Kotak Bank
-
కోటక్ బ్యాంక్‌పై హిండెన్‌బర్గ్ ఆరోపణలు
అదానీ గ్రూప్ సంస్థలపై చేసిన ఆరోపణలకుగాను అమెరికా షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్‌కు సెబీ షోకాజ్ నోటీసులు పంపింది. ఈ వ్యవహారంపై హిండెన్‌బర్గ్ స్పందిస్తూ కొత్తగా కోటక్ మహీంద్రా బ్యాంక్‌ను వివాదంలోకి లాగింది.సెబీ నోటీసులు అందుకున్న హిండెన్‌బర్గ్ స్పందిస్తూ..‘భారత క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి షోకాజ్ నోటీసులు అందాయి. అదానీ స్టాక్స్‌పై పెట్టుబడుల్లో మేము నిబంధనల్ని పాటించలేదని అందులో ఉంది. సెబీ వ్యాఖ్యల్లో ఏమాత్రం నిజంలేదు. అదానీ గ్రూప్ కృత్రిమంగా స్టాక్ ధరలను పెంచిందని చెప్పిన సమయంలోనే ఆయా కంపెనీల స్టాక్స్ ధరను షార్ట్ చేశామని సెబీకి ఇదివరకే స్పష్టం చేశాం. కానీ నోటీసుల్లో మాత్రం షేర్ల పతనాన్ని ముందే అంచనా వేసి వాటిపై ట్రేడ్ చేసినట్లు ఉంది. ఈ నోటీసులకు అర్థం లేదు. భారత్‌లోని శక్తిమంతమైన వ్యాపారవేత్తల లోపాలను ఎత్తిచూపితే ఇలా నోటీసులు పంపడం సరికాదు’ అని చెప్పింది.‘అదానీ గ్రూప్ అవకతవకల వ్యవహారం భయటకు వచ్చే సమయంలో కోటక్ బ్యాంకు ఆఫ్‌షోర్ ఫండ్(విదేశాల్లో ఏర్పాటు చేసిన ఫండ్ కంపెనీ) ఏర్పాటు చేసింది. దాని సహాయంతో ఓ పెట్టుబడి భాగస్వామి ద్వారా అదానీ స్టాక్స్‌ను షార్ట్ చేశారు. దీనివల్ల కోటక్ బ్యాంకుకు పెద్దగా లాభాలు ఏమి రాలేదు. కానీ, సెబీ జారీ చేసిన షోకాజ్ నోటీసుల్లో ఎక్కడా కోటక్ పేరు గానీ, ఆ సంస్థ బోర్డు సభ్యుల ప్రస్తావన లేదు. సెబీ మరో శక్తిమంతమైన భారత వ్యాపారవేత్తను రక్షించే యోచనలో ఉన్నట్లు స్పష్టమవుతోంది’ అని హిండెన్‌బర్గ్ తెలిపింది.అదానీ షేర్ల షార్ట్ సెల్లింగ్‌లో నిబంధనలు పాటించామని పేర్కొంది. తన ఇన్వెస్టర్లతో ఉన్న సంబంధాలతోనే స్టాక్స్‌ను షార్ట్ చేసి 4.1 మిలియన్ డాలర్ల(రూ.34 కోట్లు) ఆదాయం పొందినట్లు తెలిపింది. అయితే సంస్థ ఖర్చులు, ఇతర వ్యయాలను లెక్కిస్తే తమకు ఏమీ మిగలలేదని స్పష్టం చేసింది.అసలేం జరిగిందంటే..అదానీ గ్రూప్ సంస్థల స్టాక్ ధరలను కృత్రిమంగా పెంచారని హిండెన్‌బర్గ్ తెలిపింది. అందుకోసం కంపెనీకు చెందిన కొన్ని విదేశీ పెట్టుబడిదారుల సహాయం తీసుకున్నారని చెప్పింది. ఈమేరకు 2023 జనవరిలో హిండెన్‌బర్గ్ నివేదిక విడుదల చేసింది. విలువ పెరిగిన షేర్లను తనఖా పెట్టి ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొందిందని ఆరోపించింది. ఆర్థికపరమైన నేరాలకు పాల్పడినట్లు తెలిపింది. యూఏఈ దేశాల్లో అదానీ కుటుంబం పలు డొల్ల కంపెనీలను నియంత్రిస్తోందని చెప్పింది. వీటిద్వారా అవినీతి, అక్రమ నగదు బదలాయింపులకు పాల్పడుతోందని ఆరోపించింది. ఆ ఆరోపణలు వచ్చిన వెంటనే కంపెనీ స్పందించి ఇన్వెస్టర్లలో నమ్మకం కలిగించేందుకు ఎస్బీఐలోని అప్పులను కొంత తీర్చింది. ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టులో విచారణ సైతం జరిగింది.ఇదీ చదవండి: హెచ్డీఎఫ్సీ యూపీఐ సేవలు నిలిపివేత.. ఎప్పుడంటే..ఇదిలాఉండగా, హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలతో కోటక్ మహీంద్రా బ్యాంక్ స్టాక్ ధర మంగళవారం 3.5 శాతం మేర నష్టపోయి రూ.1,745 వద్ద ట్రేడవుతోంది. -
మాజీ మిస్ ఇండియాను పెళ్లి చేసుకున్న ఉదయ్ కోటక్ కుమారుడు
ప్రసిద్ధ కోటక్ బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్‌కోటక్ కుమారుడు జైకోటక్ మాజీ మిస్ ఇండియాను పెళ్లిచేసుకున్నట్లు తెలిసింది. ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం వివాహం జరిగినట్లు కథనాలు వస్తున్నాయి. ముఖేష్ అంబానీ కుటుంబానికి చెందిన ‘అంబానీ_అప్డేట్’ ఇన్‌స్టా హ్యాండిల్లో అంబానీ దంపతులు వివాహానికి హాజరైన చిత్రాలను పోస్ట్ చేసినట్లు తెలిసింది. మే 24, 2023లో జైకోటక్ తనకు కాబోయే భార్య అదితిఆర్య(మాజీ మిస్ ఇండియా) యేల్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేసిందని తన ఎక్స్‌ఖాతాలో పోస్ట్ చేశారు. జైకోటక్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి బీఏ పట్టా పొందారు. అదితిఆర్య దిల్లీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ సాధించింది. 2015లో అదితి మిస్ ఇండియా వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. ఎంబీఏ చదివేందుకు యూఎస్ వెళ్లడానికి ముందు కొన్ని హిందీ, కన్నడ సినిమాలతో పాటు తెలుగులో కల్యాణ్‌రామ్‌తో కలిసి ఇజం సినిమాలో నటించారు. Aditi, my fiancée, completed her MBA from Yale University today. Immensely proud of you @AryaAditi pic.twitter.com/xAdcRUFB0C — Jay Kotak (@jay_kotakone) May 24, 2023 View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update) -
కోటక్ బ్యాంకుకు కొత్త సీఈఓ, ఎండీ నియామకం
