ముంబై: దేశంలో డేటా సెంటర్ల వ్యాపారంపై పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా కోటక్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్ రూ.590 మిలియన్ డాలర్లు (సుమారు రూ.4,835 కోట్లు) సమీకరించింది. కోటక్ డేటా సెంటర్ ఫండ్ కింద 800 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నట్టు కోటక్ బ్యాంక్‌కు చెందిన కోటక్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్ (కేఐఏ) ప్రకటించింది.
దేశంలో డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టే మొదటి ప్రత్యేక ఫండ్ ఇదేనని తెలిపింది. ప్రస్తుతం దేశంలో ఉన్న డేటా సెంటర్ సామర్థ్యం మన అవసరాల కంటే తక్కువగానే ఉన్నట్టు కేఐఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాహుల్‌షా పేర్కొన్నారు. ‘‘ఇది భారీ పెట్టుబడులు అవసరమైన రంగం. కనుక భారీ ఈక్విటీ పెట్టుబడుల అవకాశాలు ఉంటాయని మేం భావిస్తున్నాం’’అని చెప్పారు.
(ఇదీ చదవండి: మనకు ఎడాదికొక ఎలక్ట్రిక్ కారు.. వోల్వో ప్రామిస్!)
Comments
Please login to add a commentAdd a comment