rupay card
-
రూపే కార్డ్- వీసా కార్డ్ తేడా ఏమిటి? ఏది ఉత్తమం?
ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం ఒకటి. మనదేశంలో ఆన్లైన్ లావాదేవీలతో పాటు డిజిటల్ లావాదేవీలు జరుగుతుంటాయి. నగదు రహిత లావాదేవీల్లో కార్డు చెల్లింపుల ట్రెండ్ ఇటీవలి కాలంలో మరింతగా పెరిగింది. నగదు రహిత విధానంలో కార్డుల సాయంతో పలు రకాల లావాదేవీలు చేయవచ్చు.కార్డుతో లావాదేవీలు జరిపే చాలామందికి రూపే కార్డ్- వీసా కార్డ్ మధ్య తేడాలు ఏమిటో సరిగా తెలియకపోవచ్చు. దీంతో కొత్త కార్డును ఎంపిక చేసుకునే విషయంలో అయోమయానికి గురవుతుంటారు. అందుకే ఈ రెండు కార్డుల మధ్యగల వ్యత్యాసాన్ని గుర్తిస్తూ, ఏ కార్డు ఉత్తమనేది ఇప్పుడు తెలుసుకుందాం.రూపే కార్డ్ భారతదేశంలో విస్తృతంగా ఆమోదం పొందిన కార్డు. దీనిని ఉపయోగించి అంతర్జాతీయ వెబ్సైట్లలో చెల్లింపులు చేయలేం. అయితే వీసా కార్డ్ అనేది దేశీయంగా, అంతర్జాతీయంగా విస్తృతంగా ఆమోదం పొందింది. ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశంలోనూ వీసా కార్డ్ సాయంతో చెల్లింపులు చేయవచ్చు.వీసా కార్డ్ నెట్‌వర్క్‌లతో పోలిస్తే రూపే కార్డ్‌తో చేసే చెల్లింపులకు తక్కువ లావాదేవీ ఛార్జీలు కలిగివుంటాయి. ఈ కార్డ్ ద్వారా జరిగే ప్రతి లావాదేవీ భారతదేశంలోనే ప్రాసెస్ అవుతుంది. ఇక వీసా కార్డ్ అనేది అంతర్జాతీయ చెల్లింపు నెట్వర్క్ అయినందున, లావాదేవీ ప్రక్రియ దేశం వెలుపల జరుగుతుంది. అందుకే రూపేతో పోలిస్తే దీనికి అధికంగా ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది.రూపే కార్డ్ లావాదేవీలు వీసాతో పాటు ఇతర చెల్లింపు నెట్‌వర్క్‌ల కంటే వేగంగా జరగుతాయి. వీసా కార్డ్‌లో లావాదేవీల వేగం రూపేతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. రూపే కార్డ్ ప్రాథమిక లక్ష్యం ముఖ్యంగా దేశంలోని గ్రామీణులకు ఉపయుక్తం కావడం. భారతదేశంలో వీసా కార్డులు టైర్ వన్, టైర్ టూ నగరాల్లో ఎక్కువగా వినియోగంలో ఉన్నాయి.రూపే కార్డ్ - వీసా కార్డ్‌లలో ఏ కార్డ్ ఉత్తమం అనే విషయానికొస్తే అది వినియోగదారుని అవసరాలపై ఆధారపడి ఉంటుంది. ఎవరైనా దేశంలోనే లావాదేవీలు జరుపుతున్నట్లయితే వారికి రూపే కార్డ్ ఉత్తమ ఎంపిక. అంతర్జాతీయంగా లావాదేవీలు చేస్తూ లేదా తరచూ విదేశాలకు వెళుతున్నవారికి వీసా కార్డ్ ఉత్తమం. ఈ కార్డును ప్రపంచంలోని ఏ దేశంలోనైనా వినియోగించేందుకు అవకాశం ఉంటుంది. -
క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? కొత్త ఫీచర్లు మీ కోసమే..
రూపే క్రెడిట్ కార్డు వినియోగదారులకు కొన్ని కొత్త ఫీచర్లు రాబోతున్నాయి. ఈమేరకు యూపీఐ ప్లాట్‌ఫామ్‌కు సంబంధించి వీటిని త్వరలో అమలు చేయబోతున్నట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ప్రకటించింది. రూపే క్రిడిట్ కార్డును వినియోగించి యూపీఐ లావాదేవీలు జురుపుతుంటారు. అయితే సంబంధిత యూపీఐ యాప్‌లోనే ఆ మొత్తాన్ని ఈఎంఐగా మార్చుకునే సదుపాయం కల్పిస్తున్నారు. క్రెడిట్ అకౌంట్ బిల్ పేమెంట్, ఇన్స్టాల్మెంట్ పేమెంట్ ఆప్షన్, లిమిట్ మేనేజ్మెంట్ వంటి ఫీచర్లను సైతం అందుబాటులోకి తీసుకురానున్నారు. రూపే కార్డు అందిస్తున్న బ్యాంకులు లేదా ఇతర సంస్థలు మే 31 కల్లా ఈ ఫీచర్లను అమలులోకి తీసుకురావాలని ఎన్పీసీఐ తెలిపింది. ఇప్పటికే రూపే క్రెడిట్ కార్డులను యూపీఐ లావాదేవీల కోసం అనుసంధానం చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ఫోన్‌పే, గూగుల్ పే వంటి యూపీఐ యాప్స్‌తో కార్డులను లింక్ చేసుకోవచ్చు. ఎన్పీసీఐ తాజా నిర్ణయం వల్ల ఇకపై రూపే క్రెడిట్ కార్డుల వినియోగం మరింత సులభతరం కానుంది. లింక్ చేసిన యూపీఐ యాప్‌లోనే లావాదేవీలను ఈఎంఐగా మార్చుకోవచ్చు. చెల్లింపులు చేసే సమయంలోనే ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులోకి రానుంది. ఈఎంఐ రేట్లకు సంబంధించిన జాబితా కూడా అక్కడే కనిపిస్తుంది. ఇదీ చదవండి: త్వరలో ఆర్బీఐ కొత్త మొబైల్ యాప్.. ఎందుకంటే.. క్రెడిట్ అకౌంట్ బిల్‌పేమెంట్, ఇన్స్టాల్మెంట్ పేమెంట్ ఫీచర్ ద్వారా యూపీఐ యాప్‌లోనే కార్డు బిల్లు చెల్లించొచ్చు. కావాలనుకుంటే ఆటో పే ఆప్షన్ కూడా వినియోగించుకోవచ్చు. ఎప్పుడైనా అవసరం అయితే క్రెడిట్ లిమిట్ పెంచమని బ్యాంక్‌ను నేరుగా యూపీఐ యాప్ ద్వారానే కోరే వెసులుబాటు ఉండనుంది. క్రెడిట్ కార్డు ఔట్ స్టాండింగ్ బిల్, మినమిమ్ బిల్, టోటల్ అమౌంట్, బిల్ డేట్ వంటివి యూపీఐ యాప్‌లోనే తెలుసుకోవచ్చు. -
వీసా,మాస్టర్‌కార్డ్‌తో సమానంగా రూపే కార్డు: మోదీ సర్కార్ సరికొత్త ప్లాన్
న్యూఢిల్లీ: రూపే డెబిట్ కార్డులకు అంతర్జాతీయంగా ఆమోదయోగ్యతను మరింతగా పెంచడంపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) దృష్టి పెడుతోంది. వీసా, మాస్టర్ కార్డ్‌లను ఉపయోగించే వారితో సమానంగా రూపే కార్డుదారులకు కూడా ప్రయోజనాలు ఉండేలా చూసేందుకు ఎన్పీసీఐ ప్రయత్నిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా మరిన్ని అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవడంపై కసరత్తు చేస్తున్నట్లు వివరించాయి. (స్వీట్ కపుల్ సక్సెస్ స్టోరీ: తొలి ఏడాదిలోనే రూ.38 కోట్లు) ప్రస్తుతం అమెరికాకు చెందిన డిస్కవర్, డైనర్స్ క్లబ్.. జపాన్‌కు చెందిన జేసీబీ, పల్స్.. చైనాకు చెందిన యూనియన్ పే సంస్థలకు సంబంధించిన పాయింట్స్ ఆఫ్ సేల్ (పీవోఎస్) మెషిన్ల ద్వారా రూపే కార్డులతో లావాదేవీలు నిర్వహించ డానికి వీలుంటోంది. రూపే జేసీబీ గ్లోబల్ కార్డును జేసీబీ కార్డు చెల్లుబాటయ్యే ఇతర దేశాల్లోని పీవోఎస్‌లు, ఏటీఎంలలోనూ ఉపయోగించవచ్చు. రూపే డెబిట్ కార్డులు, చిన్న మొత్తాల్లో లావాదేవీలకు ఉపయోగపడే ఏకీకృత చెల్లింపుల విధానం.. భీమ్-యూపీఐని ప్రోత్సహించేందుకు కేంద్రం రూ. 2,600 కోట్లతో ప్రత్యేక స్కీమును ఈ మధ్యే ఆమోదించింది. (కేంద్రం గుడ్ న్యూస్: మొబైల్ పోతే..మే 17 నుంచి కొత్త విధానం) -
యూపీఐలో కెనరా బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డ్
హైదరాబాద్: ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ తన రూపే క్రిడెట్ కార్డులను యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) పరిధిలోకి తీసుకొచ్చింది. బ్యాంక్ కస్టమర్లందరూ తమ యాక్టివ్ రూపే క్రెడిట్ కార్డ్‌ను యూపీఐకి అనుసంధానం చేసుకోవచ్చు. ఖాతా ఆధారిత యూపీఐ లావాదేవీల తరహాలోనే కార్డ్‌ని భౌతికంగా వినియోగించకుండానే చెల్లింపులు జరపవచ్చు. పీఓఎస్ మెషీన్లు లేని వ్యాపారులు యూపీఐతో అనుసంధానమైన రూపే క్రెడిట్ కార్డు కలిగి ఉన్న కస్టమర్ల నుంచి చెల్లింపులు పొందవచ్చు. దీనివల్ల చిన్న వ్యాపారులు తక్కువ ఖర్చుతో విక్రయాల టర్నోవర్‌ను, వ్యాపారాన్ని పెంచుకోవచ్చు. -
రూపే కార్డుల ప్రోత్సాహానికి రూ. 2,600 కోట్ల స్కీం!
న్యూఢిల్లీ: రూపే డెబిట్ కార్డులు, తక్కువ విలువ చేసే భీమ్–యూపీఐ లావాదేవీలను ప్రోత్సహించే దిశగా కేంద్ర క్యాబినెట్ బుధవారం రూ. 2,600 కోట్ల స్కీముకు ఆమోదముద్ర వేసింది. దీని కింద ఈ ఆర్థిక సంవత్సరంలో రూపే కార్డులు, యూపీఐని ఉపయోగించి జరిపే పాయింట్ ఆఫ్ సేల్స్, ఈ–కామర్స్ లావాదేవీలను ప్రోత్సహించినందుకు గాను బ్యాంకులకు ప్రోత్సాహకాలు లభిస్తాయి. అనగా కేంద్రం ఈ పథకం కింద బ్యాంకులకు ఆర్థికసాయాన్ని అందివ్వనుంది. ఈ పథకం ద్వారా బలమైన డిజిటల్ చెల్లింపు వ్యవస్థగా వృద్ధి చెందాలని భావిస్తోంది. వినియోగదారులు వ్యాపారులకు తక్కువ విలువ గల పేమెంట్స్‌ను పోత్సహిస్తుంది. యూపీఐ లైట్, యూపీఐ123పే ద్వారా డిజిటల్ చెల్లింపులను ప్రమోట్ చేస్తుంది. ఈ పథకంతో భారత్ డిజిటల్ చెల్లింపుల విషయంలో మరో ముందడుగు వేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. చదవండి: టాలెంట్ కోసం విప్రో కీలక నిర్ణయం: ఉద్యోగులకు బంపర్ ఆఫర్ -
ఈ క్రెడిట్ కార్డ్ కస్టమర్లకు గుడ్‌న్యూస్!
ప్రముఖ క్రెడిట్ కార్డ్ జారీచేసే సంస్థలు ఎస్బీఐ (SBI), ఐసీఐసీఐ (ICICI) బ్యాంక్, (Axis)యాక్సిస్ బ్యాంక్ వచ్చే ఏడాది మార్చి నాటికి `యూపీఐ` సేవలు అందుబాటులోకి తీసుకురానున్నాయి. దీంతో డిజిటల్ పేమెంట్స్ సేవల వినియోగానికి యూజర్లకు అదనపు వెసులుబాటు లభించనుంది. ఇటీవల నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) `రూపే క్రెడిట్ కార్డ్ ఆన్ యూపీఐ` ఫీచర్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీని కింద రోజుకు రూ.50 లక్షల విలువైన లావాదేవీలు జరుగుతున్నాయని ఎన్పీసీఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తెలిపారు. ప్రస్తుతం మూడు ప్రభుత్వ రంగ బ్యాంకులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ప్రైవేట్ రంగ బ్యాంక్ హెడీఎఫ్సీ బ్యాంకులు రూపే క్రెడిట్ కార్డ్ విభాగంలో తన కస్టమర్లు ఈ సేవలను అందిస్తున్నాయి. గత జూన్‌లో యూపీఐ సేవలతో క్రెడిట్ కార్డులను `పే నౌ` ఫెసిలిటీ కింద లింక్ చేసేందుకు ఆర్బీఐ అనుమతించింది. ప్రస్తుతం రోజువారీగా రూ.50 లక్షల విలువైన లావాదేవీలు నమోదవుతుండగా, భవిష్యత్తులో ఇతర అతిపెద్ద క్రెడిట్ జారీ సంస్థలు యూపీఐ సేవలను అందుబాటులోకి తేవడం ద్వారా లావాదేవీలు మరింత పెరుగనున్నాయి. యూపీఐ లావాదేవీలపై రూ.2000 వరకు రూపే క్రెడిట్ కార్డుల వినియోగంపై అదనపు చార్జీలను తొలగిస్తూ ఇటీవలే ఎన్పీసీఐ మార్గదర్శకాలు జారీ చేసింది. చదవండి: ఈ కేంద్ర పథకం గురించి మీకు తెలుసా.. ఇలా చేస్తే రూ.15 లక్షలు వస్తాయ్! -
అందుబాటులోకి కొత్త సేవలు.. ఈ క్రెడిట్ కార్డ్‌తో బోలెడు లాభాలు!
ఆన్లైన్ చెల్లింపులను మరింత ప్రోత్సాహించేందుకు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ సేవలను పొందడం కోసం మీ రూపే క్రెడిట్ కార్డ్ (Rupay credit card)లను భీం యాప్ (BHIM UPI) యాప్‌కి లింక్ చేయాల్సి ఉంటుంది. తద్వారా.. ప్రజలు ఇకపై షాపుల్లో, మాల్స్‌లో షాపింగ్‌తో పాటు మరే ఇతర బిల్లుల చెల్లింపులకు మీ క్రెడిట్ కార్డులను స్వైపింగ్ మిషన్ల వద్ద స్వైప్ చేయాల్సిన అవసరం ఉండుదు. ఎలాగో తెలుసుకుందాం! క్రెడిట్ కార్డ్ లేకపోయినా ..ఈజీగా చెల్లింపులు టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న ప్రతి రంగంలోనే మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే బ్యాంకింగ్లోనూ భారీగానే జరిగాయి. గతంలో ఏ లావాదేవీలకైన కస్టమర్ నేరుగా బ్యాంకులకు వెళ్లాల్సి వచ్చేది. అయితే క్రమంగా కాలం డిజిటల్ యుగం వైపు అడుగుపెడుతోంది. ఈ నేపథ్యంలో ఏటీఎం, క్రెడిట్ కార్డ్, ఆన్లైన్ లావాదేవీలంటూ అంతా కూర్చున్న చోటే చెల్లింపులు జరిగిపోతున్నాయి. కరోనా నుంచి ఆన్లైన్ లావాదేవీలు మరింత పెరిగాయని నివేదికలు కూడా చెప్తున్నాయి. తాజాగా ఎన్పీసీఐ మరో ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. మీరు చేయల్సిందల్లా.. భీం యూపీఐలో మీ రూపే క్రెడిట్ కార్డ్‌ని లింక్ చేయడమే. తద్వారా ఏ చెల్లింపులకైన క్రెడిట్ కార్డు మీ వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. క్రెడిట్ కార్డు లేకుండానే కేవలం భీం యాప్‌కి లింక్ చేసిన మీ యూపీఐ అకౌంట్‌తో ఈజీగా చెల్లింపులు జరుపుకోవచ్చు. ఇటీవల గణనీయంగా పెరుగుతున్న క్రెడిట్ కార్డుల వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీని వల్ల క్రెడిట్ కార్డ్ పోగొట్టుకునే సమస్య ఇకపై ఉండదు. చెల్లింపులు కూడా చాలా సులభతరం కానున్నాయి. ఈ బ్యాంకులకు మాత్రమే.. కేవలం కొన్ని బ్యాంకులకు మాత్రమే భీమ్ యాప్ ద్వారా రూపే క్రెడిట్ కార్డు ఉపయోగానికి ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. అందులో పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్ ఖాతాదారులకు మాత్రమే తొలుత భీం యాప్‌తో రూపె క్రెడిట్ కార్డు సేవలను ఉపయోగించగలరు. ఈ మేరకు గత సెప్టెంబర్ 20న ఎన్పీసీఐ సర్క్యులర్ జారీ చేసింది. చదవండి: ఎలాన్ మస్క్‌కు భారీ ఝలకిచ్చిన ఉద్యోగులు.. ఇప్పుడేం చేస్తావ్! -
రూపే క్రెడిట్ కార్డ్ కస్టమర్లకు శుభవార్త, ఆ ఛార్జీలు లేవండోయ్!
రూపే క్రెడిట్ కార్డ్ కస్టమర్లకు గుడ్‌న్యూస్. ఇకపై రూపే క్రెడిట్ కార్డు ద్వారా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) లావాదేవీలు జరిపితే ఎలాంటి ఛార్జీలు ఉండవని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకటించింది. ఈ నిబంధన రూ.2000 వరకు జరిపే లావాదేవీలకు వర్తిస్తుందని తెలిపింది. రూపే క్రెడిట్ కార్డ్ గత నాలుగు సంవత్సరాలుగా కస్టమర్లకు సేవలు అందిస్తోంది. అన్ని ప్రధాన బ్యాంకులు ఈ కార్డు సేవలను అందిస్తున్నాయి. వీటితో పాటు వాణిజ్య, రిటైల్ విభాగాల కోసం ప్రత్యేకంగా ఇంక్రిమెంటల్ కార్డ్‌లు కూడా జారీ చేస్తున్నాయి. ప్రజల ఆర్థిక వ్యవహారాలలో రూపే కార్డ్ విడదీయరాని బంధం ఏర్పరుచుకుంది. ఆర్బీఐ కొత్త నిబంధన.. ఎలంటి చార్జీలు లేవు! రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూపీఐకి లావాదేవీలకు రూపే క్రెడిట్ కార్డులను లింక్ చేసేందుకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ లింకింగ్ ప్రక్రియ ద్వారా క్రెడిట్ కార్డ్ వినియోగం పెంచాలని భావిస్తోంది ఆర్బీఐ. ఈ నిబంధన వల్ల క్రెడిట్ కార్డులను కస్టమర్లు వారి వర్చువల్ పేమెంట్ అడ్రస్‌కు లింక్ చేస్తారు. దీని ద్వారా.. ఏటీఎం కార్డ్ వినియోగదారలు యూపీఐ లావాదేవీలు ఎలా చేస్తున్నారో, క్రెడిట్ కార్డ్ ఉన్నవారు కూడా తమ క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ నుంచి యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు. ఈ నిబంధన ద్వారా రూ.2,000 లేదా అంతకన్నా తక్కువ లావాదేవీలకు మర్చంట్ డిస్కౌంట్ రేట్ వర్తించదు. అంటే ఎలాంటి ఛార్జీలు ఉండవు. దీని వల్ల తక్కువ మొత్తంలో లావాదేవీలు చేసే కస్టమర్లకు, చిరు వ్యాపారులకు కూడా మేలు జరుగుతుంది. చదవండి: Airtel 5g: ఎయిర్టెల్ యూజర్లకు భారీ షాక్! ఈ ఫోన్లలో 5జీ పనిచేయడం లేదంట! -
యూపీఐ ద్వారా బీఎన్‌పీఎల్
ముంబై: ఇప్పుడు కొనుక్కో– తరువాత చెల్లించు(బయ్ నౌ పే లేటర్–బీఎన్‌పీఎల్) వంటి మరిన్ని ప్రొడక్టులను యూపీఐ ప్లాట్ఫామ్లో భాగం చేయాలంటూ టెక్నాలజీ రంగ వెటరన్ నందన్ నిలేకని పేర్కొన్నారు. యూపీఐ ప్లాట్‌ఫామ్ ద్వారా నిలేకని రుపే క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టారు. ఆర్బీఐ అధికారికంగా అనుమతించడంతో యూపీఐ ప్లాట్‌ఫామ్‌పై రుపే కార్డును నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్(ఎన్పీసీఐ) ఆవిష్కరించింది. ఈ సందర్భంగా యూపీఐ ప్లాట్ఫామ్లో రుపే కార్డ్ విడుదల క్రెడిట్ సేవలకు సంబంధించి ఉపయుక్తమైన తొలి అడుగు అంటూ నిలేకని వ్యాఖ్యానించారు. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్(యూపీఐ) ప్లాట్‌ఫామ్ ఆర్కిటెక్ట్‌లలో ఒకరైన నిలేకని ఆర్బీఐ అనుమతితో భవిష్యత్‌లో విభిన్న రుణ సౌకర్యాలకు తెరలేచే వీలున్నట్లు అంచనా వేశారు. 40.5 కోట్లమంది ప్రజలు యూపీఐను వినియోగిస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రస్తావించారు. కోట్లమందికి బీఎన్‌పీఎల్ తదితర మార్గాలలో డిజిటల్ లావాదేవీలకు వీలు ఏర్పడితే వినియోగదారు రుణాలు బహుముఖాలుగా విస్తరిస్తాయని అభిప్రాయపడ్డారు. -
త్వరలో రూపే క్రెడిట్ కార్డులను యూపీఐ ప్లాట్‌ఫాంకు లింక్
ముంబై: దేశీయంగా మూడో వంతు జనాభా డిజిటల్ చెల్లింపులకు మళ్లితేనే నగదు వినియోగం తగ్గుతుందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఎండీ, సీఈవో దిలీప్ అస్బే తెలిపారు. ప్రస్తుతం ఏకీకృత చెల్లింపుల విధానం (యూపీఐ) వంటి సర్వీసులను జనాభాలో దాదాపు అయిదో వంతు ప్రజలే వినియోగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇదే తీరు కొనసాగితే చలామణీలో ఉన్న నగదు పరిమాణం చెప్పుకోతగ్గ స్థాయిలో తగ్గడానికి 12–18 నెలలు పట్టొచ్చని దిలీప్ చెప్పారు. కొన్నాళ్లుగా ఇటు డిజిటల్ చెల్లింపులు అటు చలామణీలో ఉన్న నగదు (సీఐసీ) పరిమాణం ఒకే తరహాలో పెరుగుతుండటం ఒక పజిల్‌గా మారిన నేపథ్యంలో దిలీప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పెద్ద నోట్ల రద్దు సమయంలో 2016లో స్థూల దేశీయోత్పత్తిలో సీఐసీ 12 శాతంగా ఉండగా .. ప్రస్తుతం ఇది 14 శాతానికి పెరిగింది. సంపన్న దేశాల్లో ఇది సింగిల్ డిజిట్ స్థాయిలోనే ఉంటోంది. దేశీయంగా చిత్రమైన పరిస్థితి నెలకొనడంపై దిలీప్ వివరణ ఇచ్చారు. నగదు బదిలీ స్కీముల వంటి పథకాల సొమ్ము నేరుగా ప్రజల ఖాతాల్లోనే జమ అవుతున్నప్పటికీ వారు డిజిటల్ చెల్లింపులను ఎంచుకోకుండా .. ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా చేసుకుని వాడుకుంటుండటం కూడా సీఐసీ పెరగడానికి ఒక కారణమని ఆయన తెలిపారు. మరోవైపు, భవిష్యత్తులో భారతీయులు రోజుకు వంద కోట్ల పైగా డిజిటల్ చెల్లింపు లావాదేవీలు నిర్వహిస్తారని దిలీప్ చెప్పారు. మరికొద్ది నెలల్లో రూపే క్రెడిట్ కార్డులను యూపీఐ ప్లాట్‌ఫాంనకు అనుసంధానించనున్నట్లు వివరించారు. దీనిపై ఎస్బీఐ కార్డ్స్, బీవోబీ కార్డ్స్, యాక్సిస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ మొదలైన వాటితో చర్చలు జరుగుతున్నాయన్నారు. -
ఎల్ఐసీ పాలసీ దారులకు శుభవార్త.. ఉచితంగా క్రెడిట్ కార్డు!
LIC Policy Holders: ప్రముఖ ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీ తన పాలసీ దారులకు శుభవార్త అందించింది. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ ఆఫ్ ఇండియా) తన కస్టమర్ లేదా పాలసీ హోల్డర్, ఏజెంట్లకు ఉచితంగా క్రెడిట్ కార్డును ఇవ్వనునట్లు తెలిపింది. ఐడీబీఐ బ్యాంక్ సహకారంతో ఎల్ఐసీ సీఎస్ఎల్ ఇటీవల రూపే క్రెడిట్ కార్డును ప్రారంభించింది. ఈ క్రెడిట్ కార్డును లుమైన్ కార్డు, ఎక్లాట్ కార్డుల పేరుతో తీసుకొచ్చింది. ఈ క్రెడిట్ కార్డులు ప్రస్తుతం ఎల్ఐసీ ఏజెంట్లు, సభ్యులు, పాలసీదారులకు ప్రత్యేకంగా ఇస్తుంది. త్వరలో ఈ కార్డులను ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని చూస్తుంది. ఈ క్రెడిట్ కార్డు తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఒకవేళ మీరు ఈ కార్డు ద్వారా ఎల్ఐసీ ప్రీమియం చెల్లించినట్లయితే రెట్టింపు రివార్డ్ పాయింట్లను అందుకుంటారు. అంతేకాక పెట్రోల్ బంకుల వద్ద ఫ్యూయల్ సర్ఛార్జ్ మినహాయింపు కూడా ఉంటుంది. ఈ కార్డుల పలు రకాల ఇతర ప్రయోజనాలను అందిస్తాయని ఎల్ఐసీ చెప్పింది. ఈ రెండు క్రెడిట్ కార్డులను ఎల్ఐసీ, ఐడిబిఐ బ్యాంక్ కలిసి సంయుక్తంగా అందిస్తున్నాయి. మరో ముఖ్యమైన విషయం ఏమింటే ఈ కార్డులకు ఎలాంటి మెంబర్షిప్ ఫీజులు కానీ లేదా యాన్యువల్ ఫీజులు కానీ చెల్లించాల్సివసరం లేదు. ఈ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈ లింకు మీద క్లిక్ చేయండి. ఇతర ప్రయోజనాలు: లూమిన్ కార్డుపై రూ.100 ఖర్చు చేస్తే 3 డిలైట్ పాయింట్లను మీరు పొందవచ్చు. ఎక్లాట్ క్రెడిట్ కార్డుపై రూ.100 ఖర్చు చేస్తే 4 డిలైట్ పాయింట్లు వస్తాయి. ఎల్ఐసీ ఐడీబీఐ ఎక్లాట్ కార్డు హోల్డర్స్‌కు దేశీయ, అంతర్జాతీయ విమానశ్రయాల్లో కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సస్ కూడా లభిస్తుంది. ఈ కార్డుల ద్వారా రూ.400 లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీ చేస్తే 1 శాతం ఫ్యూయల్ సర్ఛార్జ్ రియంబర్స్మెంట్ ఉంటుంది. 3000 కంటే ఎక్కువ మొత్తంలో ఏదైనా కొంటే, వాటిని తేలికగా ఈఎంఐల్లోకి మార్చుకోవచ్చు. ఈ క్రెడిట్ కార్డులకు కూడా యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఉంది. రూ.5 లక్షల వరకు సమ్ అస్యూర్డ్ లభిస్తుంది. మీ పేరుపై ఇప్పటికే ఒక కార్డు ఉన్నప్పటికీ, భవిష్యత్‌లో మరిన్ని యాడ్-ఆన్ కార్డులను మీరు పొందవచ్చు. లూమిన్ క్రెడిట్ కార్డు లిమిట్ రూ. 50వేలు గాను, ఎక్లాట్ క్రెడిట్ కార్డు లిమిట్ రూ.2 లక్షలుగా ఉంది. ఈ కార్డుల యూనిక్ ఫీచర్ ఏమిటంటే ఎలాంటి ప్రాసెసింగ్ కాస్ట్ ఉండదు. ఈ రెండు క్రెడిట్ కార్డుల వ్యాలిడిటీ 4 ఏళ్లుగా ఉంది. (చదవండి: ఇస్మార్ట్ శంకర్ కాదు.. ఇస్మార్ట్ ఎలన్ మస్క్ !) -
రూపే డెబిట్ కార్డు, భీమ్ యూపీఐ యూజర్లకు కేంద్రం తీపికబురు
న్యూఢిల్లీ: డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి కేంద్రం ప్రభుత్వం రూపే డెబిట్ కార్డు, భీమ్ యూపీఐ యూజర్లకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సిద్దం అయ్యింది. ఈ ప్రత్యేక పథకానికి నేడు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు ఐ అండ్ బి మంత్రి అనురాగ్ ఠాకూర్ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ పథకం ఏప్రిల్ 1, 2021 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు అమలులో ఉంటుందని పేర్కొన్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఖజానా మీద సుమారు రూ.1300 కోట్ల మేర భారం పడనుంది. భీమ్-యూపీఐ ద్వారా రూ.2,000 కంటే తక్కువ విలువ లావాదేవీలు చేసే వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వడానికి కేంద్రం సన్నాహాలు చేస్తోంది. దేశంలో డిజిటల్ చెల్లింపు వ్యవస్థను బలోపేతం చేయడానికి బ్యాంకులు రూపే డెబిట్ కార్డు, భీమ్-యుపీఐ ద్వారా డిజిటల్ లావాదేవీలను చేసేవారికి ప్రోత్సాహకలు అందించనున్నాయి. దేశంలో డిజిటల్ చెల్లింపుల ప్రక్రియను మరింత బలోపేతం చేయడానికి ఇది దోహదపడుతుందని మంత్రివర్గం పేర్కొంది. బ్యాంకు సేవలు అందుకోలేనివారు, దిగువ వర్గాలకు డిజిటల్ చెల్లింపులను అందుబాటులోకి తేవడానికి కేంద్రం ప్రయత్నిస్తుంది. ఈ డిజిటల్ ఏకొ సిస్టమ్ లో పేద ప్రజలను భాగస్వామ్యం చేయాలని చూస్తుంది. (చదవండి: సర్వీసు చార్జీల పేరుతో ఎస్బీఐ భారీగా వడ్డీంపు..!) -
బీపీసీఎల్- ఎస్బీఐ క్రెడిట్‌కార్డ్‌తో రివార్డ్ పాయింట్స్
న్యూఢిల్లీ: చమురు మార్కెటింగ్ కంపెనీ బీపీసీఎల్.. ఎస్బీఐ కార్డ్ సంయుక్తంగా రూపే ఆధారిత కాంటాక్ట్‌లెస్ క్రెడిట్‌కార్డ్‌ను గురువారం మార్కెట్లోకి విడుదల చేశాయి. ఇది కో బ్రాండెడ్ క్రెడిట్‌కార్డ్. ఈ కార్డ్‌తో బీపీసీఎల్ ఇంధన స్టేషన్లలో చేసే చెల్లింపులపై ప్రత్యేక రివార్డులను వినియోగదారులు పొందొచ్చు. బీపీసీఎల్ పెట్రోల్ స్టేషన్లలో ప్రతీ రూ.100 కొనుగోలుపై 13ఎక్స్ రివార్డు పాయింట్లు లభిస్తాయి. ఒక శాతం ఫ్యుయల్ సర్చార్జ్ను కూడా రద్దు చేశారు. రూ.4,000 వరకు ఉండే లావాదేవీలకు ఇది వర్తిస్తుంది. -
రూపే కార్డులు : రైల్వే ఉద్యోగులకు సలహా
సాక్షి, న్యూఢిల్లీ : తమ డెబిట్ లేదా ఏటీఎం కార్డులను రూపే ఆధారిత కార్డుల్లోకి మార్చుకోవాలని 12 లక్షలకుపైగా తన ఉద్యోగులకు రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది. ఆత్మనిర్భర్ భారత్ ప్రచారం, డిజిటల్ ఇండియా చొరవల్లో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి పియూష్ గోయెల్ లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దీనితోపాటు దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ రైల్వే ఇప్రెస్ట్ హోల్డర్లకూ ఈ తరహా విజ్ఞప్తినే చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఉద్యోగులు రుపే కార్డులను ఎంచుకునేలా ప్రోత్సహించడానికి ఈ విషయంలో విస్తృత ప్రచారం ఇవ్వడానికి శిబిరాలను ఏర్పాటు చేస్తున్నాయన్నారు.తమ ప్రస్తుత ఇప్రెస్ట్ కార్డులను రూపే కార్డులుగా మార్చుకోవాలని కోరుతోందని తెలిపారు. -
రూపే కార్డు కస్టమర్లకు శుభవార్త
సాక్షి, ముంబై: ముంబై: రూపేకార్డు కస్టమర్లకు నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా శుభవార్త తెలిపింది. వివిధ బ్రాండ్ల కొనుగోళ్లపై ‘‘రూపే ఫెస్టివల్ కార్నివాల్’’ పేరుతో 65 శాతం వరకు డిస్కౌంట్లను ఇస్తున్నట్లు ప్రకటించింది. అమెజాన్, స్విగ్గి, శామ్సంగ్ వంటి టాప్ బ్రాండ్లపై రూపే కార్డు కస్టమర్లు 10-65శాతం వరకు డిస్కౌంట్లను పొందవచ్చు. ఆరోగ్యం, ఫిట్నెస్, ఎడ్యుకేషన్, ఈ–కామర్స్ లాంటి వాటిపైనే కాకుండా ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసరాలైన డైనింగ్, ఫుడ్ డెలివరి, షాపింగ్, ఎంటర్టైన్మెంట్, వెల్నెస్, ఫార్మసీతో పాటు మరికొన్నింటిపైనా ఆకర్షణీయమైన ఆఫర్లను పొం దవచ్చు. సురక్షితమైన, కాంటాక్ట్‌లెస్, క్యాష్‌లెస్ పే మెంట్లను పెంచడమే లక్ష్యమని ఎన్సీసీఐ పేర్కొంది. ‘‘కార్నివాల్ ఆకర్షణీయమైన ఆఫర్లు, డిస్కౌం ట్లు కస్టమర్ల పండుగ సంతోషాల్ని మరింత పెం చుతాయి. ఇదే సమయంలో డిజిటల్, కాంటాక్ట్‌లెస్ పేమెంట్ల సంఖ్య పెరుగుతుంది’’ అని ఎన్పీసీఐ మార్కెటింగ్ చీఫ్ కునాల్ కలవాతియా తెలిపారు. -
ఐఆర్సీటీసీ ఎస్బీఐ రుపే కార్డ్ : ఆఫర్లు
సాక్షి, ముంబై : భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కార్డు వచ్చేసింది. భారతీయ రైల్వే ప్రయాణికులకు గరిష్ట లాభంతోపాటు, రిటైల్, భోజన, వినోదాలపై ప్రయోజనాలు, ఇతర లావాదేవీల మినహాయింపుల అందించేలా ఐఆర్సీటీసీ ఎస్బిఐ కార్డును రుపే ప్లాట్‌ఫాంపై విడుదల చేశాయి.ఈ క్రెడిట్ కార్డు ద్వారా రైల్వేకు సంబంధించిన లావాదేవీలన్నీ డిజిటల్ గా సురక్షితంగా జరుగుతాయని రైల్వే మంత్రి పియూష్ గోయల్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రయోజనాలు నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్ సి)టెక్నాలజీ ద్వారా రైల్వేస్టేషన్‌లోని పీఓఎస్ మిషన్లలో కార్డును స్వైప్ చేయకుండానే కేవలం టచ్ ద్వారా సంబంధింత లావాదేవీలు పూర్తి చేయవచ్చు. 