నగదు రహితంపై ఆదర్శం కావాలి | Cash-free should be the motto of | Sakshi
Sakshi News home page

నగదు రహితంపై ఆదర్శం కావాలి

Published Sun, Jan 1 2017 10:53 PM | Last Updated on Tue, Sep 5 2017 12:08 AM

నగదు రహితంపై ఆదర్శం కావాలి

నగదు రహితంపై ఆదర్శం కావాలి

► బ్యాంకు ఖాతా పుస్తకాల పంపిణీ

ఎల్లారెడ్డిపేట: మంత్రి కేటీఆర్‌ దత్తత తీ సుకున్న రాజన్నపేటలో వందశాతం ఖాతాలను పూర్తిచేసినట్లు జెడ్పీటీసీ సభ్యు లు తోట ఆగయ్య అన్నారు. గ్రా మంలో శనివారం బ్యాంకు మేనేజర్లు, అధికారులు కలిసి బ్యాంకు ఖాతాలు తీసుకున్న వారికి ఖాతా పుస్తకాలను పంపిణీ చేశారు. రాజన్నపేట జిల్లాలోనే మిగతా గ్రామాలకు ఆదర్శం కానుందని పేర్కొన్నారు. ఖాతాల అనంతరం వందశాతం ఏటీఎం కార్డులు పొందే విధంగా అవగాహన కల్పించాలని అధికారులను కోరారు.

అలాగే సింగారంలో నగదు రహిత లావాదేవీలపై సర్వే నిర్వహిం చారు. గ్రామస్తులంతా బ్యాంకు ఖాతా లు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అందె సుభాశ్, మాజీ ఎంపీపీ ఎలుసాని మోహన్ కుమార్, ఎంపీడీవో చిరంజీవి, సర్పంచ్‌లు ద్యాప ఎల్లయ్య, గొల్లపల్లి దేవలక్ష్మి, ఎంపీటీసీ నమిలికొండ శ్రీనివాస్, నాయకులు కొండ రమేశ్, శ్రీనివాస్‌గౌడ్, బ్యాంకు మేనేజర్లు మున్వర్, బ్రహ్మయ్య, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement