special fund
-
మహిళల భద్రతకు ప్రత్యేక నిధి!
సాక్షి, హైదరాబాద్: పని ప్రదేశంలో మహిళలు ధైర్యంగా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోందని మంత్రి సీతక్క వెల్లడించారు. ఇటీవల దేశవ్యాప్తంగా జరుగుతున్న ఘటనలతో మహిళలు భయాందోళనకు గురవుతున్నారని, ఈ పరిస్థితిని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. మహిళలపై దాడులు చేసిన వారికి వెంటనే శిక్ష అమలయితేనే ఇలాంటి ఘటనలు తగ్గుతాయని మంత్రి అభిప్రాయపడ్డారు.మహిళల భద్రతపై బుధవారం సచివాలయంలో మంత్రి సీతక్క సమావేశం నిర్వ హించారు. మహిళలపై హింస పెరగడానికి డ్రగ్స్, గంజాయి కూడా కారణమవుతున్నాయని వివరించారు. ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల్లో షీ టీమ్స్ గస్తీ పెంచుతామన్నారు. పబ్లిక్ ప్లేసుల్లో, ఆసుపత్రుల్లో సీసీ కెమెరాలను పెంచుతామన్నారు. మంత్రులు, ఉన్నతాధికారులతో కోర్ కమిటీని ఏర్పాటు చేస్తామని, అన్ని శాఖల్లో త్వరలో ఉమెన్ సేఫ్టీ కమి టీలు నియమిస్తామని తెలిపారు. మహిళల భద్రత కోసం ప్రతి శాఖకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించే అంశాన్ని తమ ప్రభు త్వం పరిశీలిస్తోందన్నారు. మహిళా ఉద్యోగుల భద్రతపై ప్రతీ కార్యాలయంలో కమిటీలు ఏర్పాటు చేయాలని మహి ళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద సూచించారు. బచ్పన్ బచావోతో కలసి పనిచేస్తాం.. బాల కారి్మకులు, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న బచ్పన్ బచావో ఆందోళన్ ప్రతినిధుల బృందం బుధవారం సచివాలయంలో మంత్రి సీతక్కతో సమావేశమయింది. నోబెల్ అవార్డు గ్రహీత కైలాశ్ సత్యార్థి నేతృత్వంలో బచ్పన్ బచావో ఆందోళన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సంపూర్ణ బెహరా, ధనుంజయ్ తింగాల్, ప్రతినిధులు వీఎస్ శుక్లా, చందన, వెంకటేశ్వర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బచ్పన్ బచావో ఆందోళన్‌తో రాష్ట్ర ప్రభుత్వం కలసి పనిచేస్తుందని తెలిపారు. -
డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టే మొదటి ప్రత్యేక ఫండ్ ఇదే...
ముంబై: దేశంలో డేటా సెంటర్ల వ్యాపారంపై పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా కోటక్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ రూ.590 మిలియన్ డాలర్లు (సుమారు రూ.4,835 కోట్లు) సమీకరించింది. కోటక్ డేటా సెంటర్ ఫండ్ కింద 800 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నట్టు కోటక్ బ్యాంక్‌కు చెందిన కోటక్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ (కేఐఏ) ప్రకటించింది. దేశంలో డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టే మొదటి ప్రత్యేక ఫండ్ ఇదేనని తెలిపింది. ప్రస్తుతం దేశంలో ఉన్న డేటా సెంటర్ సామర్థ్యం మన అవసరాల కంటే తక్కువగానే ఉన్నట్టు కేఐఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాహుల్‌షా పేర్కొన్నారు. ‘‘ఇది భారీ పెట్టుబడులు అవసరమైన రంగం. కనుక భారీ ఈక్విటీ పెట్టుబడుల అవకాశాలు ఉంటాయని మేం భావిస్తున్నాం’’అని చెప్పారు. (ఇదీ చదవండి: మనకు ఎడాదికొక ఎలక్ట్రిక్ కారు.. వోల్వో ప్రామిస్!) -
రూ. 3 లక్షల కోట్ల ఉద్దీపన అవసరం
న్యూఢిల్లీ: కరోనా కష్టాల్లో కూరుకుపోయిన ఎకానమీకి ఊతం ఇవ్వడానికి రూ.3 లక్షల కోట్ల ఉద్దీపన అవసరమని ఇండస్ట్రీ చాంబర్ సీఐఐ ప్రెసిడెంట్ టీవీ నరేంద్రన్ పేర్కొన్నారు. ఉద్దీపనలో భాగంగా జన్ ధన్ అకౌంట్ల ద్వారా కుటుంబాలకు ప్రత్యక్ష నగదు బదలాయింపు జరపాలనీ ఆయన సూచించారు. బ్రిటన్ తరహాలో వ్యాక్సినేషన్ సత్వర విస్తృతికి ‘వ్యాక్సిన్ జార్’ను (లేదా మంత్రి) నియమించాలని సిఫారసు చేశారు. దేశ ఆర్థిక పురోగతి విషయమై విలేకరులతో ఆయన మాట్లాడిన అంశాల్లో ముఖ్యమైనవి... ► భారత్ ఎకానమీ వినియోగ ఆధారితమైనది.ఈ డిమాండ్‌ను మహమ్మారి తీవ్రంగా దెబ్బతీసింది. ఈ పరిస్థితుల్లో నగదు ప్రత్యక్ష బదలాయింపు కీలకమని సీఐఐ భావిస్తోంది. ► ఎంఎన్ఆర్ఈజీఏ (మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం) కింద కేటాయింపులు మరింత పెంచాలి. ► వస్తు సేవల పన్ను(జీఎస్టీ) తగ్గింపులు డిమా ండ్ పురోగతికి దోహదపడుతుంది. గృహ కొనుగోలుదారులకు స్టాంప్ డ్యూటీ, వడ్డీ రాయితీలు అవసరం. గతేడాది తరహాలో ఎట్‌టీసీ క్యాష్ వోచర్ స్కీమ్ ఆత్మనిర్బర్ భారత్ రోజ్‌గార్ యోజనను 2022 మార్చి 31 వరకూ పొడిగించాలి. ► లఘు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎం ఎస్ఎంఈ) సహా కంపెనీలకు సకాలంలో తగిన అన్ని చెల్లింపులూ జరిగేలా చర్యలు తీసుకోవాలి. ► వృద్ధికి సంబంధించి వ్యయాలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో సత్వర పురోగతి ఉండాలి. ► దేశంలోని వయోజనులు అందరికీ 2021 డిసెంబర్ కల్లా వ్యాక్సినేషన్ పుర్తికావాలి. ఇందుకు రోజుకు సగటున కనీసం 71.2 లక్షల డోసేజ్ వ్యాక్సినేషన్ జరగాలి. ఈ దిశలో ఏజెన్సీలు, రాష్ట్రాలు, కేంద్రం, ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థల మధ్య సమన్వయ సహకారం అవసరం. వ్యాక్సినేషన్ ఆవశ్యకత ప్రచారానికి క్రీడా, సినీ ప్రముఖుల సేవలను వినియోగించుకోవాలి. ► కోవిడ్–19 మూడవ వేవ్ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని, గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్ కేర్ కేంద్రాల ఏర్పాటుకు జిల్లా పాలనా యంత్రాంగాలు, ప్రైవేటు రంగ భాగస్వాములు దృష్టి సారించాలి. ► బ్యాంకింగ్ మొండిబకాయిల సమస్య సత్వర పరిష్కారానికి కృషి చేయాలి. ► భవిష్యత్‌లో ఎటువంటి మహమ్మారినైనా తట్టుకుని నిలబడ్డానికి ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలి. -
ఎంఎస్ఎంఈలకు రూ.లక్ష కోట్ల నిధి
న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) సంస్థలకు నిధుల ఇబ్బందులను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.లక్ష కోట్ల పథకాన్ని ఏర్పాటు చేయబోతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు, భారీ పరిశ్రమలు ఎంఎస్ఎంఈలకు బకాయిలను చెల్లించేందుకు వీలుగా ఈ నిధిని ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఆర్థిక శాఖ ఆమోదం అనంతరం కేబినెట్ పరిశీలనకు ఉంచుతామని చెప్పారు. -
ఎస్సీల అత్యవసర సాయానికి మరో నిధి
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక ఇబ్బందులు, ప్రోత్సాహంకోసం ఎదురుచూసే ఎస్సీ యువతను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్సీ ఎస్డీఎఫ్) అమలు చేస్తున్నప్పటికీ వీటి పరిధిలోకి రాని అంశాలను క్రోడీకరిస్తూ కొత్తగా క్రూషియల్ వెల్ఫేర్ ఫండ్ (సీడబ్ల్యూఎఫ్) అమల్లోకి తెచ్చింది. ఈ నిధినుంచి అత్యవసర ఆర్థికసాయం కోసం వచ్చేవారికి నేరుగా నగదును అందించే వెసులుబాటు ఉంటుంది. 2018–19 వార్షిక సంవత్సరం నుంచి ఈ నిధి అందుబాటులోకి వచ్చింది. తాజా వార్షిక సంవత్సరంలో సీడబ్ల్యూఎఫ్ కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.62 కోట్లు కేటాయించింది. సాయమే పరమావధిగా... ఎస్సీ ఎస్డీఎఫ్ ద్వారా 42 శాఖల ద్వారా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ నగదు సాయం పథకాలు పెద్దగా లేవు. ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ కల్యాణలక్ష్మి లాంటి పథకాల్లో నగదును సాయం రూపంలో ఇచ్చినప్పటికీ నిబంధనలకు లోబడే పంపిణీ చేస్తారు. అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రీయ స్థాయి కార్యక్రమాల్లో పాల్గొనే వారికి ఆర్థికంగా ఇబ్బందులుంటే సీడబ్ల్యూఎఫ్ ద్వారా నేరుగా నగదు సాయాన్ని అందించే వీలుంది. క్రీడల్లో పాల్గొనే వారు, సెమినార్లకు హాజరయ్యేవాళ్లు, ఉపాధి అవకాశాలకు సంబంధించి విదేశాల్లో ఈవెంట్లకు హాజరవ్వాలనుకున్న సందర్భంలో వారికి అత్యవసర సాయం కింద ఖర్చులు, ప్రయాణ చార్జీలను ఈ నిధి కింద ఇస్తారు. అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయిలో పథకాలు సాధించిన ఎస్సీ క్రీడాకారులకు కూడా నిర్ణీత మొత్తంలో నగదు పారితోషకాలను ఈ నిధి కింద ఇవ్వొచ్చు. అదేవిధంగా వ్యక్తిగత వృద్ధి, ఉపాధి మార్గాలకు సంబంధించిన అంశాలతో పాటు యంత్రాంగం విచక్షణతో సాయం చేసేలా ఈ నిధి నిబంధనలను ప్రభుత్వం రూపొందించింది. కలెక్టర్లకు బాధ్యతలు... సీడబ్ల్యూఎఫ్ కింద అర్హుల ఎంపిక, సాయం పంపిణీ బాధ్యతల్ని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. ఆర్థిక సాయంకోరే అభ్యర్థి ముందుగా సంబంధిత జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారిని సంప్రదించి దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. అనంతరం దాన్ని పరిశీలించిన అధికారి కలెక్టర్‌కు సిఫార్సు చేస్తారు. అక్కడ దరఖాస్తును పూర్తిస్థాయిలో పరిశీలించిన అనంతరం సీడబ్ల్యూఎఫ్ కింద సాయాన్ని మంజూరు చేస్తారు. సాయం పరిమితి రూ.5 లక్షలవరకు కలెక్టర్ నిర్ణయం ఆధారంగా మంజూరవుతుంది. అంతకుమించి సాయం ఆశిస్తే ఫైలును ప్రభుత్వానికి పంపించాల్సి ఉంటుంది. ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అనుమతి తర్వాతే రూ.5లక్షలకు మించిన సాయం ఇస్తామని ఆ శాఖ సంచాలకులు పి.కరుణాకర్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
రైల్వే భద్రతకోసం ప్రత్యేక ఫండ్..!
న్యూఢిల్లీ: రైల్వేలు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి 2016-17 బడ్జెట్లో రైల్వేలకు ప్రత్యేక ప్రతిపాదనలు చేయనున్నారట. ముఖ్యంగా వరుస ప్రమాదాలతో కునారిల్లుతున్నభారతీయ రైల్వే వ్యవస్థను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇటీవల కాలంలో రైలు ప్రమాదాలు బాగా పెరిగిపోవడంతో ప్రయాణీకుల భద్రతకు భరోసా ఇచ్చేందు కు ప్రత్యేక నిధులతో రడీ అవుతోంది. రైలు భద్రత ప్రత్యేక ఫండ్ కోసం రూ .20,000 కోట్ల ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రైల్వే బడ్జెట్ కోసం రెండు పేజీలను ప్రత్యేకంగా కేటాయించినట్టు తెలిపారు. సాధారణ బడ్జెట్లో వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రధాన ప్రాజెక్టులు, వ్యయ మరియు ఆదాయ లక్ష్యాలు సహా రైల్వే 'రాబోయే కార్యకలాపాలు గురించి ప్రస్తావన ఉంటుంది. రాబోయే బడ్జెట్ 2017-18 లో ఢిల్లీ-హౌరా, ఢిల్లీ-ముంబై రైలు మార్గాల్లో ట్రాక్‌లు మరియు వంతెనల బలోపేతానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు చెప్పారు. ప్రత్యేక భద్రతా నిధి కోసం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. బడ్జెట్లో రూ.20వేల కోట్లు కేటాయించనున్నారు. కొత్త రైళ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రణాళికలపై పెద్దగా ప్రతిపాదనలు ఉండకపోవచ్చు కానీ, ప్రయాణికుల భద్రత ఫండ్ కు సంబంధించిన కీలకమైన ప్రకటన వెలువడే అవకాశంఉందని సీనియర్ రైలు మంత్రిత్వ శాఖ అధికారి తెలిపారు. రైలు నెట్వర్క్ అభివృద్ధిలో ఇది ఒక నమూనా మార్పుగా ఆయన అభివర్ణించారు. ఫెన్సింగ్ ల వద్ద మనుషులు, పశువుల చొరబాటును నిరోధించడంపై బడ్జెట్ పేపర్లలో ప్రముఖ ప్రస్తావన ఉండనున్నట్టు చెప్పారు. ప్రధాన రహదారు మార్గం వెంట మానవరహిత లెవెల్ క్రాసింగ్‌ల తొలగింపుతో పాటు , ఫెన్సింగ్, ట్రాక్ మరియు సిగ్నలింగ్ అభివృద్ధి , రెండు కారిడార్లు కోసం రూ 21,000 కోట్ల అంచనా వ్యయంతో నిధులను కేటాయించనున్నారు. . రైల్వే ట్రాక్‌లు, వంతెనల బలోపేతం, మరమ్మతుల కోసం పెద్దఎత్తున నిధులు కేటాయించనున్నారు. రూ. 34 వేల కోట్ల మూలధనంతో రైల్వే హోల్డింగ్ కంపెనీని ఏర్పాటుచేసే ప్రతిపాదన తీసుకురానున్నట్టు తెలిపారు. దీని ప్రకారం ఐఆర్సీటీసీ, ఆర్ఐటీఈఎస్, కొంకర్, రైల్‌టెల్, ఎమ్ఆర్వీసీ సహా మొత్తం 14 ప్రభుత్వ రంగ సంస్థలతో ఈ కంపెనీ ఏర్పాటు కానుంది. రైల్వేల వేగాన్ని నియంత్రించకుండా, ట్రాక్‌ల వెంట ఫెన్సింగ్ వ్యవస్థలను ఏర్పాటుచేయాలనేది ప్లాన్. తొలుత 160 కిలోమీటర్లకు, అనంతరం 200 కిలోమీటర్లకు పెంచే యోచన ఉన్నట్టు కూడా చెప్పారు. దీనికోసం కిలోమీటర్‌కు రూ.45 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. కాగా గత రెండు నెల్లో అయిదు ఘోర రైలు ప్రమాదాలు చోటుచేసుకోగా దాదాపు 200 మంది రైలు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. వందలమంది గాయపడ్డారు. రైల్వే బడ్జెట్ ను సాధారణ బడ్జెట్టో విలీనం చేసిన యూనియన్ బడ్జెట్ ను మొదటిసారి ఫిబ్రవరి 1 ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టనున్నసంగతి తెలిసిందే.