కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం లోక్సభలో 2017-18 ఏడాదికిగాను బడ్జెట్‌ను సమర్పించారు. 92 ఏళ్ల సంప్రదాయాన్ని కాదని తొలిసారి రైల్వే బడ్జెట్‌ను కూడా సాధారణ బడ్జెట్‌లో భాగంగా ప్రవేశపెట్టారు. నగదు రహిత లావాదేవిలను ప్రోత్సహించేందుకు ఐఆర్‌సీటీసీ ద్వారా బుక్ చేసుకునే రైల్వే టికెట్లపై సర్వీస్ ట్యాక్స్ ను ఎత్తివేశారు. ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేసేందుకు కార్పస్ ఫండ్ ఏర్పాటు చేశారు.