ఏటీఎం వద్ద జాగ్రత్తలు తీసుకోవాలి : సీపీ కార్తికేయ  | Care must be taken at ATM | Sakshi
Sakshi News home page

ఏటీఎం వద్ద జాగ్రత్తలు తీసుకోవాలి : సీపీ కార్తికేయ 

Published Mon, Jun 18 2018 2:30 PM | Last Updated on Wed, Oct 17 2018 6:10 PM

Care must be taken at ATM - Sakshi

వివరాలు వెల్లడిస్తున్న సీపీ కార్తికేయ 

నిజామాబాద్‌క్రైం: నిజామాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్‌ సబ్‌ డివిజన్‌ల పరిధిలోని ప్రజలకు ఏటీఎం వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆదివారం సీపీ కార్తికేయ విలేకరులతో వెల్లడించారు.   

  •      మీ ఏటీఎం పిన్‌ నెంబర్‌రు ఇతరులకు తెలియజేయకూడదు.  
  •      మీ బ్యాంకింగ్‌ లావాదేవీలు ఎవరికి వారు సొంతంగా చేసుకోవాలి. బ్యాంక్‌ల వద్ద ఇతరులను ఎవరిని నమ్మవద్దు.
  •     ఇతరులను నమ్మినట్లయితే వారు మోసం చేస్తున్న విషయం తెలియనివ్వరు. అనంతరం మీ ఖాతా డబ్బులు సులువుగా డ్రా చేసుకొని తీసుకెళ్లుతారు. 
  •      ఎవరైన బ్యాంక్‌ నుంచి ఫోన్‌ చేసి బ్యాంక్‌ మేనేజర్‌ లేదా ఇతర సిబ్బందిని మాట్లాడుతున్నాను.  
  •      మీ ఏటీఎం వివరాలు లేదా ఖాతా వివరాలు ఎలాంటివి అడిగిన తెలుపరాదు.  
  •      ఎవరైన మీకు ఫోన్‌చేస్తే మీరు ఈ విషయాన్ని బ్యాంకు అధికారులకు, దగ్గరలోని పోలీస్‌స్టేషన్‌ సిబ్బందికి, కంట్రోల్‌ సెల్‌ నం.9490618000 సమాచారం అందించండి. 
  •      ఏటీఎం పిన్‌ నెంబర్‌ను కార్డు పేపర్‌ మీదా రాసిపెట్టుకోరాదు.  
  •      ప్రతి ఒక్కరూ ఏటీఎం పిన్‌ నెంబర్‌ జ్ఞాపకం ఉంచుకోవాలి. 
  •      మీ బ్యాంక్, ఏటీఎం లావాదేవీలు అప్పుడప్పుడు చెక్‌ చేసుకోవాలి. 
  •      మనం ఏటీఎం కార్డు మిషన్‌లో పెట్టినప్పుడు/కార్డు స్లాట్‌లో మనకు అంతరాయం అనిపిస్తే అలాంటి సమయంలో బ్యాంకు అధికారులకు, సంబంధిత పోలీసుస్టేషన్‌ వారికి               తేలియజేయడంలో ఆలస్యం చేయవద్దు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement