సాక్షి, అమరావతి: ఉనికి కోసమే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు దిగజారి మాట్లాడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బురద చల్లడమే తన విధానం అన్నట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అనుభవం ఉన్న నేతా లేక గల్లీ లీడరా? అని ప్రశ్నించారు. చంద్రబాబు, ఆయన తనయుడు హైదరాబాద్‌కు పారిపోయారు. చంద్రబాబు నాయుడు.. జూమ్ నాయుడుగా మారిపోయారని ఆయన ఎద్దేవా చేశారు.(చదవండి: పేర్ని నానిపై హత్యాయత్నం: కొత్త కోణం..)
‘‘కోవిడ్ దృష్ట్యా అసెంబ్లీ ఆవరణలో మీడియా పాయింట్ తొలగించాం. ఏ అర్హత ఉందని చంద్రబాబు మా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ప్రజలను పట్టించుకోని చంద్రబాబుకు ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదు. కష్టకాలంలో రూ.70వేల కోట్లు ప్రజలకు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌ది. ప్రభుత్వం ఇచ్చే ప్రతిపైసా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళ్తోంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రజలను సీఎం జగన్ ఆదుకున్నారు. 9 నెలల్లో అమరావతికి చంద్రబాబు ఎన్నిసార్లు వచ్చారు? మీరు లేవనెత్తిన అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సమస్యలను చూసి పారిపోయింది చంద్రబాబు, లోకేషేనని శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. (చదవండి: మానవత్వంతో ఆదుకోండి)
Comments
Please login to add a commentAdd a comment