దేశీయ దిగ్గజ బ్యాంక్ అయిన కోటక్ మహీంద్రాకు కొత్త సీఈఓ, ఎండీగా అశోక్ వాస్వానీ నియమితులయ్యారు. బ్యాంక్ ఎండీగా ఉదయ్ కోటక్ వైదొలిగిన తర్వాత తాజా నియామకం జరిగింది. వాస్వానీ నియామకానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. షేర్ హోల్డర్లు ఆమోదం తెలపాల్సి ఉందని కోటక్ మహీంద్రా బ్యాంక్ ఓ ప్రకటనలో పేర్కొంది. మూడేళ్ల పాటు ఆయన ఆ పదవిలో ఉంటారు. 2024 జనవరి 1లోగా అశోక్ వాస్వానీ బాధ్యతలు చేపట్టనున్నారు. బ్యాంకింగ్ రంగంలో అశోక్ వాస్వానీకి దాదాపు ముప్పై ఏళ్ల అనుభవం ఉంది. గతంలో అంతర్జాతీయ బ్యాంక్ సిటీ గ్రూప్‌లో పనిచేశారు. బార్క్లేస్ బ్యాంక్‌లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం యూఎస్-ఇజ్రాయెల్ ఏఐ ఫిన్‌టెక్ పగాయా టెక్నాలజీస్ లిమిటెడ్‌కు ప్రెసిడెంట్‌గా ఉన్నారు. అంతేకాదు లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ గ్రూప్, ఎస్పీ జైన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ మేనేజ్మెంట్ (యూకే) బోర్డు సభ్యులుగానూ ఉన్నారు. ప్రథమ్, లెండ్ హ్యాండ్ వంటి దాతృత్వ సంస్థల్లో డైరెక్టర్‌గానూ వ్యవహరిస్తున్నారు. కోటక్ బ్యాంక్ సీఈఓ, ఎండీగా నియమితులు కావడం పట్ల వాస్వానీ సంతోషం వ్యక్తంచేశారు. స్వదేశానికి తిరిగి రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రాబోయే ఐదేళ్లలో ప్రపంచంలోని అగ్రశ్రేణి 3 ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా భారత్‌ను నిలిపే ప్రయాణంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ తనవంతు పాత్ర పోషిస్తుందని చెప్పారు. ప్రపంచస్థాయి బ్యాంకర్ అయిన అశోక్.. కోటక్ బ్యాంక్‌ను అద్భుతంగా తీర్చిదిద్దగలరని ఉదయ్ కోటక్ విశ్వాసం వ్యక్తంచేశారు. కోటక్ బ్యాంక్‌ను ఖాతాదారులకు అనుకూల సంస్థగా మార్చేందుకు అశోక్ అనుభవం అక్కరకొస్తుందని తాత్కాలిక ఎండీ, సీఈఓ దీపక్ గుప్తా పేర్కొన్నారు. -
యువకుడి బ్యాంక్ ఖాతాలో 753 కోట్లు
సాక్షి, చైన్నె: ఇటీవల కాలంగా బ్యాంకు అధికారులు, సిబ్బంది చేస్తున్న పొరబాట్లు, నిర్లక్ష్యం కారణంగా మరొకరి ఖాతాల్లోకి కోట్ల రూపాయలు జమ కావడంతో, ఆ తర్వాత అవి వెనక్కి వెళ్లడం తమిళనాట పరిపాటిగా మారింది. గత నెల కాల్ ట్యాక్సీ డ్రైవర్ రాజ్‌కుమార్ ఖాతాలో ఏకంగా 9 వేల కోట్లను తమిళనాడు మార్కంటైల్ బ్యాంక్ నుంచి జమ అయ్యింది. ఇది మరవక ముందే కొటాక్ మహేంద్ర బ్యాంక్ నుంచి రూ.756 కోట్లు తంజావూరులోని ఓ యువకుడి ఖాతాలోకి వచ్చి చేరింది. ఖాతాదారుల ప్రేమయం లేకుండానే వెనక్కి ఆ మొత్తాలను బ్యాంక్ వర్గాలు తీసుకునేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో శనివారం చైన్నె తేనాంపేటలోని ఓ మెడికల్ షాపులో పని చేస్తున్న మహ్మద్ ఇక్రీష్ అనే యువకుడి ఖాతాలోకి రూ. 753 కోట్ల 44 లక్షలు జమ అయ్యాయి. ఇది చూసిన ఆ యువకుడి బ్యాంకర్లకు సమాచారం ఇవ్వగా, ఏకంగా అతడి ఖాతాను సీజ్ చేసి పడేయడంతో వ్యవహారం మీడియాకు చేరింది. సరైన సమాధానం ఇవ్వకుండా.. మహ్మద్ ఇక్రీష్ శుక్రవారం తన ఖాతా నుంచి ఓ మిత్రుడికి రూ. 2 వేలు, మరో మిత్రుడికి రూ. 100 నగదు బదిలీ చేశాడు. ఆ తర్వాత అతడి బ్యాంక్ ఖాతాలోకి పెద్దఎత్తున నగదు జమ అయినట్లుగా ఎస్ఎంఎస్ వచ్చింది. దీనిని పెద్దగా అతడు పట్టించుకోలేదు. శుక్రవారం ఉదయం తన ఖాతాను చెక్ చేసుకున్నారు. తన ఖాతాలో రూ. 753 కోట్ల 44 లక్షలు బ్యాలెన్స్ ఉండడంతో షాక్‌కు గురయ్యాడు. ఈ విషయంగా సంబంధిత బ్యాంక్ సేవా కేంద్రాన్ని సంప్రదించినా పట్టించుకోలేదు. చివరకు బ్యాంక్ నెంబర్ ఆధారంగా మేనేజర్‌ను సంప్రదించాడు. ఈ సమాచారంతో ఆ బ్యాంక్ వర్గాలు ఆగమేఘాలపై అతడి ఖాతాను సీజ్ చేయడం గమనార్హం. తనకు పెద్దఎత్తున సొమ్ము వచ్చినట్టు సమాచారం ఇస్తే, చివరకు తన ఖాతాను సీజ్ చేశారని, తనకు సరైన సమాధానం ఇవ్వడం లేదంటూ ఆ యువకుడు మీడియా దృష్టికి తీసుకు రావడంతో తాజా వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లయ్యింది. -
రత్తన్‌ఇండియా పవర్లో కొటక్ మహీంద్రా బ్యాంక్ పెట్టుబడులు
ముంబై: రెండు అనుబంధ సంస్థల ద్వారా రత్తన్‌ఇండియా పవర్ లిమిటెడ్(ఆర్ఐపీఎల్)లో రూ. 732 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు కొటక్ మహీంద్రా బ్యాంక్ వెల్లడించింది. మార్పిడిరహిత డిబెంచర్ల(ఎన్సీడీఏలు) జారీ ద్వారా చేపట్టిన తాజా పెట్టుబడులతో బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్ రుణ చెల్లింపు వ్యయాలు తగ్గేందుకు వీలు చిక్కనున్నట్లు పేర్కొంది. కొటక్ స్ట్రాటజిక్ సిట్యుయేషన్స్ ఇండియా ఫండ్–2 ద్వారా రూ. 582 కోట్లు, కొటక్ ప్రయివేట్ క్రెడిట్ ఫండ్(కేపీసీఎఫ్) ద్వారా రూ. 150 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు తెలియజేసింది. తగిన రిస్క్ సర్దుబాటు చేసిన రాబడుల కోసం క్యాపిటల్ స్టాక్‌లో పాల్గొన్న తమ కొత్త క్రెడిట్ ఫండ్స్ నుంచి ఇది మొదటి పెట్టుబడి అని కోటక్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీని శ్రీనివాసన్ పేర్కొన్నారు.ృ -
డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టే మొదటి ప్రత్యేక ఫండ్ ఇదే...
ముంబై: దేశంలో డేటా సెంటర్ల వ్యాపారంపై పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా కోటక్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ రూ.590 మిలియన్ డాలర్లు (సుమారు రూ.4,835 కోట్లు) సమీకరించింది. కోటక్ డేటా సెంటర్ ఫండ్ కింద 800 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నట్టు కోటక్ బ్యాంక్‌కు చెందిన కోటక్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ (కేఐఏ) ప్రకటించింది. దేశంలో డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టే మొదటి ప్రత్యేక ఫండ్ ఇదేనని తెలిపింది. ప్రస్తుతం దేశంలో ఉన్న డేటా సెంటర్ సామర్థ్యం మన అవసరాల కంటే తక్కువగానే ఉన్నట్టు కేఐఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాహుల్‌షా పేర్కొన్నారు. ‘‘ఇది భారీ పెట్టుబడులు అవసరమైన రంగం. కనుక భారీ ఈక్విటీ పెట్టుబడుల అవకాశాలు ఉంటాయని మేం భావిస్తున్నాం’’అని చెప్పారు. (ఇదీ చదవండి: మనకు ఎడాదికొక ఎలక్ట్రిక్ కారు.. వోల్వో ప్రామిస్!) -
కోటక్, ఇండస్ ఇండ్ బ్యాంకులకు ఆర్బీఐ షాక్!