2021 మార్చి వరకు ఎలాంటి ఎంట్రీ రుసుము చెల్లించాల్సిన అవసరంలేదు. ఐఆర్సీటీసీ బుక్ చేసే టికెట్లపై ఒక శాతం డిస్కౌంట్ అందిస్తుంది. కొత్త ఐఆర్సీటీసీ-ఎస్బీఐ రుపే క్రెడిట్ కార్డుతో, వినియోగదారులు టికెట్లు బుక్ చేసుకోవడంతోపాటు ఆన్లైన్ షాపింగ్, డిస్కౌంట్ కూడా పొందవచ్చు. రైలు టిక్కెట్ల కొనుగోలు ద్వారా వచ్చిన రివార్డ్ పాయింట్లను రీడీమ్ చేయవచ్చు. ముఖ్యంగా బిగ్‌బాస్కెట్, ఆక్స్వై, ఫుడ్‌ఫర్ ట్రావెల్.ఇన్, అజియో, మొదలైన వాటిలో షాపింగ్ చేసేటప్పుడు వినియోగదారులు ఆకర్షణీయమైన డిస్కౌంట్లను పొందవచ్చు. మెడ్ లైఫ్ ద్వారా మెడిసిన్స్ పై 20 శాతం దాకా డిస్కౌంట్. వినియోగదారులకు ఆల్‌రౌండ్ షాపింగ్ అనుభవాన్ని మరింతగా పొందేలా కార్లటన్, అరిస్టోక్రాట్, విఐపి, స్కైబ్యాగ్ , కాప్రీస్లలో షాపింగ్ చేసేటప్పుడు 10 శాతం తగ్గింపును అందిస్తోంది. మింత్రాలో 300 రూపాయలు ఆఫర్ క్యూమాత్పై 15 శాతం, బాటాపై 25 శాతం తగ్గింపు ఆఫర్ కూడా ఉంది. వృత్తి, వ్యాపారరీత్యా తరచూ రైలు ప్రయాణం చేస్తున్న వారికి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. ఎన్నో అత్యాధునిక సౌకర్యాలతో పాటు ఏసీ, సెకండ్, థర్డ్ ఏసీ, ఎగ్జిక్యూటివ్ చైర్, ఏసీ కార్ చైర్ వినియోగదారులకు 10శాతం వాల్యూ బ్యాక్ సదుపాయం. ఒక శాతం ఇంధన సర్‌చార్జ్ మినహాయింపు లభిస్తుంది. రైల్వే స్టేషన్లలో మూడు నెలలకు ఒకసారి ఏడాదిలో నాలుగు సార్లు ప్రీమియం లాంజ్ ఉచితం. అలాగే కార్డ్ హోల్డర్లు 350 బోనస్ రివార్డ్ పాయింట్లను అందుకుంటారు. ఈ కార్డు కోసం ఎలా దరఖాస్తు చేయాలి ఎస్బీఐ అధికారిక వెబ్సైట్లో కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి పోర్టల్‌ను సందర్శించాలి. అక్కడ పొందుపర్చిన లింక్‌లో వ్యక్తిగత వివరాలు, మొబైల్ నంబర్, అడ్రస్ ప్రూఫ్ ఎంటర్ చేసి, దరఖాస్తు చేసుకోవాలి. One Credit Card, Multiple Benefits: Introducing IRCTC-SBI Cobranded RuPay Card, that lets you earn rewards while you spend. Discover never-ending benefits on shopping, fuel recharge, train ticket booking & more! 📝 Apply today & enjoy zero issuance fee: https://t.co/aDDkqEElid pic.twitter.com/yQjX3guzGL — Piyush Goyal (@PiyushGoyal) August 27, 2020 -
రూపే కార్డులపై మర్చంట్ డిస్కౌంట్ రేటు తగ్గింపు
ముంబై: రూపే డెబిట్ కార్డు లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేటును క్రమబదీ్ధకరించినట్టు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) ప్రకటించింది. అక్టోబర్ 20 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్), ఈకామ్, భారత్‌క్యూఆర్ కోడ్ ఆధారిత మర్చంట్ లావాదేవీలపై రేట్లను క్రమబదీ్ధకరించినట్టు వివరించింది. రూ.2,000కు పైన ఉండే లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ చార్జీని 0.60 శాతానికి సవరించామని, గరిష్టంగా రూ.150గానే ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం రూ.2,000పైన లావాదేవీలపై 0.90 శాతం వరకు అంటే గరిష్టంగా రూ.1,000 వరకు ఉండేది. ఇక క్యూఆర్ లావాదేవీలపై చార్జీని 0.50 శాతానికి తగ్గించింది. గరిష్ట చార్జీ రూ.150. -
ఎస్బీఐ కార్డు నుంచి త్వరలో రూపే కార్డులు
న్యూఢిల్లీ: క్రెడిట్ కార్డుల సంస్థ ఎస్బీఐ కార్డ్ త్వరలో రూపే పేమెంట్ నెట్వర్క్ ఆధారిత కార్డులను జారీ చేయనుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)తో కుదుర్చుకోవాల్సిన ఒప్పందం ఒకటి ఉందని, ఇది పూర్తయిన వెంటనే రూపే కార్డులకు సంబంధించి కొన్ని ఉత్పత్తులను ప్రవేశపెడతామని ఎస్బీఐ కార్డ్ ఎండీ హర్దయాళ ప్రసాద్ తెలిపారు. జాతీయతా భావం రగులుతున్న నేపథ్యంలో రూపే కార్డులే కావాలని అడుగుతున్న వారి సంఖ్య పెరుగుతోందని ఆయన చెప్పారు. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ జారీ చేసే మూడో వంతు కార్డులు ఇవే ఉంటున్నాయని వివరించారు. దీన్ని బట్టి చూస్తుంటే రూపే కార్డుల వాడకం మరింతగా పెరుగుతుందనడంలో సందేహం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం క్రెడిట్ కార్డుల్లో ఎక్కువ శాతం కార్డులు అమెరికన్ పేమెంట్ గేట్వేస్ వీసా, మాస్టర్‌కార్డ్ ఆధారితమైనవే ఉంటున్నాయి. జూలై ఆఖరు నాటికి ఎస్బీఐ కార్డుకు 90 లక్షల ఖాతాదారులు, 17.9 శాతం మార్కెట్ వాటా ఉంది. 2018 డిసెంబర్ నుంచి ప్రతి నెలా 3 లక్షల కార్డులు అదనంగా జతవుతున్నాయని ప్రసాద్ చెప్పారు. -
బహ్రెయిన్‌కు మీ కోసం వచ్చా
మనామా: బహ్రెయిన్ అభివృద్ధికి ప్రవాస భారతీయులు చేసిన కృషిపై అభినందనలను వింటే తన మనసు సంతోషంతో పొంగిపోతుందని ప్రధాని మోదీ అన్నారు. బహ్రెయిన్‌లోని ప్రవాస భారతీయుల శ్రమను మోదీ ప్రశంసించారు. బహ్రెయిన్‌లో పనిచేస్తున్న భారతీయులను ఉద్దేశించి మోదీ బహ్రెయిన్ జాతీయ స్టేడియంలో ప్రసంగించారు. ‘నేను భారత ప్రధానిగానే ఇక్కడకు వచ్చాను. కానీ ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్న భారతీయులను కలిసి వారితో మాట్లాడటమే’ అని అన్నారు. బహ్రెయిన్ మొత్తం జనాభా దాదాపు 12 లక్షలు కాగా, అక్కడ పనిచేస్తున్న ప్రవాస భారతీయుల సంఖ్యే 3.5 లక్షలు. వీరిలోనూ ఎక్కువ మంది కేరళీయులే. బహ్రెయిన్‌లో పర్యటిస్తున్న తొట్టతొలి భారత ప్రధాని మోదీయే. రూపే కార్డును ఉపయోగించి త్వరలోనే బహ్రెయిన్లోనూ చెల్లింపులు చేసే అవకాశం కల్పిస్తున్నామనీ, ఇందుకు సంబంధించిన అవగాహన ఒప్పందంపై ఇప్పటికే ఇరు దేశాలు సంతకాలు చేశాయని ఆయన తెలిపారు. మోదీకి కింగ్ హమద్ ఆర్డర్ అవార్డు.. బహ్రెయిన్‌తో భారత సంబంధాల బలోపేతానికి కృషి చేస్తున్నందుకు మోదీకి ‘కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ద రినైజన్స్’ అవార్డును బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా ప్రదానం చేశారు. మోదీ పర్యటన సందర్భంగా 250 మంది భారతీయ ఖైదీలను ఆదివారం విడుదల చేసి బహ్రెయిన్ మానవత్వాన్ని చాటుకుంది. బహ్రెయిన్‌లో 200 ఏళ్ల పురాతనమైన శ్రీనాథ్జీ శ్రీకృష్ణుడి ఆలయాన్ని పునరభివృద్ధి చేసేందుకు రూ. 