
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఏపీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని.. కానీ ప్రతిపక్ష నేత చంద్రబాబు హైదరాబాద్‌లో కుర్చోని బురద చల్లుతున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. విశాఖ గ్యాస్ లీక్ సంఘటనలో సాయం అందించడంలో వైఎస్ జగన్ ప్రభుత్వం సఫలమయ్యిందన్నారు. హుదూద్ తుఫాను సమయంలో చంద్రబాబు ప్రచార్భాటాలకే పరిమితమయ్యారని విమర్శించారు. ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా గ్యాస్ లీకేజీ ఘటనలో నష్టపోయిన కుటుంబాలను వైఎస్ జగన్ ఆదుకున్నారని తెలిపారు. చంద్రబాబు రూ.25 లక్షలు డిమాండ్ చేస్తే.. సీఎం జగన్ కోటి రూపాయలను ప్రకటించారని తెలిపారు. మళ్ళి కోటి రూపాయలు ఎందుకంటూ చంద్రబాబు బురదచల్లుతున్నారని దుయ్యబట్టారు.
(ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం)
పుష్కరాల సమయంలో చంద్రబాబు ప్రచార్భాటాలు 29 మందిని పొట్టన పెట్టుకున్నాయని.. అప్పట్లో మృతులను ఉద్దేశించి ఆయన నీచంగా మాట్లాడారని గుర్తుచేశారు. ప్రతిపక్షం గట్టిగా నిలదీస్తే కేవలం పదిలక్షలు మాత్రమే ప్రకటించారని ధ్వజమెత్తారు. విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనలో ప్రభుత్వం తప్పిదం లేకపోయిన సహయక చర్యలు చేపట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారని పేర్కొన్నారు. చంద్రబాబులా ప్రచార్భాటాలకు పోయి నిర్లక్ష్యం చేసి ఉంటే వేలాది మంది మృత్యువాత పడేవారని తెలిపారు. చంద్రబాబు, లోకేష్‌లు ప్రధాని మోదీని, సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వం అన్నారని.. నేడు శవ రాజకీయాలు చేసేందుకు సిగ్గులేకుండా విశాఖకు వెళ్లడానికి కేంద్రం అనుమతి అడిగారని విమర్శలు గుప్పించారు.
(విశాఖ విషాదం: ఎల్‌జీ పాలిమర్స్ క్షమాపణ)
కరోనాను ఎదుర్కొనేందుకు కరకట్టపై అక్రమంగా నిర్మించుకున్న కట్టడంలో క్వారంటైన్ లో వుండి ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేందుకు అనుమతి అడిగావా? అని చంద్రబాబును ప్రశ్నించారు. ఆయన ప్రజా సంక్షేమం కన్నా శవ రాజకీయానికే పెద్దపీట వేస్తున్నారని ధ్వజమెత్తారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో దేశానికే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదర్శంగా నిలిచారని శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment