odelu
-
ఎన్నికల ప్రచారంలో వేగం.. పోటాపోటీగా సాగుతున్న ప్రచారం!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూర్ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఈ నియోజకవర్గంలో ఎన్నికల వేళ అనూహ్య పరిణా మాలు చోటు చేసుకుంటుండడం ఆసక్తి క లిగిస్తోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గె లవాలనే తలంపు రాజకీయ పార్టీల మధ్య పోటాపోటీ ప్రచారానికి దారి తీస్తోంది. ప్రధాన పార్టీల నుంచి ప్ర భుత్వ విప్ బాల్క సుమన్, మాజీ ఎంపీ వివేక్ బరిలో ఉండడంతో ను వ్వా నేనా అన్న తీరులో పోరు సాగుతోంది. ఈ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బాల్క సు మన్ పోటీలో ఉండగా, కాంగ్రెస్ పార్టీ నుంచి గడ్డం వివేక్ రాకతో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికీ అధికారికంగా చెన్నూర్ నుంచి పోటీ చేసే అభ్యర్థి పేరు ఖ రారు కాలేదు. వివేక్ కాంగ్రెస్ పార్టీలో చేరికతో దా దాపు ఆయనకే బీఫాం అన్నట్లుగా పార్టీ వర్గాలు భా విస్తున్నాయి. చెన్నూర్ నుంచి వివేక్ బరిలో ఉంటారనే విషయం ఖాయమైనట్లు తెలుస్తోంది. ఇక సీపీఐకి టికెట్ ఇస్తామని ప్రతిపాదించినప్పటికీ చర్చల దశలోనే పొత్తు ఆగిపోయింది. బీజేపీలో వివేక్ ఉన్నంత కాలం ఆ పార్టీ కేడర్‌లో ఉత్సాహం ఉండేది. ప్రస్తుతం సరైన అభ్యర్థి కోసం వెతికే క్రమంలో ఎవరినీ ప్రకటించలేదు. ఆయన పార్టీ మార్పుతో ఇక్కడ బీజేపీ ఇబ్బందిలో పడింది. పోటాపోటీగా చేరికలు.. ప్రస్తుతం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో చేరికల పర్వం పోటాపోటీగా సాగుతోంది. బీజేపీలోని వివేక్ అనుచర వర్గం భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరుతోంది. ఇక గతంలో కాంగ్రెస్ పార్టీతో ఉన్న వారంతా తిరిగి కాంగ్రెస్‌లోకి చేరేందుకు ప్లాన్ వేశారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి అధికంగా కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా భీమారం, జైపూర్ మండలాల్లో అధికార పార్టీకి చెందిన గ్రామ సర్పంచ్‌లు మూకుమ్మడిగా రాజీనామాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. రామక్రిష్ణాపూర్, చెన్నూరు పట్టణాల్లోనూ చేరికలపై దృష్టి సారిస్తుండడంతో వలసలతో హస్తం పార్టీలో ఊపు వస్తోంది. మందమర్రి పట్టణంలో పలువురు వివేక్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇదే బాటలో మరికొందరు చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే బాల్క సుమన్ నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. పార్టీలో నష్టం జరగకుండా అసమ్మతి నాయకులతో చర్చిస్తూ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. బుజ్జగింపులు, హామీలు ఇస్తూ నాయకులతో చర్చలు సాగిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఎదురుదాడితో వివేక్‌పై