న్యూఢిల్లీ: డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి కేంద్రం ప్రభుత్వం రూపే డెబిట్ కార్డు, భీమ్ యూపీఐ యూజర్లకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సిద్దం అయ్యింది. ఈ ప్రత్యేక పథకానికి నేడు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు ఐ అండ్ బి మంత్రి అనురాగ్ ఠాకూర్ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ పథకం ఏప్రిల్ 1, 2021 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు అమలులో ఉంటుందని పేర్కొన్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఖజానా మీద సుమారు రూ.1300 కోట్ల మేర భారం పడనుంది.
భీమ్-యూపీఐ ద్వారా రూ.2,000 కంటే తక్కువ విలువ లావాదేవీలు చేసే వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వడానికి కేంద్రం సన్నాహాలు చేస్తోంది. దేశంలో డిజిటల్ చెల్లింపు వ్యవస్థను బలోపేతం చేయడానికి బ్యాంకులు రూపే డెబిట్ కార్డు, భీమ్-యుపీఐ ద్వారా డిజిటల్ లావాదేవీలను చేసేవారికి ప్రోత్సాహకలు అందించనున్నాయి. దేశంలో డిజిటల్ చెల్లింపుల ప్రక్రియను మరింత బలోపేతం చేయడానికి ఇది దోహదపడుతుందని మంత్రివర్గం పేర్కొంది. బ్యాంకు సేవలు అందుకోలేనివారు, దిగువ వర్గాలకు డిజిటల్ చెల్లింపులను అందుబాటులోకి తేవడానికి కేంద్రం ప్రయత్నిస్తుంది. ఈ డిజిటల్ ఏకొ సిస్టమ్ లో పేద ప్రజలను భాగస్వామ్యం చేయాలని చూస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment