ATM withdrawal
-
ఏటీఎం నుంచి ఈపీఎఫ్‌వో సొమ్ము!
ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఈపీఎఫ్‌వో 3.0 అనే కొత్త వెర్షన్‌కి అప్‌గ్రేడ్ అయ్యే ప్రణాళికలో ఉంది. ఏటీఎం నుండి పీఎఫ్ సొమ్ము ఉపసంహరణ, ఉద్యోగి ప్రస్తుత 12 శాతం చందా పరిమితి పెంపు, పీఎఫ్ సొమ్మును పెన్షన్‌గా మార్చుకునే అవకాశం వంటి కొత్త సంస్కరణలు ఇందులో ఉండవచ్చని భావిస్తున్నారు.ఏటీఎం తరహా కార్డుఈటీ నౌ రిపోర్ట్ ప్రకారం.. ఈపీఎఫ్‌వో 3.0 అనే కొత్త వెర్షన్లో అతి ముఖ్యమైన అంశం ఏమిటంటే, పీఎఫ్ సొమ్ము ఉపసంహరణల కోసం ఒక కార్డును జారీ చేయాలని కార్మిక మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. ఈ కార్డును ఉపయోగించి ఏటీఎం ద్వారా పీఎఫ్ డబ్బును విత్‌డ్రా చేయవచ్చు. అయితే, పీఎఫ్ మొత్తంలో గరిష్టంగా 50 శాతం మాత్రమే ఇలా విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్ వచ్చే ఏడాది మే నుంచి జూన్ నెలల మధ్య ఎప్పుడైనా అమలు చేయవచ్చు.ఇక మరొక పరిణామం ఏమిటంటే, ఉద్యోగులు తమ జీతంలో ఈపీఎఫ్‌కు జమ చేసే కాంట్రిబ్యూషన్లపై ప్రస్తుతం ఉన్న 12% పరిమితిని తొలగించవచ్చు. ఉద్యోగులు తమకు నచ్చినంత మొత్తాన్ని పీఎఫ్‌కు జమ చేసుకునే అవకాశాన్ని ఇది కల్పిస్తుంది. అయితే, యజమాన్యం కాంట్రిబ్యూషన్ మాత్రం ఉద్యోగి జీతం ఆధారంగా ఉంటుంది. అలాగే ఉద్యోగి సమ్మతితో పీఎఫ్ మొత్తాన్ని పెన్షన్‌గా మార్చాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. -
ఏటీఎం ఉపయోగిస్తే చార్జీల మోత
-
చిక్కిన దొంగ, ఇప్పటికే 118 కేసులు
సాక్షి, సిద్దిపేట: ఏటీఎం సెంటర్ల వద్ద అమాయకులను బురిడీ కొట్టించి వారి ఖాతాల్లోంచి డబ్బులు డ్రా చేస్తున్న వ్యక్తిని సిద్దిపేట పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకుమార్‌గా పోలీసులు గుర్తించారు. ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేయడం తెలియని వ్యక్తులతో రాజకుమార్ తొలుత మంచిగా మాట్లాడి నమ్మకం కలిగిస్తాడు. అనంతరం సొమ్ము విత్ డ్రా చేసి ఇస్తానని చెప్పి ఏటీఎం కార్డులు కొట్టేస్డాని పోలీసులు వెల్లడించారు. బాధితులకు అనుమానం రాకుండా నకిలీ కార్డులు ఇచ్చి.. అనంతరం వారి అకౌంట్లలో నుంచి డబ్బులు డ్రా చేస్తాడని తెలిపారు. నిందితుని వద్ద నుంచి 18 ఏటీఎం కార్డులు, రూ.80 వేల నగదు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. రాజ్‌కుమార్‌పై ఇప్పటికే 118 కేసులు ఉన్నాయని, గతంలో 11 సార్లు జైలు అతనికి జైలు శిక్ష పడిందని తెలిపారు. (చదవండి: ముగ్గుర్ని చంపి, శవాలతో శృంగారం) -
ఏటీఎం నుంచి ఇక రోజుకు రూ.20 వేలే!
