న్యూఢిల్లీ: రూపే డెబిట్ కార్డులు, తక్కువ విలువ చేసే భీమ్–యూపీఐ లావాదేవీలను ప్రోత్సహించే దిశగా కేంద్ర క్యాబినెట్ బుధవారం రూ. 2,600 కోట్ల స్కీముకు ఆమోదముద్ర వేసింది. దీని కింద ఈ ఆర్థిక సంవత్సరంలో రూపే కార్డులు, యూపీఐని ఉపయోగించి జరిపే పాయింట్ ఆఫ్ సేల్స్, ఈ–కామర్స్ లావాదేవీలను ప్రోత్సహించినందుకు గాను బ్యాంకులకు ప్రోత్సాహకాలు లభిస్తాయి.
అనగా కేంద్రం ఈ పథకం కింద బ్యాంకులకు ఆర్థికసాయాన్ని అందివ్వనుంది. ఈ పథకం ద్వారా బలమైన డిజిటల్ చెల్లింపు వ్యవస్థగా వృద్ధి చెందాలని భావిస్తోంది. వినియోగదారులు వ్యాపారులకు తక్కువ విలువ గల పేమెంట్స్‌ను పోత్సహిస్తుంది. యూపీఐ లైట్, యూపీఐ123పే ద్వారా డిజిటల్ చెల్లింపులను ప్రమోట్ చేస్తుంది. ఈ పథకంతో భారత్ డిజిటల్ చెల్లింపుల విషయంలో మరో ముందడుగు వేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.
చదవండి: టాలెంట్ కోసం విప్రో కీలక నిర్ణయం: ఉద్యోగులకు బంపర్ ఆఫర్
Comments
Please login to add a commentAdd a comment