visakha capital
-
విశాఖ రాజధాని.. సీఎం జగన్ కీలక ట్వీట్
సాక్షి, తాడేపల్లి: విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా అభివృద్ధి చెందుతుందని.. ఇందుకోసం రానున్న పదేళ్లలో విశాఖ అభివృద్ధిపై స్పష్టమైన రూట్ మ్యాప్‌ని సిద్ధం చేశామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. ‘‘ఎన్నికల అనంతరం సీఎంగా నా రెండవ ప్రమాణ స్వీకారం విశాఖలోనే ఉంటుంది. నేను కూడా ఇక్కడే నివాసం ఉంటానని హామీ ఇస్తున్నా. వైజాగ్ మీద నా నిబద్ధత అదీ’’ అంటూ సీఎం జగన్ పేర్కొన్నారు. We will have a practical, pragmatic 10 year vision and roadmap for Vizag, the executive capital of Andhra Pradesh. I assure everyone, post the upcoming elections, my swearing in ceremony for my second term as the Chief Minister will be in Vizag and I will be staying in Vizag.… pic.twitter.com/ydVWD1bW3H — YS Jagan Mohan Reddy (@ysjagan) March 5, 2024 సీఎం జగన్ మంగళవారం విశాఖపట్నంలో పర్యటించారు. రాడిసన్ బ్లూలో నిర్వహిస్తున్న ‘విజన్..విశాఖ’ సదస్సులో పాల్గొని వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశమయ్యారు. వైజాగ్ కన్వెన్షన్ సెంటర్లో స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి, సీడాప్ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో సమావేశమయ్యారు. పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా రాష్ట్ర యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ‘భవిత’ పేరుతో చేపట్టిన సరికొత్త కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. -
వైజాగ్ కేంద్రంగా పాలన: ‘విశాఖ వందనం’ ప్రచార రథం ప్రారంభం
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షకు అనుగుణంగా పరిపాలన రాజధానిగా విశాఖ వర్థిల్లాలని సంపత్ వినాయక దేవాలయంలో జేఏసీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ‘విశాఖ వందనం’ ప్రచార రథాన్ని రాష్ట్ర పరిపాలన వికేంద్రీకరణ జేఏసీ చైర్మన్ హనుమంతు లజపతిరాయ్ ప్రారంభించారు. నేటి నుంచి పరిపాలన కేంద్రీకరణ జేఏసీ ఆధ్వర్యంలో దేవాలయాల సందర్శన కార్యక్రమం చేపట్టారు. ఉత్తరాంధ్రలో ప్రముఖ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. దసరా నుంచి విశాఖ కేంద్రంగా సీఎం వైఎస్ జగన్ చేపట్టనున్న పరిపాలన సజావుగా సాగాలని ప్రజలంతా ఆకాంక్షిస్తున్నారని లజపతిరాయ్ అన్నారు. అదేవిధంగా విశాఖ కేంద్రంగా రాష్ట్ర పరిపాలన విజయవంతంగా సాగాలని కాంక్షిస్తూ ప్రజలందరితో కలిసి శనివారం నుంచి దశలవారీగా సర్వమత ప్రార్థనలు చేస్తామన్నారు. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపే శక్తిని ముఖ్యమంత్రికి ఇవ్వాలని కోరుతూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. జేఏసీ తరఫున దేవాలయాలు, చర్చిలు, ముస్లిం ప్రార్థనా స్థలాల్లో సర్వమత ప్రార్థనలు చేపట్టాలని నాన్ పొలిటికల్ జేఏసీ సమావేశంలో ఇటీవల తీర్మానించినట్లు వెల్లడించారు. -
CM YS Jagan: సీఎం జగన్ స్పష్టమైన సంకేతం.. ఇక తగ్గేదేలే!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంత పట్టుదలతో ఉంటారో మరోసారి రుజువైంది. తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరం అయిన విశాఖపట్నాన్ని రాజధానిగా ఎంపిక చేసుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని వేగవంతం చేయవచ్చన్న భావనతో ఉన్న జగన్ ఆ దిశగా ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చేశారు. విశాఖపట్నమే ఏపీ రాజధాని అని ఆయన డిల్లీలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ మీట్ సన్నాహక సదస్సులో పేర్కొన్నారు. రాబోయే నెలల్లో విశాఖ రాజధాని అవుతుందని, తాను విశాఖకు మారి అక్కడ నుంచే పాలన చేస్తానని ఆయన వెల్లడించారు. బహుశా ఈ మధ్యకాలంలో ఇంత క్లారిటీతో ఈ విషయాన్ని చెప్పడం ఇదే మొదటిసారి కావచ్చు. మూడేళ్ల క్రితం మూడు రాజధానుల అంశం ప్రకటించి సంచలనం సృష్టించిన జగన్ వివిధ కారణాలతో వెంటనే దానిని అమలు చేయలేకపోయారు. తెలుగుదేశం, జనసేన వంటి పక్షాలు ఇందుకు అడ్డపడడం, హైకోర్టుకు వెళ్లి మూడు రాజధానుల నిర్ణయానికి ఆటంకాలు సృష్టించడంతో, పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అప్పటికి మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకోవడం జరిగాయి. కాని అప్పుడే మళ్లీ కొత్త బిల్లును మరింత ప్రయోజనకరంగా, మూడు ప్రాంతాలకు ఉపయోగపడేలా తీసుకువస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వం అమరావతి పేరుతో విజయవాడ, గుంటూరు ల మధ్య గ్రామాలను రాజధానిగా ఎంపిక చేసుకుంది. అక్కడ లక్షల కోట్ల వ్యయం చేస్తేకాని రాజధాని నిర్మాణం పూర్తి చేయలేని పరిస్థితిని సృష్టించుకుంది. బలవంతంగా పలు చోట్ల రైతుల నుంచి భూములను సమీకరించింది. కొన్ని చోట్ల పంటలను కూడా దగ్దం చేసిందన్న ఆరోపణలు కూడా వచ్చాయి. సుమారు ఏభైవేల ఎకరాలలో రాజధాని నిర్మాణం అంటే లక్షల కోట్ల వ్యయం చేయల్సి ఉంటుంది. తొలి దశలో లక్షా తొమ్మిదివేల కోట్ల రూపాయల మేర మౌలిక వసతుల కోసం వెచ్చించాలని అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాశారు. కాని కేంద్రం మాత్రం కేవలం 2500 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంది. ఆచరణ సాధ్యం కాని ప్రతిపాదనలతో ఆయన హడావుడి చేశారు. ఈ నేపథ్యంలో అన్ని ప్రాంతాల ప్రజలలో అమరావతిపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. చివరికి ఆ గ్రామాలు ఉన్న తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాలలో సైతం టీడీపీ ఓటమిపాలైంది. తదుపరి అదికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రాజధాని అంశంపై బోస్టన్ గ్రూప్ తో అధ్యయనం చేయించింది. ఆ తర్వాత నిపుణుల కమిటీని నియమించింది. అంతకుముందు కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ చేసిన సిఫారస్‌లను కూడా పరిగణనలోకి తీసుకుని విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా జగన్ సర్కార్ ప్రకటించింది. కాని దీనిని తెలుగుదేశం, జనసేన తదితర కొన్ని పక్షాలు వ్యతిరేకించాయి. అమరావతి రాజధానిని రియల్ ఎస్టేట్ వెంచర్‌గా మార్చడం, ఇన్ సైడ్ ట్రేడింగ్ వంటి ఆరోపణలు రావడం నెగిటివ్ పాయింట్లుగా మారాయి. అంతేకాక జాతీయ రహదారికి సుదూరంగా మారుమూల గ్రామాలలో రాజధాని నిర్మించాలన్న ఆలోచనపై వివిధ వర్గాలు పెదవి విరిచాయి. అక్కడకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని గత ప్రభుత్వం ఆశించినా, అందుకు పెట్టుబడిదారులు ఆసక్తి చూపలేదు. దానికి కారణం అమరావతిలో నగర వాతావరణం లేకపోవడం, కాస్మొపాలిటన్ కల్చర్ కాకుండా, సామాజికవర్గ ఆధిపత్య ధోరణి ఉండడమే అని వేరే చెప్పనవసరం లేదు. అదే విశాఖ అయితే పెద్ద నగరం కావడం, అక్కడ ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండడం, కాస్మోపాలిటన్ కల్చర్, కులాల రొంపి పెద్దగా లేకపోవడం వంటివి అడ్వాంటేజ్‌గా మారాయి. అక్కడకు పెట్టుబడిదారులు రావడం, ఐటీ వంటి పరిశ్రమలు పెట్టడానికి ఆసక్తి కనబరుస్తుండడం కూడా కలిసి వస్తోంది. గతంలో సైతం పెట్టుబడుల సదస్సులను విశాఖలోనే నిర్వహించేవారు. తద్వారా ఆ నగర ప్రాముఖ్యతను అప్పటి ప్రభుత్వం కూడా ఒప్పుకున్నట్లయింది. కాని విశాఖ నగరం అయితే తమ రియల్ ఎస్టేట్ ప్రయోజనాలు దెబ్బతింటాయని తెలుగుదేశం పార్టీ ముఖ్యులు భావించి కృత్రిమ ఉద్యమం సృష్టించారు. కాని అది కాలక్రమేణా నీరుకారిపోయింది. తాజాగా మూడు రాజధానుల అంశం సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. అసలు చట్టం చేసే అధికారమే అసెంబ్లీకి లేదని ఏపీ హైకోర్టు తీర్పు ఇవ్వడం, అది కూడా చట్టం ఉపసంహరణ తర్వాత తీర్పు చెప్పడం ఆశ్చర్యం కలిగింది. దీనిపై గౌరవ అత్యున్నత స్థానం ఏమి చెబుతుందన్నది ఉత్కంఠ కలిగించే అంశం. చదవండి: లోకేష్ పాదయాత్రలో ఏం కనిపించింది?.. వర్కౌట్ అవుతుందా? ఈ నేపథ్యంలో జగన్ విశాఖను రాజధానిగా మరోసారి ఉద్ఘాటించడం ద్వారా తన ఆత్మ విశ్వాసాన్ని తెలియచెప్పారు. ఇప్పటికే ఉత్తరాంధ్రలో విశాఖ రాజధాని కావాలన్న ఆకాంక్ష బలంగా ఏర్పడింది. పలు చోట్ల ర్యాలీలు, సదస్సులు జరిగాయి. కాని విశాఖను రాజధాని కాకుండా అడ్డుకోవడానికి టీడీపీ, దాని అనుబంధ మీడియా విశ్వయత్నం చేస్తున్నాయి. అక్కడ ఎలాంటి అభివృద్దికి ప్రయత్నించినా, నిరోధించడానికి రకరకాల వ్యూహాలు పన్నుతున్నాయి. అయినా జగన్ ధైర్యంగా ముందుకు సాగుతున్నారు. ఏపీ దిశ,దశను మార్చే ఈ నిర్ణయాన్ని ఎంత త్వరగా అమలు చేస్తే అంత మంచిదని చెప్పాలి. ఏప్రిల్ నాటికి విశాఖ నుంచి సీఎం పాలన చేస్తారని టీడీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా ప్రకటించారు. ఇదే సమయంలో అమరావతి ప్రాంతంలో శాసన సభ ను ఉంచడమే కాకుండా, అక్కడ అభివృద్ది పథకాలకు శ్రీకారం చుడుతున్నారు. ఏది ఏమైనా జగన్ రాష్ట్ర ప్రయోజనాల కోసం చేస్తున్న ఈ ప్రయత్నం సఫలం కావాలని ఆకాంక్షిద్దాం. -హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్ -
మూడు నెలల్లో విశాఖ రాజధాని.. మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు
సాక్షి, విజయనగరం: మూడు నెలల్లో విశాఖపట్నం రాజధాని అవుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరంలో ఆదివారం ఆయన అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది సీఎం జగన్ మరింత మంచి పాలన అందిస్తారన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చదవండి: ప్రతి ఇల్లు ఆనందంగా ఉండాలి: సీఎం జగన్ -
ఉత్తరాంధ్ర టీడీపీ నేతలకు ఆ భయం పట్టుకుందా?
ఉత్తరాంధ్ర టీడీపీ నేతలకు ఉనికి భయం పట్టుకుందా? అందుకే పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాలను పట్టించుకోవడంలేదా? విశాఖ బ్రాండ్ ఇమేజ్ను నాశనం చేయడానికి చంద్రబాబు చేస్తున్న కుట్రలను టీడీపీ నేతలే అడ్డుకుంటున్నారా? విశాఖ రాజధాని సెంటిమెంట్‌కు భయపడి సైలెంట్ అవుతున్నారా? చదవండి: చంద్రబాబు ‘ఆఖరు మాటలు’ దేనికి సంకేతం? విశాఖకు చేస్తున్నది మేలా? కీడా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించినప్పటి నుంచి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఏదో ఒక రూపంలో విశాఖ నగరంపై కుట్రలు చేస్తూనే ఉన్నారు. విశాఖపై ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లుగా ఉత్తరాంధ్ర టీడీపీ నేతలతో ప్రచారం చేయిస్తూనే ఉన్నారు. బినామీ రాజధాని అమరావతి కోసం విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయడానికి కుట్రలు కుతంత్రాలు అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు అంతా కలిసి విశాఖలో భూకబ్జాలు పెరిగిపోయాయంటూ వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు తెలపాలని చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశాన్ని తీసుకుని వరుసగా ఆరు రోజులపాటు ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు అంతా సేవ్ ఉత్తరాంధ్ర పేరుతో వివిధ కార్యక్రమాలు చేపట్టాలని హుకుం జారీ చేశారు. రుషి కొండపై విధ్వంసం పేరుతో ధర్నా చేయాలని.. ఆ తర్వాత వరుసగా దస్ పల్లా భూములు, గంజాయి సాగు, ఏజెన్సీలో అక్రమ మైనింగ్, ఉత్తరాంధ్రలో చక్కెర కర్మగారాలు మూసివేత అంటూ ఇలా ఆరు అంశాలపై ధర్నాలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ ఆరు కార్యక్రమాల్లో కేవలం ఒక్క కార్యక్రమాన్ని మాత్రమే నిర్వహించి టీడీపీ నేతలు చేతులు దులుపుకున్నారు. రుషి కొండ వద్ద దీక్షకు బయలుదేరి వెళ్లే సమయాన్ని ముందుగానే పోలీసులకు సమాచారం అందించి.. పార్టీ కార్యాలయం వద్దే అరెస్టయ్యారు. అసలు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడితో సహా సీనియర్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. మిగతా ఐదు నిరసన కార్యక్రమాలను తాము చేయలేమని చంద్రబాబుకు కరాకండిగా చెప్పేశారు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలకు విరుద్ధంగా రాజధాని అంశం నుంచి దృష్టి మరల్చేందుకు ఎటువంటి నిరసన కార్యక్రమాలు చేపట్టినా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని చంద్రబాబు నాయుడుకు స్పష్టం చేశారు. రాజధానిని అడ్డుకోవడం కోసం విశాఖలో ఏదో జరిగిపోతుందన్నట్లు తప్పుడు ప్రచారం చేసినా, నిరసనలు దీక్షలు చేపట్టినా ప్రజల నుండి వ్యతిరేకత తప్పదని పచ్చ పార్టీ బాస్‌ను హెచ్చరించారు. దసపల్లా భూముల్లోనే టీడీపీ ఆఫీసు అసలు చంద్రబాబు సూచించిన నిరసన కార్యక్రమాలకు సంబంధించిన తప్పులు, ఘోరాలు అన్నీ జరిగింది టీడీపీ పాలనా కాలంలోనే అంటూ ఉత్తరాంధ్ర నేతలు రివర్స్‌లో ఝలక్ ఇచ్చారు. విశాఖలో టీడీపీ నేతలే స్వయంగా భూ కబ్జాలకు పాల్పడ్డారంటూ బాబు హయాంలోనే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సిట్‌కు ఫిర్యాదు చేసిన అంశాన్ని టీడీపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. మరో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖ గంజాయికు అడ్డగా మారిందని మీడియా ముఖంగా మాట్లాడిన మాటలను గుర్తు చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో చక్కెర కర్మాగారాలన్నీ టీడీపీ హయాంలోనూ మూతబడిన విషయాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదంటున్నారు. దస్పల్లా భూముల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకొని పార్టీ కార్యాలయాన్ని నిర్మించిన సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అంటున్నారు. ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురైంది, వలసలు పెరిగింది కూడా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే అని తేల్చేశారు ఉత్తరాంధ్ర నాయకులు. తప్పులన్నీ తమ పాలనలోనే చేసి.. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందిస్తూ నిరసనలు, ధర్నాలు ఎలా చేయాలంటూ చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. మీకో దండం బాబు ఉత్తరాంధ్రలో నిరసన కార్యక్రమాలు నిర్వహించలేమంటున్న పార్టీ నేతలపై చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ పిలుపునిచ్చిన నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారు. టీడీపీకి అమరావతి ఒక్కటే ముఖ్యమని వీలైనంతవరకు విశాఖ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీయాలని పార్టీ నేతలను ఆదేశిస్తున్నారు. ఎవరైనా పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. మరి ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు చంద్రబాబు ఆదేశాలను అమలు చేస్తారా? లేదంటే విశాఖ పరిపాలనా రాజధానిగా కావాలని పోరాటం చేస్తున్న ఉత్తరాంధ్ర ప్రజల సెంటిమెంట్ గౌరవిస్తారా అన్నది వేచి చూడాలి. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
విశాఖ రాజధానికోసం గర్జించిన విద్యార్థి లోకం
టెక్కలి: శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో గురువారం ‘మన విశాఖ.. మన రాజధాని’ నినాదం మార్మోగింది. వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరుగుతుందని విద్యార్థిలోకం గళమెత్తింది. వికేంద్రీకరణకు మద్దతుగా ఉత్తరాంధ్ర జేఏసీ కన్వీనర్ హనుమంతు లజపతిరాయ్, టెక్కలి నియోజకవర్గ కన్వీనర్ డి.ఎ.స్టాలిన్, విద్యార్థి, నిరుద్యోగ పోరాటసమితి నాయకుడు టి.సూర్యం నేతృత్వంలో విద్యార్థులు గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర జేఏసీ కన్వీనర్ హనుమంతు లజపతిరాయ్ మాట్లాడుతూ దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన ఉత్తరాంధ్రకు ఊపిరిపోసే విధంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖలో పరిపాలన రాజధానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. మన భావితరాల బంగారు భవిష్యత్ కోసం విశాఖ పరిపాలన రాజధాని కావాల్సిందేనన్నారు. ఈ విషయంలో వెనుకడుగు లేదని స్పష్టం చేశారు. జేఏసీ నియోజకవర్గ కన్వీనర్ డి.ఎ.స్టాలిన్ మాట్లాడుతూ మన భవిష్యత్ కోసం చేస్తున్న ఈ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయాలని పిలుపునిచ్చారు. విశాఖలో పరిపాలన రాజధానితో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా ఎంతో అభివృద్ది చెందుతుందని చెప్పారు. కాగా, టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి పాత జాతీయ రహదారి మీదుగా వైఎస్సార్ జంక్షన్ నుంచి అంబేడ్కర్ జంక్షన్ వరకు విద్యార్థులు ర్యాలీ చేశారు. వైఎస్సార్, అంబేడ్కర్ విగ్రహాల వద్ద జేఏసీ నాయకులు నివాళులు అర్పించారు. -
ఉత్తరాంధ్ర అంతటా అదే నినాదం
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల్లో ప్రతి ఒక్కరి నోట వికేంద్రీకరణ నినాదం మారుమోగుతోంది. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రతిపాదించిన వికేంద్రీకరణ నినాదం ఉత్తరాంధ్రలోని ప్రతి గ్రామంలోనూ ఉవ్వెత్తున ఎగసి పడుతోంది. మూడు రాజధానుల ఏర్పాటుతో వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అభివృద్ది చెందుతాయని శ్రీకాకుళం నుంచి అనకాపల్లి జిల్లా వరకు ఊరూ వాడా ఏకమై మద్దతు పలుకుతోంది. శుక్రవారం విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో మానవ హారాలు, భారీ ర్యాలీలు, సమావేశాలు నిర్వహించారు. విశాఖ గర్జనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటే గర్జిస్తామంటూ మేధావులు, విద్యార్థులు, సామాన్య ప్రజలు, వర్తకులు, ఉద్యోగులు నినదించారు. నేడు అన్ని దారులూ విశాఖ గర్జన వైపే - విశాఖ ఉత్తర నియోజకవర్గం 25వ వార్డులో వికేంద్రీకరణకు మద్దతుగా సమావేశం జరిగింది. నియోజకవర్గ సమన్వయకర్త కె.కె.రాజు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 46, 50, 51వ వార్డుల్లోని డీఎల్బీ గ్రౌండ్, మురళీనగర్ పార్కు, ఈస్ట్ పార్కు వద్ద వాకర్స్‌తో సమావేశమై వికేంద్రీకరణ ఆవశ్యకత వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సతీష్, కార్పొరేటర్లు వావిలపల్లి ప్రసాద్, రెయ్యి వెంకటరమణ, కోఆప్షన్ సభ్యులు సేనాపతి అప్పారావు పాల్గొన్నారు. - విశాఖ తూర్పు నియోజకవర్గంలోని పలు వార్డుల్లో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు శుక్రవారం ప్రజలతో సమావేశాలు నిర్వహించారు. భీమిలి నియోజవర్గంలో ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు క్యాంప్ కార్యాలయంలో విశాఖ గర్జనకు సంబంధించి పోస్టర్ విడుదల చేశారు. పరిపాలనా వికేంద్రీరణకు మద్దతుగా తగరపువలస పీఏసీఎస్‌లో సొసైటీ అధ్యక్షుడు అక్కరమాని రామునాయుడు ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నాయకులు సమావేశం అయ్యారు. చిట్టివలస బంతాట మైదానం నుంచి ర్యాలీగా విశాఖ గర్జనకు వెళ్లాలని తీర్మానించారు. - భీమిలి, తగరపువలసకు చెందిన వంద మంది ఆటో కార్మికులు భీమిలి నుంచి తగరపువలస వరకు మద్దతుగా ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. పీఎం పాలెం వైఎస్ రాజశేఖరరెడ్డి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నుంచి కొమ్మాది కూడలి వరకు జగుపిల్ల నరేష్ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. - విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఆడారి ఆనంద్ ఆధ్వర్యంలో ఎన్ఏడీ యునైటెడ్ క్రైస్ట్ చర్చిలో, పలు విద్యా సంస్థల్లో, ఎన్ఏడీ టాసిన్ మసీదుల్లో సమావేశాలు నిర్వహించి వికేంద్రీకరణకు మద్దతు పలకాలని కోరారు. - పెందుర్తి నియోజకవర్గంలో పెందుర్తి రాంపురంలో వైఎస్సార్సీపీ కార్యాలయంలో మూడు మండలాల పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించి విశాఖ గర్జనను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ పాల్గొన్నారు. - గాజువాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే తిప్పలనాగిరెడ్డి ఆధ్వర్యంలో 65, 66, 67, 68, 75 వార్డుల్లో విద్యార్థులతో, అగనంపూడిలో మానవహారాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి, దేవాన్‌రెడ్డి, పల్లా చినతల్లి, కార్పొరేటర్లు పాల్గొన్నారు. - అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా శుక్రవారం నక్కపల్లిలో కాపు కార్పొరేషన్ డైరక్టర్ వీసం రామకృష్ణ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై కళాశాల విద్యార్థులు, వివిధ సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఉపమాక రోడ్డు వరకు ‘ఒక రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు’ అంటూ నినాదాలు చేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్లో విద్యార్థులతో కలసి మానవ హారం నిర్వహించారు. -
అందుకే టీడీపీకి భయం పట్టుకుంది..!
-
అందుకే టీడీపీకి భయం పట్టుకుంది..!
సాక్షి, విశాఖపట్నం: రాజధాని పేరిట ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. ఆదివారం విశాఖపట్నంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విశాఖ నుంచి పరిశ్రమలు తరలిపోతున్నట్లు టీడీపీ దుష్ఫ్రచారం చేస్తోందని మండిపడ్డారు. భీమిలిలో గజం స్థలం కూడా కబ్జాకు గురికాలేదని స్పష్టం చేశారు. టీడీపీ నేతలు రోజుకోక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. విశాఖలో టీడీపీ నేతల భూ దాహానికి అడ్డూఅదుపు లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో ల్యాండ్ మాఫీయాను పూర్తిగా కంట్రోల్ చేశామని చెప్పారు. ఆక్రమణలు, భూ కబ్జాల విషయంలో ఎవరినీ ఉపేక్షించవద్దని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారని వెల్లడించారు. అవినీతి రహిత పాలన అందించాలన్నదే సీఎం జగన్ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. స్వాగతించాల్సింది పోయి..విమర్శలా.. ఉత్తరాంధ్రకు టీడీపీ చేసిందేమీ లేదని మంత్రి అవంతి విమర్శించారు. ఆసియాలో విశాఖ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం అని పేర్కొన్నారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా పెడతామంటే స్వాగతించాల్సింది పోయి టీడీపీ విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి టీడీపీ అడ్డుపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్రలు,కుతంత్రాలు చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. అవినీతిపై యుద్ధం చేస్తుంటే టీడీపీ భయం పట్టుకుందన్నారు. ఆ బాధ్యత కూడా మాదే.. ఉగాదికి 25 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఐదు నెలల్లోనే పూర్తి చేశామని,అమరావతిని కూడా అభివృద్ధి చేసే బాధ్యత తమదేనన్నారు. అమరావతి రైతులకు న్యాయం చేస్తామని ఆయన పేర్కొన్నారు. -
చంద్రబాబుకు మంత్రి కృష్ణదాస్ సవాల్..
సాక్షి, శ్రీకాకుళం: లక్ష కోట్ల రాజధాని ఏపీ అభివృద్ధికి దోహదపడదని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. అధికార వికేంద్రీకరణ కోరుతూ ఆదివారం శ్రీకాకుళంలో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లక్ష కోట్లతో సాగునీటి ప్రాజెక్టులు ప్రతిపాదిస్తే రాష్ట్రం శాశ్వతంగా సుభిష్టంగా ఉంటుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలంతా స్వాగతిస్తున్నారని చెప్పారు. పవన్‌కల్యాణ్ స్థిరత్వం లేని నాయకుడు అని.. రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారని విమర్శించారు. చంద్రబాబు మద్దతుతో కొంతమంది మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు దమ్ముంటే నరసన్నపేటలో తనపై పోటీ చేసి గెలవాలని కృష్ణదాస్ సవాల్ విసిరారు. .. టీడీపీ బ్రిడ్జి పార్టీలా వ్యవహరిస్తోంది.. టీడీపీ చేస్తోన్న అమరావతి దీక్షలను దొంగ దీక్షలుగా వైఎస్సార్సీపీ నేత కిల్లి కృపారాణి అభివర్ణించారు. అధికార వికేంద్రీకరణకు రాష్ట్ర ప్రజలంతా మద్దతు పలుకుతున్నారని పేర్కొన్నారు. బీజేపీకి టీడీపీ బ్రిడ్జి పార్టీలా వ్యవహరిస్తోందని విమర్శించారు. విరాళాలు ఎందుకు సేకరిస్తున్నారు.. అమరావతి ఉద్యమం పేరుతో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు డ్రామాలాడుతున్నారని ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ ధ్వజమెత్తారు. విరాళాలు ఎందుకు సేకరిస్తున్నారో చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. ఆయన రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధిని అడ్డుకుంటే బుద్ధి చెబుతాం.. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటే చంద్రబాబుకి తగిన బుద్ధి చెబుతామని ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు హెచ్చరించారు. చంద్రబాబు పక్షపాత వైఖరి వలనే ఉత్తరాంధ్ర తీవ్రంగా నష్టపోయిందని మండిపడ్డారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తోన్న కృషిని చంద్రబాబు ఓర్వలేక అమరావతి ఉద్యమం ముసుగులో డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. -
సీఎం ప్రతిపాదన ఉత్తరాంధ్రకు వరం
అల్లిపురం(విశాఖ దక్షిణ): రాష్ట్రానికి పరిపాలనా రాజధానిగా ఉండే అన్ని అర్హతలు విశాఖపట్నానికే ఉన్నాయని మేధావులు, పారిశ్రామిక వేత్తలు స్పష్టం చేశారు. తక్షణమే రాజధాని ఏర్పాటు చేసుకునేందుకు కావాల్సిన 5 లక్షల చదరపు అడుగుల నిర్మాణాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. పరిపాలన వికేంద్రీకరణతో రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందుతుందన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదనకు తమ వంతు మద్దతు ఉంటుందన్నారు. రాజకీయాలకు అతీతంగా ఈ తీర్మానం చేస్తున్నామని వారు స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి సమితి ఆధ్వర్యంలో శనివారం అల్లిపురంలోని ఓ హోటల్లో మేధావులు, పారిశ్రామిక వేత్తలు, పలు రంగాలకు చెందిన ప్రముఖులతో ‘విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధాని–సీఎం ప్రతిపాదన’కు మద్దతుగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖపట్నంకాస్మోపాలిటన్ నగరంగా ఇప్పటికే అభివృద్ధి చెందిందన్నారు. కానీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు కొంతమంది నాయకులు విశాఖపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ‘విశాఖ ప్రజలు సౌమ్యులు.. ఎవరినీ ఏమీ అడగరు.. ఎవరు వచ్చినా స్వాగతించి.. ఆదరించి అన్నం పెడతారు’అని అన్నారు. బౌద్ధ భిక్షువులకు, వ్యాపార నిమిత్తం వచ్చిన ఎందరికో అన్నం పెట్టిన నేల ఉత్తరాంధ్ర అని కొనియాడారు. పావురాల కొండ, తొట్ల కొండ, బొజ్జన్నకొండ వంటి 12 బౌద్ధారామాలు కలిగిన కొండలు విశాఖ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయన్నారు. గొప్ప చరిత్ర కలిగిన విశాఖకే పరిపాలనా రాజధానిగా ఉండే అర్హత ఉందని వక్తలు నొక్కివక్కాణించారు. పరిపాలన వికేంద్రీకరణ వల్ల రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందుతుందన్నారు. అమరావతి పేరుతో ఆందోళన చేస్తున్న వారు రైతులు కారని, నిజమైన రైతులు 150 కిలోమీటర్ల దూరం వెళ్లి కూలి పనులు చేసుకుంటున్నారని ఓ అధ్యయనంలో తేలిందన్నారు. రైతుల పేరుతో దీక్షలు, ధర్నాలు చేసి రాష్ట్ర అభివృద్ధిని చంద్రబాబు అడ్డుకుంటున్నాడని ఆరోపించారు. ఉత్తరాంధ్ర వాసులకు రాజధాని ఎందుకని పదే పదే మాట్లాడటం ఆందోళనకు గురి చేస్తోందన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు తన వైఖరిని మార్చుకుని మూడు రాజధానులకు మద్దతివ్వాలని కోరారు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా, వారి వాక్కును వినిపించేందుకుగానూ.. రాజకీయాలకు అతీతంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి సమితిని ఏర్పాటు చేసినట్లు కన్వీనర్ పీవీ సాంబమూర్తి తెలిపారు. విభజన చట్టంలో అంశాలను టీడీపీ అనుసరించలేదు విభజన చట్టంలోని అంశాలను టీడీపీ ప్రభుత్వం అనుసరించలేదు. హైదరాబాద్‌ను రాజధానిగా పదేళ్లు మనం ఉపయోగించుకోవచ్చు. అక్కడ ఉండే హక్కును వదులుకుని రాజధాని అభివృద్ధి చేయకుండానే అమరావతికి తరలిరావడం సమంజసం కాదు. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాల బాగోగులు చూడాల్సి ఉన్నా పట్టించుకోలేదు. ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదు. విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా సీఎం చేసిన ప్రతిపాదనను అందరూ స్వాగతించాలి. –ఆచార్య సత్యనారాయణ, విశ్రాంత ఆచార్యులు, ఏయూ ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందాలంటే పరిపాలన వికేంద్రీకరణ అవసరం. ఈ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. విశాఖ ఒక విశిష్ట నగరం. రాజధానికి కావాల్సిన అన్ని హంగులు, అర్హతలు ఉన్నాయి. ప్రత్యేకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం లేదు. నేరుగా పరిపాలన జరిపేందుకు అవసరమైన ప్రభుత్వ భవనాలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతానికి పాలనా పరమైన ఇబ్బందులు లేకుండా, ఖర్చు తగ్గించుకునేందుకు ఇదే మంచి నిర్ణయం. ఈ నిర్ణయాన్ని అందరూ ఆహ్వానించాలి. – ఆచార్య తిమ్మారెడ్డి ధర్నాలు చేస్తోంది నిజమైన రైతులు కాదు అమరావతి రాజధాని కావాలని ధర్నాలు చేస్తున్నవారు నిజమైన రైతులు కారు. మా బృందం 15 గ్రామాల్లో 1,500 మంది రైతులను స్వయంగా కలిసి మాట్లాడింది. నిజమైన రైతులు, రైతు కూలీలు రోజూ ఉపాధి నిమిత్తం కిలోమీటర్ల దూరం వెళ్లిపోతున్నారు. ధర్నాల్లో పాల్గొంటున్న వారు దళారులు, భూస్వాములే. వారికి ప్రభుత్వం నష్ట పరిహారం అందజేసింది. నిజమైన రైతులకు విద్యా, ఉపాధి అవకాశాలు లేవు. వారిని ఆదుకుని సరైన న్యాయం చేయాలి. రాజధానికి కావాల్సిన అన్ని అర్హతలు విశాఖకే ఉన్నాయి. – ఆచార్య ఎం.వి.రామరాజు, సైకాలజిస్ట్ -
విశాఖపై విషమెందుకు?
అల్లిపురం(విశాఖ దక్షిణం): ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లతో గెలిచిన చంద్రబాబు అభివృద్ధికి అడ్డుపడుతున్నారని రాష్ట్ర పర్యాటక, క్రీడల శాఖల మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. విశాఖపట్నం కాస్మొపాలిటిన్ సిటీగా రాజధానికి అన్ని అర్హతలున్న నగరమని అభివర్ణించారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రతిపాదిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటనను స్వాగతిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం డాబాగార్డెన్స్‌లోని అంబేడ్కర్ సర్కిల్ నుంచి రెడ్నమ్ గార్డెన్స్ మీదుగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు కాగడాలతో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ విశాఖపట్నం అభివృద్ధి చెందిన నగరంగా రాజధానికి అన్ని అర్హతులు ఉన్నాయన్నారు. దేశంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమన్నారు. ముంబై నగరానికి దీటుగా విశాఖ అభివృద్ధి చెందుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా విశాఖను తక్కువ ఖర్చుతోనే అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో ముఖ్యమంత్రి జగన్ ప్రజల నుంచి ఎక్కడ క్రెడిట్ కొట్టేస్తారోననే అక్కసుతో చంద్రబాబు రైతులను రెచ్చగొడుతున్నారన్నారు. ఆయనకు సిగ్గు, లజ్జ ఉంటే ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లతో.. ముఖ్యంగా విశాఖ నగర ప్రజల ఓట్లతో గెలిచిన తన నలుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు పరిపాలన వికేంద్రీకరణను కోరుకుంటున్నారన్నారు. విశాఖ ప్రజలు ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారన్నారు. కార్యక్రమంలో గాజువాక, అనకాపల్లి, పెందుర్తి ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, గుడివాడ అమర్నాథ్, అన్నంరెడ్డి అదీప్‌రాజు, పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ మళ్ల విజయప్రసాద్, మంత్రి రాజశేఖర్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా గురువులు, కొయ్యప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు. -
'విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తాం'
విశాఖ : విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తామని సీమాంధ్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు అన్నారు. హైదరాబాద్ కేంద్రీకతృ అభివృద్ధి వల్లే ఆంధ్రా నష్టపోయిందని ఆయన మంగళవారమిక్కడ వ్యాఖ్యానించారు. వికేంద్రీకృత అభివృద్ధికి బీజేపీ కృషి చేస్తుందని హరిబాబు తెలిపారు. గుజరాత్ పాలన వల్లే నరేంద్ర మోడీ ప్రధాని అభ్యర్థి అవగలిగారని ఆయన పేర్కొన్నారు.