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రోజువారీ ఏటీఎం విత్‌డ్రాయెల్ పరిమితిని సగానికి సగం తగ్గించేసింది. ప్రస్తుతం ఈ పరిమితి రూ.40,000 ఉండగా... దీనిని బుధవారం నుంచి రూ.20,000కు తగ్గిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలియజేసింది. నిజానికి ఎస్బీఐ ఈ నెల మొదట్లోనే ఈ నిర్ణయాన్ని ప్రకటించినా... అక్టోబర్ 31 నుంచీ అమల్లోకి వస్తుందని అప్పట్లోనే ప్రకటించింది. మోసపూరిత లావాదేవీలు పెరిగిపోతుండటంతో, కస్టమర్ల ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. తాజా నిర్ణయం వల్ల ఏటీఎంల ద్వారా ఒకేరోజు పెద్ద మొత్తంలో నిధుల విత్‌డ్రా చేయడానికి అవకాశం ఉండదు. దీనివల్ల మోసగాళ్లు సైతం రోజుకు రూ.20వేల కన్నా ఎక్కువ విత్‌డ్రా చేయలేరు కనక ఒకవేళ ఎవరైనా మోసపోయినా మరీ ఎక్కువ మొత్తాన్ని పోగొట్టుకోకుండా ఉంటారన్నది తమ ఉద్దేశమని బ్యాంకు తెలియజేసింది. ఏదైనా మోసపూరిత విత్‌డ్రాయల్ జరిగితే వెంటనే కార్డ్ బ్లాక్ చేయించుకోవడం, సంబంధిత బ్రాంచీని సంప్రదించడం చేయాలని, దాంతో నష్టాన్ని పరిమితం చేసుకోవచ్చని కూడా సూచించింది. ఎక్కువ మొత్తం కావాలంటే దరఖాస్తు... ‘‘క్లాసిక్ అండ్ మ్యాస్ట్రో డెబిట్ కార్డ్‌పై విత్‌డ్రాయల్ పరిమితిని రూ.20,000కు తగ్గిస్తున్నాం. ఇతర కార్డులకు సంబంధించి రోజువారీ విత్‌డ్రాయల్ పరిమితిలో ఎలాంటి మార్పూ లేదు. క్లాసిక్–డెబిట్ కార్డ్ చిప్ ఆధారితం కాదు. కాబట్టి సెక్యూరిటీ పరమైన ఆందోళనలు ఉన్నాయి. పలు ఫిర్యాదులూ అందాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. రూ.20,000కు మించి విత్‌డ్రాయల్స్ కావాలనుకునేవారు హయ్యర్ కార్డ్ వేరియెంట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు’’ అని ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ పీకే గుప్తా తెలిపారు. ‘‘గణాంకాల విశ్లేషణ ప్రకారం– మెజారిటీ కార్డ్ హోల్డర్లు రోజుకు రూ.20,000లోపే ఏటీఎం విత్‌డ్రా చేస్తున్నారు. ఏదైనా మోసం కేసులు నమోదవుతున్నాయంటే, అవి రూ.20,000 పైబడే ఉన్నాయి’’ అని కూడా ఆయన పేర్కొన్నారు దేశ వ్యాప్తంగా ఎస్బీఐకి దాదాపు 42 కోట్ల మంది కస్టమర్లున్నారు. 2018 మార్చి నాటికి బ్యాంక్ 39.50 కోట్ల డెబిట్ కార్డులను జారీ చేసింది. వీటిలో దాదాపు 26 కోట్ల కార్డులను విరివిగా వినియోగిస్తున్నారు. డెబిట్ కార్డుల జారీకి సంబంధించి ప్రస్తుతం ఎస్బీఐ మార్కెట్ వాటా దాదాపు 32.3 శాతంగా ఉంది. -
బాదుడు షురూ..
