
రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని.. రాష్ట్రంలో గంటకు మూడు, నాలుగు సంఘటనలు జరుగుతున్నాయని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మండిపడ్డారు.
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని.. రాష్ట్రంలో గంటకు మూడు, నాలుగు సంఘటనలు జరుగుతున్నాయని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మండిపడ్డారు. ఇవి ప్రభుత్వ లెక్కల ప్రకారమే.. ప్రభుత్వ ఉదాసీనత కారణంగానే ఈ దారుణాలు జరుగుతున్నాయన్నారు. విశాఖ ఉన్మాదిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
హోంమంత్రి నివాసం ఉంటున్న విశాఖలోనే ఈ దారుణాలు జరుగుతున్నాయి. ఆమె సొంత నియోజకవర్గంలో 25 పోక్సో కేసులు నమోదయ్యాయి. రాజమండ్రి ఘటన జరిగి పది రోజులు అవుతున్నా చంద్రబాబు పట్టించుకోలేదు. పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఎందుకు నోరెత్తి మాట్లాడలేదు?. వరుసగా ఇన్ని దారుణాలు జరుగుతుంటే చంద్రబాబు, పవన్ ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారు?. నిందితులకు రక్షణ కల్పిస్తూ, బాధితులపై కేసులు పెట్టడం దుర్మార్గం’’ అంటూ వరుదు కల్యాణి దుయ్యబట్టారు.
‘‘పోలీసులు మహిళల రక్షణను వదిలేసి రెడ్‌బుక్ రాజ్యాంగం కోసం పని చేస్తున్నారు. ఏపీలో మహిళలు ఇంట్లో ఉన్నా రక్షణ ఉండటం లేదు. ఇన్ని సంఘటనలు జరుగుతున్నా ఒక్క సమీక్ష కూడా చేయలేదు. హోంమంత్రి, సీఎంల కనీసం సమీక్షలు కూడా ఎందుకు చేయటం లేదు?
