రైల్వే భద్రతకోసం ప్రత్యేక ఫండ్‌..! | Budget 2017: FM may announce special fund of Rs 20,000 cr for rail safety | Sakshi
Sakshi News home page

రైల్వే భద్రతకోసం ప్రత్యేక ఫండ్‌..!

Published Mon, Jan 30 2017 1:59 PM | Last Updated on Tue, Sep 5 2017 2:29 AM

రైల్వే భద్రతకోసం ప్రత్యేక ఫండ్‌..!

రైల్వే భద్రతకోసం ప్రత్యేక ఫండ్‌..!

న్యూఢిల్లీ: రైల్వేలు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి  2016-17 బడ్జెట్లో  రైల్వేలకు ప్రత్యేక ప్రతిపాదనలు  చేయనున్నారట. ముఖ్యంగా వరుస ప్రమాదాలతో కునారిల్లుతున్నభారతీయ రైల్వే వ్యవస్థను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇటీవల కాలంలో రైలు ప్రమాదాలు బాగా పెరిగిపోవడంతో ప్రయాణీకుల భద్రతకు భరోసా ఇచ్చేందు కు ప్రత్యేక నిధులతో   రడీ అవుతోంది. రైలు భద్రత  ప్రత్యేక ఫండ్ కోసం రూ .20,000 కోట్ల ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.


వచ్చే ఆర్థిక  సంవత్సరానికి సంబంధించిన రైల్వే బడ్జెట్‌ కోసం రెండు పేజీలను ప్రత్యేకంగా కేటాయించినట్టు తెలిపారు. సాధారణ బడ్జెట్లో వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రధాన ప్రాజెక్టులు, వ్యయ మరియు ఆదాయ లక్ష్యాలు సహా రైల్వే 'రాబోయే కార్యకలాపాలు గురించి  ప్రస్తావన ఉంటుంది.  రాబోయే బడ్జెట్ 2017-18 లో ఢిల్లీ-హౌరా, ఢిల్లీ-ముంబై రైలు మార్గాల్లో ట్రాక్లు మరియు వంతెనల బలోపేతానికి  ప్రతిపాదనలు సిద్ధం  చేసినట్టు చెప్పారు. ప్రత్యేక భద్రతా నిధి కోసం ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ.. బడ్జెట్‌లో రూ.20వేల కోట్లు కేటాయించనున్నారు. కొత్త రైళ్లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రణాళికలపై పెద్దగా ప్రతిపాదనలు ఉండకపోవచ్చు కానీ,  ప్రయాణికుల భద్రత ఫండ్ కు  సంబంధించిన కీలకమైన  ప్రకటన వెలువడే అవకాశంఉందని సీనియర్ రైలు మంత్రిత్వ శాఖ అధికారి తెలిపారు.

రైలు నెట్వర్క్ అభివృద్ధిలో ఇది ఒక నమూనా మార్పుగా  ఆయన అభివర్ణించారు.  ఫెన్సింగ్ ల వద్ద మనుషులు, పశువుల చొరబాటును   నిరోధించడంపై బడ్జెట్ పేపర్లలో ప్రముఖ ప్రస్తావన  ఉండనున్నట్టు చెప్పారు. ప్రధాన రహదారు మార్గం వెంట మానవరహిత లెవెల్ క్రాసింగ్ల తొలగింపుతో  పాటు , ఫెన్సింగ్, ట్రాక్ మరియు సిగ్నలింగ్ అభివృద్ధి ,  రెండు కారిడార్లు కోసం  రూ 21,000 కోట్ల అంచనా వ్యయంతో నిధులను  కేటాయించనున్నారు. .  రైల్వే ట్రాక్‌లు, వంతెనల బలోపేతం, మరమ్మతుల కోసం పెద్దఎత్తున నిధులు కేటాయించనున్నారు. రూ. 34 వేల కోట్ల మూలధనంతో రైల్వే హోల్డింగ్‌ కంపెనీని ఏర్పాటుచేసే ప్రతిపాదన తీసుకురానున్నట్టు తెలిపారు.  దీని ప్రకారం ఐఆర్‌సీటీసీ, ఆర్‌ఐటీఈఎస్‌, కొంకర్‌, రైల్‌టెల్‌, ఎమ్‌ఆర్‌వీసీ సహా మొత్తం 14 ప్రభుత్వ రంగ సంస్థలతో ఈ కంపెనీ ఏర్పాటు కానుంది.

రైల్వేల వేగాన్ని నియంత్రించకుండా, ట్రాక్‌ల వెంట ఫెన్సింగ్‌ వ్యవస్థలను ఏర్పాటుచేయాలనేది ప్లాన్‌.  తొలుత 160 కిలోమీటర్లకు, అనంతరం 200 కిలోమీటర్లకు పెంచే యోచన ఉన్నట్టు కూడా చెప్పారు. దీనికోసం కిలోమీటర్‌కు రూ.45 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.

కాగా గత రెండు నెల్లో అయిదు ఘోర రైలు ప్రమాదాలు చోటుచేసుకోగా దాదాపు 200 మంది  రైలు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.  వందలమంది గాయపడ్డారు.  రైల్వే బడ్జెట్‌ ను   సాధారణ బడ్జెట్టో విలీనం చేసిన యూనియన్‌ బడ్జెట్‌ ను మొదటిసారి    ఫిబ్రవరి 1 ఆర్థిక మంత్రిత్వ శాఖ  ప్రవేశపెట్టనున్నసంగతి తెలిసిందే.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement