హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో వచ్చే ఏడాది మార్చి నాటికి కొటక్ బ్యాంక్ కొత్తగా 200 బ్రాంచీలను ఏర్పాటు చేయాలని లకి‡్ష్యంచింది. ఐదు బ్రాంచీలు తెలంగాణలో ఏర్పాటు చేయనున్నట్లు కొటక్ బ్యాంక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పునీత్ కపూర్ తెలిపారు.
ప్రస్తుతం దేశంలో కొటక్‌కు 1,391 శాఖలు, 2,231 ఏటీఎం కేంద్రాలున్నాయని గురువారమిక్కడ విలేకరులతో చెప్పారు. జూన్ 30 నాటికి దేశంలో సేవింగ్స్ ఖాతా డిపాజిట్లు రూ.66,621 కోట్లు, కాసా డిపాజిట్లు రూ.95,363 కోట్లు, మొత్తం అడ్వాన్స్‌లు రూ.1,76,927 కోట్లుగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
ఏపీ, తెలంగాణల్లో వృద్ధి..: ప్రస్తుతం ఏపీలో కొటక్‌కు 106 బ్రాంచీలున్నాయి. సేవింగ్ అకౌంట్స్ డిపాజిట్స్ రూ.2,370 కోట్లు. ఏటా 25 శాతం వృద్ధి. కాసా డిపాజిట్లు రూ.2,370 కోట్లుగా ఉన్నాయి. ఏటా 28 శాతం వృద్ధితో మొత్తం అడ్వాన్స్‌లు రూ.3,640 కోట్లుగా ఉన్నాయి.
తెలంగాణలో 82 బ్రాంచీలున్నాయి. పొదుపు డిపాజిట్లు రూ.3,807 కోట్లు. కాసా డిపాజిట్లు రూ.5,081 కోట్లు. మొత్తం అడ్వాన్స్‌లు రూ.7,842 కోట్లు ఏటా 14 శాతం వృద్ధిని కనబరుస్తుందని ఆయన తెలిపారు. 811 పొదుపు ఖాతాలో లక్ష నుంచి కోటి రూపాయల జమపై 6 శాతం వడ్డీ రేటును అందిస్తుండటంతో ఖాతాల వృద్ధికి కారణమని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment