వాహనాల ధ్రువపత్రాలను పరిశీలిస్తున్న సీపీ
రెంజల్(బోధన్): సమాజంలో జరుగుతున్న నేరాల నియంత్రణతో పాటు ప్రజలకు అవసరమైన అన్ని రకాల సేవలను అందించేందకు రాష్ట్ర పోలీసు వ్యవస్థ కృషి చేస్తోందని సీపీ కార్తికేయ అన్నారు. అందుకు అవసరమైన ఆదేశాలకు జిల్లా పోలీసు యంత్రాంగానికి జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు తమ పోలీసులు అంకితభావంతో పనిచేస్తారని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
రెంజల్ మండలం నీలా గ్రామంలో గురువారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలోని హైస్కూల్‌లో గ్రామస్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ మాట్లాడారు. జాగ్రత్తలే మనిషికి బలం అని అన్నారు. ఎదుటివారి మాటలను నమ్మకుండా జాగ్రత్తగా వ్యవహరించినప్పుడే మోసాల నుంచి తమను తమం కాపాడుకునే అవకాశం ఉంటుందన్నారు. అపరిచితులు తమ ఏటీఎం కార్డు గురించి అడిగితే పిన్ నంబరు, ఓటీపీలను చెప్పవద్దన్నారు.
ఖాతాదారులకు బ్యాంకుల నుంచి గాని పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం ఫోన్ ద్వార అడగరని తెలిపారు. మత సామరస్యానికి సంబంధిచి జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. మహిళల భద్రతకు షీటీంలకు ఏర్పాటు చేశామన్నారు. దేవుని గుడికి ఎంత నమ్మకంతో వెళతారో ఆదే నమ్మకం పోలీసులపై ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామన్నారు.
గల్ఫ్ మోసాలను నియంత్రించేందుకు హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా ఇతర దేశాలకు పంపిస్తామని వస్తే ముందుగా వారి సమాచారాన్ని సమీపంలోని స్టేషన్లో అందించాలన్నారు. గ్రామాల్లో ఇంటర్ పూర్తి చేసిన యువకులకు ఉచితంగా పోలీసు శాఖ ద్వార శిక్షణ అందింస్తుననట్లు తెలిపారు.
పోలీసు జీతంతో పాటు వీఆర్వో జీతాలకు ప్రీపెరయ్యె వారికి సైతం శిక్షణ దోహదపడుతుందన్నారు. సమావేశంలో అదనపు డీసీపీ(ఆడ్మిన్) ఆకుల రాంరెడ్డి, బోధన్, ఆర్మూర్, ఎస్‌బీఐ, ఏఆర్ ఏసీపీలు రఘు, శివకుమార్, మహేశ్వర్, రవీందర్, 8 మంది సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment