సాక్షి, విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్ నుంచి 13 వేల టన్నుల స్టైరిన్‌ను విదేశాలకు తరలిస్తున్నామని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. రేపు (బుధవారం) ఉదయం 8వేల స్టైరిన్‌ను ఒక షిప్ ద్వారా వెనక్కి పంపిస్తున్నామని.. మే 17లోపు మిగిలిన స్టైరిన్‌ను కూడా పంపిస్తామని వెల్లడించారు. బాధిత గ్రామాల్లో మెడికల్ బృందాలు అనుక్షణం పనిచేస్తాయని తెలిపారు. బాధిత గ్రామం వెంకటాపురంలో ప్రత్యేకంగా వైఎస్సార్ క్లినిక్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. గ్యాస్ లీకేజ్ ఘటనపై కమిటీలు పనిచేస్తున్నాయని తెలిపారు.
(స్టైరీన్‌ను వెనక్కి పంపిస్తున్నాం: కన్నబాబు)
ఆ కంపెనీతో సంబంధం లేదు..
ఇప్పటివరకు మృతుల కుటుంబాల్లో 8 మందికి రూ.కోటి సాయం అందించామని.. మిగిలిన వారికి రేపటిలోగా పరిహారం వారి ఖాతాల్లో వేస్తామన్నారు. తనకు, ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఫ్యాక్టరీలో రవీందర్‌రెడ్డి అనే వ్యక్తి పనిచేస్తున్నాడని.. తనకు బంధువని టీడీపీ తప్పుడు ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారాలను ఆయన ఖండించారు. చంద్రబాబును యూటర్న్ నాయుడిగా విజయసాయిరెడ్డి అభివర్ణించారు.
(చదవండి: స్టైరిన్ తరలింపు ప్రక్రియ ప్రారంభం)
Comments
Please login to add a commentAdd a comment