ముంబై: కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్‌లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రూ.కోటి చొప్పున జరిమానా విధించింది. రెగ్యులేటరీ నిబంధనలు పాటించకపోవడం దీనికి కారణమని పేర్కొంది. నాలుగు సహకార బ్యాంకులపై కూడా జరిమానాను విధించినట్లు సెంట్రల్ బ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది. డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ స్కీమ్, 2014కి సంబంధించిన కొన్ని నిబంధనలను ఉల్లంఘించినందుకు అలాగే కస్టమర్ ప్రొటెక్షన్ బాధ్యతలకు సంబంధించి ఆదేశాలను పాటించనందుకు కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై రూ. 1.05 కోట్ల పెనాల్టీ విధించినట్లు ప్రకటన పేర్కొంది. నిర్దిష్ట నో యువర్ కస్టమర్ (కేవైసీ) నిబంధనలను పాటించనందుకు ఇండస్ఇండ్ బ్యాంక్‌పై రూ. 1 కోటి జరిమానా విధించినట్లు వివరించింది. నవ్ జీవన్ కో–ఆపరేటివ్ బ్యాంక్, బలంగీర్ జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్, ధాకురియా కోఆపరేటివ్ బ్యాంక్ (కోల్‌కతా), ది పళని కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్‌పై రూ.1 లక్ష నుంచి రూ. 2 లక్షల వరకూ జరిమానా విధించినట్లు తెలిపింది. -
ఐపీఓకి ఓలా,వేల కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంగా సన్నాహాలు
ట్యాక్సీ సేవల దిగ్గజం ఓలా పబ్లిక్ ఇష్యూ యోచనలో ఉంది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేయనుంది. తద్వారా రూ. 7,000–11,000 కోట్ల మధ్య నిధుల సమీకరణ చేపట్టాలని ఓలా మాతృ సంస్ధ ఏఎన్ఐ టెక్నాలజీస్ భావిస్తోంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఇష్యూ నిర్వహణకు సిటీగ్రూప్, కోటక్ మహీంద్రా బ్యాంక్ తదితర ఎంపిక చేసిన సంస్థలతో చర్చలు చేపట్టింది. ఆస్టిన్ జీఐఎస్‌లో టెక్‌మహీంద్రా పెట్టుబడులు న్యూఢిల్లీ: ఆస్టిన్ జీఐఎస్‌లో 13.8 శాతం వాటాను టెక్ మహీంద్రా తన యూఎస్ సబ్సిడరీ (టెక్‌మహీంద్రా ఐఎన్‌సీ) రూపంలో కొనుగోలు చేయనుంది. ఇందుకోసం 1.25 మిలియన్ డాలర్లు (రూ.9.37కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది. ఐవోటీ/5జీ విభాగంలో సేవల విస్తరణకు ఈ కొనుగోలు తోడ్పడనుందని కంపెనీ ప్రకటించింది. -
కోటక్ బ్యాంక్ లాభం అప్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 32 శాతం ఎగసి రూ. 1,642 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 1,244 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 7,685 కోట్ల నుంచి రూ. 8,063 కోట్లకు పుంజుకుంది. అయితే నికర వడ్డీ ఆదాయం రూ. 6,912 కోట్ల నుంచి రూ. 6,480 కోట్లకు నీరసించింది. స్థూల మొండి బకాయిలు(ఎన్పీఏలు) 2.7 శాతం నుంచి 3.56 శాతానికి పెరిగాయి. నికర ఎన్పీఏలు సైతం 0.87% నుంచి 1.28 శాతానికి పెరిగాయి. కాగా.. మొండి రుణాలకు కేటాయింపులు రూ. 962 కోట్ల నుంచి స్వల్పంగా తగ్గి రూ. 935 కోట్లకు పరిమితమయ్యాయి. ఫలితాల నేపథ్యంలో షేరు ఎన్ఎస్ఈలో 1% లాభంతో రూ. 1,740 వద్ద ముగిసింది. -
కోటక్ లాభం 2,407 కోట్లు
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో రూ.2,407 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో ఆర్జించిన నికర లాభం(రూ.1,747 కోట్లు)తో పోల్చితే 38 శాతం వృద్ధి సాధించామని కోటక్ మహీంద్రా బ్యాంక్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.10,829 కోట్ల నుంచి రూ.12,543 కోట్లకు పెరిగిందని పేర్కొంది. స్టాండ్అలోన్ పరంగా చూస్తే, గత క్యూ2లో రూ.1,142 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో 51 శాతం వృద్ధితో రూ.1,724 కోట్లకు పెరిగిందని వివరించింది. రూ.3,350 కోట్లకు నికర వడ్డీ ఆదాయం.... పన్ను వ్యయాలు తక్కువగా ఉండటం, నికర వడ్డీ ఆదాయం అధికంగా ఉండటంతో ఈ స్థాయి నికర లాభం సాధించామని కోటక్ మహీంద్రా బ్యాంక్ తెలిపింది. తమ కన్సాలిడేటెట్ లాభంతో అనుబంధ సంస్థల వాటా 28 శాతంగా ఉందని వివరించింది. నికర వడ్డీ ఆదాయం రూ.2,676 కోట్ల నుంచి 25 శాతం వృద్ధితో రూ.3,350 కోట్లకు పెరిగిందని తెలిపింది. గత క్యూ2లో 4.19 శాతంగా ఉన్న నికర వడ్డీ మార్జిన్ ఈ క్యూ2లో 4.61 శాతానికి పెరిగిందని పేర్కొంది. రుణ వృద్ధి 21 శాతం నుంచి 15 శాతానికి తగ్గిందని తెలిపింది. సీక్వెన్షియల్‌గా చూస్తే, ఈ క్యూ1లో రుణ వృద్ధి 18 శాతమని పేర్కొంది. తగ్గిన రుణ నాణ్యత... ఈ బ్యాంక్ రుణ నాణ్యత ఒకింత తగ్గింది. గత క్యూ2లో రూ.4,302 కోట్లుగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో రూ.5,475 కోట్లకు పెరిగాయని బ్యాంక్ పేర్కొంది. అలాగే నికర మొండి బకాయిలు రూ.1,618 కోట్ల నుంచి రూ.2,032 కోట్లకు పెరిగాయని వివరించింది. శాతం పరంగా చూస్తే, స్థూల మొండి బకాయిలు 1.91 శాతం నుంచి 2.17 శాతానికి, నికర మొండి బకాయిలు 0.73 శాతం నుంచి 0.82 శాతానికి పెరిగాయని పేర్కొంది. కేటాయింపులు రూ.360 కోట్ల నుంచి రూ.473 కోట్లకు పెరిగాయని వివరించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్ 0.8 శాతం లాభంతో రూ.1,629 వద్ద ముగిసింది. -
ప్రైవేట్ పెట్టుబడులకు తోడ్పాటునివ్వాలి
ముంబై: వృద్ధి రేటును మరింత మెరుగుపర్చుకోవాలనుకుంటే ప్రైవేట్ పెట్టుబడులకు ఊతమిచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ ఉదయ్ కోటక్ అభిప్రాయపడ్డారు. ఇందుకోసం విధానపరమైన చర్యలు లేదా పన్నుపరమైన ప్రయోజనాలను పరిశీలించవచ్చని ఆయన చెప్పారు. తద్వారా 7 శాతం వృద్ధి దగ్గరే చిక్కుబడిపోకుండా మరింత మెరుగ్గా రాణించేందుకు అవకాశాలు ఉంటాయన్నారు. ఏప్రిల్–సెప్టెంబర్ మధ్యకాలంలో వృద్ధి అంచనాలను రిజర్వ్ బ్యాంక్ 7.2–7.4 శాతానికి పరిమితం చేసిన నేపథ్యంలో కోటక్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి వృద్ధి 7.1 శాతం మాతమ్రే నమోదైంది. మరోవైపు, వ్యవస్థలో ద్రవ్యకొరత కారణంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగ కార్యకలాపాలు దాదాపు స్తంభించిపోయిన నేపథ్యంలో ద్రవ్య లభ్యత మెరుగుపర్చేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉందని ఉదయ్ కోటక్ చెప్పారు. ఇన్ఫ్రా రుణాల సంస్థ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంక్షోభం కారణంగా ప్రస్తుతం పరిస్థితులు మరింత దిగజారాయని.. అయితే ఈ సమస్య వ్యవస్థాగతమైనది కాదని, ఇన్వెస్టర్లు తీవ్ర భయాందోళనలకు గురికావడమే దీనికి కారణమని విశ్లేషించారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సమస్య పరిష్కారానికి ఉదయ్ కోటక్ సారథ్యంలో ప్రభుత్వం కొత్త బోర్డును నియమించింది. -
అదరగొట్టిన కొటక్ మహీంద్ర బ్యాంకు
సాక్షి, ముంబై: మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా దేశీయ ఐదవ అతిపెద్ద రుణదాత కొటక్ మహీంద్రా మూడవ త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. విశ్లేషకుల అంచనాలను అధిగమించి నికరలాభంలో మెరుగైన ప్రదర్శనను కనబపర్చింది. సోమవారం ప్రకటించిన ఫలితాల్లో 23 శాతం వృద్ధిని నమోదు చేసింది. డిసెంబర్ 31తో ముగిసిన మూడవ త్రైమాసికంలో నికర లాభం రూ. 1,291 కోట్లును సాధించింది. అధిక వడ్డీ ఆదాయం తదితర కారణాలతో ఈ వృద్ధిని సాధించింది. మొత్తం ఆదాయం కూడా 27శాతం వృద్ధి చెంది 2939కోట్ల రూపాయల ఆదాయాన్ని నమోదు చేసింది. ఇది అంచనా వేసినదాని కంటే దాదాపు 26కోట్ల రూపాయలు అధికం. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 23 శాతం పుంజుకుని రూ. 2939 కోట్లయ్యింది. నికర వడ్డీ మార్జిన్లు(ఎన్ఐఎం) 4.2 శాతం నుంచి 4.33 శాతానికి పెరిగింది. ఈ త్రైమాసికంలో బ్యాడ్‌లోన్ కేటాయింపులు 50 శాతం పెరిగి 255 కోట్ల రూపాయలకు చేరాయి. మార్క్-టు-మార్కెట్ నష్టాలు రూ. 272 కోట్లు.డిసెంబర్ చివరలో మొత్తం రుణాల మొత్తం శాతం 2.07 శాతానికి నిలవగా, ఇంతకుముందు త్రైమాసికంలో 2.15 శాతం, అంతకుముందు ఏడాది 2.31 శాతంతో పోలిస్తే అస్సెట్ నాణ్యత మెరుగుపడింది. -
అంతర్జాతీయ ట్రెండ్, ఫలితాలే ఆధారం..
న్యూఢిల్లీ: ఈ ఏడాది క్యూ3(అక్టోబర్–డిసెంబర్) కార్పొరేట్ ఫలితాలు.. దేశీ స్టాక్ సూచీలకు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటివరకు వెల్లడైన కంపెనీల ఫలితాలు పర్వాలేదనిపించుకోగా.. ఇండెక్స్ హెవీవెయిట్ అయిన ఐటీసీ ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే అంశంపై మార్కెట్ వర్గాలు దృష్టిసారించాయి. బుధవారం వెల్లడికానున్న ఈ సంస్థ ఫలితాలు.. శుక్రవారం విడుదలకానున్న ఎల్ అండ్ టీ, మారుతీ సుజుకీ ఫలితాలు ఈవారంలో మార్కెట్ ట్రెండ్‌ను ప్రభావితం చేయనున్నాయని భావిస్తున్నారు. మరోవైపు గత శుక్రవారం మార్కెట్ ముగిసిన తరువాత విప్రో.. శనివారం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు వెల్లడికాగా, దీని ప్రభావం సోమవారం మార్కెట్ ప్రారంభంపై కనిపించనుంది. క్యూ3 ఫలితాలతో పాటు కంపెనీల యాజమాన్యం చేసే వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఎపిక్ రీసెర్చ్ సీఈఓ ముస్తఫా నదీమ్ అన్నారు. ఈవారంలో జోరుగా బ్యాంకింగ్ ఫలితాలు.. హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫలితాలు సోమవారం వెల్లడికానున్నాయి. టీవీఎస్ మోటార్ గణాంకాలు మంగళవారం వెల్లడికానుండగా, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ఫలితాలు బుధవారం.. యస్ బ్యాంక్, కాల్గేట్–పామోలివ్ (ఇండియా), అల్ట్రాటెక్ సిమెంట్ క్యూ3 ఫలితాలు గురువారం వెల్లడికానున్నాయి. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాలు పర్వాలేదు.. ‘ఆశాజనక ఫలితాలతో చాలా వరకు ఐటీ కంపెనీలు ఆకట్టుకున్నాయి. ఇప్పటివరకు వెల్లడైన ఐటీ సంస్థల క్యూ3.. అంచనాలను అధిగమించాయి. యాజమాన్యాలు చేసిన వ్యాఖ్యలు కూడా పాజిటివ్‌గానే ఉన్నాయి. ఈ ఫలితాల సీజన్ ఆశాజనకంగా ఉండనుందనే అంశానికి ఇవి సంకేతాలుగా ఉన్నాయి.’ అని ఎస్సెల్ మ్యూచువల్ ఫండ్ సీఐఓ విరల్ బెరవాలా విశ్లేషించారు. అంతర్జాతీయ అంశాలపై దృష్టి.. అమెరికా–చైనాల వాణిజ్య యుద్ధం ముగిసిన సూచనలు ఏవీ కనిపించడం లేదు. ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో ఫిబ్రవరిలో మరోసారి సమావేశమవుతారని ఇప్పటికే వైట్‌హౌస్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో వాణిజ్య యుద్ధం అంశంపై ఇన్వెస్టర్లు ఓ కన్నేసి ఉంచడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు బ్రిటన్ పార్లమెంటులో ప్రధాని థెరెసా మే ప్రభుత్వంపై ప్రతిపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై జరిగిన ఓటింగ్‌లో మే స్వల్ప ఆధిక్యంతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. సోమవారం మరో కొత్త బ్రెగ్జిట్ ఒప్పందాన్ని సభ ముందు ఉంచుతానని స్పష్టం చేశారు. ముడిచమురు ధరల ప్రభావం.. ఒపెక్ సప్లై కోత నిర్ణయాలతో గతకొంతకాలంగా క్రూడ్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 61 డాలర్లను అధిగమించింది. ఈ ర్యాలీ ఇలానే కొనసాగితే, డాలరుతో రూపాయి మారకం విలువపై ఒత్తిడి కలిగించే అవకాశం ఉన్న నేపథ్యంలో మార్కెట్ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తుందని రాయిటర్స్ విశ్లేషించింది. ఈ అంశం ఆధారంగానే వడ్డీ రేట్ల కోతపై వచ్చే ఆర్బీఐ సమావేశంలో నిర్ణయం తీసుకోనుందని వివరించింది. ఎఫ్ఐఐల నికర విక్రయాలు.. ఈఏడాది జనవరి 1–18 కాలంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) భారత మార్కెట్ నుంచి రూ. 4,040 కోట్లను ఉపసంహరించుకున్నట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది. -
కోటక్ బ్యాంక్‌లో బఫెట్ పెట్టుబడులు?
