారు. కాల్‌డేటా తీసుకుని విచారిస్తే వాస్తవాలు ఏంటనేది తెలుస్తుంది అంటూ కామెంట్స్ చేశారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘గాలివీడు ఎంపీడీవో ఘటనలో పూర్తి స్థాయి విచారణ చేయాలి. ఎంపీడీవో కార్యాలయ అధికారులు పిలిస్తేనే సుదర్శన్‌రెడ్డి అక్కడికి వెళ్లారు. ఎంపీపీ అయిన తన తల్లి సంతకం కావాలని ఎంపీడీవో కార్యాలయ అధికారులు కోరారు. ఎంపీపీకి చెందిన సామాగ్రి లోపల ఉందని, తాళాలు తీయాలని ఆయన అడిగారు. ఆ సమయంలో తోపులాట జరిగింది. దాన్ని రాజకీయం చేస్తున్నారు.ఎంపీడీవో రెచ్చగొట్టే విధంగా మాట్లాడటంతోనే సమస్య పెద్దదైంది. ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ హింసను ప్రోత్సహించకూడదు. ఘటన జరగకముందే టీడీపీ నేతలు అక్కడకు ఎలా చేరారు. వారు ఎంపీడీవో కార్యాలయం వద్ద చేసిన హంగామాపై విచారణ చేయాలి. ఈ ఘటనకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్ని వివరాలు తెలుకోవాలి. దీనిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ఆయన్ను కోరుతున్నాను. ముందు కాల్‌డేటా తీసుకుని విచారిస్తే వాస్తవాలేంటనేది తెలుస్తుంది. నిజ నిర్ధారణ జరిపిన తర్వాతే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి’ అని కామెంట్స్ చేశారు. -
చిన్న వయసు.. పెద్ద మనసు
సాక్షి, గాలివీడు (కడప): ఆ బాలుడి వయసు పదేళ్లు.. అందరు పిల్లల్లాగా ఆడుతూ పాడుతూ తనదైన లోకంలో విహరించడంతోనే సరిపెట్టుకోలేదు. సొంతూరులోని ఓ ఆలయ పునరుద్ధరణకు భూరి విరాళమిచ్చి పెద్దమనసు చాటు కున్నాడు. వివరాలిలా.. గాలివీడుకు చెందిన భువనేశ్వరి సింగపూర్‌లో ఉంటున్నారు. ఆమె కుమారుడు బండ్లకుంట బాహుబలేయ. గాలివీడులో శిథిలావస్థలో ఉన్న చారిత్రక పురాతన వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని దాతల సహకారంతో పునరుద్ధరిస్తున్నారు. విషయం తెలుసుకున్న బాహుబలేయ తాను నాలుగేళ్లుగా పొదుపు చేసుకున్న రూ.50 వేల నగదును విరాళంగా అందించాలనుకున్నాడు. తన అమ్మమ్మ లక్ష్మిదేవి, తాతయ్య దివంగత పులి వెంకటరమణల పేరు మీద రాయచోటిలోని కుటుంబ సభ్యుల ద్వారా నగదును శనివారం కమిటీ సభ్యులకు అందజేశాడు. -
పెళ్లికి ముందే గర్భం.. భర్తకు ఫోన్ చేసి...
సాక్షి, గాలివీడు : వైఎస్సార్ వెలిగల్లు ప్రాజెక్టులోకి దూకి ఆత్మహత్య చేసుకుంటానని నిండు గర్భిణి తన భర్తకు ఫోన్ చేసిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాలిలా... చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టనం నీరుగుట్టపల్లెకు చెందిన వెంకటరమణ కుమార్తె పుష్పావతి(21), గాలివీడు మండలం అరవీడుకు చెందిన పుర్రం మారుతి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెళ్లికి ముందే పుష్పావతి గర్భం దాల్చింది. ఈవిషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో ఇరు కుటుంబాల అంగీకారంతో రెండు నెలల క్రితం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అప్పటికే పుష్పావతి ఏడు నెలల గర్భవతి. చదవండి: (భర్త మరణవార్త విని భార్య మృతి) సెప్టెంబర్‌లో అత్తవారింటి వద్ద ఉన్న పుష్పావతికి సంప్రదాయబద్ధంగా ఆమె తల్లిదండ్రులు పుసుపు, కుంకుమ ఇచ్చి కాన్పు కోసం మదనపల్లెకు తీసుకెళ్లారు. మంగళవారం పుష్పావతి మదనపల్లె నుంచి ఆర్టీసీ బస్సులో గాలివీడుకు చేరుకుంది. సమీపంలోని వైఎస్సార్ వెలిగల్లు ప్రాజెక్టు వద్ద నుంచి భర్తకు ఫోన్ చేసి ప్రాజెక్టులోకి దూకుతున్నానని సమాచారాన్ని చేరవేసింది. భర్త మారుతి హుటాహుటిన వెలిగల్లు ప్రాజెక్టు వద్దకు చేరుకున్నాడు. ప్రాజెక్టు వద్ద భార్య చెప్పుల(పాదరక్షలు)ను గమనించి ఎస్ఐ చిన్నపెద్దయ్య, తహసీల్దార్ శ్రావణికి సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించన ఎస్ఐ, తహసీల్దార్ గాలింపు చేపట్టారు. ప్రాజెక్టులోకి దూకి ఆత్మహత్య చేసుకుందా? లేక ఎక్కడికైనా వెళ్లిందా అనే కోణంలో పోలీసులు గాలిస్తున్నారు. విషయం తెలుసుకున్న చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని పోలీసులను, అధికారులను ఆదేశించారు. చదవండి: (వికటించిన వైద్యం: శరీరం పూర్తిగా కాలిపోయి బాలిక మృతి) -
ఏ పని సక్రమంగా చేశావు బాబూ..!