30 కోట్ల విలువైన పనులను మోదీ ఆదివారం ప్రారంభించారు. ఖలీఫాతో మోదీ చర్చలు జరిపిన అనంతరం ఓ సంయుక్త ప్రకటనను రెండు దేశాలు విడుదల చేశాయి. ద్వైపాక్షిక, ప్రాంతీయ, బహుముఖ అంశాలపై వారు చర్చించారు. ఉగ్రవాదంపై నిఘా సమాచారాన్ని పరస్పరం మార్పిడి చేసుకునేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఫ్రాన్స్ చేరుకున్న మోదీ బియారిట్జ్: బహ్రెయిన్ పర్యటనను మోదీ ఆదివారం ముగించుకుని, జీ–7 సదస్సులో పాల్గొనేందుకు ఆదివారం ఫ్రాన్స్‌లోని బియారిట్జ్‌కు చేరుకున్నారు. పర్యావరణం తదితర సమకాలీన అంశాలపై మోదీ ఈ సదస్సులో ప్రసంగించనున్నారు. పలువురు అంతర్జాతీయ స్థాయి నేతలతో ద్వైపాక్షిక భేటీల్లో పాల్గొంటారు. జీ–7 కూటమి దేశాల్లో భారత్ లేకపోయినప్పటికీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ వ్యక్తిగత ఆహ్వానం మేరకు మోదీ ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు. జాన్సన్‌తో భేటీ అయిన మోదీ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో మోదీ ఆదివారం బియారిట్జ్‌లో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై ఇరు ప్రధానులు చర్చలు జరిపారని భారత ప్రధానమంత్రి కార్యాలయం తెలిపిం ది. బ్రిటన్ ప్రధానిగా జాన్సన్ ఎన్నికయ్యాక ఆయనతో మోదీ తొలి భేటీ ఇది. -
జీఎస్టీ గుడ్‌న్యూస్ : డిజిటల్ చెల్లింపులపై క్యాష్‌బ్యాక్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు జరిగాయి. ముఖ్యంగా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకుగాను రూపే, భీమ్ యాప్ చెల్లింపులపై ప్రోత్సాహకాలు లభించనున్నాయి. జీఎస్టీ కౌన్సిల్ భేటీ అనంతరం ఆర్థికమంత్రి పియూష్ గోయల్ ఈ విషయాన్ని ప్రకటించారు. పైలట్ ప్రాజ్జెక్టుగా ముందుగా రాష్ట్రాల్లో దీన్ని అమలు చేయనున్నాయని తెలిపారు. ఆయా రాష్ట్రాలు ప్రయోగాత్మంగా, స్వచ్ఛందంగా ప్రారంభించనున్నాయని తెలిపారు. ఈ పైలట్ ప్రాజెక్టులో సాధించిన ఆదాయం, నష్టం లాంటి అంశాలను అంచనా వేయనున్నామని పేర్కొన్నారు. డిజిటల్ చెల్లింపుల ప్రోత్సహాకాలపై బీహార్ డిప్యూటీముఖ్యమంత్రి సుశీల్ మోదీ నేతృత్వంలోని మంత్రివర్గ బృందం ప్రతిపాదనలకౌన్సిల్ ఆమోదించినట్టు తెలిపారు. ఇది అమల్లోకి వస్తే 20శాతం దాకా క్యాష్‌బ్యాక్ వినియోగదారులకు చెల్లించనున్నామని వెల్లడించారు. మొత్తం జీస్‌ఎటీపై గరిష్టంగా వంద రూపాయలు వరకు పొందవచ్చని గోయల్ చెప్పారు. కౌన్సిల్ తదుపరి సమావేశం సెప్టెంబర్ 28-29తేదీల్లో గోవాలో జరుగనుంది. -
డిజిటల్‌తో దళారులకు బ్రేకులు
న్యూఢిల్లీ: ‘డిజిటల్ ఇండియా’ దళారులు, మధ్యవర్తులకు వ్యతిరేకంగా చేపట్టిన కార్యక్రమమని... ఇది నల్లధనాన్ని, బ్లాక్ మార్కెటింగ్‌ను నియంత్రించడంతోపాటు చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించేందుకు సాయపడిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. డిజిటల్ ఇండియా చర్యలతో లబ్ధి పొందిన పలువురితో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సంభాషించారు. దేశీయతకు చిహ్నమైన రూపే కార్డును డిజిటల్ చెల్లింపుల కోసం వినియోగించుకోవాలని దేశ ప్రజల్ని కోరారు. జనానికి నేరుగా సేవలు... ‘‘డబ్బుల్ని దిండ్ల కింద పెట్టుకునే వారున్న ఈ దేశంలో... దళారులు లేకుండా రేషన్ పొందలేని ఈ దేశంలో... డిజిటల్ చెల్లింపుల గురించి చెప్పినప్పుడు నన్ను ఎగతాళి చేశారు. కానీ, దీనివల్ల సేవలు నేరుగా అందుతున్నాయని లబ్ధిదారులు చెప్పడమే విమర్శకులకు గట్టి సమాధానం. రేషన్ కోసం ఇప్పుడు దళారులు అవసరం లేదు. ప్రజలు తాము కష్టపడిన దానికి ప్రతిఫలాన్ని నేరుగా బ్యాంకు ఖాతాలోనే పొందుతున్నారు. గ్రామాల్లోని పేద రైతులు డీజిటల్ చెల్లింపుల బాట పడుతుండటంతో దళారులు వదంతులను వ్యాప్తి చేస్తున్నారు. డిజిటల్ లావాదేవీలు సురక్షితం కాదని అబద్ధాలు చెబుతున్నారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా డబ్బులు పంపుతుండటంతో వారి వ్యాపారం తగ్గింది’’ అని ప్రధాని వివరించారు. డిజిటల్ ఇండియాతో దళారులకు కమీషన్ కరువైందన్నారు. నల్లధనానికి, బ్లాక్ మార్కెట్‌కు (అక్రమమార్గంలోకి మళ్లించడం), మధ్యవర్తులకు డిజిటల్ ఇండియా అడ్డుకట్ట వేసిందని చెప్పారాయన. దేశాన్ని ముందుకు తీసుకెళ్లడమే తమ కర్తవ్యంగా పేర్కొన్నారు. దేశీ కార్డులను వాడండి ‘‘ప్రభుత్వం తెచ్చిన చెల్లింపుల యాప్ భీమ్ ద్వారా 2017–18 సంవత్సరంలో 10,983 కోట్ల విలువైన 91.5 కోట్ల లావాదేవీలు జరిగాయి. అదే 