కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం పార్లమెంట్‌లో ప్రవేశపెడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంపై కీలక ప్రకటన చేశారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు, మూలధన పన్ను లాభాల నుంచి కూడా మినహాయింపు ఇచ్చారు. కాగా, ల్యాండ్ పూలింగ్‌లో ఉన్నవారికి మాత్రమే పన్ను రద్దు వర్తిస్తుందని అన్నారు.