సాక్షి, గాలివీడు: పద్నాలుగేళ్ల మీ పాలనలో ఏ పని సక్రమంగా చేశావని చంద్రబాబు తీరుపై ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. మండలం పరిధిలోని అరవీడు, గాలివీడు, గోరాన్‌చెరువు గ్రామాల్లో సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు పాలన అంతా ప్రచార ఆర్భాటం తప్పా అభివృద్ధి శూన్యమన్నారు. ఆదివారం రాయచోటిలో సీఎం బహిరంగ సభకు కోట్లు ఖర్చు చేశారన్నారు. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో రాయచోటికి తాగునీరు, వెలిగల్లు, ఘరికోన, శ్రీనివాసపురం రిజర్వాయర్లు నిర్మించడం, రింగ్‌రోడ్డు, విద్యాలయాలు తదితర ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు. కృష్జా జలాలను రాయచోటి ప్రాంతానికి రానివ్వకపోవడమే కాకుండా, ఆ జలాలను కుప్పంకు తరలించే కాంట్రాక్ట్ పనులు ఇక్కడి టీడీపీ నేతలకు కట్టబెట్టి రాయచోటి వాసుల గొంతు కోయలేదా అని ప్రశ్నించారు. 2016 కల్లా రాయచోటికి కృష్ణా జలాలను ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు. ఆ హామీని నేటికి నెరవేర్చలేదని ఆయన మండిపడ్డారు. వాస్తవాలు మాట్లాడుతుంటే దురుసుగా ప్రవర్తిస్తావా..? చంద్రబాబు కన్నా సీనియర్ నాయకుడు, మాజీ శాసన సభ్యుడు సుగవాసి పాలకొండ్రాయుడు వాస్తవాలను మాట్లాడుతుంటే కనీస గౌరవం లేకుండా మైక్ లాక్కొని దురుసుగా ప్రవర్తిస్తావా అని విమర్శించారు. ఆరోగ్య శ్రీ, 108, 104, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలను అమలు చేసి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న చరిత్ర వైఎస్సార్‌దేనన్నారు. బీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీలకు ఎక్కువ సీట్లు కేటాయించిన ఘనత వైఎస్సార్సీపీకే దక్కుతుందన్నారు. బీసీలు ఉన్నత పదవులుకు పనికిరారని, ఎస్సీల్లో ఎవరూ పుట్టాలనుకుంటారని చెప్పిన వ్యక్తి చంద్రబాబేనన్నారు. తాము అధికారంలోకి వస్తే మొట్టమొదటి ఎమ్మెల్సీ మైనార్టీలకు కేటాయిస్తామని తమ అధినేత జగన్ ఎప్పుడో ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. 15 ఏళ్లు అధికారంలో ఉన్న మీకు పట్టణంలో ప్రభుత్వ కళాశాల స్థల విషయం గుర్తుకు రాలేదా అని చంద్రబాబును ప్రశ్నించారు. వైఎస్ జగన్ సీఎం అయితే నియోజకవర్గంలోని సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. రూ.20 కోట్లకు ప్రశ్నపత్రాలను అమ్ముకున్న వారిని చట్టం ముందు నిలబెడతామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ జల్లా సుదర్శన్‌రెడ్డి, నాయకులు యధుభూషణ్‌రెడ్డి, ç ఉమాపతిరెడ్డి, మైనార్టీ అధ్యక్షుడు ఖాదర్మోద్దీన్, బీసీ సెల్ అధ్యక్షుడు వల్లపునాగేష్, మహిళా మండల అధ్యక్షురాలు వెలిగింటి నాగేశ్వరమ్మ, ఎస్టీ సెల్ అధ్యక్షులు హనుమాన్‌నాయక్, ఎస్సీ సెల్ అధ్యక్షులు ప్రసాద్ పాల్గొన్నారు. ప్రజాసంక్షేమమే వైఎస్సార్సీపీ ధ్యేయం రాయచోటి: ప్రజాసంక్షేమమే వైఎస్సార్సీపీ ధ్యేయమని, ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని గడికోట శివలలిత ఓటర్లను కోరింది. మున్సిపాలిటీ పరిధిలోని 8, 9, 10 వార్డుల్లో సోమవారం స్థానిక కౌన్సిలర్లు, నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి సాధించాలంటే వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. టీడీపీ పాలనలో మహిళలకు సరైన గౌరవం లభించకపోగా డ్వాక్రా రుణాల మాఫీలో తీరని అన్యాయం జరిగిందని వివరించారు. జగనన్న అధికారంలోకి వస్తే డ్వాక్రా రుణాల మాఫీ కావడంతో పాటు వృద్ధులకు రూ.3 వేల పింఛన్ వస్తుందన్నారు. ప్రచారంలో పట్టణ మైనార్టీ మహిళ అధ్యక్షురాలు నాజీనీన్, ఉపాధ్యక్షురాలు జబీన్, కౌన్సిలర్లు ఫయాజుర్ æరెహమాన్, వెంకటరామిరెడ్డి, కొలిమి చాన్‌బాషా, సలీమ్, రెహమాన్, ఫయాజ్ అహమ్మద్, గంగిరెడ్డి, చెన్నూరు అన్వర్‌బాషా, నిస్సార్‌అహమ్మద్, విక్కీ, దేవేంద్ర, అమీర్ పాల్గొన్నారు. -
పచ్చ పార్టీ నేతల దోపిడీ పర్వం
-
ఒంటరితనం భరించలేక ఆత్మహత్య
– ఉరి వేసుకొని ఆత్మహత్య రాయచోటి టౌన్: ఒంటరి తనాన్ని భరించలేక నల్లాబత్తిన రమణారెడ్డి (45) అనే వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాయచోటి పట్టణంలో చోటు చేసుకొంది. రాయచోటి పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గాలివీడు మండలం గోపనపల్లె పూజారి వాండ్లపల్లెకు చెందిన నల్లాబత్తిన రమణారెడ్డి ఐదేళ్ల క్రితం పల్లె నుంచి పట్టణానికి కాపురం మార్చాడు. అప్పటికే ఆయన భార్య మృతి చెందింది. కుమారుడిని చదివించుకొనేందుకు రాయచోటికి మకాం మార్చాడు. నాలుగు సంవత్సరాల క్రితం ఎంపీడీవో కార్యాలయం సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో రేకుల షెడ్ వేసుకొని పండ్లు, ఐస్‌క్రీమ్స్, చైనీ ఫాస్ట్‌పుడ్, పాలు, పెరుగు వంటి వస్తువులు అమ్ముకొని వచ్చే ఆదాయంతో జీవనం సాగించేవాడు. నా అనే వారు ఎవరూ లేకపోవడం, భార్య కూడా లేకపోవడం ఆయనకు తీరని వెలితిని కలిగించింది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి షాపు మూసిన తరువాత ఆ షాపులోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం తెల్లవారు జామున షాపు తెరవడానికి వచ్చిన మరో వ్యక్తి తలుపులు తెరిచి చూడగా అప్పటికే రమణారెడ్డి ఉరికి వేలాడుతూ కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి ఆత్మహత్యకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
విద్యుత్ తీగలు తెగి పడి 20 గొర్రెలు మృతి
గాలివీడు (వైఎస్సార్ జిల్లా) : ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తెగి పడటంతో 20 గొర్రెలు మృతిచెందిన సంఘటన వైఎస్సార్ కడప జిల్లా గాలీవీడు మండలం కసిరెడ్డిగారిపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. ఈదురు గాలుల ధాటికి విద్యుత్ తీగలు తెగిపడటంతో కొట్టంలో ఉన్న 20 గొర్రెలు అక్కడికక్కడే మృతిచెందాయి.