కోటక్ మహీంద్రా బ్యాంక్ తన బ్యాంకింగ్ వ్యవస్థను మెరుగుపరిచే లక్ష్యంతో మెయింటెనెన్స్ సర్వీసులపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపింది. దాంతో కొన్ని బ్యాంకింగ్ సేవలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. కోటక్ వీసా డెబిట్ కార్డు, స్పెండ్జ్ కార్డుకు సంబంధించిన సేవలు కొంత సమయంపాటు అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది. ఈ మెయింటెనెన్స్ సర్వీసులకు సంబంధించి బ్యాంక్ తన ఖాతాదారులకు ఇప్పటికే ఈమెయిల్ ద్వారా సమాచారం అందించింది. సేవల్లో అసౌకర్యాన్ని నివారించడానికి తదనుగుణంగా వారి లావాదేవీలను ప్లాన్ చేసుకోవాలని వినియోగదారులకు సూచించింది.
ఇదీ చదవండి: ఇండిగోకు రూ.115.86 కోట్ల జరిమానా
అంతరాయం ఎప్పుడంటే..
ఫిబ్రవరి 5, 2025, ఫిబ్రవరి 12, 2025న రెండు రోజుల్లో తెల్లవారుజామున 1:00 గంటల నుంచి ఉదయం 5:00 గంటల వరకు నిర్వహణ కార్యకలాపాలు జరుగుతాయని బ్యాంకు పేర్కొంది. ఇన్‌స్టోర్ పీఓఎస్ లావాదేవీలు, ఆన్‌లైన్ లావాదేవీలు, అంతర్జాతీయ ఏటీఎం ఉపసంహరణలు వంటి సేవలు కోటక్ వీసా డెబిట్ కార్డ్, స్పెండ్జ్ కార్డ్ వినియోగదారులకు అందుబాటులో ఉండవని వివరించింది. యూపీఐ, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి ఇతర బ్యాంకింగ్ సేవలపై ప్రభావం ఉండదని బ్యాంక్ తెలిపింది. అంతరాయంలేని బ్యాంకింగ్ అనుభవాన్ని అందించడానికి ఈ మెయింటెనెన్స్ అవసరమని ఖాతాదారులకు బ్యాంక్ హామీ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment