అసెంబ్లీ చీఫ్ విప్గా నల్లాల ఓదేలు ! | Odelu to be Telangana Govt Chief Whip | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ చీఫ్ విప్గా నల్లాల ఓదేలు !

Published Fri, Oct 24 2014 2:10 PM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM

అసెంబ్లీ చీఫ్ విప్గా నల్లాల ఓదేలు ! - Sakshi

అసెంబ్లీ చీఫ్ విప్గా నల్లాల ఓదేలు !

హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ, శాసనమండలిలలో చీఫ్ విప్, విప్ల నియమాకంపై తెలంగాణ సీఎం కేసీఆర్ కసరత్తు ప్రారంభించారు. శాసనసభ చీఫ్ విప్గా నల్లాల ఓదేలు, శాసనమండలి చీఫ్ విప్గా సుధాకర్ రెడ్డి పేర్లను కేసీఆర్ దాదాపుగా ఖరారు చేసినట్లు సమాచారం. ఈ రోజు సాయంత్రం తెలంగాణ కేబినెట్ సమావేశంలో వారి పేర్లు ప్రకటించే అవకాశం ఉంది.

ఈ అంశంతోపాటు ఆంధ్రా తెలంగాణా రాష్ట్రాల మధ్య రగడకు దారి తీస్తోన్న శ్రీశైలం విద్యుత్ ఉత్పాదన అంశంపై కూడా చర్చ జరగనుంది. నవంబరు అయిదోవ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలలో ప్రతిపక్షాలను సమర్థవంతంగా ఎదుర్కొనే అంశాలపై కూడా ఈ కేబినెట్ భేటీలో చర్చించనున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement