సాక్షి, న్యూఢిల్లీ : తమ డెబిట్ లేదా ఏటీఎం కార్డులను రూపే ఆధారిత కార్డుల్లోకి మార్చుకోవాలని 12 లక్షలకుపైగా తన ఉద్యోగులకు రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది. ఆత్మనిర్భర్ భారత్ ప్రచారం, డిజిటల్ ఇండియా చొరవల్లో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి పియూష్ గోయెల్ లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దీనితోపాటు దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బీఐ రైల్వే ఇప్రెస్ట్ హోల్డర్లకూ ఈ తరహా విజ్ఞప్తినే చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఉద్యోగులు రుపే కార్డులను ఎంచుకునేలా ప్రోత్సహించడానికి ఈ విషయంలో విస్తృత ప్రచారం ఇవ్వడానికి శిబిరాలను ఏర్పాటు చేస్తున్నాయన్నారు.తమ ప్రస్తుత ఇప్రెస్ట్ కార్డులను రూపే కార్డులుగా మార్చుకోవాలని కోరుతోందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment