మైసూరులో నిందితుడి అరెస్ట్
= రిపోర్టర్ ముసుగులో చోరీలు
= ఎస్‌ఐ ఈశ్వరిని అభినందించిన సీపీ
బెంగళూరు, న్యూస్‌లైన్: మాజీ అథ్లెట్ అశ్విని నాచప్ప ఏటీఎం కార్డులు చోరీ చేసి నగదు డ్రా చేసిన నిందితుడిని ఇక్కడి జయనగర పోలీసులు అరెస్టు చేశారు. మైసూరు జిల్లా టీ. న రశీపుర పట్టణలోని ఎరగనహళ్లికి చెందిన రవి (44) అనే నిందితుడిని అరెస్టు చేసి రూ. 1.97 లక్షలు స్వాధీనం చేసుకున్నామని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ చెప్పారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సవ ూవేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. డిసెంబర్ 3న జయనగర రెండవ బ్లాక్‌లోని కిత్తూరు రాణి చెన్నమ్మ క్రీడా మైదానంలో స్పోర్ట్స్ మీట్ కార్యక్రమం జరిగిం ది.
ఈ కార్యక్రమానికి అశ్వినీ నాచప్ప ముఖ్యఅథిగా హాజరయ్యారు. ఆ సమయంలో వ్యానిటి బ్యాగ్‌ను స్టేజ్‌పై ఉన్న కుర్చీ మీద పెట్టి జెండా ఎగురవేయడానికి వెళ్లారు. ఆ సమయంలో రవి వ్యానిటీ బ్యాగ్‌లో ఉన్న చిన్న పర్సును చోరీ చేశాడు. అనంతరం అక్కడి నుంచి ఉడాయించాడు. పర్సులో ఉన్న మూడు ఏటీఎం కార్డులతో వివిధ బ్యాంకుల్లో రూ. 2.40 లక్షల నగదు డ్రా చేశాడు.
మొబైల్‌లో నగదు డ్రా అయ్యిందని మెసేజ్ రావడంతో అశ్వినీ నాచప్ప జయనగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలించారు. ఈశ్వరి నేతృత్వంలోని ప్రత్యేక బృందం బెంగళూరు, మైసూరు నగరాలలో నిందితుడి కోసం గాలించడం మొదలుపెట్టారు. మైసూరులో ఉన్నట్లు తెలుసుకుని అరెస్ట్ చేసిన ట్లు నగర పోలీసు కమిషనర్ ఔరాద్కర్ చెప్పారు.
శ్రీమంతుడి అవతారం : అశ్వినీ నాచప్ప ఏటీఎం కార్డులు చోరీ చేసిన రవి సామాన్యుడు కాడు. దిన పత్రికల్లో వీఐపీల కార్యక్రమాలు తెలుసుకుని సూటు, బూటుతో అక్కడి చేరుకుని ఎవ రికి అనుమానం రాని తరహాలో నడుచుకుంటాడు. మరికొన్ని చోట్ల విలేకరి అంటూ మొదటి వరుసలో కూర్చుని విలువైన వస్తువులు తస్కరిస్తుంటాడని ఔరాద్కర్ చెప్పారు. ఇదే తరహాలో నిందితుడు రవి టౌన్ హాల్, రవీంద్ర కళాక్షేత్ర, హోటళ్లలో చోరీ చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలి పారు. నిందితుడిని అరెస్ట్ చేసిన ఎస్‌ఐ ఈశ్వరి బృందాన్ని ఔరాద్కర్ అభినందించి నగదు బహుమతి అందజేశారు.
అశ్విని నాచప్ప నగదు రికవరీ
Published Tue, Dec 10 2013 3:32 AM | Last Updated on Sat, Sep 2 2017 1:25 AM
Advertisement