• కొత్త చార్జీలను అమల్లోకి తెచ్చిన బ్యాంకులు • కనీస నగదు నిల్వ లేకపోయినా, పరిధి దాటిన నగదు జమలు, ఏటీఎం విత్‌డ్రాలపై జరిమానాలు • జనరల్ ఖాతాదారులపై తీవ్ర భారం • బ్యాంకుల తీరుపై మండిపడుతున్న ఖాతాదారులు • చార్జీలను ఎత్తివేయాలని డిమాండ్ ఇందూరు (నిజామాబాద్ అర్బన్) : ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ బ్యాంకుల్లో ఖాతాదారులపై చార్జీల బాదుడు ప్రారంభమైంది. ఇదివరకే ఎస్బీఐ ప్రతి సేవకు చార్జీలు వసూలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ ప్రారంభం నుంచి అమలు కూడా చేసింది. మిగతా బ్యాంకులు ఎలాంటి ప్రకటనలు చేయకుండానే చార్జీలను అమలు చేస్తున్నాయి. దీంతో విషయం తెలియని ఖాతాదారులు అకౌంట్లలో కనీస నిల్వలు ఉంచక, అలాగే నగదు జమలు, ఏటీఎం విత్‌డ్రాలు పరిమితికి మించి చేస్తూ చాలామంది చార్జీల బాదుడికి గురవుతున్నారు. చెక్‌బుక్ కావాలన్నా, నెలలోమూడుసార్లకు మించి నగదు జమచేసినా, సొంత ఏటీఎంలో ఐదుసార్లకు మించి డబ్బులు విత్‌డ్రా చేసినా, అకౌంట్ మూసివేయాలనుకున్నా, పరిమితికి మించి లాకర్లను తెరిచినా.. ఇలా ప్రతి సేవలపై ఖాతాదారుల నుంచి చార్జీలు వసూలు చేస్తున్నాయి. దీంతో బ్యాంకుల చార్జీల అమలు తీరుపై జిల్లాలో ఖాతాదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చార్జీలను ఎత్తివేసి, పరిమితులను తొలగించాలని కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకులు 252 బ్రాంచ్‌లున్నాయి. ఆయా బ్రాంచిల్లో సురభి, బేసిక్ సేవింగ్స్, జన్‌ధన్ యోజన ఖాతాలు కాకుండా జనరల్ (వ్యక్తిగతం, సాలరీ, వ్యాపారం, తదితర) ఖాతాలు 20లక్షల వరకు ఉన్నాయి. చార్జీలు జనరల్ ఖాతాలకు మాత్రమే అమలు చేస్తున్నాయి. అయితే ఈ చార్జీల అమలు గతంలో కూడా ఉండేవని, దీనిని మళ్లీ అమలు చేస్తున్నట్లుగా బ్యాంకు అధికారులు పేర్కొంటున్నారు. చార్జీలు ఒకే విధంగా కాకుండా వివిధ బ్యాంకులు స్వల్ప తేడాతో అమలు చేస్తున్నాయి. కాగా జిల్లావ్యాప్తంగా చార్జీల అమలుతో బ్యాంకుల్లో ఖాతాదారులు నగదు జమలు చాలావరకు తగ్గించారు. చార్జీల బాదుడు ఇలా.. • సేవింగ్స్ ఖాతాదారులు నెలలో మూడుసార్లు మాత్రమే సొంత బ్యాంకు శాఖలో ఉచితంగా నగదు డిపాజిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆపై ప్రతి డిపాజిట్‌కు రూ.50 చార్జీ చెల్లించాలి. • రూ.10,000 నెలవారీ సగటు నిల్వ ఉండే సాధారణ కరెంట్ ఖాతాదారులు బ్యాంకులో రోజుకు రూ.25,000 వరకు నగదును ఉచితంగా డిపాజిట్ చేసుకోవచ్చు. అంతకు మించితే ప్రతి రూ.1000పై 75 పైసల చార్జీ ఉంటుంది. ఈ చార్జీ కూడా కనీసం రూ.50 తక్కువ కాకుండా వసూలు చేస్తారు. • నెలలో సొంత బ్యాంకు ఏటీఎంలలో ఐదు లావాదేవీలు మాత్రమే ఉచితం. ఆపై ప్రతి లావాదేవీపై రూ.10 చార్జీ విధిస్తారు. • లాకర్లను సంవత్సరంలో 12 సార్లు మాత్రమే ఉచితంగా తెరవవచ్చు. ఆపై ప్రతిసారి రూ.100 చెల్లించాలి. • కరెంటు ఖాతాదారులకు ఏడాదిలో 50 చెక్కులే ఉచితం. ఆపై ప్రతి చెక్‌లీఫ్‌పై రూ.3 చార్జీ ఉంటుంది. • ఖాతా ప్రారంభం ఉచితంగా కాదు. రూ.20 చెల్లించాలి. • అర్బన్ ప్రాంతాల్లోని బ్యాంకుల్లో ఖాతాదారులు తమ ఖాతాల్లో రూ.3000 కనీస నగదు నిల్వ ఉంచాలి, లేదంటే రూ.50పైగా జరిమానా పడుతుంది. • సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ.2000 నగదు నిల్వ ఉంచాలి. లేదంటే రూ.40 వరకు జరిమానా ఉంటుంది. • గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకుల్లో రూ.1000 నగదు నిల్వ ఉంచాలి. లేదంటే రూ.30 వరకు జరిమానా తప్పదు. -
క్రెడిట్ కార్డు.. ఏదీ ఉచితం కాదు
కొత్త ఖాతాదారులను ఆకర్షించేందుకు బ్యాంకులు.. ఆర్థిక సంస్థలు ఒక్కోసారి ఉచిత క్రెడిట్ కార్డుల గాలం వేస్తుంటాయి. అందులో కొందరు చిక్కుకుంటారు కూడా. కానీ నిజానికి క్రెడిట్ కార్డులకు సంబంధించి ఉచితమంటూ ఏదీ ఉండదు. అన్నిటికీ రకరకాల చార్జీలుంటాయి. కాకపోతే ఆయా సంస్థలు కార్డుల జారీ లక్ష్యాలను సాధించుకోవడం కోసం అన్ని వివరాలనూ ఒకోసారి ముందుగా చెప్పవు. కనక ఇలాంటి వాటి గురించి ముందుగా కాస్త అవగాహన ఉంటే ఆ తర్వాత సమస్యలుండవు.క్రెడిట్ కార్డులపై విధించే ఫీజులు, చార్జీల గురించి.. అవగాహన కల్పించే ప్రయత్నమే ఈ కథనం. చాలా మటుకు క్రెడిట్ కార్డులకు వార్షిక మెయింటెనెన్స్ ఫీజుంటోంది. బ్యాంకు ఒకవేళ ఉచిత క్రెడిట్ కార్డు ఇస్తామంటే దానర్థం గరిష్టంగా ఒక్క ఏడాది పాటు మాత్రమే జాయినింగ్ ఫీజు, వార్షిక ఫీజు మినహాయింపునిస్తామని. ఆ తర్వాత ఎప్పట్లాగే వార్షిక మెయింటెనెన్స్ చార్జీలు వర్తిస్తాయి. కొన్ని బ్యాంకులు మాత్రం జీవితకాలం ఉచిత కార్డులిస్తున్నాయి. కాబట్టి ఉచిత క్రెడిట్ కార్డు తీసుకునేటప్పుడే అది జీవితకాలం ఉచితమా లేక తర్వాత ఏడాది నుంచి మెయింటెనెన్స్ చార్జీలు ఉంటాయా అన్నది అడిగి తెలుసుకోవాలి. వడ్డీ చార్జీలు ఎక్కువే... క్రెడిట్ కార్డు నెలవారీ బిల్లులో రెండు అమౌంట్లు ఉంటాయి. ఒకటి మొత్తం కట్టాల్సిన బకాయి కాగా రెండోది కనీసం కట్టాల్సిన అమౌంటు. మిగతాది తర్వాత కట్టొచ్చులే అనే ఉద్దేశంతో కొందరు కనీస మొత్తం చెల్లించి ఊరుకుంటుంటారు. కానీ ఆ మిగతా మొత్తం మీద దాదాపు 2–4 శాతం మేర నెలవారీగా వడ్డీ విధిస్తారన్న సంగతి వారికి తెలియదు. సాధారణంగా నెలవారీ వడ్డీ రేటును ఏడాది మొత్తానికి అన్వయించి వార్షిక ప్రాతిపదికన పర్సెంటేజీ రేటును నిర్ణయిస్తారు. ఇది ఏకంగా 36–38% స్థాయిలో కూడా ఉండొచ్చు. కార్డు పోయినా చార్జీలు.. ఒకవేళ క్రెడిట్ కార్డు పోగొట్టుకుంటే.. కొత్త కార్డు జారీ చేయాలంటే బ్యాంకు చార్జీలు వసూలు చేస్తుంది. ఏటీఎం విత్‌డ్రాయల్ చార్జీలు క్రెడిట్ కార్డు ద్వారా ఏటీఎంల నుంచి డబ్బును విత్‌డ్రా చేస్తే చార్జీలు ఉంటాయి. సాధారణంగా ఇలాంటి నగదువిత్డ్రాయల్పై లావాదేవీ చార్జీలు.. తీసుకున్న మొత్తంలో ఏకంగా 2.5 శాతం మేర ఉంటాయి. ఇదే కాకుండా విత్‌డ్రా చేసుకున్న తేదీ నుంచే వడ్డీ లెక్కింపు మొదలైపోతుంది. ఈ వడ్డీ ఏడాదికి 24–46 శాతం రేంజిలో ఉంటుంది. కనుక నగదు విత్‌డ్రాయల్ అవసరాల కోసం క్రెడిట్ కార్డు ఉపయోగించకపోవడమే మంచిది. దాని బదులు డెబిట్ కార్డు వినియోగమే శ్రేయస్కరం. చార్జీల మోతే... లేట్ పేమెంట్ చార్జీలు గడువు లోగా నెలవారీ క్రెడిట్ కార్డు బకాయిలను ఖాతాదారు కట్టలేని పక్షంలో అదనంగా లేట్ పేమెంట్ చార్జీలు ఉంటాయి. వడ్డీ చార్జీలతో సంబంధం లేకుండా ఇది ఫ్లాట్ ఫీజు రూపంలో ఉంటుంది. ఓవర్‌డ్రాఫ్ట్ చార్జీలు క్రెడిట్ కార్డుపై నెలవారీ ఉన్న పరిమితికి మించి కస్టమరు లావాదేవీలు జరిపిన పక్షంలో బ్యాంకు ఈ చార్జీలను విధిస్తుంది. విదేశీ లావాదేవీ చార్జీలు విదేశాల్లో క్రెడిట్ కార్డుపై జరిపే ప్రతీ లావాదేవీకి ఈ చార్జీలు వర్తిస్తాయి. ఇవి ఆయా విదేశీ లావాదేవీ పరిమాణంలో 3–5 శాతం మేర ఉంటాయి. ఈ మొత్తాన్ని సదరు లావాదేవీ జరిగిన తేదీ నాడు ఉన్న మారకం రేటు ప్రకారం రూపాయి మారకంలోకి మార్చి బ్యాంకు వసూలు చేస్తుంది. పెట్రోలు, రైలు టికెట్ కొనుగోలుపై చార్జీలు సాధారణంగా పెట్రోల్ లేదా రైలు టికెట్లను క్రెడిట్ కార్డుపై కొంటే అదనంగా చార్జీలు ఉంటాయి. ఇది కొనుగోలు వ్యయంలో నిర్దిష్ట శాతంగా ఉంటుంది. అవుట్‌స్టేషన్ చెక్ చార్జీలు క్రెడిట్ కార్డు బకాయిలను చెల్లించేందుకు అవుట్‌స్టేషన్ చెక్కులను ఉపయోగిస్తే అదనంగా చార్జీలు వర్తిస్తాయి. బిల్లు మొత్తం ఏ శ్లాబ్‌లోకి వస్తుందో చూసి.. దాన్ని బట్టి బ్యాంకు నిర్దిష్ట శాతం మేర చార్జీలు వసూలు చేస్తుంది. చెక్కు బౌన్సింగ్ లేదా ఈసీఎస్ చార్జీలు ఒకవేళ క్రెడిట్ కార్డు బకాయిల చెల్లింపునకు జారీ చేసిన చెక్కు బౌన్సయినా లేదా డిజానర్ అయినా.. అదనంగా చార్జీల వడ్డన ఉంటుంది. సేవా పన్ను.. క్రెడిట్ కార్డు లావాదేవీలపై సేవా పన్ను ఉంటుంది. ఇవీ ఆర్బీఐ నిబంధనలు.. క్రెడిట్ కార్డు సమస్యల నుంచి ఖాతాదారుల ప్రయోజనాలను కాపాడే ఉద్దేశంతో రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కొన్ని నిబంధనలు రూపొందించింది. వీటి ప్రకారం ఆర్బీఐ సూచనలకు లోబడే వడ్డీ రేట్లు, ఇతర చార్జీలు ఉండాలి. బ్యాంకులు క్రెడిట్ కార్డులపై తాము వసూలు చేసే వడ్డీ సీలింగ్ రేటు (ప్రాసెసింగ్, ఇతరత్రా చార్జీలు సహా) ముందుగానే వెల్లడించాలి. వీటితో పాటు మరికొన్ని నిబంధనలు.. ఒకవేళ ఎవరైనా కస్టమర్ నుంచి అధిక వడ్డీ రేటు వసూలు చేస్తుంటే దానికి తగిన కారణాలు (డిఫాల్ట్ కావడం మొదలైనవి) ఖాతాదారుకు తెలియజేయాలి. ఇందులో భాగంగా వివిధ రకాల ఖాతాదారుల నుంచి వసూలు చేసే వడ్డీ రేట్లను బ్యాంకులు తమ వెబ్సైట్లలోనూ ఇతరత్రా సాధనాల్లోనూ ముద్రించి, అవగాహన కల్పించాలి. ఇక ఏయే చార్జీల వడ్డన ఉంటుందనే దానిపై కార్డు హోల్డరుకు తెలియజేసేలా లెక్కించేందుకు ఉపయోగిస్తున్న విధానాలను తెలియజేయాలి. మినిమం బ్యాలెన్స్ మాత్రమే కడుతున్న పక్షంలో గడువు తేదీ తర్వాత బకాయి మొత్తం మీద వడ్డీ వడ్డింపు ఉంటుందనే సంగతి ప్రత్యేకంగా పెద్ద అక్షరాలతో తెలియజేయాలి. ప్రతి నెలా మినిమం బ్యాలెన్సే కట్టుకుంటూ పోతే మొత్తం బకాయి తీరడానికి అనేక సంవత్సరాలు పడుతుందన్న సంగతి తెలియజెప్పేందుకు తగు చర్యలు తీసుకోవాలి. -
అకౌంట్ లేకపోయినా నగదు బదిలీ
ముంబై: ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్ స్కీమ్‌ను బుధవారం ప్రారంభించింది. ఈ స్కీమ్‌లో అవతలి వ్యక్తికి బ్యాంక్ అకౌంట్ లేకపోయినా సొమ్ములను పంపించవచ్చని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. బ్యాంక్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఐసీఐసీఐ బ్యాంక్‌లో సేవింగ్స్ ఖాతా ఉన్న వ్యక్తి ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా ఇతర వ్యక్తులకు డబ్బులు పంపించవచ్చు. డబ్బులు స్వీకరించే వ్యక్తికి ఏ బ్యాంక్‌లోనూ ఖాతా ఉండవలసిన అవసరం లేదు. మొబైల్ నంబర్, అడ్రస్ ఉంటే చాలు. డబ్బులు స్వీకరించే వ్యక్తి మొబైల్ నంబర్‌కు ఆరు అంకెల రహస్య కోడ్‌ను పంపిస్తారు. ఈ నంబర్‌తో సదరు వ్యక్తి ఏ ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎం నుంచైనా డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు. డబ్బులు పంపించిన రెండు రోజుల్లోగా వాటిని విత్‌డ్రా చేసుకోవలసి ఉంటుంది. ఎలక్ట్రానిక్ చెల్లింపులు బాగా పెరిగిపోయిన నేపథ్యంలో ఇలాంటి వినూత్నమైన సర్వీస్‌ను అందిస్తున్నామని ఐసీఐసీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ రాజీవ్ సభర్వాల్ పేర్కొన్నారు. ఈ కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్ కారణంగా తమ ఖాతాదారుల కుటుంబ సభ్యులు, మిత్రులు సులభంగా డబ్బులను పొందవచ్చని వివరించారు.