విరుచుకుపడుతున్నారు. ఈ నెల 7న మందమర్రి పట్టణంలో నిర్వహించనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభతో ఊపు తెచ్చేందుకు పార్టీ కేడర్‌ను సన్నద్ధం చేస్తున్నారు. ఎన్నికల ప్రచార సభను విజయవంతం చేసి, బీఆర్ఎస్ను పటిష్టం చేసేందుకు పావులు కదుపుతున్నారు. ఈ మేరకు పార్టీ కేడర్‌ను అంతా సిద్ధం చేస్తున్నారు. వెనక్కి తగ్గిన ఓదెలు.. వివేక్ రాకతో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు పార్టీని వీడుతారనే ప్రచారం జరిగినా చివరికి ఆయనతో కలిసి పని చేసేందుకు నిర్ణయించుకన్నారు. ఈ మేరకు పార్టీ సీనియర్ నాయకులు జానారెడ్డి సమక్షంలో నాయకులంతా చర్చలు జరిపారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అ సంతృప్తులు ఒక్కొక్కరుగా చల్లబ డుతున్నారు. టికెట్ ఆశించి భంగపడిన మా జీ మంత్రి బోడ జనార్దన్, తదితర నాయకులు పార్టీలోనే ఉన్నా రు. మరోవైపు రాజారమే శ్ తన అనుచరులతో సమావేశమై కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పా రు. మరోవైపు బీఎస్పీ నుంచి డాక్టర్ దాసారపు శ్రీనివాస్, టీడీపీ నుంచి సంజయ్, బీజేపీ టికె ట్ కోసం దుర్గం అశోక్ ప్రయత్నాలు చేస్తున్నా రు. మరికొంద రు స్వతంత్ర అభ్యర్థులుగా బరి లో దిగేందుకు ప్రణాళికలు వేశారు. ఈ క్రమంలో జిల్లాలో చెన్నూరు రాజకీయాలు రోజు రోజుకు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇవి చదవండి: పాజిటివ్‌గా చెబితే.. ప్రజలు అర్థం చేసుకోవడం లేదు.. అందుకే ఇలా.. -
సుమన్‌కు సెగ
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/ఎంజీఎం: మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ ప్రచారంలో అపశ్రుతి చోటు చేసుకుంది. సుమన్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు అనుచరుడు రేగుంట గట్టయ్య ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. జైపూర్ మండలం ఇందారం నుంచి తొలిసారిగా ప్రచారం ప్రారంభించేందుకు బుధవారం నియోజకవర్గానికి వచ్చిన సుమన్‌కు స్వాగతం పలికే సందర్భంలో పెనుప్రమాదం తప్పింది. సుమన్‌కు టికెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ గట్టయ్య ఒంటి మీద పెట్రోల్ పోసుకోవడంతో పాటు సుమన్‌పైకి చిమ్మేందుకు చేసిన ప్రయత్నంలో మంగళహారతులపై పడి మంటలు రేగాయి. దీంతో గట్టయ్యతో పాటు 16 మందికి గాయాలయ్యాయి. సుమన్‌పై పెట్రోలు పడకుండా శ్రీరాంపూర్ సీఐ నారాయణనాయక్, సుమన్ అనుచరుడు జైనుద్దీన్ అడ్డుగా నిలిచారు. తీవ్రంగా గాయపడ్డ గట్టయ్యను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. సీఐ నారాయణనాయక్, ఫొటోగ్రాఫర్లు అనీష్, శ్రీకాంత్‌లను మంచిర్యాల లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పథకం ప్రకారమేనా..!: చెన్నూర్‌లో ప్రచారానికి సుమన్ బుధవారం ఉదయం 11.40కు ముహూర్తం నిర్ణయించుకున్నారు. డీఎంఎఫ్ నిధులతో ఇందారం గ్రామంలో రూ.1.20 కోట్లతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను ప్రారంభించేందుకు వెళ్లారు. మహిళలు సుమన్‌కు హారతి పట్టేందుకు రాగా, అక్కడికి చేరుకున్న ఇందారం గ్రామానికి చెందిన ఎమ్మార్పీఎస్ నేత గట్టయ్య చేతిలో పెట్రోల్ సీసాతో ప్రత్యక్షమయ్యాడు. ఏం జరుగుతుందో తెలిసేలోగానే ‘జై కేసీఆర్.. జై ఓదెన్న’అని నినాదాలు చేస్తూ పెట్రోల్‌ను ఒంటిపై పోసుకున్నాడు. గట్టయ్య తన నోట్లో పడ్డ పెట్రోల్‌ను సుమన్‌పైకి ఉమ్మినట్లు సాక్షులు చెబుతున్నారు. మంగళహారతులపై పెట్రోల్ పడటంతో మంటలు రేగాయి. గట్టయ్య కాలిపోతూ పరిగెత్తుతుండగా పోలీసులు మంటలు ఆర్పే ప్ర యత్నం చేశారు. ఘటనను సుమన్‌పై జరిగిన హత్యాయత్నంగా పోలీసులు కేసు నమోదు చేశారు. నాపై జరిగిన హత్యాయత్నం: బాల్క సుమన్ తనపై జరిగిన హత్యాయత్నంలో భాగంగానే ఓదెలు వర్గం పెట్రోల్‌తో దాడి చేసిందని బాల్క సుమన్ ఆరోపించారు. చెన్నూర్ టికెట్‌ను కేసీఆర్ తనకు కేటాయించారని.. ఎవరు అడ్డుపడినా ఇక్కడి నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. సుమన్‌వి నీచరాజకీయాలు: ఓదెలు బాల్కసుమన్ నీచ రాజకీయాలు మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కోరారు. ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గట్టయ్యను ఓదెలు పరామర్శించారు. -
అసెంబ్లీ చీఫ్ విప్‌గా నల్లాల ఓదేలు !
హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ, శాసనమండలిలలో చీఫ్ విప్, విప్ల నియమాకంపై తెలంగాణ సీఎం కేసీఆర్ కసరత్తు ప్రారంభించారు. శాసనసభ చీఫ్ విప్‌గా నల్లాల ఓదేలు, శాసనమండలి చీఫ్ విప్‌గా సుధాకర్ రెడ్డి పేర్లను కేసీఆర్ దాదాపుగా ఖరారు చేసినట్లు సమాచారం. ఈ రోజు సాయంత్రం తెలంగాణ కేబినెట్ సమావేశంలో వారి పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. ఈ అంశంతోపాటు ఆంధ్రా తెలంగాణా రాష్ట్రాల మధ్య రగడకు దారి తీస్తోన్న శ్రీశైలం విద్యుత్ ఉత్పాదన అంశంపై కూడా చర్చ జరగనుంది. నవంబరు అయిదోవ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలలో ప్రతిపక్షాలను సమర్థవంతంగా ఎదుర్కొనే అంశాలపై కూడా ఈ కేబినెట్ భేటీలో చర్చించనున్నట్లు సమాచారం. -
సాదాసీదాగా..
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం సాదాసీదాగా ముగిసింది. శనివారం ఎంపీ రాథోడ్ రమేష్ అధ్యక్షతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ సమావేశం నిర్వహించారు. ఇందులో ఎజెండా ప్రకారం 28 అంశాలపై చర్చించాల్సి ఉండగా.. 