న్యూఢిల్లీ: ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంకులో (కేఎంబీ) ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ గురు వారెన్ బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హాథవే పెట్టుబడులు పెట్టనుందన్న వార్తలు శుక్రవారం మార్కెట్లో హల్చల్ చేశాయి. మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం కేఎంబీలో 10 శాతం వాటాలను బెర్క్‌షైర్ కొనుగోలు చేయాలని భావిస్తోంది. ప్రమోటర్ వాటాలను కొనుగోలు చేయడం లేదా ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ రూపంలో ఈ డీల్ ఉండవచ్చు. ఒప్పందం విలువ సుమారు 4 బిలియన్ డాలర్ల నుంచి 6 బిలియన్ డాలర్ల దాకా (దాదాపు రూ. 28,000 కోట్ల నుంచి రూ. 42,000 కోట్ల దాకా) ఉండొచ్చని అంచనా. ఒకవేళ ఈ డీల్ గానీ పూర్తయితే ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా కేఎంబీలో ప్రమోటర్లు తమ వాటాలను తగ్గించుకోవడం సాధ్యపడుతుంది. సెప్టెంబర్ ఆఖరు నాటికి కేఎంబీలో ప్రమోటరు, వైస్ చైర్మన్ ఉదయ్ కొటక్‌కు 29.73 శాతం వాటాలున్నాయి. ఆర్బీఐ ఆదేశాల ప్రకారం డిసెంబర్ 2018 నాటికల్లా ప్రమోటర్ల వాటాను 20 శాతానికి, 2020 మార్చి నాటికి 15 శాతానికి తగ్గించుకోవాల్సి ఉంది. ప్రస్తుతం కేఎంబీ మార్కెట్ క్యాప్ దాదాపు 34 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ. 2.38 లక్షల కోట్లు) ఉంది. మరోవైపు, ఈ వార్తలపై స్టాక్ ఎక్సే్చంజీలకు కేఎంబీ వివరణనిచ్చింది. బెర్క్‌షైర్ హాథవే తమ బ్యాంకులో వాటాలు కొనుగోలు చేసే ప్రణాళికల గురించి తమ వద్ద సమాచారమేమీ లేదని పేర్కొంది. షేరు 9 శాతం అప్..: బెర్క్‌షైర్ హాథవే పెట్టుబడులు పెడుతున్నట్లు వెలువడిన వార్తలతో శుక్రవారం కోటక్ మహీంద్రా షేర్లు భారీగా ఎగిశాయి. బీఎస్ఈలో ఒక దశలో సుమారు 14 శాతం పెరిగి రూ. 1,345.35 స్థాయిని కూడా తాకింది. చివరికి 8.53 శాతం లాభంతో రూ. 1,282.25 వద్ద క్లోజయ్యింది. మరోవైపు ఎన్ఎస్ఈలో కూడా ఇంట్రాడేలో రూ. 1,345.95 – రూ. 1,176.15 మధ్య తిరుగాడిన షేరు చివరికి 8.84 శాతం లాభంతో రూ. 1,284.55 వద్ద క్లోజయ్యింది. -
కొటక్ బ్యాంక్‌కు జాక్‌పాట్ : భారీ పెట్టుబడులు?
సాక్షి, ముంబై : ప్రయివేట్ రంగ సంస్థ కొటక్ మహీంద్రా బ్యాంక్ కు జాక్ పాట్ తగిలింది. తాజా సమాచారం ప్రకారం గ్లోబల్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ కొటక్ బ్యాంకులో భారీస్థాయి పెట్టుబడులకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు 10శాతం వాటాను కొనుగోలు చేయనున్నారన్న వార్తలు శుక్రవారం నాటి మార్కెట్ లో హల్ చల్ చేశాయి. 400-600 కోట్ల డాలర్లు పెట్టుబడులు కొటక్ మహీంద్రా బ్యాంక్‌లో అమెరికన్ దిగ్గజం వారెన్ బఫెట్ సంస్థ బెర్కషైర్ హాథవే 4-6 బిలియన్ డాలర్లను(రూ. 28,000-42,000 కోట్లు) ఇన్వెస్ట్ చేసే యోచనలో ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. బ్యాంకులో 10 శాతం వాటాను కొనుగోలు చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమోటర్ వాటా నుంచి లేదా ప్రయివేట్ ప్లేస్‌మెంట్‌కింద వాటాను సొంతం చేసుకోనున్నట్లు మీడియా పేర్కొంది. బ్యాంకులో ప్రస్తుతం ఉదయ్ కొటక్‌కు 29.73 శాతం వాటా ఉండగా, మొత్తం ప్రమోటర్ గ్రూప్‌నకు 30.02 శాతం వాటా ఉంది. కొటక్ వివరణ అయితే ఈ వార్తలను కొటక్ మహీంద్రా యాజమాన్యం తిరస్కరించింది. దీనికి సంబంధించి నివేదించడానికి తమ దగ్గర సమాచారం ఏమీ లేదని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. మరోవైపు వారెన్ బఫెట్ కొనుగోలు వార్తలతో ఇన్వెస్టర్లు కొటక్ మహీంద్రా షేర్లను భారీగా కొనుగోలు చేశారు. దాదాపు 10 శాతం జంప్‌చేసి, కంపెనీ వివరణ అనంతరం 7శాతం లాభాలకు పరిమితమైంది. కాగా రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం ఈ డిసెంబర్ 31లోగా ప్రమోటర్ల వాటాను 20 శాతానికి పరిమితం చేసుకోవలసి ఉంది. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంకు కొటక్ మహీంద్రాను ఇప్పటికే ఆదేశించింది. అలాగే 2020 మార్చి 31 నాటికి 15 శాతానికి ప్రమోటార్ల వాటాను తగ్గించుకోవాలని కూడా ఆర్బీఐ కోరింది. -
కోటక్ బ్యాంకు లాభం 21% వృద్ధి
న్యూఢిల్లీ: కోటక్ మహీంద్రా బ్యాంకు సెప్టెంబర్ క్వార్టర్‌కు సంబంధించి ఆశాజనక ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్ (బ్యాంకుతో పాటు ఇతర సబ్సిడరీలు కలసి) లాభం 21.3 శాతం వృద్ధితో రూ.1,747 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ ఆదాయం సైతం రూ.10,829 కోట్లకు పెరిగింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.1,440 కోట్లు, ఆదాయం రూ.9,140 కోట్లుగా ఉన్నాయి. నికర వడ్డీ ఆదాయం, ఫీజుల ద్వారా ఆదాయం పెరగడం కలిసొచ్చింది. కానీ, బ్యాంకు నికర వడ్డీ మార్జిన్ మాత్రం 4.4 శాతం నుంచి 4.2 శాతానికి తగ్గింది. బ్యాంకు ఆస్తుల నాణ్యత మెరుగుపడింది. స్థూల ఎన్పీఏలు 1.91 శాతానికి తగ్గాయి. క్రితం ఏడాది సెప్టెంబర్ క్వార్టర్లో ఇవి 2.14 శాతంగా ఉన్నాయి. విలువ పరంగా చూస్తే స్థూల ఎన్పీఏల మొత్తం రూ.4,302 కోట్లు. నికర ఎన్పీఏలు సైతం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 1.08 శాతం (రూ.2,036 కోట్లు) నుంచి 0.73 శాతానికి (1,617 కోట్లు) తగ్గుముఖం పట్టాయి. ఎన్పీఏలు, కంటింజెన్సీలకు చేసిన నిధుల కేటాయింపులు సైతం రూ.359 కోట్లకు పెరిగాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ కేటాయింపులు రూ.252 కోట్లుగా ఉండడం గమనార్హం. అడ్వాన్స్‌లు, ఇతరత్రా వాటికి చేసిన నిధుల కేటాయింపులు రూ.221 కోట్లుగా ఉన్నట్టు కోటక్ బ్యాంకు తెలిపింది. ఆగస్ట్ 2న 8.10 శాతం పర్పెచ్యుయల్ నాన్ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్లను అర్హులైన ఇన్వెస్టర్లకు కేటాయించడం వల్ల బ్యాంకు పెయిడప్ క్యాపిటల్ పెరిగినట్టు పేర్కొంది. అంచనాలకు సమీపంలో... స్టాండలోన్‌గా చూసుకుంటే కోటక్ మహీంద్రా బ్యాంకు నికర లాభం 15 శాతం పెరిగి రూ.1,141 కోట్లకు చేరింది. కానీ, అనలిస్టులు మాత్రం రూ.1,200 కోట్ల స్థాయిల్లో ఉంటుందని అంచనా వేశారు. ఆదాయం రూ.5,714 కోట్ల నుంచి రూ.7,016 కోట్లకు పెరిగింది. కన్సాలిడేటెడ్‌గా బ్యాంకు వద్ద మిగులు నిల్వలు, క్యాపిటల్ రూ.54,349 కోట్లకు వృద్ధి చెందాయి. సెప్టెంబర్ చివరి నాటికి కన్సాలిడేటెడ్‌గా ఇచ్చిన రుణాల మొత్తం రూ.2.22 లక్షల కోట్లుగా ఉన్నట్టు బ్యాంకు తెలిపింది. బీఎస్ఈలో కోటక్ బ్యాంకు షేరు 1.75 శాతం తగ్గి రూ.1,157.10 వద్ద క్లోజయింది. ముఖ్యాంశాలివీ... రిటైల్ రుణాలు 27.77 శాతం పెరిగి రూ.78,167 కోట్లకు చేరాయి. రెండో త్రైమాసికంలో బ్యాంకు మొత్తం రుణాల్లో రిటైల్ రుణాల వాటా 42 శాతంగా ఉంది. కార్పొరేట్ రుణాలు 17% పెరిగి రూ.1,06,773 కోట్లకు చేరాయి. డిపాజిట్లు 24% వృద్ధితో రూ.2.06 లక్షల కోట్లు. ఇతర ఆదాయం వార్షికంగా 26 శాతం పెరిగి రూ.1,205 కోట్లకు చేరింది. -
మార్చి నాటికి 200 కొత్త శాఖలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో వచ్చే ఏడాది మార్చి నాటికి కొటక్ బ్యాంక్ కొత్తగా 200 బ్రాంచీలను ఏర్పాటు చేయాలని లకి‡్ష్యంచింది. ఐదు బ్రాంచీలు తెలంగాణలో ఏర్పాటు చేయనున్నట్లు కొటక్ బ్యాంక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పునీత్ కపూర్ తెలిపారు. ప్రస్తుతం దేశంలో కొటక్‌కు 1,391 శాఖలు, 2,231 ఏటీఎం కేంద్రాలున్నాయని గురువారమిక్కడ విలేకరులతో చెప్పారు. జూన్ 30 నాటికి దేశంలో సేవింగ్స్ ఖాతా డిపాజిట్లు రూ.66,621 కోట్లు, కాసా డిపాజిట్లు రూ.95,363 కోట్లు, మొత్తం అడ్వాన్స్‌లు రూ.1,76,927 కోట్లుగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణల్లో వృద్ధి..: ప్రస్తుతం ఏపీలో కొటక్‌కు 106 బ్రాంచీలున్నాయి. సేవింగ్ అకౌంట్స్ డిపాజిట్స్ రూ.2,370 కోట్లు. ఏటా 25 శాతం వృద్ధి. కాసా డిపాజిట్లు రూ.2,370 కోట్లుగా ఉన్నాయి. ఏటా 28 శాతం వృద్ధితో మొత్తం అడ్వాన్స్‌లు రూ.3,640 కోట్లుగా ఉన్నాయి. తెలంగాణలో 82 బ్రాంచీలున్నాయి. పొదుపు డిపాజిట్లు రూ.3,807 కోట్లు. కాసా డిపాజిట్లు రూ.5,081 కోట్లు. మొత్తం అడ్వాన్స్‌లు రూ.7,842 కోట్లు ఏటా 14 శాతం వృద్ధిని కనబరుస్తుందని ఆయన తెలిపారు. 811 పొదుపు ఖాతాలో లక్ష నుంచి కోటి రూపాయల జమపై 6 శాతం వడ్డీ రేటును అందిస్తుండటంతో ఖాతాల వృద్ధికి కారణమని ఆయన పేర్కొన్నారు. -
పీఎన్బీ హౌసింగ్‌పై... హెచ్డీఎఫ్సీ, కోటక్ కన్ను!
ముంబై: గృహ రుణాల సంస్థ.. పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్(పీఎన్‌బీహెచ్‌ఎఫ్)లో మెజారిటీ వాటాలు దక్కించుకునేందుకు దిగ్గజాలు హెచ్డీఎఫ్సీ, కోటక్ మహీంద్రా బ్యాంక్ దృష్టి సారించాయి. ఇందులో భాగంగా పీఎన్‌బీహెచ్‌ఎఫ్ యాజమాన్యంతో సమావేశమైనట్లు తెలుస్తోంది. ప్రమోటర్లయిన పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ), ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ కార్లైల్లకు ఉన్న మొత్తం 66% వాటాల కొనుగోలుపై భేటీలో చర్చించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు, దీనిపై బీఎస్ఈ సోమవారం వివరణ కోరగా.. పీఎన్‌బీహెచ్‌ఎఫ్ యాజమాన్యంతో సమావేశం వార్తలను హెచ్డీఎఫ్సీ ఖండించింది. హెచ్డీఎఫ్సీ గతంలో కూడా కెన్‌ఫిన్ హోమ్స్‌లో మెజారిటీ వాటాలను కొనుగోలు చేసేందుకు చర్చలు జరిపింది. కానీ కెన్ ఫిన్ హోమ్స్ ప్రమోటర్లు వాటాల విక్రయ యోచనను పక్కన పెట్టడంతో డీల్ కుదరలేదు. ఒకవేళ పీఎన్‌బీహెచ్‌ఎఫ్ డీల్ గానీ కుదిరితే టేకోవర్ నిబంధనల ప్రకారం మిగతా వాటాల కొనుగోలు కోసం హెచ్డీఎఫ్సీ ప్రత్యేకంగా ఓపెన్ ఆఫర్ ప్రకటించాల్సి ఉంటుంది. అఫోర్డబుల్ హౌసింగ్ విభాగంలో కార్యకలాపాలు విస్తరించేందుకు హెచ్డీఎఫ్సీ రూ. 13,000 కోట్లు సమీకరించింది. పీఎన్‌బీహెచ్‌ఎఫ్‌లో పీఎన్బీ, కార్లైల్‌కి చెరి 33 శాతం వాటాలు ఉన్నాయి. వాటాల విక్రయ డీల్ విలువ సుమారు రూ. 12,000 కోట్ల మేర ఉండొచ్చని.. ఒప్పందం కుదిరిందంటే కార్లైల్‌కి, పీఎన్బీకి చెరి రూ. 6,000 కోట్లు రావొచ్చని అంచనా. దాదాపు రూ. 14,000 కోట్ల నీరవ్ మోదీ కుంభకోణం నేపథ్యంలో వివిధ సంస్థల్లో వాటాలను విక్రయించడంతో పాటు ఇతరత్రా వనరుల ద్వారా కూడా నిధులు సమీకరించేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ రంగ బ్యాంకులను మరింత పటిష్టంగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన సంస్కరణలను అమలు చేసే దిశగా పీఎన్‌బీహెచ్, ఇక్రా, క్రిసిల్, బీఎస్ఈ వంటి సంస్థల్లో తగు సమయంలో తమ వాటాలను విక్రయించనున్నట్లు పీఎన్బీ ఇటీవలే స్టాక్ ఎక్స్చేంజీలకు తెలియజేసింది. అడ్వైజర్ల నియామకంలో ప్రమోటర్లు.. కార్లైల్ ఇప్పటికే వాటాల విక్రయ ప్రక్రియ కోసం అడ్వైజర్‌గా కన్సల్టెన్సీ సంస్థ మోర్గాన్ స్టాన్లీని నియమించుకుంది. మరోవైపు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ప్రస్తుతం ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ని నియమించుకునే ప్రక్రియ ప్రారంభించింది. 2017 నవంబర్‌లో పీఎన్‌బీహెచ్‌ఎఫ్‌లో సుమారు 6 శాతం వాటాలను జనరల్ అట్లాంటిక్ సింగపూర్ ఫండ్ తదితర ఇన్వెస్టర్లకు పీఎన్బీ విక్రయించింది. ఇతరత్రా ఇన్వెస్టర్లలో బిర్లా సన్‌లైఫ్ ఎంఎఫ్, మోతీలాల్ ఓస్వాల్ ఎంఎఫ్, వాసాచ్, టి రోవి ప్రైస్, సింగపూర్ ప్రభుత్వం, ఫిడిలిటీ, ఇన్వెస్కో, రిలయన్స్ ఎంఎఫ్, నొమురా అసెట్ మేనేజ్మెంట్ మొదలైన సంస్థలు ఉన్నాయి. 14 శాతం ఎగిసిన షేరు.. వాటాల విక్రయ వార్తలతో సోమవారం పీఎన్‌బీహెచ్‌ఎఫ్ షేర్లు 14% పైగా పెరిగాయి. బీఎస్ఈలో 14.19% పెరిగి రూ. 1,223.35 వద్ద, ఎన్ఎస్ఈలో 13.89% పెరిగి రూ. 1,221.55 వద్ద షేర్లు క్లోజయ్యాయి. ఒక దశలో బీఎస్ఈలో 15.73% ఎగసి రూ. 1,239.95 స్థాయిని కూడా తాకాయి. మొత్తం మీద కంపెనీ మార్కెట్ విలువ మరో రూ. 2,637 కోట్ల మేర పెరిగి రూ. 20,484 కోట్లకు చేరింది. పీఎన్‌బీహెచ్‌ఎఫ్ ఏయూఎం రూ.62వేల కోట్లు పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్‌కు పశ్చిమ, దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల్లో 84 శాఖలు ఉన్నాయి. వ్యాపారంలో తనఖా ఖాతాల వాటా 70% మేర ఉంటుంది. సంస్థ.. నికర నిరర్ధక ఆస్తుల పరిమాణం 0.25%గాను, నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ రు. 62,252 కోట్లుగాను ఉంది. 2016లో దాదాపు రూ. 3,000 కోట్ల ఐపీవోకి వచ్చినప్పట్నంచి పీఎన్బీ హౌసింగ్ మార్కెట్ విలువ సుమారు రెట్టింపయ్యింది. 2015 ఫిబ్రవరిలో కార్లైల్ రూ.1,600 కోట్లతో 49% వాటా దక్కించుకుంది. ఇటీవలే 5% వాటా విక్రయంతో ప్రస్తుతం పీఎన్బీ హెచ్ ఎఫ్‌లో కార్లైల్ వాటా 33%కి పరిమితమైంది. -
ఏటీఎంల ఇన్ఛార్జే దొంగ..
నేరేడ్మెట్ : కోటక్ మహేంద్ర బ్యాంకు ఏటీఎం లూటీ కేసులో సీసీ కెమెరా ‘ఇంటి దొంగ’ను పట్టించింది. కుషాయిగూడ పోలీసులు చోరీ సొత్తును స్వాధీనం చేసుకొని, నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. నేరేడ్మెట్లోని తన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కుషాయిగూడ ఏసీపీ కష్ణమూర్తితో కలిసి మల్కాజిగిరి డీసీపీ సీహెచ్.ఉమామహేశ్వర శర్మ కేసు వివరాలు వెల్లడించారు. జనగాం జిల్లాకు చెందిన తూడి విఘ్నేష్(28) 15ఏళ్లుగా కీసర మండలం నాగారంలో నివసిస్తున్నాడు. ఐదేళ్లుగా కోటక్ మహేంద్ర గ్రూప్‌లో మల్కాజిగిరి రూట్లో క్యాష్ కస్టోడియన్‌తో పాటు రూట్ ఇన్చార్జిగా పని చేస్తున్నాడు. ఇటీవల విఘ్నేష్‌కు కుషాయిగూడ–ఈసీఐఎల్ రూట్ కోటక్ మహేంద్ర బ్యాంకు ఏటీఎంల ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. తన సంపాదన కుటుంబ పోషణకు సరిపోవడం లేదనే అసంతృప్తితో ఉన్న విఘ్నేష్.. విలాసవంతంగా బతకాలని భావించాడు. ఇందుకు ఏటీఎంలో నగదు చోరీ చేయాలని పథకం వేశాడు. ఇందులో భాగంగా ఈ నెల 9న కుషాయిగూడ ఠాణా పరిధిలోని కమలానగర్ (ఈసీఐఎల్ ప్రధాన రోడ్డు)లోని ఏటీఎంకు వెళ్లాడు. ఏటీఎం తాళాన్ని పగులకొట్టి, అందులోని సుమారు రూ.3,54,500 నగదును దోచుకెళ్లాడు. ఇంటికెళ్లి ఒక బ్యాగ్‌లో డబ్బును దాచిపెట్టాడు. ఎవరికీ అనుమానం రాకుండా విధులకు హాజరయ్యాడు. ఏటీఎంలో నగదు రావడం లేదని బ్యాంకు అధికారులకు కస్టమర్ల నుంచి ఫిర్యాదులు వెళ్లాయి. ఈ విషయమై అధికారులు ఏటీఎంను సందర్శించగా చోరీ జరిగినట్టు తేలింది. ఈ నెల 11న అధికారులు కుషాయిగూడ పోలీసులకు చోరీ విషయమై ఫిర్యాదు చేశారు. పోలీసులు ఏటీఎం కేంద్రం వద్ద సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించగా ఏటీఎం నుంచి నగదు చోరీ చేసింది క్యాష్ కస్టోడియన్ విఘ్నేష్‌గా తేలింది. బుధవారం నిందితుడిని అరెస్టు చేసి, ఇంట్లో దాచిపెట్టిన రూ.3,54,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో కుషాయిగూడ డీఐ రాములు, సీఐచంద్రశేఖర్ పాల్గొన్నారు. -
కోటక్ బ్యాంకు ఫలితాలు భేష్
♦ జూన్ క్వార్టర్లో లాభం 1,347 కోట్లు ♦ 26 శాతం పెరుగుదల ♦ కలిసొచ్చిన సబ్సిడరీల పనితీరు ముంబై: అనుబంధ సంస్థల చక్కని పనితీరు, కోర్ ఆదాయం పెరగడంతో జూన్ త్రైమాసికంలో కోటక్ మహీంద్రా బ్యాంకు మెరుగైన ఫలితాలను ప్రకటించింది. లాభం 26 శాతం వృద్ధితో రూ.1,346.82 కోట్లుగా నమోదైంది. స్టాండలోన్ ప్రాతిపదికన ఆర్జించిన లాభం చూసుకున్నా 23 శాతం వృద్ధితో రూ.913 కోట్లుగా నమోదయింది. నికర వడ్డీ ఆదాయం సైతం 17 శాతం పెరిగి రూ.2,246 కోట్లకు చేరింది. అయినప్పటికీ నికర వడ్డీ మార్జిన్ మాత్రం తగ్గడం గమనార్హం. 0.20 తగ్గి 4.4 శాతానికి పరిమితమైంది. వడ్డీయేతర ఆదాయం రూ.733 కోట్ల నుంచి రూ.906 కోట్లకు వృద్ధి చెందింది. వాహన రుణాల విబాగం ఆదాయం 10 శాతం పెరిగి రూ.132 కోట్లుగా నమోదైంది. కొత్తగా యాప్ ఆధారిత డిజిటల్ సేవింగ్స్ ఖాతాలు, ఇతర సేవలకు సంబంధించి మార్కెటింగ్ కోసం చేసిన వ్యయాల రూపేణా బ్యాంకుపై రూ.63 కోట్ల భారం పడింది. చీఫ్ ఫైనాన్షియల్ అధికారి జైమిన్ భట్ మాట్లాడుతూ... ఎంసీఎల్ఆర్ రేటు మార్జిన్లపై ప్రభావం చూపిందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నికర వడ్డీ మార్జిన్ 4.2–4.3 శాతానికి పరిమితం అవుతుందని చెప్పారు. రుణాల్లో 19 శాతం వృద్ధి నమోదైంది. వాణిజ్య వాహనాలు, నిర్మాణ రంగ ఎక్విప్మెంట్ విభాగాల్లో అధికంగా రుణాలివ్వడమే దీనికి కారణం. పెద్ద కార్పొరేట్లు, కన్జ్యూమర్ రుణాల్లోనూ వృద్ధి నమోదు కావడం గమనార్హం. ఆస్తుల నాణ్యత విçషయానికొస్తే... స్థూల ఎన్పీఏలు 1.07%గా ఉన్నాయి. వీటికి కేటాయించిన నిధులు మాత్రం రూ.232కోట్లకు పెరిగాయి. దివాళా చర్యలకు ఆర్బీఐ గుర్తించిన 12 భారీ ఎన్పీఏ కేసుల్లో నాలుగింటిలో కోటక్ బ్యాంకు వాటా కూడా ఉంది. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబై : కన్సాలిడేషన్ నేపథ్యంలో గురువారం స్టాక్ మార్కెట్లు ఒత్తిడిలో కొనసాగాయి. సెన్సెక్స్ 50.95 పాయింట్ల నష్టంలో 31,904 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 26.30 పాయింట్లు కిందకి పడిపోయి 9,873 వద్ద సెటిలైంది. నేటి ట్రేడింగ్‌లో టాటాస్టీల్, కొటక్ మహింద్రా బ్యాంకు, వీఏ టెక్ వాబ్యాక్, కెనరా బ్యాంకులు టాప్ టూజర్లుగా ఎక్కువగా నష్టాలు గడించాయి. యాక్సిస్ బ్యాంకు, ఓఎన్జీసీలు రెండు సూచీల్లోనూ లాభాలు పండించాయి. కొటక్ మహింద్రా బ్యాంకు, ఐటీ కంపెనీ మైండ్‌ట్రి కంపెనీలు అంచనాలను మిస్ చేయడంతో వీటి షేర్లు నష్టాల్లో కొనసాగగా... వీటితో పాటు ఐటీసీ, ఇన్ఫోసిస్‌లు కూడా ఒత్తిడిలో కొనసాగాయి. మైండ్‌ట్రి, ఇన్ఫోసిస్ కంపెనీ షేర్లు ఒత్తిడిలో కొనసాగడంతో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 0.88 శాతం మేర పడిపోయింది. మరిన్ని కార్పొరేట్ ఫలితాలపై ఇన్వెస్టర్లు ఎక్కువగా దృష్టిసారిస్తున్నారు. దీంతో ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు మార్కెట్ విశ్లేషకులు చెప్పారు. నేడు మార్కెట్ అవర్స్ తర్వాత రానున్న ఫలితాల ప్రకటన నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు కూడా 0.26శాతం నష్టాల్లో ముగిసింది. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 17 పైసలు పడిపోయింది. డాలర్ బలపడుతుండటంతో రూపాయి నష్టాలు పాలై 64.45గా ట్రేడైంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 70 రూపాయల నష్టంలో 28,180 రూపాయలుగా ఉన్నాయి. -
విలీన వార్తలను ఖండించిన యాక్సిస్ బ్యాంకు
ముంబై: దేశంలో మూడో అతిపెద్ద ప్రైవేట్ రంగ సంస్థ యాక్సిస్ బ్యాంక్ ను, మరో ప్రయివేట్ రంగ సంస్థ కొటక్ మహీంద్రా బ్యాంక్ కొనుగోలు చేయనున్నట్టు వార్తలు మార్కెట్ లో హల్ చల్ చేశాయి. తర్వలోనే కొటక్ బ్యాంక్ చేతికిఽ యాక్సిస్ బ్యాంక్ వెళ్లిపోనుందని, ప్రయివేట్ రంగ దిగ్గజ బ్యాంకును కోటక్ స్వాధీనం చేసుకోనుందనే నివేదికలు అటు ఇన్వెస్టర్లు, ఇటు మార్కెట్ వర్గాల్లో ఆందోళన రేపాయి. అయితే ఈ వార్తలను యాక్సిస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ శిఖా శర్మ తీవ్రంగా ఖండించారు. ఇవన్నీ అవాస్తవాలని, నిరాధారమైనవనీ కొట్టి పారేశారు. తాము బ్యాంకింగ్ సేవల్లో అతిపెద్ద కార్పొరేట్ సంస్థగా కొనసాగుతున్నామనీ, విలీనం అయ్యే సమస్యేలేదని స్పష్టం చేశారు. ఇలాంటి స్పెక్యులేషన్స్ని నమ్మవద్దని కోరారు. కొటక్ మహీంద్రా మెర్జర్ ప్రణాళికల్లో ఉన్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకు కొటక్ యాజమాన్యం ఇప్పటికే ప్రభుత్వాన్ని సంప్రదించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాదు యాక్సిస్ టేకోవర్‌కు మరిన్ని దిగ్గజ బ్యాంకులు పావులు కదిపే అవకాశమున్నట్లు పుకార్లు చెలరేగాయి. అసలే డిమానిటైజేషన్ ప్రక్రియలో ఉద్యోగుల అక్రమాలతో ఇబ్బందుల్లో పడ్డ యాక్సిస్ బ్యాంక్ ఈ విలీనం వార్తలతో మరింత చిక్కుల్లో పడ్డట్టయింది. దీంతో మార్కెట్లో సంచలనంగా మారింది. దీంతో యాక్సిస్ బ్యాంక్ షేరు దాదాపు 5.34 శాతం లాభపడగా కొటక్ బ్యాంక్ 0.4 శాతం నష్టపోయినా..చివరలో కోలుకుని 0.24 శాతం లాభాలతో ముగిసింది. -
బ్యాంకుల ‘కుమ్మక్కు’పై కాంపిటీషన్ కమిషన్ దృష్టి
న్యూఢిల్లీ: పొదుపు ఖాతాల వడ్డీ రేట్లపై ఆర్బీఐ నియంత్రణ ఎత్తివేసినప్పటికీ చాలా మటుకు బ్యాంకులు దాదాపు ఒకే రేటును పాటిస్తుండటంపై కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) దృష్టి సారించనుంది. ఈ విషయంలో అవి కుమ్మక్కయ్యాయా అన్న కోణాన్ని పరిశీలించనుంది. శుక్రవారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సీసీఐ చైర్మన్ అశోక్ చావ్లా ఈ విషయాలు తెలిపారు. నియంత్రణ ఎత్తివేతతో వడ్డీ రేట్లను తమ ఇష్టానుసారం మార్చుకునే అవకాశం ఉన్నా కూడా ఇప్పటికీ చాలా మటుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ), మరికొన్ని ఇతర బ్యాంకులు నాలుగు శాతం మాత్రమే ఇస్తున్న సంగతి తమ దృష్టికి వచ్చినట్లు ఆయన చెప్పారు. అవి కుమ్మక్కయ్యే ఇలా చేస్తున్నాయా లేక ఇతరత్రా మరో కారణమేదైనా ఉందా అన్నది పరిశీలిస్తామన్నారు. మరోవైపు, ఆన్లైన్ షాపింగ్ సంస్థలపై ఫిర్యాదుల అంశాన్ని ప్రస్తావిస్తూ.. తమకు ఈ మధ్యనే సంబంధిత సమాచారం చేరిందని ఆయన చెప్పారు. దాని ఆధారంగా తదుపరి విచారణ చేయాల్సిన అవసరం ఉందా లేదా అన్నదానిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. వచ్చే నెలన్నర- రెండు నెలల్లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. సంప్రదాయ షాపులతో పోలిస్తే ఆన్లైన్ రిటైలింగ్ సంస్థలు భారీ డిస్కౌంట్లు ఇస్తుండటం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఏపీలో సిమెంటు సంస్థల కుమ్మక్కుపై ఫిర్యాదు కొట్టివేత.. ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో సిమెంటు కంపెనీలు కుమ్మక్కై సిమెంటు రేట్లు పెంచేశాయన్న ఫిర్యాదును సీసీఐ తోసిపుచ్చింది. ఈ ఆరోపణలను ధృవీకరించేలా తగిన ఆధారాలేమీ లేవని స్పష్టం చేసింది. మేలో ఎన్నికల తర్వాత నెల రోజుల వ్యవధిలో సిమెంట్ కంపెనీలన్నీ కూడబలుక్కుని బస్తాకు రూ. 75 మేర రేట్లను పెంచేశాయని ఫిర్యాదిదారు ఆరోపించారు. మరోవైపు, సిమెంటు దిగ్గజాలు హోల్సిమ్-లఫార్జ్‌ల విలీన ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోవడానికి దాదాపు రెండు నెలలు పడుతుందని సీసీఐ చైర్మన్ అశోక్ చావ్లా చెప్పారు. అటు ఫార్మా దిగ్గజాలు సన్-రాన్‌బ్యాక్సీ డీల్‌పై నెలాఖరులోగా నిర్ణయం తీసుకోగలమని వివరించారు. రాన్‌బాక్సీని దాదాపు 4 బిలియన్ డాలర్లతో సన్‌ఫార్మా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.