
సాక్షి, విశాఖపట్నం: ఇరవై రోజుల తర్వాత ఎల్జీ పాలిమర్స్ బాధితులను చంద్రబాబు పరామర్శిస్తానని చెప్పడం హాస్యాస్పదమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ ఎద్దేవా చేశారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. విశాఖకు చంద్రబాబు రాజకీయ లబ్ధికోసమే వస్తున్నారని విమర్శించారు. గ్యాస్ ఘటనలో బాధితులకు కోటి రూపాయలు పరిహారం ఇచ్చి ఆదుకున్న ఘనత దేశ చరిత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు.
సీబీఐ విచారణకు చంద్రబాబు స్వాగతించడం ఆయన నీచ రాజకీయానికి నిదర్శనమని దుయ్యబట్టారు. తన అవినీతిని వెలికి తీస్తారని అధికారంలో ఉన్నప్పుడు సీబీఐకు నో ఎంట్రీ అన్న చంద్రబాబు సీబీఐ కావాలని ఎలా అడుగుతున్నారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు, అయ్యన్నలు.. రంగనాయకమ్మ పోస్ట్‌ను షేర్ చేసి అలజడి సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గత పాలనలో రాష్ట్రాన్ని దోచుకుతిన్న టీడీపీ నేతలు దోచుకోవడం గురించి మాట్లాడటం సిగ్గుచేటని ఎమ్మెల్యే ఉమాశంకర్ విమర్శించారు.