సాక్షి, తాడేపల్లి: విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా అభివృద్ధి చెందుతుందని.. ఇందుకోసం రానున్న పదేళ్లలో విశాఖ అభివృద్ధిపై స్పష్టమైన రూట్ మ్యాప్‌ని సిద్ధం చేశామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్ చేశారు. ‘‘ఎన్నికల అనంతరం సీఎంగా నా రెండవ ప్రమాణ స్వీకారం విశాఖలోనే ఉంటుంది. నేను కూడా ఇక్కడే నివాసం ఉంటానని హామీ ఇస్తున్నా. వైజాగ్ మీద నా నిబద్ధత అదీ’’ అంటూ సీఎం జగన్ పేర్కొన్నారు.
We will have a practical, pragmatic 10 year vision and roadmap for Vizag, the executive capital of Andhra Pradesh.
— YS Jagan Mohan Reddy (@ysjagan) March 5, 2024
I assure everyone, post the upcoming elections, my swearing in ceremony for my second term as the Chief Minister will be in Vizag and I will be staying in Vizag.… pic.twitter.com/ydVWD1bW3H
సీఎం జగన్ మంగళవారం విశాఖపట్నంలో పర్యటించారు. రాడిసన్ బ్లూలో నిర్వహిస్తున్న ‘విజన్..విశాఖ’ సదస్సులో పాల్గొని వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశమయ్యారు. వైజాగ్ కన్వెన్షన్ సెంటర్‌లో స్కిల్ డెవలప్‌మెంట్, ఉపాధి, సీడాప్ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో సమావేశమయ్యారు. పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా రాష్ట్ర యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ‘భవిత’ పేరుతో చేపట్టిన సరికొత్త కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment