డెబిట్ కార్డు పోయిందా..ఏటీఎంకు కార్డు తెసుకెళ్లడం మర్చిపోయారా..డెబిట్ కార్డు లేకుండా దూరప్రాంతాలకు వెళ్లారా.. మరేం పర్వాలేదు. మీరు ఉన్న ప్రాంతంలో ఏటీఎం ఉంటే ఎలాంటి డెబిట్ కార్డు లేకుండానే నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే అందుకోసం మీ స్మార్ట్‌ఫోన్‌లో యూపీఐ యాప్ ఉంటే సరిపోతుంది. కార్డు అవసరం లేకుండా యూపీఐ ద్వారా ఎలా డబ్బు విత్‌డ్రా చేయాలో తెలుసుకుందాం.
బ్యాంకింగ్ రంగ సేవల్లో టెక్నాలజీ విస్తరిస్తోంది. అందులో భాగంగా యూపీఐ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఏ చిన్న లావాదేవీలు చేయాలన్నా స్మార్ట్‌పోన్‌లోని యూపీఐని వినియోగిస్తున్నారు. దీన్ని ఉపయోగించి డెబిట్ కార్డు లేకుండానే ఏటీఎంలో డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. అందుకోసం ఇంటర్ ఆపరబుల్ కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రావల్ (ఐసీసీడబ్ల్యూ) విధానం ఉపయోగపడుతుంది. ప్రస్తుతం చాలా బ్యాంకులు ఈ సర్వీసును అందిస్తున్నాయి.
విత్‌డ్రా చేసుకోండిలా..
ముందుగా మీ వద్ద యూపీఐ యాప్ ఇన్‌స్టాల్ చేసిన స్మార్ట్‌ఫోన్ ఉండాలి. ప్రస్తుతం చాలామంది గూగుల్‌పే, ఫోన్‌పే..వంటి యూపీఐ ధర్డ్‌పార్టీ యాప్‌లను వాడుతున్నారు.
మీ బ్యాంకు ఐసీసీడబ్ల్యూ సేవలందిస్తుందో లేదో తనిఖీ చేసుకోవాలి.
ఒకవేళ ఈ సర్వీసు అందుబాటులో ఉంటే ఏటీఎం వద్దకు వెళ్లి స్క్రీన్‌పై ‘యూపీఐ నగదు ఉపసంహరణ’ ఆప్షన్ ఎంచుకోవాలి.
ఏటీఎం ప్రొవైడర్‌ను బట్టి ఈ ఎంపిక విభిన్నంగా ఉండవచ్చు. జాగ్రత్తగా గమనిస్తే సులువుగానే దాన్ని గుర్తించవచ్చు.
యూపీఐ విత్‌డ్రా సెలక్ట్ చేసుకున్నాక క్యూఆర్ కోడ్ డిస్‌ప్లే అవుతుంది.
మీ ఫోన్‌లోని యూపీఐ యాప్ ఓపెన్ చేసి ఏటీఎం స్క్రీన్‌పై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి.
మీరు ఎంత డబ్బు విత్‌డ్రా చేయాలో ఎంటర్ చేసి, యూపీఐ పిన్ ప్రెస్ చేయాలి. (యూపీఐ ద్వారా ఏటీఎం రోజువారీ విత్‌డ్రా పరిమితి సాధారణంగా రూ.10,000గా ఉంటుంది)
కొంత సమయం తర్వాత బ్యాంకు సిస్టమ్ సర్వర్‌తో కనెక్ట్ అయి డబ్బు విత్‌డ్రా అవుతుంది.
ఇదీ చదవండి: కొత్త పెన్షన్ విధానంలోని కీలకాంశాలు..
ఈ ప్రక్రియ వల్ల ఖాతాదారుల వ్యక్తిగత సమాచారానికి ఎలాంటి ప్రమాదం ఉండదు. క్యూఆర్ కోడ్ మీ సమాచారాన్ని రక్షించడానికి ఎన్‌క్రిప్షన్‌ని ఉపయోగిస్తుంది. మీకు మాత్రమే తెలిసిన యూపీఐ పిన్‌తో లావాదేవీని పూర్తి చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment