ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఈపీఎఫ్‌వో 3.0 అనే కొత్త వెర్షన్‌కి అప్‌గ్రేడ్ అయ్యే ప్రణాళికలో ఉంది. ఏటీఎం నుండి పీఎఫ్ సొమ్ము ఉపసంహరణ, ఉద్యోగి ప్రస్తుత 12 శాతం చందా పరిమితి పెంపు, పీఎఫ్ సొమ్మును పెన్షన్‌గా మార్చుకునే అవకాశం వంటి కొత్త సంస్కరణలు ఇందులో ఉండవచ్చని భావిస్తున్నారు.
ఏటీఎం తరహా కార్డు
ఈటీ నౌ రిపోర్ట్ ప్రకారం.. ఈపీఎఫ్‌వో 3.0 అనే కొత్త వెర్షన్‌లో అతి ముఖ్యమైన అంశం ఏమిటంటే, పీఎఫ్ సొమ్ము ఉపసంహరణల కోసం ఒక కార్డును జారీ చేయాలని కార్మిక మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. ఈ కార్డును ఉపయోగించి ఏటీఎం ద్వారా పీఎఫ్ డబ్బును విత్‌డ్రా చేయవచ్చు. అయితే, పీఎఫ్ మొత్తంలో గరిష్టంగా 50 శాతం మాత్రమే ఇలా విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్ వచ్చే ఏడాది మే నుంచి జూన్ నెలల మధ్య ఎప్పుడైనా అమలు చేయవచ్చు.
ఇక మరొక పరిణామం ఏమిటంటే, ఉద్యోగులు తమ జీతంలో ఈపీఎఫ్‌కు జమ చేసే కాంట్రిబ్యూషన్‌లపై ప్రస్తుతం ఉన్న 12% పరిమితిని తొలగించవచ్చు. ఉద్యోగులు తమకు నచ్చినంత మొత్తాన్ని పీఎఫ్‌కు జమ చేసుకునే అవకాశాన్ని ఇది కల్పిస్తుంది. అయితే, యజమాన్యం కాంట్రిబ్యూషన్ మాత్రం ఉద్యోగి జీతం ఆధారంగా ఉంటుంది. అలాగే ఉద్యోగి సమ్మతితో పీఎఫ్ మొత్తాన్ని పెన్షన్‌గా మార్చాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment