new branch
-
లంకతో రూపీలో వాణిజ్యం
కొలంబో: శ్రీలంక రూపీ–భారత్ రూపీ మధ్య వాణిజ్యాన్ని ప్రారంభించినందుకు ఎస్బీఐని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభినందించారు. శ్రీలంక నుంచి లంకన్ రూపీ–భారత్ రూపీలో నేరుగా వాణిజ్యం ప్రారంభించిన తొలి విదేశీ బ్యాంక్‌గా ఎస్బీఐ నిలిచినట్టు చెప్పారు. ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న శ్రీలంకలో మంత్రి సీతారామన్ పర్యటిస్తుండడం తెలిసిందే. నార్తర్న్ ప్రావిన్స్ గవర్నర్ పీఎస్ఎం చార్లెస్‌తో కలసి జాఫ్నా ప్రాంతంలో ఎస్బీఐ రెండో శాఖను మంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖరా, భారత హై కమిషనర్ (శ్రీలంక) గోపాల్ బాగ్లే కూడా పాల్గొన్నారు. ఎస్బీఐ ప్రారంభించిన ఈ నూతన సేవ వల్ల శ్రీలంక దిగుమతిదారులు అమెరికా డాలర్లపై ఆధారపడాల్సిన ఇబ్బంది తప్పుతుందని మంత్రి చెప్పారు. ఇది శ్రీలంక ఆర్థిక వ్యవస్థకు సాయంగా ఉంటుందన్నారు. జాఫ్నా బ్రాంచ్ ద్వారా నార్తర్న్ ప్రావిన్స్‌లో వ్యాపారాలకు ఎస్ బీఐ మద్దతుగా నిలుస్తుందని చెప్పనారు. మంత్రి సీతారామన్ గురువారం ట్రింకోమలేలోనూ ఎస్బీఐ శాఖను ప్రారంభించడం గమనార్హం. తన పర్యటనలో భాగంగా శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, ప్రధాని దినేష్ గుణవర్ధనేతో మంత్రి సీతారామన్ సమావేశమయ్యారు. -
హైదరాబాద్‌లో ఎస్బీఐ యోనో తొలి బ్రాంచ్
హైదరాబాద్: ప్రభుత్వ రంగ ఎస్బీఐ బ్యాంక్ హైటెక్ సిటీలో తొలి యోనో బ్రాంచ్‌ను ప్రారంభించింది. ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్, మేనేజింగ్ డైరెక్టర్ చల్లా శ్రీనివాస్‌లు వర్చువల్ పద్ధతిలో ఈ బ్రాంచిని ఆవిష్కరించారు. ఇది సౌతిండియాలో మొదటిదికాగా, దేశంలో 4వది కావడం విశేషం. ఎస్బీఐ డిజిటల్ బ్యాంకింగ్ సేవలను యోనో ప్లాట్‌ఫామ్ ద్వారా అందించనుంది. బ్రాంచి ఆవిష్కరణ సందర్భంగా హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఓపీ మిశ్రా మాట్లాడుతూ ‘‘యోనో కేవలం ప్రొడెక్ట్ మాత్రమే కాదు. దాదాపు అన్ని బ్యాంక్ సేవలను అందించే వేదిక’’ అన్నారు. -
విశాఖలో ఉబెర్ ఎక్సలెన్స్ సెంటర్
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ప్రముఖ ట్యాక్సీ సేవల సంస్థ ‘ఉబెర్’.. విశాఖపట్నంలో తన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)ను సోమవారం ప్రారంభించింది. ఈ కేంద్రం ఏర్పాటు నిమిత్తం రూ. 5.73 కోట్లను వెచ్చించినట్లు ప్రకటించింది. అత్యవసర సమస్యలను పరిష్కరించడం, ఏదైనా సంఘటన జరిగినప్పుడు వెంటనే స్పందించడం కోసం శిక్షణ పొందిన బృందాలు ఇక్కడ నుంచే నిరంతర సేవలను అందిస్తాయని వివరించింది. ప్రస్తుతం ఈ కేంద్రంలో 70 మంది పనిచేస్తుండగా.. వచ్చే ఏడాది ప్రారంభం నాటికి వీరి సంఖ్యను 120కి పెంచనున్నామని, ఇక ఏడాది చివరినాటికి మొత్తం 500 మందికి ఉపాధి లభించనుందని ప్రకటించింది. ఈ సందర్భంగా సంస్థ సీనియర్ డైరెక్టర్ (కమ్యూనిటీ ఆపరేషన్స్ ఫర్ ఆసియా పసిఫిక్) వెన్ స్జూ లిన్ మాట్లాడుతూ.. ‘కస్టమర్లు, రైడర్లకు పూర్తిస్థాయి మద్దతును అందించడానికి ఏర్పాటుచేసిన ప్రత్యేక కేంద్రం ఇది. హైదరాబాద్‌లో ఇప్పటికే ఉన్న కేంద్రాన్ని విస్తరించడంలో భాగంగా ఇక్కడ సెంటర్‌ను ప్రారంభించం’ అని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో 12వ సెంటర్ భారత్‌లో తన మొదటి కేంద్రాన్ని హైదరాబాద్‌లో 2015లో సంస్థ ఏర్పాటుచేసింది. ప్రస్తుతం 1,000 మంది ఉద్యోగులతో ఉబెర్ రైడర్స్, డ్రైవర్లు, కస్టమర్లు, కొరియర్, రెస్టారెంట్ భాగస్వాములకు ఇక్కడ నుంచే సేవలందిస్తోంది. ఓలాకు పోటీనివ్వడం కోసం తాజాగా రెండవ సెంటర్‌ను విశాఖలో ప్రారంభించింది. ప్రపంచంలోనే కంపెనీకి ఇది 12వ సెంటర్‌గా ప్రకటించింది. అమెరికాలో 2, యూరప్‌లో 4 సీఓఈ కేంద్రాలతో పాటు మధ్యప్రాచ్యం, ఆఫ్రికాల్లో ఇటువంటి కార్యాలయాలనే నిర్వహిస్తోంది. -
మార్చి నాటికి 200 కొత్త శాఖలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో వచ్చే ఏడాది మార్చి నాటికి కొటక్ బ్యాంక్ కొత్తగా 200 బ్రాంచీలను ఏర్పాటు చేయాలని లకి‡్ష్యంచింది. ఐదు బ్రాంచీలు తెలంగాణలో ఏర్పాటు చేయనున్నట్లు కొటక్ బ్యాంక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పునీత్ కపూర్ తెలిపారు. ప్రస్తుతం దేశంలో కొటక్‌కు 1,391 శాఖలు, 2,231 ఏటీఎం కేంద్రాలున్నాయని గురువారమిక్కడ విలేకరులతో చెప్పారు. జూన్ 30 నాటికి దేశంలో సేవింగ్స్ ఖాతా డిపాజిట్లు రూ.66,621 కోట్లు, కాసా డిపాజిట్లు రూ.95,363 కోట్లు, మొత్తం అడ్వాన్స్‌లు రూ.1,76,927 కోట్లుగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణల్లో వృద్ధి..: ప్రస్తుతం ఏపీలో కొటక్‌కు 106 బ్రాంచీలున్నాయి. సేవింగ్ అకౌంట్స్ డిపాజిట్స్ రూ.2,370 కోట్లు. ఏటా 25 శాతం వృద్ధి. కాసా డిపాజిట్లు రూ.2,370 కోట్లుగా ఉన్నాయి. ఏటా 28 శాతం వృద్ధితో మొత్తం అడ్వాన్స్‌లు రూ.3,640 కోట్లుగా ఉన్నాయి. తెలంగాణలో 82 బ్రాంచీలున్నాయి. పొదుపు డిపాజిట్లు రూ.3,807 కోట్లు. కాసా డిపాజిట్లు రూ.5,081 కోట్లు. మొత్తం అడ్వాన్స్‌లు రూ.7,842 కోట్లు ఏటా 14 శాతం వృద్ధిని కనబరుస్తుందని ఆయన తెలిపారు. 811 పొదుపు ఖాతాలో లక్ష నుంచి కోటి రూపాయల జమపై 6 శాతం వడ్డీ రేటును అందిస్తుండటంతో ఖాతాల వృద్ధికి కారణమని ఆయన పేర్కొన్నారు. -
ట్రావెల్స్‌లో ప్రయానించే వారికి శుభవార్త
-
భారత ఉపఖండంలో అల్‌ఖైదా శాఖ!!
అగ్రరాజ్యం అమెరికానే గడగడలాడించిన ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా.. ఇప్పుడు భారత ఉప ఖండంలో కూడా ఓ కొత్త శాఖ తెరిచిందట. ఈ విషయాన్ని స్వయంగా ఆ సంస్థ నాయకుడు ఆయమాన్ అల్ జవహరి ప్రకటించారు. భారత ఉప ఖండంలోనే చిత్రీకరించిన ఓ వీడియో మెసేజిలో ఈ విషయం తెలిపారు. ఆన్లైన్ జీహాదిస్ట్ ఫోరంలో ఈ వీడియో కనిపించింది. ప్రధానంగా బర్మా, బంగ్లాదేశ్‌లతో పాటు.. భారతదేశంలోని కొన్ని భాగాల్లో ముస్లిం ఖలీఫా వ్యవస్థను పునరుద్ధరించడానికి ఈ కొత్త దళం పనిచేస్తుందని ఆ వీడియోలో అల్ జవహరి చెప్పినట్లుంది.