
సాక్షి, అమరావతి : ఐదేళ్ల పాలనలో దళారీగా, కమీషన్ ఏజెంట్‌గా పనిచేసి సీఎం అర్థాన్ని మార్చేసిన ‘ఘనత’ చంద్రబాబుదేనని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. బాబు సీఎంగా కాకుండా కమీషన్ మినిస్టర్‌లా పనిచేశారని ఎద్దేవా చేశారు. రాజకీయ జీవితంలో ఆయన రోజురోజుకు దిగజారుతున్నారని చురకలంటించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద శ్రీకాంత్‌రెడ్డి గురువారం విలేకరులతో మాట్లాడారు. విద్యుత్ కొనుగోళ్ల పీపీఏలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షిస్తే చంద్రబాబు రంకెలెందుకు వేస్తున్నారని మండిపడ్డారు.
ల్యాంకో రాజగోపాల్‌కి బాబు లబ్ది చేకూర్చారని, విద్యుత్ కొనుగోళ్లలో రూ.5 వేల కోట్ల కమీషన్లు దండుకున్నారని ఆరోపించారు. పీపీఏల కుంభకోణంలో తన పేరెక్కడ బయటికొస్తుందోనని చంద్రబాబు కొత్త డ్రామాలు మొదలుపెట్టారని విమర్శించారు. వాస్తవాలు ప్రజలకు చేరకుండా సభను తప్పుదోవ పట్టిస్తున్నారని శ్రీకాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్నటివరకు ‘ఖబర్దార్’ అంటూ కేంద్రాన్ని హెచ్చరించిన ఆయన ఇప్పుడెందుకు వెనకేసుకొస్తున్నారని ప్రశ్నించారు. రైతుల పొట్టకొట్టి హెరిటేజ్‌లో అధిక రేట్లకు అమ్ముకోవడం లేదా అని అన్నారు. టీడీపీని బీజేపీలో విలీనం చేస్తూ తమని విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం జగన్ ప్రజాసేవకుడిగా ఉంటారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment