
సాక్షి, సిద్దిపేట: ఏటీఎం సెంటర్ల వద్ద అమాయకులను బురిడీ కొట్టించి వారి ఖాతాల్లోంచి డబ్బులు డ్రా చేస్తున్న వ్యక్తిని సిద్దిపేట పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకుమార్‌గా పోలీసులు గుర్తించారు. ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేయడం తెలియని వ్యక్తులతో రాజకుమార్ తొలుత మంచిగా మాట్లాడి నమ్మకం కలిగిస్తాడు. అనంతరం సొమ్ము విత్ డ్రా చేసి ఇస్తానని చెప్పి ఏటీఎం కార్డులు కొట్టేస్డాని పోలీసులు వెల్లడించారు. బాధితులకు అనుమానం రాకుండా నకిలీ కార్డులు ఇచ్చి.. అనంతరం వారి అకౌంట్లలో నుంచి డబ్బులు డ్రా చేస్తాడని తెలిపారు. నిందితుని వద్ద నుంచి 18 ఏటీఎం కార్డులు, రూ.80 వేల నగదు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. రాజ్‌కుమార్‌పై ఇప్పటికే 118 కేసులు ఉన్నాయని, గతంలో 11 సార్లు జైలు అతనికి జైలు శిక్ష పడిందని తెలిపారు.
(చదవండి: ముగ్గుర్ని చంపి, శవాలతో శృంగారం)
Comments
Please login to add a commentAdd a comment