సాక్షి, అమరావతి: ప్రభుత్వంపై బురద చల్లడమే కొందరు కుట్ర దారుల పని అంటూ ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ, వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ జరుపుతోందని.. రిపోర్ట్ రాకముందే అవాస్తవ కథనాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
చదవండి: ‘బండారూ! మందేసి మాట్లాడుతున్నావా? ఇంతటి మహా విషాదాన్ని కూడా రాజకీయం చేస్తారా?’
‘‘విచారణలో ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకుంటుంది?. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వలేదు. సీబీఐ ఏఎస్పీ రాంసింగ్‌పై ప్రభుత్వమే కేసు వేయించిందని దుష్ప్రచారం చేస్తున్నారు. కోర్టు ఆదేశాలతోనే సీబీఐ ఏఎస్పీ రాంసింగ్‌పై కేసు నమోదయ్యిందని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వంపై బురద చల్లాలనే ఏకైక అజెండాతో కుట్ర చేస్తున్నారు. మంచి చేసేవారిపై రోజుక కథనంతో దుష్ప్రచారం చేస్తున్నారు. మంత్రి గౌతమ్‌రెడ్డి మరణాన్ని కూడా టీడీపీ రాజకీయం చేస్తోంది. ప్రజలు ఛీకొడతారన్న కనీస జ్ఞానం కూడా టీడీపీకి లేదని’’ శ్రీకాంత్‌రెడ్డి దుయ్యబటారు.
Comments
Please login to add a commentAdd a comment