
ఆన్‌లైన్ ట్రాన్సక్షన్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత జేబులో డబ్బులు పెట్టుకునేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దీంతో చాలామంది యూపీఐ వాడుతున్నారు. అయితే బ్యాంక్ ఖాతా ఉన్నవారు యూపీఐ ఐడీ సెట్ చేసుకోవచ్చు. అయితే వారికి డెబిట్ కార్డు ఉండాలి. కానీ బ్యాంకులు అందరికీ.. డెబిట్ కార్డులు ఇవ్వదు. అలాంటి వారు యూపీఐ ఐడీ ఎలా సెట్ చేసుకోవాలో ఇక్కడ చూసేద్దాం.
డెబిట్ కార్డు లేకుండా.. యూపీఐ ఐడీ సెట్ సేసుకోవాలనుకుంటే, ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. అది బ్యాంక్ ఖాతాకు లింక్ అయి ఉండాలి. అంతే కాకుండా ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ కూడా రిజిస్టర్ అయి ఉండాలి. ఆలా ఉన్నప్పుడే.. యూపీఐ ఐడీ సెట్ చేసుకోవాలి.
యూపీఐ పిన్ ఎలా సెట్ చేసుకోవాలంటే?
➤స్మార్ట్‌ఫోన్‌లో యూపీఐ యాప్ ఓపెన్ చేసి, బ్యాంక్ వివరాలను నమోదు చేయాలి.
➤తరువాత యూపీఐ పిన్ సెట్ చేసుకోవడానికి కావాల్సిన ఆప్షన్ ఎంచుకోవాలి.
➤పిన్ సెట్ చేసుకునే ఆప్షన్ ఎంచుకున్నప్పుడు.. అక్కడ మీకు డెబిట్ కార్డు, ఆధార్ ఓటీపీ అనే ఆప్షన్ కనిపిస్తాయి.
➤అక్కడ ఆధార్ ఓటీపీ ఎంపిక చేసుకోవాలి.
➤ధృవీకరణ కోసం ఆధార్ నెంబర్ మొదటి ఆరు అంకెలను ఎంటర్ చేయాలి.
➤ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తరువాత రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
➤ఓటీపీ ఎంటర్ చేసిన తరువాత.. యూపీఐ పిన్ సెట్ చేసుకోమని చూపిస్తుంది. మీకు నచ్చిన ఒక పిన్ సెట్ చేసుకోవచ్చు.
ఇదీ చదవండి: జీఎమ్ఎస్ గోల్డ్ స్కీమ్ నిలిపేసిన ప్రభుత్వం: బ్యాంకులు మాత్రం..
Comments
Please login to add a commentAdd a comment