బడ్జెట్లో పది ప్రాధాన్యతాంశాలు ఇవే..
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం లోక్సభలో 2017-18 ఏడాదికిగాను బడ్జెట్‌ను సమర్పించారు. 92 ఏళ్ల సంప్రదాయాన్ని కాదని తొలిసారి రైల్వే బడ్జెట్‌ను కూడా సాధారణ బడ్జెట్‌లో భాగంగా ప్రవేశపెట్టారు. వసంతపంచమి రోజు బడ్జెట్ ప్రవేశ పెట్టడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. రెండంకెల ద్రవ్యోల్భణం అదుపుతోకి వచ్చిందన్నారు. వివక్షాపూరితమైన విధానాలకు పూర్తిగా ముగింపు పలికామని జైట్లీ అన్నారు. ఈ సందర్భంగా బడ్జెట్లో ప్రధానంగా దృష్టిపెట్టిన పది అంశాలను ఆయన వివరించారు.
బడ్జెట్లో దృష్టిపెట్టిన పది అంశాలు
1. రైతులు
2. గ్రామీణాభివృద్ధి
3.యువత
4. పేదల ఆరోగ్యం
5. మౌలిక సదుపాయాలు
6. పారిశ్రామిక వృద్ధికి ఆర్థిక చేయూత
7. వేగవంతమైన జవాబుదారీతనం
8. ప్రజా సర్వీసులు
9. సమర్థమైన ఆర్థిక విధానం
10. నిజాయతీ పరులకు సరళీకృతమైన పన్ను విధానం
(సంబంధిత వార్తలు..)
బడ్జెట్ లో రైల్వే హైలెట్స్...
గృహ రంగానికి గుడ్న్యూస్
పేదలకు కేంద్ర బడ్జెట్‌లో వరాలు!
ఐఆర్‌సీటీసీ టికెట్ల మీద భారీ వరాలు