ATM cards
-
టీజీబీలో విలీనం కానున్న ఏపీజీవీబీ తెలంగాణ శాఖలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సేవలందిస్తున్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ) శాఖలన్నీ జనవరి 1 నుంచి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ (టీజీబీ)లోకి విలీనం కాబోతున్నాయి. ‘ఒక రాష్ట్రం– ఒక గ్రామీణ బ్యాంకు’అనే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు అనుగుణంగా తెలంగాణలోని వివిధ జిల్లాల్లో కొనసాగుతున్న ఏపీజీవీబీ 493 శాఖలను విలీనం చేయనున్నారు. 2006లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటైన ఏపీజీవీబీ 771 శాఖలతో సేవలు అందిస్తోంది. అప్పటికే తెలంగాణలో ఉన్న దక్కన్ గ్రామీణ బ్యాంకును రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా మార్పుచేసి శాఖలను విస్తరించారు. ప్రస్తుతం తెలంగాణ గ్రామీణ బ్యాంకు 435 శాఖలతో 18 జిల్లాల్లో సేవలు అందిస్తోంది. ఏపీజీవీబీ తెలంగాణ శాఖల విలీనం తరువాత తెలంగాణలోని 33 జిల్లాల్లో 928 శాఖలుగా టీజీబీ రూపాంతరం చెందనుంది. అతిపెద్ద గ్రామీణ బ్యాంకుల్లో ఒకటిగా.. ఏపీజీవీబీ తెలంగాణ శాఖల విలీనం తరువాత టీజీబీ దేశంలోనే అతిపెద్ద గ్రామీణ బ్యాంకుల్లో ఒకటిగా అవతరించనున్నదని బ్యాంక్ చైర్పర్సన్ వై.శోభ తెలిపారు. విలీన ప్రక్రియ తుదిదశకు చేరిన సందర్భంగా టీజీబీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రస్తుతం రూ.30 వేల కోట్ల టర్నోవర్‌తో ఉన్న టీజీబీ... విలీనం తరువాత రూ.70 వేల కోట్ల టర్నోవర్‌కు చేరుతుందన్నారు.విలీన ప్రక్రియలో భాగంగా ఆస్తులు, అప్పుల పంపకాలు, ఉద్యోగుల ఆప్షన్ల ప్రక్రియ వంటివన్నీ కొలిక్కివచ్చినట్లు తెలిపారు. విలీనం నేపథ్యంలో ఈనెల 28 నుంచి 31 వరకు బ్యాంకు సేవల్లో కొంతమేర అంతరాయం కలుగుతుందని, అయితే ఖాతాదారుల అత్యవసర సేవల కోసం 30, 31 తేదీల్లో వారి ఖాతాల నుంచి రూ.5 వేల వరకు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. జనవరి 1 నుంచి ఖాతాదారులకు సేవలన్నీ అందుబాటులో ఉంటాయని తెలిపారు.ఇక ఏపీజీవీబీ శాఖలకు చెందిన ఖాతాదారులు వారి ఏటీఎం కార్డులు మార్చుకునేందుకు, యూపీఐ, మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను తిరిగి పొందేందుకు ఒకటో తేదీ నుంచి మారిన టీజీబీ శాఖల్లో సంప్రదించాలని కోరారు. అలాగే ఏపీజీవీబీ ఖాతాదారుల వద్ద ఇప్పటికే ఉన్న పాత చెక్కులు, డీడీలు వచ్చే సంవత్సరం మార్చి 31 వరకు చెల్లింపులకు, క్లియరింగ్ సేవలకు ఉపయోగించుకోవచ్చని తెలిపారు. మీడియా సమావేశంలో బ్యాంకు జీఎంలు సుధాకర్, చంద్రశేఖర్, లక్ష్మి, భారతి, రమేష్, ఏజీఎం సుశాంత్‌కుమార్ పాల్గొన్నారు. -
రూపే కార్డులు : రైల్వే ఉద్యోగులకు సలహా
సాక్షి, న్యూఢిల్లీ : తమ డెబిట్ లేదా ఏటీఎం కార్డులను రూపే ఆధారిత కార్డుల్లోకి మార్చుకోవాలని 12 లక్షలకుపైగా తన ఉద్యోగులకు రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది. ఆత్మనిర్భర్ భారత్ ప్రచారం, డిజిటల్ ఇండియా చొరవల్లో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి పియూష్ గోయెల్ లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దీనితోపాటు దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ రైల్వే ఇప్రెస్ట్ హోల్డర్లకూ ఈ తరహా విజ్ఞప్తినే చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఉద్యోగులు రుపే కార్డులను ఎంచుకునేలా ప్రోత్సహించడానికి ఈ విషయంలో విస్తృత ప్రచారం ఇవ్వడానికి శిబిరాలను ఏర్పాటు చేస్తున్నాయన్నారు.తమ ప్రస్తుత ఇప్రెస్ట్ కార్డులను రూపే కార్డులుగా మార్చుకోవాలని కోరుతోందని తెలిపారు. -
చిక్కిన దొంగ, ఇప్పటికే 118 కేసులు
సాక్షి, సిద్దిపేట: ఏటీఎం సెంటర్ల వద్ద అమాయకులను బురిడీ కొట్టించి వారి ఖాతాల్లోంచి డబ్బులు డ్రా చేస్తున్న వ్యక్తిని సిద్దిపేట పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకుమార్‌గా పోలీసులు గుర్తించారు. ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేయడం తెలియని వ్యక్తులతో రాజకుమార్ తొలుత మంచిగా మాట్లాడి నమ్మకం కలిగిస్తాడు. అనంతరం సొమ్ము విత్ డ్రా చేసి ఇస్తానని చెప్పి ఏటీఎం కార్డులు కొట్టేస్డాని పోలీసులు వెల్లడించారు. బాధితులకు అనుమానం రాకుండా నకిలీ కార్డులు ఇచ్చి.. అనంతరం వారి అకౌంట్లలో నుంచి డబ్బులు డ్రా చేస్తాడని తెలిపారు. నిందితుని వద్ద నుంచి 18 ఏటీఎం కార్డులు, రూ.80 వేల నగదు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. రాజ్‌కుమార్‌పై ఇప్పటికే 118 కేసులు ఉన్నాయని, గతంలో 11 సార్లు జైలు అతనికి జైలు శిక్ష పడిందని తెలిపారు. (చదవండి: ముగ్గుర్ని చంపి, శవాలతో శృంగారం) -
ఏటీఎం కార్డుల క్లోనింగ్ ముఠా అరెస్టు
సాక్షి, హైదరాబాద్ : ఏటీఎం కార్డులను క్లోనింగ్ చేస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. కాగా వీరు ఒడిశాకు చెందిన ముఠాగా గుర్తించినట్లు తెలిపారు. గచ్చిబౌలి హెడీఎఫ్సీ మేనేజర్ ఫిర్యదుతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. కాగా నిందితులు 140 క్లోనింగ్ ఏటీఎం కార్డుల సాయంతో రూ. 13 లక్షలు విత్ డ్రా చేసినట్లు తేలింది. నిందితుల నుంచి రూ. 10 లక్షలతో పాటు స్కిమర్, క్లోనింగ్ మిషన్, 44 క్లోన్డ్ ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు. -
ఆ డెబిట్ కార్డులిక పనిచేయవు.. డెడ్‌లైన్ డిసెంబర్ 31!
సాక్షి, బిజినెస్ డెస్క్: పాత డెబిట్ కార్డులను కొత్త కార్డులకు మార్చుకునేందుకు గడువు దగ్గరపడుతోంది. ప్రస్తుతం విరివిగా వినియోగంలో ఉన్న మ్యాగ్నెటిక్ స్ట్రిప్ (మ్యాగ్‌స్ట్రిప్) డెబిట్ కార్డులు.. రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల మేరకు డిసెంబర్ 31 తర్వాత నుంచి చెల్లుబాటు కావు. జనవరి 1 నుంచి యూరో పే, మాస్టర్‌కార్డ్, వీసా(ఈఎంవీ) చిప్ కార్డులు మాత్రమే పనిచేస్తాయి. దీంతో పాత మ్యాగ్‌స్ట్రిప్ కార్డుల స్థానంలో కొత్త చిప్ కార్డులు తీసుకోవడం తప్పనిసరిగా మారింది. డెడ్‌లైన్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఇప్పటికే పలు బ్యాంకులు తమ ఖాతాదారులకు కొత్త కార్డులను పంపిస్తున్నాయి. అయినప్పటికీ.. సుమారు 70 శాతం మంది ఖాతాదారులకు మాత్రమే ఇవి చేరినట్లు తెలుస్తోంది. దీంతో తప్పనిసరిగా చిప్ కార్డులు తీసుకోవడంపై బ్యాంకులు విస్తృతంగా అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒకవేళ ఇప్పటికీ చిప్ కార్డు పొందని వారు ఆఖరు రోజు దాకా వేచి చూడకుండా.. సత్వరం తమ తమ బ్యాంకు శాఖలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నాయి. ఆన్లైన్లో నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించాయి. ఉదాహరణకు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ నెట్‌బ్యాంకింగ్ తీసుకుంటే.. ఇందులో ఈ–సర్వీసెస్ విభాగంలో ఏటీఎం కార్డు సర్వీసెస్ ఆప్షన్‌ను ఎంచుకుని కొత్త కార్డుకోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పాత మ్యాగ్‌స్ట్రిప్ డెబిట్ కార్డుల స్థానంలో కొత్త చిప్ కార్డులను ప్రభుత్వ రంగ ఎస్బీఐ వంటి బ్యాంకులు చాలామటుకు ఉచితంగానే అందిస్తున్నాయి. మ్యాగ్‌స్ట్రిప్ డెబిట్ కార్డులను తరచుగా ఉపయోగిస్తున్నవారి చిరునామాలకు నేరుగా పంపిస్తున్నాయి. ఒకవేళ గడిచిన ఏడాదికాలంగా ఒక్కసారి కూడా కార్డును ఉపయోగించని వారు మాత్రం తమ తమ హోం బ్రాంచీల్లో సంప్రదించి కొత్త చిప్ కార్డులను పొందవచ్చని ఎస్బీఐ వర్గాలు తెలిపాయి. 99 కోట్ల డెబిట్ కార్డులు.. ఆర్బీఐ గణాంకాల ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి దేశవ్యాప్తంగా 99 కోట్ల డెబిట్ కార్డులు, 4.2 కోట్ల క్రెడిట్ కార్డులు ఉన్నాయి. ఖాతాదారులు మోసాల బారిన పడకుండా కాపాడే క్రమంలో 2015 సెప్టెంబర్ నుంచే చిప్ ఆధారిత, పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్(పిన్)తో పనిచేసే డెబిట్, క్రెడిట్ కార్డులు జారీ చేయాలంటూ అదే ఏడాదిలో ఆర్బీఐ ఆదేశించింది. ఆ తర్వాత డెడ్‌లైన్‌ను మరికొన్ని నెలలు పాటు పొడిగించడంతో 2016 జనవరి తర్వాత నుంచి కొత్తగా ఖాతాలు తెరిచిన వారందరికీ చిప్ ఆధారిత డెబిట్ కార్డులనే బ్యాంకులు జారీ చేస్తున్నాయి. కానీ, డెడ్‌లైన్ కన్నా ముందే మ్యాగ్స్ట్రిప్తో జారీ అయిన క్రెడిట్, డెబిట్ కార్డులు యథాప్రకారం వాడకంలో కొనసాగుతున్నాయి. దీంతో వీటన్నింటి స్థానంలో కొత్త చిప్ కార్డులు జారీ చేయాలం టూ ఈ ఏడాది డిసెంబర్ 31ని ఆర్బీఐ డెడ్‌లైన్‌గా విధించింది. దీన్ని పొడిగించాలం టూ బ్యాంకులు కోరినప్పటికీ.. ఆర్బీఐ తోసిపుచ్చడంతో గడువులోగా చిప్కార్డుల జారీ అనివార్యమైంది. ఈఎంవీ చిప్ కార్డు అంటే.. డెబిట్ కార్డు చెల్లింపులకు సంబంధించి ఈఎంవీ చిప్ టెక్నాలజీని అంతర్జాతీయ ప్రమాణంగా పరిగణిస్తారు. ఈ టెక్నాలజీ గల డెబిట్ కార్డుల్లో పొందుపర్చే మైక్రోప్రాసెసర్ చిప్‌లో.. కార్డుహోల్డరు డేటా భద్రంగా నిక్షిప్త మై ఉంటుంది. అయితే, స్వైప్ చేసిన ప్రతిసారి ఆథెంటికేషన్ వివరాలు మారిపోతూ ఉంటా యి. పిన్ నంబరు కూడా తప్పనిసరిగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే.. రెండంచెల భద్ర త ఉంటుంది. దీంతో ఈ కార్డుల నుంచి డేటా సేకరించడం, క్లోనింగ్ చేయడం, మోసగిం చడం చాలా కష్టం. మ్యాగ్‌స్ట్రిప్ కార్డులతో పోలిస్తే ఇది మరింత సురక్షితమైన టెక్నాలజీ. మ్యాగ్‌స్ట్రిప్ కార్డు గుర్తింపు ఇలా డెబిట్ కార్డు ముందుభాగంలో ఎడమవైపున చిప్ లాంటిది గానీ లేకపోతే మీది పాత మ్యాగ్‌స్ట్రిప్ డెబిట్ కార్డు అవుతుంది. సాధారణంగా మ్యాగ్‌స్ట్రిప్ కార్డుల్లో కస్టమర్ డేటా స్థిరంగా నిక్షిప్తమైపోతుంది. దీంతో మోసగాళ్లు ఈ వివరాలను సులభతరంగా సేకరించి, మోసాలకు పాల్పడేందుకు ఆస్కారాలు ఎక్కువ. -
రెస్టారెంట్ వెయిటర్లకు ఏటీఎం కార్డు ఇస్తున్నారా..
సాక్షి, సిటీబ్యూరో: ప్రముఖ రెస్టారెంట్లలో విందుకు వెళుతున్న కస్టమర్లు బిల్లు చెల్లించేందుకు ఇస్తున్న ఏటీఎం కార్డుల వివరాలను స్కిమ్మింగ్ ద్వారా సేకరించి క్లోనింగ్ కార్డులతో డబ్బులు కొట్టేస్తున్న ముగ్గురు వ్యక్తులను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. బంజారాహిల్స్ ఏటీఎం నుంచి రెండు విడతల్లో రూ.లక్ష డ్రా చేసినట్లు సెల్‌ఫోన్‌కు ఎస్ఎంఎస్ అందడంతో బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ స్కిమ్మింగ్ మోసం వెలుగులోకివచ్చింది. సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ జానకిషర్మిలా కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎంబీఏ మధ్యలోనే మానేసిన వారణాసికి చెందిన సుమిత్ జింగ్రాన్ ఓ కాల్సెంటర్లో ఎగ్జిక్యూటివ్‌గా పని చేశాడు. ఈ సమయంలో స్కిమ్మింగ్ కార్డుల మోసాలపై అవగాహన పెంచుకున్న అతను సులభంగా డబ్బులు సంపాదించేందుకు పథకం పన్నాడు. ఇందులో భాగంగా స్కిమ్మర్లు, ఎంఎస్ఆర్ యంత్రాలను, మాగ్నటిక్ స్ట్రిప్‌లను కొనుగోలు చేశాడు. పలు రెస్టారెంట్లలో కస్టమర్లు బిల్లు చెల్లించేందుకు వెయిటర్లకు కార్డులను ఇవ్వడం గుర్తించిన అతను వెయిటర్లతో కుమ్మక్కైతే మోసాలు చేయడం తేలికనే నిర్ణయానికి వచ్చాడు. దీంతో పలు ప్రధాన నగరాల్లోని బార్లు, పబ్‌లు, రెస్టారెంట్లలో పనిచేసే వెయిటర్లను కలిసి స్కిమ్మింగ్ ద్వారా కార్డు వివరాలతో పాటు పిన్ నంబర్ సంపాదించి ఇస్తే ఒక్కో కార్డుకు రూ.రెండువేల చొప్పున ఇస్తానని ఎరవేశాడు. ఇందుకు అంగీకరించిన వెయిటర్లకు కార్డు వివరాలు, పిన్ నంబర్ సేకరించడంపై అవగాహన కల్పించేవాడు. ఈ నేపథ్యంలో గోవాలోని ఓ రెస్టారెంట్లో పనిచేస్తున్న తన స్నేహితులు రఫిక్ ఫరూక్ ఖాన్, సచిన్ కుమార్‌లను కలిసి తన పథకాన్ని వివరించగా వారు సానుకూలంగా స్పందించారు. ఆ తర్వాత రఫిక్, సచిన్ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ రెస్టారెంట్లో పనిలో చేరారు. వారు బిల్లు చెల్లించేందుకు కస్టమర్లు ఇచ్చిన ఏటీఎం కార్డులను స్కిమ్మింగ్ చేయడంతో పాటు పిన్ నంబర్లు తెలుసుకొని సుమిత్ జింగ్రాన్‌కు అందించేవారు. 15 రోజులకోసారి ఆయా రెస్టారెంట్లు, బార్లకు వెళ్లి వారి నుంచి వివరాలు తీసుకొని ఎంఎస్ఆర్ యంత్రాల సహాయంతో డాటాను క్లోన్ చేసి ముంబైకి చెందిన కెవిన్ జెర్రీ డిసౌజా, ఢిల్లీకి చెందిన గౌరవ్ వర్మలకు ఇచ్చేవాడు. వారు ఏటీఎంల నుంచి డబ్బులు డ్రా చేసేవారు. వచ్చిన మొత్తంలో 15 శాతం వారికి కమీషన్‌గా ఇచ్చేవాడు. ఇదే తరహాలో హైదరాబాద్ కస్టమర్ల నుంచి దాదాపు రూ.15 లక్షలు డ్రా చేశారు. ఇతర నగరాల్లో దాదాపు రూ.50 లక్షల వరకు కొల్లగొట్టినట్లు విచారణలో వెల్లడైంది. కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన సురేంద్రకు బంజారాహిల్స్‌లోని ఓ ఏటీఎం నుంచి రెండు దఫాలుగా రూ. లక్ష డ్రా అయినట్లు సమాచారం అందడంతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో పంజాబ్ పాటియాలో జింగ్రాన్, గౌరవ్‌వర్మ, సచిన్ కుమార్‌లను అరెస్టు చేసి ట్రాన్సిట్ వారంట్‌పై బుధవారం నగరానికి తీసుకొచ్చారు. అయితే కెవిన్ జెర్రీ డిసౌజాను అక్టోబర్ 12న సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. రఫిక్ ఫరూక్ ఖాన్ పరారీలో ఉన్నాడు. గతంలోనూ వీరిని థానే పోలీసులతో పాటు పంజాబ్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసినట్లు విచారణలో వెల్లడైంది. -
ఏటీఎం వద్ద జాగ్రత్తలు తీసుకోవాలి : సీపీ కార్తికేయ
నిజామాబాద్క్రైం: నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ సబ్ డివిజన్ల పరిధిలోని ప్రజలకు ఏటీఎం వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆదివారం సీపీ కార్తికేయ విలేకరులతో వెల్లడించారు. మీ ఏటీఎం పిన్ నెంబర్రు ఇతరులకు తెలియజేయకూడదు. మీ బ్యాంకింగ్ లావాదేవీలు ఎవరికి వారు సొంతంగా చేసుకోవాలి. బ్యాంక్‌ల వద్ద ఇతరులను ఎవరిని నమ్మవద్దు. ఇతరులను నమ్మినట్లయితే వారు మోసం చేస్తున్న విషయం తెలియనివ్వరు. అనంతరం మీ ఖాతా డబ్బులు సులువుగా డ్రా చేసుకొని తీసుకెళ్లుతారు. ఎవరైన బ్యాంక్ నుంచి ఫోన్ చేసి బ్యాంక్ మేనేజర్ లేదా ఇతర సిబ్బందిని మాట్లాడుతున్నాను. మీ ఏటీఎం వివరాలు లేదా ఖాతా వివరాలు ఎలాంటివి అడిగిన తెలుపరాదు. ఎవరైన మీకు ఫోన్‌చేస్తే మీరు ఈ విషయాన్ని బ్యాంకు అధికారులకు, దగ్గరలోని పోలీస్‌స్టేషన్ సిబ్బందికి, కంట్రోల్ సెల్ నం.9490618000 సమాచారం అందించండి. ఏటీఎం పిన్ నెంబర్‌ను కార్డు పేపర్ మీదా రాసిపెట్టుకోరాదు. ప్రతి ఒక్కరూ ఏటీఎం పిన్ నెంబర్ జ్ఞాపకం ఉంచుకోవాలి. మీ బ్యాంక్, ఏటీఎం లావాదేవీలు అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి. మనం ఏటీఎం కార్డు మిషన్‌లో పెట్టినప్పుడు/కార్డు స్లాట్‌లో మనకు అంతరాయం అనిపిస్తే అలాంటి సమయంలో బ్యాంకు అధికారులకు, సంబంధిత పోలీసుస్టేషన్ వారికి తేలియజేయడంలో ఆలస్యం చేయవద్దు. -
పోయినా.. పర్వాలేదు
మంత్రాలయం రూరల్ : సాంకేతిక అభివృద్ధి పరుగెడుతోంది. ఆ క్రమంలోనే ప్రతి వ్యక్తికీ అవసరాలు పెరుగుతున్నాయి. మెరుగైన సేవలు, అక్రమాల నివారణే లక్ష్యంగా ప్రభుత్వాలు, పలు సంస్థలు కార్డులు జారీ చేస్తున్నాయి. వ్యక్తి వివరాలు, చిరునామా తదితర అంశాలతో, బార్ కోడ్‌తో రూపొందించిన పలు కార్డులు అందరి జీవన గమనంలో భాగస్వామ్యమవుతున్నాయి. ప్రస్తుతం ప్రతి ఒక్కరు జేబులు, పర్సుల్లో ఐదు నుంచి పది కార్డులు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీటిని చాలా జాగ్రత్తగా భద్రపరుచుకుంటున్నారు. అయినా ఒక్కోసారి పర్సు పోయినప్పుడు, జిరాక్స్ తీసుకునే సందర్భంలో మరిచిపోయినప్పుడు.. ఇతర కారణాలతో అవి దూరమైనప్పుడు ఆందోళన అంతా.. ఇంతా కాదు. అయితే కార్డు పోయినా పర్వాలేదు.. కొంత సమయం, తక్కువ ఖర్చుతో వాటిని పొందవచ్చు. అవసరమైన కార్డులకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, వాటి ఉపయోగం, అవి పోగొట్టుకుంటే ఎలా పొందాలనే వివరాలతో ప్రత్యేక కథనం. రేషన్ కార్డు దరఖాస్తు విధానం: నూతన రేషన్కారు కోసం కుటుంబసభ్యుల ఫొటోతో పాటు అందరి ఆధార్‌కార్డు జిరాక్స్ కాపీలతో పాటు దరఖాస్తు ఫారాన్ని జతపరిచి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో అందజేయాలి. వారు వివరాలను ఆన్లైన్ నమోదు చేసి ఉంచుతారు. ప్రభుత్వం కార్డుల జారీ సమయంలో అర్హులకు పంపిణీ చేస్తారు. ఉపయోగం: పేదలకు ఈ కార్డు చాలా కీలకం. కేవలం ప్రభుత్వం తరుపున వచ్చే సబ్సిడీ సరుకులకు మాత్రమే పరిమితం కాకుండా ఆదాయం, పలు ధ్రువపత్రాలను పొందేందుకు రేషన్‌కార్డు ఉపయోగపడుతోంది. తెల్లరేషన్ కార్డు ఉంటే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. పేదలకు ఈ కార్డు ఎంతో ఉపయోగం. డూప్లికేట్ కార్డు పొందడం ఇలా: రేషన్ కార్డు పోతే కార్డు నంబర్‌తో స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. తహసీల్దార్ గ్రామ రెవెన్యూ అధికారిని విచారణ నిమిత్తం ఆదేశిస్తారు. ఆయన ఇచ్చే నివేదిక ఆధారంగా తహసీల్దార్ డూప్లికేట్ రేషన్‌కార్డు జారీకి ఆదేశాలు ఇస్తారు. పాన్ కార్డు దరఖాస్తు విధానం: పాన్‌కార్డు కావాలంటే ముందుగా రెండు కలర్ ఫొటోలతో ఆదాయ పన్ను విభాగపు కార్యాలయంలో దరఖాస్తుతో పాటు ఓటరు, ఆధార్ జిరాక్స్ కాపీలను జతపరిచి అందజేయాలి. అధికారులు నిర్ణయించిన చలానా కట్టాలి. దాదాపు 30 రోజుల గడువులోగా దరఖాస్తులో పేర్కొన్న చిరునామాకు కార్డు పోస్టు ద్వారా చేరుతోంది. ఉపయోగం: ఆర్థిక లావాదేవిల్లో పాన్‌కార్డు ప్రసుత్తం చాలా కీలకం. ముఖ్యంగా బ్యాంక్ ఖాతాలకు పాన్‌కార్డును అనుసంధానం చేస్తారు. అంతే కాకుండా ఇతర ఖాతాకు రూ. 50 వేలకు మించి లావాదేవీలకు తప్పకుండా పాన్‌కార్డు నంబర్ వివరాలను తెలియజేయాల్సి వస్తుంది. డూప్లికేట్ కార్డు పొందడం ఇలా: ఈ కార్డు పోతే సంబంధిత ఏజెంట్ దగ్గర కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుతో పాటు పాన్‌కార్డు జిరాక్స్, రెండు కలర్ ఫొటోలు, రెసిడెన్సీ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి. కొత్త కార్డు కోసం దాదాపు రూ. 90 చెల్లించాలి. దాదాపు 3 వారాల్లో సూచించిన చిరునామాకు చేరుతోంది. మరిన్ని వివరాలకు www. nsdipan. com లాగిన్ అవ్వాలి. ఏటీఎం కార్డులు దరఖాస్తు విధానం: బ్యాంక్ ఖాతా తెరిచిన ప్రతి ఒక్కరికి ఏటీఎం ఎంతో అవసరం. ఇందుకోసం సంబంధిత బ్యాంక్‌లో బ్యాంక్ ఖాతా నమోదు సమయంలో తెలియజేసిన వివరాలతో సంబంధించిన బ్రాంచ్ మేనేజర్‌కు దరఖాస్తు చేసుకుంటే వారు వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారు. దాదాపు 10 రోజుల గడువులోగా దరఖాస్తులో పేర్కొన్న చిరునామాకు పోస్టు ద్వారా వస్తుంది. ఉపయోగం: బ్యాంకులో జమ చేసిన డబ్బులను అక్కడికి వెళ్లకుండానే ఏటీఎం కేంద్రాల్లో ఏటీఎం కార్డును ఉపయోగించి తీసుకోవచ్చు. అదే కార్డు నుంచి నగదు బదిలీ సౌకర్యం కూడా కల్పించారు. నగదు రహిత లావాదేవీలకు ఈ కార్డులు ఎంతో కీలకంగా మారాయి. తిరిగి పొందడం ఇలా..: ఈ కార్డు పోగొట్టుకున్న వారు వెంటనే బ్యాంక్ వినియోగదారుల సేవ కేంద్రంలో ఫిర్యాదు చేసి వారు అడిగిన పూర్తి సమాచారం అందించి కార్డును బ్లాక్ చేయించాలి. ఆ తర్వాత వారిచ్చే ఫిర్యాదు నెంబర్‌ను సంబంధిత బ్యాంక్ మేనేజర్‌కు తెలియజేయాలి. ఈ విషయాన్ని నిర్ధారించిన తరువాత కొత్త కార్డును జారీ చేస్తారు. పాస్‌పోర్టు దరఖాస్తు విధానం: పాస్‌పోర్టు అవసరమైన వారు ముందుగా దరఖాస్తుదారుడికి సంబంధించిన రెండు ఫొటోలు, 10వ తరగతి మార్కుల జాబితా, ఆధార్ కార్డు వివరాలు, బ్యాంక్ స్టేట్మొంట్ ఆధారంగా ఆన్లైన్లో www. passport. com అనే వెబ్సైట్ ఆధారంగా వివరాలను నమోదు చేసుకోవాలి. ఏపీలో మొత్తం ఐదు కేంద్రాలున్నాయి. కర్నూల్, కడప తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ఆయా కార్యాలయాల వారీగా మనకు అవసరమైన చోట దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్లో నమోదైన వివరాలను విచారణ నిమిత్తం ఆ జిల్లా ఎస్పీ కార్యాలయానికి పంపుతారు. అక్కడి నుంచి స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దరఖాస్తు దారుడి వివరాలతో ముందుగా స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విచారణ చేసి, ఎస్పీ నివేదిక అందజేస్తారు. వారు అక్కడి నుంచి పాస్‌పోర్టు అధికారికి పూర్తి స్థాయిలో నివేదిక పంపుతారు. దరఖాస్తులో పేర్కొన్న చిరునామాకు పోస్టు ద్వారా చేరుకుంటుంది. ఉపయోగం: పాస్‌పోర్టు ఉండటం ద్వారా మనం ఇతర దేశాలకు వెళ్లడానికి సులభతరమవుతోంది. ప్రత్యేక ప్రాంతాలకు వెళ్లాల్సిన సమయంలో పాస్పోర్టుతో పాటు వీసాకు దరఖాస్తు చేసుకోవాలి. డూప్లికేట్ పొందడం ఇలా: పాస్‌పోర్టు పోతే ముందుగా స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. వారు విచారణ చేసి లభించకపోతే నాన్ట్రేస్ ధ్రువపత్రం జారీ చేస్తారు. అనంతరం పాస్‌పోర్టు అధికారి పేరిట ఆన్లైన్ ద్వారా దాదాపు రూ.1500 చెల్లించాలి. ఈ రెండింటి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి. ఆ శాఖ ప్రాంతీయ అధికారి విచారణ చేసి డూప్లికేట్ పాస్‌పోర్టు జారీ చేస్తారు. ఇందుకు మూడు నెలలు సమయం పట్టవచ్చు. తాత్కాల్ పాస్‌పోర్టు కోసం నేరుగా జిల్లా ఎస్పీని సంప్రదించాలి. డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు విధానం: డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు ఏపీ ఆన్లైన్ కేంద్రాల్లో ప్రభుత్వం కేటాయించిన రుసుంతో పాటు ఆధార్‌కార్డు, 10వ తరగతి మార్కుల జాబితా/ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ జిరాక్స్, రెండు కలర్ ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలి. స్థానిక ఆర్టీఓ కార్యాలయంలో నిర్వహించే టెస్ట్‌లో ఉత్తీర్ణత పొందితే, ఎల్ఎల్ఆర్ జారీ చేస్తారు. అనంతరం టెస్ట్ డ్రైవింగ్‌లో పాసయితే దాదాపు 15 రోజుల గడువులోగా లైసెన్స్ చేతికందుతోంది. ఉపయోగం: డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా వాహనం నడపడానికి అర్హులవుతాం. అంతే కాకుండా కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో నకలు కాపీని అందజేయాల్సి వస్తోంది. డూప్లికేట్ పొందడం ఇలా: డ్రైవింగ్ లైసెన్స్ పోయిన వెంటనే సమీప పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. వారు అందించే నాన్ట్రేస్ సర్టిఫికెట్తో పాటు డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించిన దరఖాస్తుతో స్థానిక ఆర్టీఓ కార్యాలయంలో అందించాలి. మరిన్ని వివరాలకు www. ap.transport.org.inవెబ్సైట్లో తెలుసుకోవచ్చు. ఆధార్ కార్డు దరఖాస్తు విధానం: ఆధార్‌కార్డుకు దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా నివాస ధ్రువపత్రంతో పాటు రెవెన్యూ అధికారి సంతకం తప్పనిసరిగా అవసరం. దరఖాస్తుతో పాటు వీటిని జతపరిచి మీ సేవ కేంద్రంలో నిర్ణయించిన మొత్తాన్ని చెల్లించి అక్కడ ఐరిస్ తీయించుకోవాలి. దాదాపు 30 రోజుల గడువులోగా దరఖాస్తులో పేర్కొన్న చిరునామాకు ఆధార్‌కార్డు పోస్ట్ ద్వారా వస్తుంది. ఉపయోగం: రేషన్‌కార్డు, పింఛన్ తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలంటే ఆధార్ తప్పనిసరి చేశారు. పథకాలకు ఆధార్ అనుసంధానం కాకపోతే లబ్ధిపొందలేరు. డూప్లికేట్ కార్డు పొందడం ఇలా: ఈ కార్డు పోతే టోల్‌ఫ్రీ నంబర్ 18001801947కు కాల్ చేసి పూర్తి వివరాలతో ఫిర్యాదు చేయాలి. ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేకుండానే కొత్త కార్డు మళ్లీ పోస్టులో మన చిరునామా వస్తుంది. help@uidi.gov.in.వెబ్సైట్లో పూర్తి సమాచారం పొందే అవకాశం ఉంది. ఓటరు గుర్తింపు కార్డు దరఖాస్తు విధానం: 18 సంవత్సరాలు నిండిన యువత వారి కలర్ ఫొటోలతో దరఖాస్తు ఫారాన్ని భర్తీ చేసి బూత్ లెవల్/గ్రామ రెవెన్యూ అధికారి గారికి దరఖాస్తు చేసుకోవాలి. వారు విచారణ చేపట్టి వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి ఉంచుతారు. ఎన్నికల కమిషన్ పూర్తి వివరాలను పరిశీలించి కార్డును జారీ చేస్తారు. కార్డు బూత్ లెవల్/గ్రామ రెవెన్యూ అధికారిని సంప్రదించి పొందవచ్చును. ఉపయోగం: ఓటరు కార్డు పొందిన ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం వస్తుంది. కొన్ని సార్లు నివాస, పుట్టిన తేదీ ధ్రువీకరణ కోసం ఈ కార్డు అవసరమవుతోంది. డూప్లికేట్ కార్డు పొందడం ఇలా: ఈ కార్డును పోగొట్టుకుంటే పోలింగ్ బూత్ నెంబర్, కార్డు నెంబర్‌తో రూ. 10 చెల్లిస్తే మీ సేవ కేంద్రాల్లో మళ్లీ కార్డును పొందవచ్చును. నెంబర్ ఆధారంగా స్థానిక తహసీల్దార్ కార్యలయంలో దరఖాస్తు చేసుకుంటే ఈ కార్డును ఉచితంగా అందజేస్తారు. మరింత సమాచారం కోసం www. ceoap. in వెబ్సైట్లో సంప్రదించి వివరాలను తెలుసుకోవచ్చును. -
మైక్రో ఏటీఎంలు వచ్చేశాయ్
జంగారెడ్డిగూడెం : జిల్లాలో మైక్రో ఏటీఎంలు వచ్చేశాయి. కేవలం ఆధార్‌కార్డుతోనే నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. గత ఏడాది నవంబర్ 8 ముందు వరకు ప్రజలు నగదు విత్‌డ్రా చేసుకోవాలంటే ఏటీఎంలపై ఆధారపడే వారు. నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దు తరువాత ఒక్కసారిగా నగదు కష్టాలు వెక్కిరించాయి. సుమారు అటూ, ఇటుగా నాలుగు నెలల పాటు ఏటీఎంలు పనిచేయలేదు. ఆ తరువాత ఒకొక్కటికిగా పనిచేయడం ప్రారంభించినా నగదు ఇబ్బందులు మాత్రం తీరలేదు. ఆ పరిస్థితి ఏడాది గడిచినా ఇప్పటికీ అలాగే ఉంది. ఈ నేపథ్యంలో మైక్రో ఏటీఎంలు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. ఏటీఎం కార్డుతోపాటు, ఆధార్‌కార్డు సహాయంతో నగదును విత్‌డ్రా చేసుకునే అవకాశం ఏర్పడింది. దీంతో ప్రజలు మెల్లమెల్లగా మైక్రో ఏటీఎంల వైపు మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో ఇప్పటికే జంగారెడ్డిగూడెం, ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరం తదితర పట్టాణాల్లో మైక్రో ఏటీఎంలు అందుబాటులో కి వచ్చాయి. ఈ మైక్రో ఏటీఎంలలో కార్డు లేకపోయినా ఆధార్ నెంబరుతో నగదును విత్ డ్రా చేసుకోవచ్చు. ఆధార్ కార్డు దగ్గర లేకపోయినా పర్వాలేదు. ఏ బ్యాంకు ఏటీఎం కార్డు ద్వారా అయినా ఈ మైక్రో ఏటీఎంల ద్వారా నగదు పొందవచ్చు. మైక్రో ఏటీఎంల సేవలు: ♦ ఆధార్‌కార్డు నంబరు అనుసంధానమైన ఏ బ్యాంకు అకౌంట్ నుంచైనా నగదును ఈ మైక్రో ఏటీఎం ద్వారా విత్‌డ్రా చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ♦ ఏ బ్యాంకు ఏటీఎం కార్డు (డెబిట్ కార్డు) ద్వారానైనా నగదు డ్రా చేసుకోవచ్చు. ♦ ఐడీఎఫ్సీ బ్యాంకుకు సంబంధించి కొత్త అకౌంట్‌ను ప్రారంభించుకోచ్చు. ♦ ఈ మైక్రో ఏటీఎం ద్వారా ఏ బ్యాంకు ఖాతాలోనైనా నగదు జమచేసుకోవచ్చు. అయితే దీనికి 1.5 శాతం సర్ఛార్జ్ పడుతుంది. ♦ ఆధార్ నంబరు ద్వారా ఏ బ్యాంకు అకౌంట్ బ్యాలెన్స్ అయినా తెలుసుకోవచ్చు. ♦ బ్యాంకు సమయాలు, సెలవు రోజులతో సంబంధం లేకుండా సేవలు పొందవచ్చు. ♦ బ్యాంకు అకౌంట్ ఉన్న వ్యక్తి ఆధార్ నెంబరు తీసుకువెళితే మైక్రో ఏటీఎం ద్వారా ఆధార్‌నెంబరుతో, ఖాతాదారుడి వేలిముద్రతో నగదు డ్రా అవుతుంది. దీంతో ఎటువంటి మోసాలకు తావు ఉండదు. -
డ్రాప్ పేరుతో నిలువు దోపిడీ
యశవంతపుర: డ్రాప్ పేరుతో దుండగులు ఓ వ్యక్తిని నిలువునా దోచుకున్నారు. ఈఘటన మహాలక్ష్మి లేఔట్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. లగ్గేరికి చెందిన సంతోష్ అనే వ్యక్తి దేవాలయానికి వెళ్లేందుకు మహాలక్ష్మి లేఔట్ వద్ద బస్సు కోసం వేచి ఉన్నాడు.ఆ సమయంలో కారులో వచ్చిన ముగ్గురు దుండగులు డ్రాప్ ఇస్తామని సంతోష్‌ను వాహనంలో ఎక్కించుకున్నారు. దాదాపు నాలుగు గంటలపాటు అతన్ని వాహనంలోనే తిప్పారు. హెబ్బాళ సమీపంలో సంతోష్‌ను చాకుతో బెందిరించి సెల్‌ఫోన్, ఎటీఎం కార్డు లాక్కున్నారు. పిన్ నంబర్ తెలుసుకున్నారు. రాత్రి 8 గంటల సమయంలో అతని ఖాతానుంచి రూ. 14వేలు డ్రా చేసి మార్గం మధ్యలో కిందకు నెట్టేసి ఉడాయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
అంతా మోసం
రోజురోజుకు మోసగాళ్ల సంఖ్య పెరిగిపోతోంది. ఈజీ మనీ కోసం వీరు పన్నే వలలో అమాయకులు చిక్కుకుని తీవ్రంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా బ్యాంకు ఖాతాదారులను బురిడీ కొట్టిస్తున్న సంఘటనలు జిల్లాలో చోటు చేసుకుంటున్నాయి. బ్యాంకులకు వచ్చిన వృద్ధులను టార్గెట్‌గా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. అలాగే ఫోన్ చేసి ఏటీఎం వివరాలు తెలుసుకుని ఖాతాదారులను మోసగిస్తున్న ఘటనలు ఇంకా చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇది ఇలా ఉండగా జిల్లాలోని ఓ కల్తీ పాల కేంద్రంపై అధికారులు దాడి చేసి మోసాన్ని బయటపెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. ‘ఎస్బీఐ నుంచి ఫోన్ చేస్తున్నాను..’ జంగారెడ్డిగూడెం : “హలో... ఎస్బీఐ నుంచి మాట్లాడుతున్నాం... మీరు ఎస్బీఐ కార్డు వాడుతున్నారు కదా! ఆ కార్డు మీద పాయింట్లు వచ్చాయి.. ఆ పాయింట్లను నగదుగా మార్చాలి.. మీ కార్డు వివరాలు తెలియజేయగలరు.’ ఇలా ఒక ఆగంతకుడు ఫోన్ చేసి సదరు వ్యక్తి ఖాతాలోని నగదు డ్రా చేసి బురిడీ కొట్టించాడు. గురువారం జంగారెడ్డిగూడెంలో ఈ ఘటన చోటు చేసుకోగా బాధితుడు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై ఎం.కేశవరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణానికి చెందిన పీవీఎస్‌ఆర్‌కే ప్రసాద్ జంగారెడ్డిగూడెం ఎస్బీఐలో ఖాతా కలిగి ఉన్నాడు. ఏటీఎం కార్డు వినియోగిస్తున్నాడు. ఆగంతకుడు ఫోన్‌చేసి వివరాలు తెలుసుకున్న అనంతరం స్వల్ప వ్యవధిలో మూడుసార్లు కార్డు నుంచి 14,985 రూపాయలు విత్ డ్రా చేశాడు. ప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై చెప్పారు. బామ్మకు టోకరా.. నగలతో జంప్ ఏలూరు అర్బన్ : బ్యాంకులో నగలు కుదువపెట్టి డబ్బులు తీసుకునేందుకు వచ్చిన వృద్ధురాలిని మాయచేసిన మోసగాడు ఆమె తెచ్చుకున్న నగలు అపహరించుకుపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక వంగాయగూడెం సుబ్రహ్మణ్యం కాలనీకి చెందిన చిల్లా పార్వతి తన వద్ద ఉన్న 12 గ్రాముల విలువైన బంగారు నగలు తాకట్టు పెట్టేందుకు స్థానిక వన్‌టౌన్ కెనాల్‌రోడ్‌లోని విజయబ్యాంకుకు వచ్చింది. బ్యాంకులో ఒంటరిగా ఉన్న ఆమెను గమనించిన గుర్తు తెలియని వ్యక్తి ఒకడు ఆమెకు డబ్బు ఇప్పిస్తానని నమ్మబలికాడు. ఆమె నుంచి నగలు తీసుకుని ఆధార్ కార్డు జిరాక్సు తీసుకురమ్మని ఆమెను బయటకు పంపాడు. కార్డు జిరాక్స్ తీసుకువచ్చిన ఆమెకు ఆగంతకుడు కనిపించకపోవడంతో అక్కడే ఉన్న కార్పొరేటర్ రాధాబాబుకు మొరపెట్టుకుంది. ఆయన బ్యాంకు అధికారులతో మాట్లాడారు. దీంతో వారు సీసీ ఫుటేజ్ పరిశీలించి మోసగాణ్ణి గుర్తిస్తామని చెప్పారు. బాధితురాలు కార్పొరేటర్ సహకారంతో వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కల్లీ పాలు తయారీ కేంద్రం గుట్టు రట్టు! కామవరపుకోట : మండలంలోని సాగిపాడు పంచాయతీ పరిధిలోని వీరంపాలెం గ్రామంలో కల్తీ పాలు తయారు చేస్తోన్న ఒక ఇంటిపై తడికలపూడి ఎస్సై జీజే విష్ణువర్థన్ శుక్రవారం దాడి చేశారు. అనంతరం పుడ్ ఇన్స్పెక్టర్ జి.వెంకటరామయ్యకు సమాచారం అందించారు. ఎస్సై సమక్షంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ ఈ పాలను పరీక్షించారు. ఎస్సై కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. లింగపాలెం మండలం ఆసన్నగూడెంకు చెందిన జెట్టి మోషే ఐదు నెలలుగా మంగతాయారు అనే మహిళకు చెందిన ఇంటిలో ఒక గది అద్దెకు తీసుకుని కల్తీ పాలు తయారు చేస్తున్నాడు. అసలు పాలకు నీళ్లు కలిపి దానిలో మంచునూనె, పాల పౌడర్ కలిపి మిక్సిలో ఆడి వచ్చిన ద్రవ్యాన్ని బయట ప్రజలకు అమ్ముతున్నాడు. దాడిలో పాల తయారీకి ఉపయోగించే నూనె ప్యాకెట్లు, పాల పౌడర్ ప్యాకెట్లు, మిక్సీ, రెండు క్యాన్ల పాలు సీజ్ చేసినట్టు ఎస్సై చెప్పారు. పాల నమూనాలను హైదరాబాద్ ల్యాబ్‌కు పంపినట్టు తెలిపారు. -
నగదు రహితంపై ఆదర్శం కావాలి
► బ్యాంకు ఖాతా పుస్తకాల పంపిణీ ఎల్లారెడ్డిపేట: మంత్రి కేటీఆర్ దత్తత తీ సుకున్న రాజన్నపేటలో వందశాతం ఖాతాలను పూర్తిచేసినట్లు జెడ్పీటీసీ సభ్యు లు తోట ఆగయ్య అన్నారు. గ్రా మంలో శనివారం బ్యాంకు మేనేజర్లు, అధికారులు కలిసి బ్యాంకు ఖాతాలు తీసుకున్న వారికి ఖాతా పుస్తకాలను పంపిణీ చేశారు. రాజన్నపేట జిల్లాలోనే మిగతా గ్రామాలకు ఆదర్శం కానుందని పేర్కొన్నారు. ఖాతాల అనంతరం వందశాతం ఏటీఎం కార్డులు పొందే విధంగా అవగాహన కల్పించాలని అధికారులను కోరారు. అలాగే సింగారంలో నగదు రహిత లావాదేవీలపై సర్వే నిర్వహిం చారు. గ్రామస్తులంతా బ్యాంకు ఖాతా లు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అందె సుభాశ్, మాజీ ఎంపీపీ ఎలుసాని మోహన్ కుమార్, ఎంపీడీవో చిరంజీవి, సర్పంచ్‌లు ద్యాప ఎల్లయ్య, గొల్లపల్లి దేవలక్ష్మి, ఎంపీటీసీ నమిలికొండ శ్రీనివాస్, నాయకులు కొండ రమేశ్, శ్రీనివాస్‌గౌడ్, బ్యాంకు మేనేజర్లు మున్వర్, బ్రహ్మయ్య, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు. -
సైబర్ నేరగాడు అరెస్టు
వేంపల్లె :ఏటీఎం నెంబర్లను సేకరించుకొని సెల్ ద్వారా పేటీఎంను ఉపయోగించి ఖాతాలలోని డబ్బులను దొంగలించే సైబర్ నేరగాడు షేక్ శ్రీనివాసులును వేంపల్లె పోలీసులు అరెస్టు చేసి గురువారం కోర్టుకు పంపారు. వివరాలలోకి వెళితే.. కాశినాయన మండలం నరసాపురం గ్రామానికి చెందిన షేక్ శ్రీనివాసులు ఆర్మీలో పనిచేస్తూ వ్యసనాలకు బానిసై ఉద్యోగం పోగొట్టుకున్నాడు. విజయవాడలో గుర్రపు పందేలు ఆడుతూ డబ్బులు పోగొట్టుకొని అప్పుల పాలయ్యాడు. ఆ తర్వాత ఏటీఎం ద్వారా దొంగతనాలకు అలవాటుపడ్డాడు. ఆంధ్రా బ్యాంకుకు చెందిన ఏటీఎంలలో క్యూలో నిలబడి వారి ఏటీఎం కార్డును సేకరించుకొని సెల్‌ఫోన్ ద్వారా పేటీఎంను ఉపయోగించి ఖాతాలలోని డబ్బులను కాజేస్తూ వచ్చాడు. రాజేష్, ప్రహ్లాద, హరీష్ వేంపల్లెకు చెందిన సైఫుల్లా అనే స్నేహితుల ఏటీఎం నెంబర్ల ద్వారా డబ్బులు కాజేశాడు. ఈనెల 11వ తేదీన వేంపల్లె ఆర్ఎంఎస్ వీధికి చెందిన సైఫుల్లా పిర్యాదు చేయడంతో పోలీసులు గురువారం కడప రోడ్డులోని అగ్రికల్చర్ చెక్‌పోస్టు వద్ద షేక్ శ్రీనివాసులును అరెస్టు చేసి అతని వద్ద నుంచి మూడు ఏటీఎం కార్డులను, రూ.1000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ మధుమల్లేశ్వరరెడ్డి తెలిపారు. -
‘ఏటీఎం కార్డులు’ మార్చి ఏమారుస్తాడు..
హైదరాబాద్: రద్దీగా ఉండి, సెక్యూరిటీ గార్డులు లేని ఏటీఎంలను టార్గెట్‌గా చేసుకుని వినియోగదారులకు ‘సహకరిస్తూ’ ఏటీఎం కార్డుల్ని మార్చి నేరాలకు పాల్పడుతున్న వ్యక్తిని మారేడ్‌పల్లి పోలీసులు పట్టుకున్నారు. 2010 నుంచి నేర జీవితం ప్రారంభించిన ఇతగాడు ఇప్పటి వరకు ఈ తరహా తొమ్మిది నేరాలు చేశాడు. నార్త్‌జోన్ డీసీపీ ఎన్.ప్రకాష్‌రెడ్డి మంగళవారం వెల్లడించిన వివరాలివీ.. మధుమేహంతో నేరబాట పట్టి... మెదక్ జిల్లా సిద్ధిపేటకు చెందిన ఎ.రవీందర్ వెస్ట్ మారేడ్‌పల్లి పరిధిలో ఉంటున్నాడు. గతంలో చిన్నచిన్న పనులు చేసుకునే ఇతడు మధుమేహం బారిన పడ్డాడు. దీంతో పని చేయలేక తేలికగా సంపాదించవచ్చని నేరాల బాట పట్టాడు. ఇందుకు గాను ఏటీఎం కేంద్రాలనే టార్గెట్‌గా చేసుకున్నాడు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఉన్న ఏటీఎంల్లో సెక్యూరిటీ గార్డులు కూడా లేని వాటిని ఎంపిక చేసుకుని కాపుకాస్తాడు. ఏటీఎం కార్డును ఎలా వినియోగించాలో తెలియని వారు వచ్చే వరకు వేచి ఉంటాడు. అలాంటి వినియోగదారుల్ని గుర్తించి సహాయం చేస్తున్నట్లు నమ్మిస్తాడు. వారు పిన్ నంబర్ చెప్పగానే వారి కార్డుతో వారి పని పూర్తి చేసి, హస్త లాఘవం చూపి తన వద్ద ఉన్న కార్డు వారికి అంటగడతాడు. తర్వాత దాన్ని వినియోగించుకుని డబ్బులు కాజేస్తాడు. కరీంనగర్లో దొరికిన లీడ్... బాధితుల ఫిర్యాదులపై కేసులు నమోదు చేసుకున్న మారేడ్‌పల్లి పోలీసులు సికింద్రాబాద్ జేబీఎస్ వద్ద ఉన్న, సిరిసిల్లలోని ఏటీఎం కేంద్రాల నుంచి సీసీ కెమెరా ఫుటేజ్‌ను సేకరించి విశ్లేషించారు. దాంతో ఈ నేరాలు ఒకే వ్యక్తి చేసినట్లు నిర్థారణైంది. అప్పటికే కరీంనగర్లో రవీందర్‌పై ఓ కేసు నమోదై ఉండటంతో అక్కడి పోలీసుల్ని సంప్రదించారు. ఫలితంగా రవీందర్‌పై సిద్ధిపేటలో సస్పెక్ట్ షీట్ ఉందని, ప్రస్తుతం మారేడ్‌పల్లిలో నివసిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితుడిని పట్టుకున్న పోలీసులు నగదు, ఏటీఎం కార్డులు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. ఇతడిపై ఉప్పల్ పరిధిలో రెండు కేసులు నమోదు కావాల్సి ఉందని డీసీపీ తెలిపారు. -
ఇకపై చిప్‌లతో కూడిన ATMకార్డులు!
-
ఏపీజీబీ నుంచి రూ.7,877 కోట్ల రుణాలు
చైర్మన్ సంపత్కుమారాచార్య మార్కాపురం : ఆంధ్రాప్రగతి గ్రామీణ బ్యాంకు నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ 30 నాటికి 5 జిల్లాల్లో రూ.7,877 కోట్ల రుణాలు ఇచ్చినట్లు బ్యాంకు చైర్మన్ డి.సంపత్కుమారాచార్య తెలిపారు. శనివారం స్థానిక పంచాయతీరాజ్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.6,650 కోట్ల డిపాజిట్లు కూడా సేకరించినట్లు చెప్పారు. జన్‌ధన్ బీమా యోజన కింద ఇప్పటి వరకు 2.25 లక్షల ఖాతాలు ప్రారంభించామన్నారు. ఖాతాదారులకు ఏటీఎం కార్డులు ఇస్తున్నామన్నారు. రైతులకు కిసాన్ రూపే కార్డులు, సాధారణ ఖాతాదారులకు రూపే కార్డులు ఇస్తున్నామని, వీటిని ఖాతాదారులు దేశంలోని ఏ బ్యాంకు ఏటీఎంలలోనైనా ఉపయోగించుకోవచ్చని వివరించారు. షాపింగ్ కూడా చేయవచ్చన్నారు. నేషనల్ ఎలక్ట్రానిక్స్ ఫండ్ సిస్టం ద్వారా ఇతర బ్యాంకుల నుంచి ఏపీజీబీ ద్వారా దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా నగదు బదిలీ చేసుకోవచ్చని తెలిపారు. ఈ ఏడాది నూతనంగా రైతుల కోసం వ్యవసాయ పెట్టుబడులు అందిస్తున్నట్లు తెలిపారు. రుణ పరిమితి లేదని, ట్రాక్టర్లు,ఆధునిక వ్యవసాయ పనిముట్లు కూడా అందిస్తామన్నారు. వైద్యశాలల్లో అధునాతన పరికరాల కోసం రూ.50 లక్షల వరకు వైద్యులకు రుణాలు అందిస్తామని చెప్పారు. మార్కాపురం, గిద్దలూరులో బ్రాంచి రెండో శాఖను త్వరలో ప్రారంభిస్తున్నామన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఐదు ఏపీజీబీ బ్యాంకు శాఖలకు ఇటీవలే నాబార్డు బెస్ట్ బ్యాంక్ అవార్డు ఇచ్చిందని సంపత్కుమారాచార్య వివరించారు. రీజనల్ మేనేజర్ రాజశేఖరరెడ్డి, చీఫ్ మేనేజర్ ఓబయ్య, బ్రాంచి మేనేజర్ రాజారావు పాల్గొన్నారు. అనంతరం ఐదు జిల్లాల బ్రాంచి మేనేజర్లతో చైర్మన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. -
ఏటీఎం కార్డులు మార్చి రూ.1.30 లక్షలు డ్రా
లబోదిబోమంటున్న బాధితులు మెదక్ మున్సిపాలిటీ : ఏటీఎం నుంచి డబ్బులు తీసిస్తామంటూ దొంగలు కార్డులు మార్చి రూ.1.30 లక్షలు డ్రా చేసుకున్న సంఘటన పట్టణంలో సోమవారం సాయంత్రం వెలుగులోకి వచ్చాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ మండల పరిధిలోని సర్దన గ్రామానికి చెందిన రైతు సురేష్ శనివారం రాత్రి 8 గంటల సమయంలో మెదక్ పట్టణం ఆటోనగర్‌లో గల ఎస్బీఐ ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లాడు. ఏటీఎం సెంటర్ వద్ద సెక్యూరిటీగార్డు డ్రెస్‌లో ఉన్న వ్యక్తి డబ్బులు తీసిస్తానంటూ సురేష్ ఏటీఎం కార్డు తీసుకున్నాడు. కొంత డబ్బును సురేష్‌కు తీసిచ్చాడు. ఆ వెంటనే సురేష్ కార్డుకు బదులు మరో ఏటీఎం కార్డును అతనికిచ్చాడు. విషయం గమనించని సురేష్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. శని, ఆదివారాల్లో అర్ధరాత్రి సమయంలో తన ఏటీఎం కార్డు నుంచి రూ.80 వేలు డ్రా చేసినట్లు ఫోన్‌కు మెసేజ్ రావడంతో సురేష్ ఆందోళన చెందాడు. దీంతో ఏటీఎం కార్డును చూసుకోగా కార్డు మారిన విషయాన్ని గుర్తించాడు. దీంతో చేసేది లే సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరో సంఘటనలో...రూ.50వేలు మండలంలోని బ్యాతోల్ తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన ఎండీ పాషా శనివారం పట్టణంలోని డబ్బులు తీసుకునేందుకు మెదక్ పట్టణంలోని ఆంధ్రాబ్యాంకు ఏటీఎం వద్దకు వచ్చాడు. అదే సమయంలో ఏటీఎం సెంటర్ వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డు ఏదో రిసిప్ట్ వస్తోందని, ఒకసారి ఏటీఎం కార్డు ఇవ్వాలని అడగ్గా పాషా తన కార్డును ఇచ్చాడు. కొంత సేపటి తరువాత సెక్యూరిటీ గార్డు మరో కార్డును పాషా చేతికి ఇచ్చాడు. అయితే ఆదివారం తన కార్డు ద్వారా రూ.50 వేలు డబ్బులు డ్రా అయినట్లు ఫోన్‌కు మెసేజ్ రావడంతో ఆందోళన చెందిన పాషా సోమవారం పట్టణ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్ఐ అంజయ్య తెలిపారు. -
అశ్విని నాచప్ప నగదు రికవరీ
మైసూరులో నిందితుడి అరెస్ట్ = రిపోర్టర్ ముసుగులో చోరీలు = ఎస్ఐ ఈశ్వరిని అభినందించిన సీపీ బెంగళూరు, న్యూస్‌లైన్: మాజీ అథ్లెట్ అశ్విని నాచప్ప ఏటీఎం కార్డులు చోరీ చేసి నగదు డ్రా చేసిన నిందితుడిని ఇక్కడి జయనగర పోలీసులు అరెస్టు చేశారు. మైసూరు జిల్లా టీ. న రశీపుర పట్టణలోని ఎరగనహళ్లికి చెందిన రవి (44) అనే నిందితుడిని అరెస్టు చేసి రూ. 1.97 లక్షలు స్వాధీనం చేసుకున్నామని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ చెప్పారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సవ ూవేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. డిసెంబర్ 3న జయనగర రెండవ బ్లాక్‌లోని కిత్తూరు రాణి చెన్నమ్మ క్రీడా మైదానంలో స్పోర్ట్స్ మీట్ కార్యక్రమం జరిగిం ది. ఈ కార్యక్రమానికి అశ్వినీ నాచప్ప ముఖ్యఅథిగా హాజరయ్యారు. ఆ సమయంలో వ్యానిటి బ్యాగ్‌ను స్టేజ్‌పై ఉన్న కుర్చీ మీద పెట్టి జెండా ఎగురవేయడానికి వెళ్లారు. ఆ సమయంలో రవి వ్యానిటీ బ్యాగ్‌లో ఉన్న చిన్న పర్సును చోరీ చేశాడు. అనంతరం అక్కడి నుంచి ఉడాయించాడు. పర్సులో ఉన్న మూడు ఏటీఎం కార్డులతో వివిధ బ్యాంకుల్లో రూ. 2.40 లక్షల నగదు డ్రా చేశాడు. మొబైల్లో నగదు డ్రా అయ్యిందని మెసేజ్ రావడంతో అశ్వినీ నాచప్ప జయనగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలించారు. ఈశ్వరి నేతృత్వంలోని ప్రత్యేక బృందం బెంగళూరు, మైసూరు నగరాలలో నిందితుడి కోసం గాలించడం మొదలుపెట్టారు. మైసూరులో ఉన్నట్లు తెలుసుకుని అరెస్ట్ చేసిన ట్లు నగర పోలీసు కమిషనర్ ఔరాద్కర్ చెప్పారు. శ్రీమంతుడి అవతారం : అశ్వినీ నాచప్ప ఏటీఎం కార్డులు చోరీ చేసిన రవి సామాన్యుడు కాడు. దిన పత్రికల్లో వీఐపీల కార్యక్రమాలు తెలుసుకుని సూటు, బూటుతో అక్కడి చేరుకుని ఎవ రికి అనుమానం రాని తరహాలో నడుచుకుంటాడు. మరికొన్ని చోట్ల విలేకరి అంటూ మొదటి వరుసలో కూర్చుని విలువైన వస్తువులు తస్కరిస్తుంటాడని ఔరాద్కర్ చెప్పారు. ఇదే తరహాలో నిందితుడు రవి టౌన్ హాల్, రవీంద్ర కళాక్షేత్ర, హోటళ్లలో చోరీ చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలి పారు. నిందితుడిని అరెస్ట్ చేసిన ఎస్ఐ ఈశ్వరి బృందాన్ని ఔరాద్కర్ అభినందించి నగదు బహుమతి అందజేశారు.