15 అంశాలకే పరిమితం చేశారు. పైగా చర్చ జరిగిన అంశాలనూ అంతగా లోతుగా పట్టించుకోలేదు. చెన్నూర్ మండలం కత్తెరశాల వాగుపై వంతెన నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు చేపట్టిన ధర్నాకు విజిలెన్స్ కమిటీ మద్దతు తెలిపింది. వాగుపై వంతెన నిర్మాణానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ప్రధానంగా వ్యవసాయంలో పంట నష్టం, హౌసింగ్‌లో ఇళ్లను కట్టకుండానే బిల్లులు చెల్లించడం, కూలిపోయిన ఇళ్లు, పంచాయతీ రాజ్ శాఖలో వర్షాలకు చెడిపోయిన రోడ్లపై చర్చ కొనసాగింది. గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం, డ్వామాలో ఉపాధి హామీ కూలీ డబ్బుల చెల్లింపు, ఇందిర జలప్రభ కింద ఎస్సీ, ఎస్టీల వ్యవసాయ భూములకు సాగునీరు, ఆర్‌డబ్ల్యూఎస్‌లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీరు కల్పించాల్సిన గ్రామాలకు పైప్‌లైన్ సౌకర్యాలు, మార్కెట్ యార్డులో పత్తి కొనుగళ్లు, విద్యుత్, అంగన్వాడీలపై, పాఠశాలలపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అహ్మద్‌బాబు మాట్లాడుతూ.. బేల మండలానికి మంజూరైన సబ్ మార్కెట్‌యార్డు ఏర్పాటుకు స్థలం గుర్తించామని, నాలుగు నెలల్లో కాంటాలతో కూడిన మార్కెట్‌యార్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. జిన్నింగ్‌మిల్లులో పత్తి కొనుగోళ్లు కుదరదని, అలాగైతే జిల్లా వ్యాప్తంగా చేపట్టాల్సి ఉంటుందన్నారు. ఐసీడీఎస్‌లో అమృతహస్తం, సబల కార్యక్రమంపై పూర్తి వివరాలను తనకు అందజేయాలని పీడీ మీరాబెనర్జీని ఆదేశించారు. గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం, పంచాయతీ భవనాలు, మండల సమాఖ్య భవన నిర్మాణాలకు, ఇతర పనులకు మార్చి 31 వరకు కొత్తగా మంజూరు ఇవ్వలేమని డ్వామా పీడీ వినయ్‌కృష్ణారెడ్డి పేర్కొన్నారు. హౌజింగ్ పీడీ గంగారాం మాట్లాడుతూ.. అవతవకలు జరిగిన మండలాల్లో విచారణ చేపట్టి సంబంధిత ఏఈని సస్పెండ్ చేయడం జరిగిందని తెలిపారు. విద్యుత్ శాఖ ఎస్ఈ అశోక్ మాట్లాడుతూ.. కరెంటు లేని గ్రామాల్లో స్తంభాలు సరఫరా చేస్తామన్నారు. చెడిపోయిన రోడ్లకు మరమ్మతు కోసం టెండర్లు పిలిచామని ఎస్ఈ ఉమా మహేశ్వర్‌రావు పేర్కొన్నారు. సమావేశంలో ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్, డీఆర్వో ఎస్ఎస్.రాజు, డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, జేడీఏ రోజ్‌లీల, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇళ్లు కట్టకుండానే బిల్లులు చెల్లించారు.. - రాథోడ్మ్రేష్, ఆదిలాబాద్ ఎంపీ ఏజెన్సీ ప్రాంతమైన పిట్టగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని కొసాయి గ్రామంలో గిరిజనులకు, కోలాంలకు, ఎస్సీ, ఎస్టీలకు 20 ఇళ్లు మంజూరయ్యాయి. కానీ.. వారు నిర్మించకుండానే అధికారులే బిల్లులు కాజేశారు. ఇందిర జలప్రభ కింద ఎంత మంది లబ్ధిదారులున్నారు.. ఏయే పనులు చేపట్టాల్సి ఉందో అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అవకతవకలు - వివేక్, ఎంపీ, పెద్దపల్లి భీమిని, నెన్నెల, బెల్లంపల్లి మండలాల్లో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో చాలా అవకతవకలు జరిగాయి. రచ్చబండ కార్యక్రమంలో కూడా ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. దండేపల్లి మండలం వెల్గనూరులో పశుసంవర్ధక శాఖకు చెందిన డాక్టర్ రావడం లేదు. ఇందిరా జలప్రభ కింద ఎస్సీ, ఎస్టీల వ్యవసాయ భూముల్లో బోర్లు వేయకుంటే ఆ పథకం ఫెయిల్ అయినట్లే. ఇటిక్యాల, కోటపల్లి, కాసిపేటలో ఆర్‌డబ్ల్యూఎస్‌కు సంబంధించిన పనులు ఇంకా ప్రారంభం కాలేదు. రోడ్లు సరిగా లేవు.. - గుండా మల్లేష్, ఎమ్మెల్యే, బెల్లంపల్లి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జిల్లాకు కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. ఇంటర్ కనెక్టివిటి కింద చేసి గ్రామాలలో పనులు జరిగేలా చూడాలి. క్లస్టర్ విలేజ్ ట్రైనింగ్ క్యాంప్‌కు ఒక్క గ్రామం, మండలం కానీ ఎంపికకాలేదు. వర్షాలకు రోడ్లు పూర్తి అధ్వానంగా మారాయి. టేకులపల్లి నుంచి మండల కేంద్రానికి వెళ్లాలంటే 15 నుంచి 20 కిలో మీటర్లు వెళ్లాల్సి వస్తుంది. రోడ్లు సరిగా లేకపోవడం వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తోంది. బెల్లంపల్లి మార్కెట్‌యార్డు విస్తరణకు ప్రభుత్వ భూమి కావాలి. మార్కెట్‌యార్డు పక్కన ఉన్న ఐదారు ఎకరాలు ప్రభుత్వ భూమిని కేటాయించాలి. రాత్రిపూట చీకట్లో ప్రజలు.. - కావేటి సమ్మయ్య, ఎమ్మెల్యే, సిర్పూర్ సిర్పూర్ నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు, బల్బులు లేక ప్రజలు చీకట్లో ఉంటున్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకున్న వారికి ఇంకా డబ్బులు చెల్లించలేదు. రోడ్లు బాగా చెడిపోయాయి. పత్తి తీసుకురావాలంటే ఇబ్బందులు.. - గేడం నగేష్, ఎమ్మెల్యే బోథ్ బోథ్ వ్యవసాయ మార్కెట్‌యార్డుకు పత్తి తీసుకురావాలంటే రైతులు ఇబ్బందులు పడుతున్నా రు. నియోజకవర్గంలోని చాలా మండలాల్లో రోడ్లు చెడిపోయి ఉన్నాయి. పనులు చేపట్టాలి. సబ్‌మార్కెట్ యార్డు ఏర్పాటు చేయాలి.. - జోగు రామన్న, ఎమ్మెల్యే, ఆదిలాబాద్ బేల మండలంలో సబ్ మార్కెట్ నిర్మాణానికి ప్రభుత్వం 2008లో మంజూరు చేసింది. కానీ ఇంత వరకు సబ్ మార్కెట్‌యార్డు ఏర్పాటు కాలేదు. బేలలో మార్కెట్ లేకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జిన్నింగ్ మిల్లుల ద్వారా బేలలో పత్తి కొనుగోలు చేయాలి. జైనథ్‌లో మార్కెట్ యార్డు ఉన్న జిన్నింగ్ మిల్లులు లేవు. ఏజెన్సీ ఏరియాల్లో రోడ్లే లేవు.. - వేణుగోపాలచారి, ఎమ్మెల్యే ముథోల్ ఏజెన్సీ ఏరియాల్లో రోడ్లు లేవు. రెండేసి రేషన్‌కార్డులు ఉన్నాయి. కుభీర్‌లో 12 ఇండ్లు కాలిపోయాయి. ఇండ్లు పూర్తిగా కట్టుకున్న వారు బిల్లుల కోసం తిరుగుతున్నరు. ఉపాధి కూలీ డబ్బులు అందించాలి. ఆరు గ్రామాలకు ఒక పోస్టాఫీసు మాత్రమే ఉంది. దీని వల్ల ఇబ్బంది అవుతంది. ఆధార్, నగదు బదిలీలాగే వ్యక్తి గత మరుగుదొడ్లను కూడా జిల్లాలో మొదటి స్థానంలో నిలపాలి. ఐసీడీఎస్ అధికారులకు ఫోన్ చేసినా స్పందించడంలేదు.