2016–17లో భీమ్ ద్వారా జరిగిన లావాదేవీల విలువ రూ.695 కోట్లే’’ అని వివరించారు. భీమ్ ద్వారా చెల్లించేందుకు యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోవాల్సిందిగా వర్తకులను, దుకాణదారులపై వినియోగదారులు ఒత్తిడి తేవాలని కోరారు. దేశీయంగా రూపొందించిన రూపే క్రెడిట్/ డెబిట్ కార్డులను వినియోగించాలని లేదంటే ప్రాసెసింగ్ ఫీజులు విదేశీ కంపెనీలకు వెళతాయని చెప్పారాయన. దేశంలో 50 కోట్ల రూపే కార్డులు ఉన్నాయంటూ... ఈ కార్డుల ద్వారా జరిగే లావాదేవీలు రూ.2,347 కోట్లకు పెరిగాయన్నారు. దేశ భక్తి గురించి మాట్లాడేవారు రూపే కార్డును వినియోగించడం వల్ల కూడా దేశానికి ఒక విధంగా సేవ చేయవచ్చని సూచించారు. వెనుకబడిన వర్గాల పురోగతి డిజిటల్ సాక్షరత అభియాన్ కింద 1.25 కోట్ల మందికి శిక్షణ ఇచ్చామని, వీరిలో 70 శాతం షెడ్యూల్డ్ కులాలు, తెగలు, ఇతర వెనుకబడిన తరగతులవారే ఉన్నారని మోదీ చెప్పారు. ఇన్నాళ్లూ వెనుకబడి ఉన్న ఓ పెద్ద సమూహం డిజిటల్ ఇండియా కార్యక్రమం వల్ల పురోగతి చెందుతున్నట్టు తెలుస్తోందన్నారు. ఎలక్ట్రానిక్స్ తయారీతో భారీగా ఉద్యోగాలు ‘‘ప్రభుత్వ ప్రోత్సాహంతో దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 23 ఎలక్ట్రానిక్ తయారీ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. దీంతో 2014లో మొబైల్ హ్యాండ్సెట్లు, వాటి కాంపోనెంట్ల తయారీ కేంద్రాలు 2 మాత్రమే ఉండగా, అవిప్పుడు 120కి పెరిగాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా 4.5 లక్షల మందికి ఉపాధినిస్తున్నాయి’’ అని వివరించారు. రూ.550 కోట్లతో చేపట్టిన బీపీవో ప్రోత్సాహ పథకం వల్ల 2 లక్షల ఉద్యోగాలు సమకూరాయన్నారు. దేశవ్యాప్తంగా మూడు లక్షలకు పైగా ఉన్న కామన్ సర్వీస్ సెంటర్లు డిజిటల్ సేవలందించే ప్రాథమిక కేంద్రాలుగా పనిచేస్తున్నట్టు తెలిపారు. -
ఖాతాదారులందరికీ రూపేకార్డులు
- కేడీసీసీబీ ద్వారా 1.05 లక్షల కార్డులు పంపిణీ లక్ష్యం - 1997కు ముందు రుణ బకాయిదారులకు వన్‌లైమ్ సెటిల్మెంట్ - జిల్లా సహకార కేంద్రబ్యాంకు చైర్మన్ వెల్లడి కర్నూలు(అగ్రికల్చర్): నగదురహిత లావాదేవీల నిర్వహణకు వీలుగా జిల్లా సహకార కేంద్రబ్యాంకు ఖాతాదారులకు రూపే కార్డులు పంపిణీ చేస్తున్నట్లు చైర్మన్ మల్లికార్జునరెడ్డి తెలిపారు. జిల్లాలో 1.05 లక్షల రూపే కార్డులు పంపిణీ చేయాలన్నది లక్ష్యం కాగా ఇప్పటి వరకు 10వేల కార్డులు పంపిణీ చేసినట్లు తెలిపారు. మంగళవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ... రూపే కార్డులు పంపిణీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. రైతులు, ఇతర ఖాతాదారులు సంబంధిత బ్రాంచీల ద్వారా వీటిని పొందవచ్చన్నారు. 2016-17లో రూ.20 కోట్ల కొత్త పంట రుణాలు, రూ. 120 కోట్ల దీర్ఘకాలిక రుణాలు పంపిణీ చేసినట్లు పంపిణీ చేసినట్లు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు స్వల్ప, దీర్ఘకాలిక రుణాల రికవరీ 50శాతం పైగా ఉందని చెప్పిన చైర్మన్ నెలాఖరులోగా 70శాతానికి చేరుతుందన్నారు. నెలాఖరులోగా రుణాలు చెల్లిస్తే అపరాద వడ్డీ ఏమీ ఉండదని చెప్పిన చైర్మన్ గడువులోగా రుణాలు చెల్లించాలని రైతులకు సూచించారు. 1997వ సంవత్సరానికి ముందు రుణాలు తీసుకొని ఇప్పటి వరకు చెల్లించని వారికోసం వన్‌టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. అసలుకు సమానంగా వడ్డీ చెల్లిస్తే పూర్తిగా మాఫీ చేస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బ్యాంకు నిరర్థక ఆస్తులను గణనీయంగా తగ్గించి బ్యాంకు అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు వివరించారు. -
రూపే కార్డ్ ఆవిష్కరణ
- ప్రపంచంలో ఏడవ పేమెంట్ గేట్‌వే - రైల్వే టికెట్లకు ప్రి పెయిడ్ వేరియంట్ న్యూఢిల్లీ: భారత దేశం తన సొంత చెల్లింపుల గేట్‌వే, రూపేను గురువారం ఆవిష్కరించింది. వీసా, మాస్టర్ కార్డ్‌ల మాదిరి ఈ రూపే కార్డ్ కూడా ఏటీఎంల్లో, మర్చంట్ అవుట్లెట్లలో పనిచేస్తుంది. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో భారత అధ్యక్షుడు ప్రణబ్ ముఖర్జీ ఈ కార్డ్‌ను ఆవిష్కరించారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) ఈ రూపే ప్లాట్‌ఫామ్‌ను డెవలప్ చేసింది. ఈ రూపే ప్లాట్‌ఫామ్ ఐసీఐసీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇంకా ఇతర బ్యాంకుల్లో క్లియరింగ్, సెటిల్మెంట్ లావాదేవీలకు ఉపయోగపడుతుంది. ఏటీఎంలు, పాయింట్ ఆఫ్ సేల్స్(పీఓఎస్), ఆన్లైన్ విక్రయాల్లో ఈ రూపే కార్డ్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇది ప్రపంచంలో ఏడో చెల్లింపు విధానం. త్వరలో ఐఆర్‌సీటీ రూపే కార్డ్‌లో ప్రి పెయిడ్ వేరియంట్‌ను అందించనున్నది. రైల్వే టికెట్ల బుకింగ్‌లో ఈ ప్రి పెయిడ్ వేరియంట్ ఉపయోగపడుతుంది. ఈ రూపే కార్డ్‌ను విదేశాలకు కూడా తీసుకెళ్లేందుకు వీలుగా అమెరికాలోని డిస్కవర్ ఫైనాన్షియల్ సర్వీసెస్, జపాన్‌లోని జేడీసీలతో చర్చలు జరుపుతున్నామని ఎన్పీసీఐ చైర్మన్ బాలచంద్రన్. ఎం. చెప్పారు. వీసా, మాస్టర్ కార్డ్ వంటి అంతర్జాతీయ కార్డ్‌లతో పోల్చితే తక్కువ వ్యయానికే ఈ రూపే కార్డ్ అందుబాటులో ఉంటుందని ఆర్థిక సేవల కార్యదర్శి జి. ఎస్. సంధు చెప్పారు.